Rao Indrajeet Singh
-
భారత్‌లో 3,291 విదేశీ కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291 కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సోమవారం వెల్లడించారు. క్రియాశీలంగాలేని విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించడం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కంపెనీల చట్టం, 2013ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. దేశంలో పనిచేస్తున్న కంపెనీలు ఈ చట్టం కింద తప్పనిసరిగా నమోదుకావాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం పొందిన తర్వాత విదేశీ కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) ఢిల్లీలో నమోదవుతాయి. విదేశీ క్రియాశీల కంపెనీలు తప్పనిసరిగా చట్ట ప్రకారం స్టాట్యూటరీ ఫైలింగ్ జరుపుతాయి. వివిధ చట్ట పరమైన అంశాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఆయా అంశాలపై లోక్‌సభలో మంత్రి లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. భారతదేశంలో 1,777 విదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యాలయాను మూసివేసినట్లు చెప్పారు. షెల్ కంపెనీల నిర్వచనం లేదు: కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం, రిజిస్టర్డ్ విదేశీ షెల్ కంపెనీలను నిర్వచించలేదని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘కంపెనీల చట్టంలోని సెక్షన్ 2(42)లోని నిబంధనలు విదేశీ కంపెనీలు నిర్వచనాన్ని ఇస్తున్నాయి. దీని ప్రకారం భారతదేశం వెలుపల ఒక కంపెనీ లేదా సంస్థ రిజిస్టరై, అది భారతదేశంలో స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా, భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా ఏవైనా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుంది. ఇలాంటి కంపెనీని చట్టం విదేశీ కంపెనీగా పేర్కొంటోంది’’ అని సింగ్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన బ్రాంచ్ ఆఫీస్ అద్దె ఒప్పందం అమలు నిలిచిపోవడం, చెల్లుబాటు గడువు ముగియడం వంటి కారణాల వల్ల భారతదేశంలో ఒక విదేశీ కంపెనీ క్రియాశీలంగా లేదని పరిగణిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 119 కేసుల విచారణకు ఎస్‌ఎఫ్‌ఐఓకు ఆదేశాలు.. 2017–18 నుండి ఇప్పటి వరకు 119 కేసులను విచారించాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపింది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అలాగే 2022–23 జూన్ 30వ తేదీ వరకూ కార్పొరేట్ మోసానికి పాల్పడిన ఏ లిస్టెడ్ కంపెనీని గుర్తించలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తెలియజేసినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. -
లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో నీతి అయోగ్ ఎంపిక చేసిన మూడు ఆశావహ జిల్లాల్లో క్రమేపీ పెరుగుదల కనిపిస్తున్నట్లు ప్రణాళికా శాఖ సహాయ మంత్రి ఇందర్జిత్ సింగ్ రావు తెలిపారు.రాజ్యసభలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ కడప జిల్లాలను ఆశావహ జిల్లాలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. విజయనగరం, కడప జిల్లాలను వెనుకబాటుతనం ప్రాతిపదికన ఎంపిక చేయగా, విశాఖపట్నంను వామపక్ష తీవ్రవాదానికి గురైన జిల్లాగా పరిగణించి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆశావహ జిల్లాల కార్యక్రమం కింద ఆరోగ్యం, పోషకాహారం, పాఠశాల విద్య, వ్యవసాయం, నీటి వనరుల యాజమాన్యం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు ఆశావహ జిల్లాల్లో విశాఖ జిల్లా ఈ ఏడాది జనవరి నాటికి విద్యా రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించి మొదటి ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఈ జిల్లాలకు అదనంగా 3 కోట్ల రూపాయల కేటాయింపు జరుగుతుందని మంత్రి అన్నారు. లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీ దేశంలోని వివిధ రాష్ట్రాలలో గల ఉన్నత విద్యా సంస్థలలో లక్షకు పైగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ (నిషాంక్) గురువారం రాజ్యసభకు తెలిపారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఉన్నత విద్యా సంస్థలలో మొత్తం 38459 అధ్యాపకుల ఉద్యోగాలు మంజూరు అయ్యాయినట్లు వెల్లడించారు. అందులో ఈ ఏడాది జూన్ నాటికి 13399 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో 12272 ఉద్యోగాల భర్తీకి గత జూన్‌లో నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు ఏర్పడటం వాటిని భర్తీ చేయడం అన్నది నిరంతర ప్రక్రియని, ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఉద్యోగాలు భర్తీ చేయవలసిందిగా కోరుతూ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్.. ఉన్నత విద్యా సంస్థలకు ఈ ఏడాదిలోనే నాలుగు సార్లు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. -
మారిన రాజకీయ సమీకరణాలు
న్యూఢిల్లీ: ఆకాశహర్మ్యాలతో కూడిన పట్టణ ప్రాం తాలతోపాటు పాడుబడిన పెంకుటిళ్లు, గుడిసెలు కలిగిన గ్రామీణ ప్రాంతాలున్న గుర్గావ్ నియోజకవర్గంలో ఈసారి లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇందుకు కారణం ఇక్కడ నుంచి పోటీపడుతున్న అభ్యర్థులే. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి యోగేంద్ర యాదవ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. ఆప్ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన ఎన్నికల బరిలో దిగడంతో గుర్గావ్ లోక్‌సభ ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. రావ్ ఇంద్రజీత్ సింగ్‌ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. ఆయన గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడాతో విభేదాల వల్ల ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. రావ్ ఇంద్రజీత్ సింగ్ పార్టీ మారడం వల్ల గుర్గావ్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ ఇక్కడ నుంచి రావ్ ధర్మపాల్‌ను నిలబెట్టింది. ఐఎన్ఎల్డీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జాకీర్ హుస్సేన్ కూడా పార్టీ మారారు. ఆయన బీఎస్పీని వీడి ఐఎన్ఎల్డీలో చేరారు. గత లోక్‌సభ ఎన్నికలలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. రివాడీ రాజకుటుంబానికి చెందిన రావ్ ఇంద్రజీత్ సింగ్ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆయనకు మహేంద్ర గఢ్, రివాడీ, గుర్గావ్, జజ్జర్, మేవాత్ ప్రాంతాలపై గట్టి పట్టు ఉండేది. సాధారణంగా కాంగ్రెస్‌కే ఓటు వేస్తూ వస్తోన్న ఈ ప్రాంతాల ఓటర్లు ఆయన పార్టీ మారడంతో అయోమయంలో పడ్డారు. సింగ్ కాం గ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఇక ముస్లిం ఓట్లపై ఆయన ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా ఫలితాలను శాసించే స్థాయిలో ఉండడంతో గెలుపుకోసం సింగ్ చెమటోడ్చక తప్పదని చెబుతున్నారు. దీనిని అవకాశంగా మలచుకునేందుకు యోగేంద్ర యాదవ్ వేగంగా పావులు కదుపుతున్నారు. ముస్లిం ఓటర్లను ఆయన ఆకట్టుకోవడం చాలా తేలికైన అంశమని రాజకీయ పండితులు చెబుతున్నారు. యాదవ్‌ల ఓట్లు కూడా బాగా నే ఉన్నందున వారి ఓట్లను కూడా కొల్లగొట్టడం లో యోగేంద్ర యాదవ్ సఫలీకృతుడవుతాడని జోస్యం చెబుతున్నారు. ఇదే జరిగితే ఆప్ పార్టీ విజయం ఇక్కడ నల్లేరు మీద నడకే. బీజేపీకి ఓటు వేయడానికి వెనుకాడే ముస్లిం ఓటర్లను ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి యోగేంద్ర యాదవ్ ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక సర్వేలు చెబుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నిజాయితీపరుడైన, చిత్తశుద్ధి కలిగిన నేత అన్న పేరు ఆయనకు ప్లస్ పాయింట్ కానుంది. గుర్గావ్ వంటి అంతర్జాతీయ హంగులున్న ప్రాంతాలతో పాటు నూహ్ వంటి గ్రామీణ ప్రాంతాలున్న ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో కూడా హస్తిమశకాంతరం కనబడుతుంది. గుర్గావ్లోని పట్టణ ప్రాంతాలను పక్కనబెడితే గ్రామీణ ప్రాంతా ప్రజలు కులమత సమీకరణాల ఆధారంగానే ఓట్లు వేస్తారు. ఇక్కడి ఓటర్లలో దళితులు, జాట్లు, వైశ్యులు, గుజ్జర్లు, రాజపుత్రులు, పంజాబీలు, బ్రాహ్మణులు తమ తమ సామాజికవర్గానికి చెందిన నేతలకే ఓట్లు వేసే అవకాశముంది. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 17, 80,000.