వాతావరణ మార్పులపై మే 2న సదస్సు
నంద్యాలఅర్బన్: స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని వైఎస్సార్ సెంటినరీ హాల్లో మే 2వ తేదీన జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో మార్పులు.. వ్యవసాయ రంగంపై ప్రభావం అనే అంశంపై సదస్సులో చర్చిస్తామని పేర్కొన్నారు. సదస్సులో దేశంలోని శాస్త్రవేత్తల విలువైన çసలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు అత్యల్ప వర్షపాత మండలాల పరిధిలో ఉన్నాయని వివరించారు. కర్నూలు జిల్లాలో 70శాతం, అనంతపురంలో 90శాతం వర్షాధారిత మెట్ట పొలాలే ఉన్నాయని, ఈ రెండు జిల్లాల్లోని 20 లక్షల హెక్టార్లలో 16లక్షల హెక్టార్లు..వర్షాధారంతోనే సాగువుతున్నాయన్నారు.