Rashtriya Swayamsewak Sangh
-
కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ జన్మస్థలాన్ని సందర్శించిన ప్రణబ్
-
సహనమే మన శక్తి : ఆరెస్సెస్‌కు ప్రణబ్ ఉద్భోద
సాక్షి, నాగ్‌పూర్ : సహనమే మన శక్తి అని, బహుళత్వాన్ని గౌరవించి.. భిన్నత్వాన్ని సంబరంగా భావించడంలోనే మన దేశ గొప్పదనం ఇమిడి ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ‘అసహనం మన జాతీయవాద గుర్తింపు నీరుగారుస్తుంది. మతం, అధికారవాద సూత్రాలు, అసహనం తదితర అంశాల ద్వారా మన జాతీయవాదాన్ని నిర్వచించుకునే ప్రయత్నం చేయడమంటే.. మనం మన ఉనికిని దెబ్బతీసుకున్నట్టే’ అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యమే మన అత్యుత్తమ ఖజానా అని, ప్రజాస్వామ్యం అంటే కానుక కాదని, అదొక ప్రవిత్రమైన మార్గదర్శనమని ఉద్బోధించారు. గురువారం నాగ్‌పూర్‌లో నిర్వహించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ శిక్షా వర్గ్ ముగింపు సదస్సులో ప్రణబ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ప్రతి రోజూ మన చుట్టు చోటుచేసుకుంటున్న హింస పెరిగిపోతూనే ఉంది. ఈ హింస అంధకారానికి ప్రతిరూపం. మన మాతృభూమి శాంతి, సామరస్యం, సంతోషం కావాలని అర్ధిస్తోంది. అందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిది’ అంటూ ప్రణబ్ తన ప్రసంగాన్ని ముగించారు. జాతి, జాతియత, దేశభక్తి తదితర అంశాలపై ఆయన ప్రసంగం సాగింది. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ప్రాచీనకాలం నుంచి భారత్‌లోని విద్యాసంస్థలకు విదేశీ విద్యార్థులు వచ్చేవారు వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అన్నది భారతీయత నుంచే వచ్చింది ఒక్కతాటిపైకి వచ్చిన భిన్న జాతుల సంస్కృతి.. భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మౌర్యుల పాలన దేశాన్ని ఒక్క తాటిపైకి తెచ్చింది భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల గొప్పతనం అసహనం, ద్వేషం జాతీయతకు ముప్పు ప్రాంతం, మతం, గుర్తింపు ప్రాతిపదికగా దేశాన్ని వీడదీసేందుకు ప్రయత్నిస్తే.. అది మన గుర్తింపునకు ప్రమాదం తెస్తుంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిని దేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్ పటేల్ గాంధీజీ చెప్పినట్లు జాతీయవాదం ఏ ఒక్కరిది కాదు.. పైగా అదేం ప్రమాదకరం కాదు అన్ని మతాలు ముఖ్యంగా హిందు, ముస్లింలు కలిస్తేనే.. అది భారతజాతి అని నెహ్రూ చెప్పారు హెగ్డేవార్‌పై ప్రణబ్ ప్రశంసలు మోహన్ భగవత్‌తోపాటు ఆరెస్సెస్ ప్రధాన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆరెస్సెస్ వ్యవస్థాపక సర్సంఘ్చాలక్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ జన్మస్థలాన్ని ప్రణబ్ సందర్శించారు. నాగ్‌పూర్‌లోని హెగ్డేవార్ స్మారక కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్‌లో ఆసక్తికర సందేశాన్ని రాశారు. భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెగ్డేవార్ అని ప్రశంసించిన ప్రణబ్.. ఆయనకు నివాళులర్పించేందుకు ఇక్కడి వచ్చినట్టు తెలిపారు. ‘భారతమాత కన్న గొప్పబిడ్డకు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఇక్కడికి వచ్చాను’ అని ఆయన విజిటర్స్ బుక్‌లో రాశారు. అంతకుముందు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రణబ్‌కు ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సాదర స్వాగతం పలికారు. -
ఆరెస్సెస్ ఆర్మీ.. భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, పాట్నా: హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే కేవలం మూడండే మూడు రోజుల్లోనే ఆర్మీని తయారు చేయగలమని భగవత్ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీ ఆ పని చేసేందుకు ఆరు-ఏడు రోజుల సమయం పడుతుందని, కానీ తమకు అందులో సగం రోజులు చాలన్నారు. బిహార్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆరురోజుల పర్యటనలో చివరిరోజు ఆరెస్సెస్ కార్తకర్తల సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ కార్తకర్తలు దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉంటారని, ఆర్మీ క్రమశిక్షణ వారు కూడా పాటిస్తారని చెప్పారు. పాక్ ఉగ్రదాడులపై స్పందించిన భగవత్.. 'ఆరెస్సెస్ మూడు రోజుల్లోనే ఓ పటిష్ట ఆర్మీని తయారు చేయగలదు. కానీ భారత ఆర్మీకి అలా తయారు చేసేందుకు వారం రోజులైనా పడుతుంది. సంఘ్ సత్తా అది. రాజ్యాంగం అందుకు వెసలుబాటు కల్పిస్తే సరికొత్త ఆర్మీని తయారుచేసి దేశం కోసం పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలర్పించేందుకు సంఘ్ కుటుంబం (ఆరెస్సెస్ కార్తకర్తలు) ఎప్పుడూ సిద్ధమే. వ్యక్తిగతంగా, సామాజిక జీవనంలో, విధి నిర్వహణ ఇలా అన్నింట్లోనూ ఆరెస్సెస్ కార్యకర్తలు ఆదర్శంగా నిలుస్తున్నారని' ప్రశంసించారు. -
'ముస్లిం జనాభా పెరుగుదలను నిరోధించండి'
రాంచీ: మత సంబంధమైన జనాభా సంఖ్య విషయమై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరో తాజా చర్చకు తెరలేపింది. తాజా జనాభా గణన లెక్కల్లో ముస్లిం జనాభా పెరిగిన నేపథ్యంలో భౌగోళిక వర్గ జనాభా అసమతుల్యత సమస్యను పరిష్కరించేందుకు జాతీయ జనాభా విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మత వర్గాల ఆధారంగా జనాభా లెక్కలపై చర్చించేందుకు ఆరెస్సెస్ ఇటీవల సమావేశమైంది. భారతీయ మూలాలున్న (హిందు, బౌద్ధులు, జైనులు, సిక్కులు) మతవర్గాల జనాభా 1951లో 88శాతం ఉండగా.. ప్రస్తుతం అది 83.8శాతానికి పడిపోయిందని, అదే సమయంలో ముస్లిం జనాభా భారీగా పెరిగిందని, ముఖ్యంగా ఈశాన్య భారతంలో అసాధారణరీతిలో వారి జనాభా పెరుగుతున్నదని ఆరెస్సెస్ పేర్కొంది. అన్ని మతాలవారికి ఏకీకృత జనాభా విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 'ఒక వ్యక్తి కుటుంబనియంత్రణను పాటించకుండా మతం అడ్డుపడితే.. దేశంలోని అన్ని వనరులను పరిగణనలోకి తీసుకొని మనం జాతీయవాద దృక్పథంతో ఒక విధానం తీసుకురావాల్సిన అవసరముంది' అని ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రటరీ కృష్ణ గోపాల్ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. ఒక వర్గం జనాభా పెరుగుదల రేటుపై ఆరెస్సెస్ గతంలో కూడా పలుసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బిహార్లలో అక్రమ వలస, మతమార్పిడులు అంశంపై నిరసన వ్యక్తంచేసింది. అయితే, ప్రస్తుతం బిహార్ ఎన్నికలు జరుగుతుండటం, కేంద్రంలో బీజేపీ మెజారిటీ సర్కార్ ఉండటంతో ఈ అంశంపై ఆరెస్సెస్ మరింత తీవ్రతతో తీర్మానాన్ని రూపొందించింది. ముస్లిం జనాభా పెరుగుదల రేటును నియంత్రించాల్సిన అవసరముందని పేర్కొంది. -
మోడీని విమర్శిస్తే సహించం: ఆర్ఎస్ఎస్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని విమర్శస్తే సహించేది లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకుడు సురేష్ సోని భారతీయ జనతా పార్టీలోని అంతర్గత శ్రేణులను శనివారం హెచ్చరించారు. భారత ప్రధాన పదవికి మోడీ సరైన వ్యక్తి అని అందరు భావిస్తున్నారని, ఇటువంటి సమయంలో ఆయనపై విమర్శలు తగవని సోని అభిప్రాయపడ్డారు. ఎవరైనా మోడీపై విమర్శలు చేసినా, పార్టీ నాయకత్వ నిర్ణయాన్ని అతిక్రమిస్తే వారిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు బలంగా వీస్తునందున, కొద్దిగా కష్టపడితే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. దీంతో అవినీతి ఊబిలో కురుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పాలన నుంచి దేశ ప్రజలను విముక్తి చేయవచ్చన్నారు. అంతేకాకుండా బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే భారత పౌరులకు అత్యంత సమర్థవంతమైన పాలన అందించగలుగుతామన్నారు. భారతీయ జనతాపార్టీ తిరిగి దేశపాలన పగ్గాలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరు శాయశక్తుల కృషి చేయాలని బీజేపీ కార్యవర్గ శ్రేణులకు సోని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనాతా పార్టీ ఢీల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులోభాగంగా లోక్‌సభలో అత్యధిక సీట్లు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో సీట్లు కొల్లగొడితే ప్రధాని కుర్చీని కైవసం చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు సురేష్ సోని రెండు రోజుల పర్యటనలో భాగంగా యూపీలో పర్యటిస్తున్నారు. శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్‌తో కలసి ఆయన ప్రసంగించారు.