ratha yatra
-
Bahuda yatra : ఘనంగా పూరీ జగన్నాథుని బహుడా యాత్ర (ఫొటోలు)
-
బంజారాహిల్స్‌లో జగన్నాథ రథయాత్ర దృశ్యాలు
-
Telengana: రాష్ట్రం మొత్తాన్ని ఒకేసారి కవర్ చేసేలా.. బీజేపీ రథయాత్రలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘రథయాత్ర’లకు బీజేపీ సిద్ధమౌతోంది. నిర్ణీతగడువు ప్రకారం వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ జనవరి నుంచి వివిధ రూపాల్లో పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. జనవరి 15 లేదా 16వ తేదీ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పర్యటనలు చేపట్టనున్నారు. దాదాపు రెండువారాల్లో ఈ పర్యటనలు ముగిశాక, ఫిబ్రవరి మొదటి, రెండోవారంలో రథయాత్రలు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రం మొత్తాన్ని ఒకేసారి కవర్ చేసేలా నాలుగుదిక్కులా నాలుగు రథయాత్రలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రల షెడ్యూల్, రూట్లపై చర్చించి, తుదిరూపునిచ్చేందుకు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ రాష్ట్రానికి రానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో బండి సంజయ్ పాదయాత్రలకు కూడా బ్రేక్ పడినట్టు సమాచారం. ఒకరిద్దరికే మైలేజ్ వచ్చేలా కాకుండా.. జనవరిలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలోని 16 నుంచి 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరోవిడత పాదయాత్ర చేపట్టాలని తొలుత భావించారు. ఈ యాత్ర ఉంటే దానిపైనే మొత్తం పార్టీ యంత్రాంగం, వనరులు వంటివి పూర్తిస్థాయిలో కేంద్రీకరించాల్సి ఉన్నందున, బస్సుయాత్రలతో రాష్ట్రం నలువైపులా చుట్టివస్తే మంచిదనే అభిప్రాయంతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు ముఖ్యనేతలకే మైలేజ్ వచ్చేట్లు కాకుండా సమిష్టిగా నేతలకు ప్రాధాన్యత లభించేలా కార్యక్రమాలకు తుది రూపు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. 7న అసెంబ్లీ సదస్సులు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని సంస్థాగతంగా పూరిస్థాయిలో బలోపేతం చేయ డం, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో ప్రభారీ, విస్తారక్ల చొప్పున నియామకం, అన్ని పోలింగ్‌బూత్ కమిటీల నియామకం పూర్తి, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు వంటి వాటిని వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర పార్టీని జాతీయ నాయకత్వం ఆదేశించినట్టు సమాచారం. వచ్చేనెల మొదటివారం కల్లా మండలాల వారిగా బూత్ కమిటీల నియామకం పూర్తి చేసి, 7న 119 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు పాల్గొనేలా అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సదస్సులనుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. నేడు నగరానికి బీఎల్ సంతోష్.. ఈ నెల 28, 29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ నియోజకవర్గాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ మంగళవారం రాత్రి నగరానికి చేరుకుంటారు. శిక్షణా శిబిరం ముగిశాక 29న సాయంత్రం తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీలతో సంతోష్, బన్సల్ సమావేశం కానున్నారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఐదుగురు పాలక్‌లు ఒక్కో నియోజకవర్గానికి ఐదుగురేసి చొప్పున ముఖ్యనేతలను బీజేపీ నియమించనుంది. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ కార్యవర్గసభ్యులు, ఇతర ముఖ్య నేతలను పాలక్‌లుగా నియమిస్తారు. ఇక ఒక్కో నియోజకవర్గానికి ఒక స్థానికేతర ఇన్చార్జి (ప్రభారీ)ని కూడా నియమిస్తారు. -
సరికొత్తగా మూవీ ప్రమోషన్స్.. 40 రోజులపాటు ప్రచార రథయాత్ర..
చెన్నై సినిమా: మాయోన్ చిత్ర ప్రచారానికి వినూత్నంగా(విష్ణుమూర్తి శేష శయనం ప్రతిభతో) రథయాత్రను ప్రారంభించారు. నటుడు సిబిరాజ్, తాన్యా జంటగా నటించిన చిత్రం మాయోన్. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథను అందించి నిర్మించిన చిత్రం ఇది. ఎన్.కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రచార యాత్ర విశేషపూజ, హోమాలతో ఆదివారం ప్రారంభమైంది. ఇక రామాపురంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార రథయాత్రను రాష్ట్రవ్యాప్తంగా 40 రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్మాత తెలిపారు. దైవం, సైన్స్, విగ్రహాల స్మగ్లింగ్, గుప్తనిధులవేట వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందించిన చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. డావిన్సీ కోడ్ వంటి చిత్రాలు తనకు చాలా ఇష్టమని, ఆ తరహా చిత్రాల్లో నటించాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని నటుడు సిబిరాజ్ పేర్కొన్నారు. -
విజయవాడ కెనాల్ రోడ్డులో రథోత్సవం. కిక్కిరిసిన భక్తజనం (ఫొటోలు)
-
జనంలోకి జగన్నాథుడు
ఆలయంలో ఉండాల్సిన దేవదేవుడు.. భక్తుల కోసం వారి మధ్యకే వచ్చాడు. బలభద్ర, సుభద్రలతో కలిసి జగన్నాథుడు వేలాది భక్తుల పూజలు అందుకుంటూ రథంలో ఊరేగుతూ గుండిచా మందిరానికి చేరుకున్నాడు. పదిరోజులపాటు దశావతారాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నాడు. నగరంలోని టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయం, సిరిపురంలోని ఉత్కళ్ సాంస్కృతి సమాజ్, ఉక్కునగరంలో ఉత్కళ్ సమాజ్ ఆధ్వర్యంలో రథయాత్రను గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు రథయాత్రలో వేలసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి. సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): లోక రక్షకుడు జనావాసాల చెంతకొచ్చాడు. లక్ష్మీనాథుడు తనను అర్చించే భక్తుల సన్నిధికే తరలివచ్చాడు. సోదరీసోదరులతో కలిసి రథమెక్కి నగర వీధుల్లో కదిలివెళ్లాడు. ప్రధానాలయం నుంచి బయల్దేరి పదిరోజుల కొలువుకు గుండిచా మఠానికి చేరుకున్నాడు. గురువారం సాయంత్రం కిక్కిరిసిన మెయిన్ రోడ్డులో ఊరేగిన జగన్నాథుడు భక్తులకు దివ్యానుభూతిని కలిగించాడు. నగరంలో జగన్నాథస్వామి రథయాత్ర గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, తప్పెట గుళ్లు, సేవా గరిడీలు, కోలాటాలు, భజనల నడుమ జగన్నాథ రథచక్రాలు కదిలాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా స్వామి రథం లాగేందుకు పోటీపడ్డారు. టౌన్ కొత్తరోడ్డులో వెలసిన జగన్నాథ స్వామి తొలి రథయాత్ర ఏవీఎన్ కాలేజ్ డౌన్‌రోడ్డు, పూర్ణామార్కెట్ మీదుగా గుండిచా మఠంగా వెలసిన టర్నర్ చౌల్ట్రీ వరకు పయనించాయి. రథమెక్కిన దేవదేవుడు గురువారం సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విద్యుత్ దీపాలలో అలంకరించిన రథంపైకి తీసుకు వెళ్లడంతో యాత్రలో ప్రధాన ఘట్టం పూర్తయింది. అనంతరం రథం పయనం మొదలైంది. స్వామి రథం లాగేందుకు అందరూ పోటీపడ్డారు. టౌన్ కొత్తరోడ్డు నుంచి సాయంత్రం 4.55 గంటలకు ప్రారంభమైన తొలి రథయాత్ర ఏవీఎన్ కాలేజ్‌డౌన్ రోడ్డు, పూర్ణా మార్కెట్, ఆంజనేయస్వామి ఆలయం మీదుగా నేత్రపర్వమైన కార్యక్రమాల నడుమ సాగింది. అసంఖ్యాకంగా భక్తులు రథాన్ని చుట్టుముట్టి స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ కోలాహలం నడుమ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రథం టర్నర్ చౌల్ట్రీకి చేరుకుంది. అనంతరం స్వామిని టర్నర్చౌల్ట్రీలోని కల్యాణమండపంలోకి ఆహ్వానించారు. అక్కడ రోజుకో దివ్యావతారంతో జగన్నాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రథం లాగిన మంత్రి అవంతి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ రథాన్ని లాగి యాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం భక్తులు రథాన్ని లాగుతూ జగన్నాథుడిని స్మరించుకున్నారు. ఆలయ అర్చకులు పాణంగిపల్లి జగన్నాథాచార్యులు, పాణంగిపల్లి రంగనాధాచార్యులు, పాణంగిపల్లి కేశవాచార్యులు, యేడిద సురేష్‌బాబు నేతృత్వంలో రథంపై వేంచేసిన స్వామిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ పర్యవేక్షణలో ఆంజనేయస్వామి ఆలయ ఈవో అల్లు జగన్నాథరావు ఏర్పాట్లు పరిశీలించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో.. జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాగర్‌నగర్ ఇస్కాన్ నగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్, మాతాజి నితాయి సేవిని సారథ్యంలో జగన్నాథస్వామి రథయాత్ర కనులపండువగా సాగింది. సాయంత్రం 4 గంటలకు.. నాలుగు రథాలతో రథయాత్ర నిర్వహించారు. రథయాత్రను మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తదితరులు ప్రారంభించారు. పాత జైల్‌రోడ్డులోని ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రథయాత్ర ప్రారంభమై డాబాగార్డెన్స్, ప్రకాశరావుపేట జంక్షన్, జగదాంబ జంక్షన్, వైఎస్సార్ విగ్రహ కూడలి, వాల్తేర్ మెయిన్‌రోడ్డు, సర్క్యూట్ హౌస్ మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రం వద్ద ముగిసింది. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామిని అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి ఔన్నత్యంపై సాంబ దాస్, జగన్నాథుని లీలలపై మాతాజి నితాయి సేవిని ప్రవచించారు. కూచిపూడి ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. భకులు తయారు చేసిన 108 రకాల ప్రసాదాలను స్వామికి నివేదన చేశారు. ఆధ్యాత్మికవేత్త ఎం.వి.రాజశేఖర్, డాక్టర్ పి.విశ్వేశ్వరరావు, శ్రీవంశీ పాపారావు, కంకటాల మల్లిక్, మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పటల్ ఎమ్డీ మురళీకృష్ణ, భక్తులు పాల్గొన్నారు. ఉప్పొంగిన ఆనందం ఉక్కునగరం: జగన్నాథుని రథయాత్ర ఉక్కునగరంలో వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మొదట స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్, శారద దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను రథంపైకి తరలించారు. సీఎండీ రథ్ బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేశారు. భక్తులు రథాన్ని ఉక్కునగరంలోని పలు సెక్టర్లలో ఉరేగించారు. డైరెక్టర్లు కె.సి.దాస్, రాయ్‌చౌదరి, వి.వి.వేణుగోపాలరావు, ఉత్కళ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. -
ముగిసిన జగన్నాథుని రథయాత్ర
-
ఘనంగా ముగిసిన బహుడా యాత్ర
భువనేశ్వర్/పూరీ: ఒడిశాలోని పూరీలో జగన్నాథుని బహుడా యాత్ర (రథయాత్ర) ఆదివారం ఘనంగా ముగిసింది. శ్రీ గుండిచా మందిరంలో 9 రోజుల కొలువు ముగించుకుని దేవతలు జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, వారి సోదరి సుభద్ర బ్రహ్మాండంగా అలంకరించిన మూడు చెక్క రథాలపై తిరిగి శ్రీ మందిరం (జగన్నాథుని ఆలయం) సింహ ద్వారం ఆవరణకు చేరడంతో బహుడా యాత్ర సమాప్తమైంది. మరో 3 రోజులపాటు శ్రీ మందిరం సింహద్వారం వద్దే రథాలపై దేవుళ్లు కొలువుదీరుతారు. స్వర్ణాలంకారం, అధర పొణా ఉత్సవాల్ని ముగించి నీలాద్రి విజే ఉత్సవంలో మూల విరాట్లను ప్రధాన వేదికకు తరలిస్తారు. తాళ ధ్వజంలో బలభద్రుడు, దర్ప దళనంలో దేవీ సుభద్ర శ్రీ మందిరం సింహద్వారం ఆవరణకు వడివడిగా చేరారు. నంది ఘోష్ రథంలో జగన్నాథుడు మాత్రం దారిలో లక్ష్మితో భేటీ అయి నిదానంగా ముందుకు సాగాడు. హీరా పంచమిని పురస్కరించుకుని ఆగ్రహించిన మహాలక్ష్మిని బుజ్జగించి నారాయణునితో భేటీ చేయించడం ఈ ఉత్సవం సారాంశం. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన యాత్రికులతో బొడొదండొ కిటకిటలాడింది. బహుడా రథయాత్ర విజయవంతంగా ముగియడంతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సేవాయత్‌లు, అధికారులకు అభినందనలు తెలిపారు. -
జగన్నాథ రథచక్రాల్..!
-
రథయాత్రకు అనుమతి నిరాకరణపై నేడు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఉగాది నుంచి హనుమజ్జయంతి వరకు తాము తలపెట్టిన శ్రీరామ రథయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) తెలంగాణ కార్యదర్శి ఎం.గాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి విచారణ జరిపారు. వీహెచ్‌పీ కార్యకలాపాలను అడ్డుకునే ఉద్దేశంతోనే పోలీసులు రథయాత్రకు అనుమతిని నిరాకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.హరినాథ్‌రెడ్డి అన్నారు. కోర్టు షరతులు విధిస్తే వాటికి అనుగుణంగా యాత్రను శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న బాసర నుంచి యాత్రను ప్రారంభించి 31న సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ దేవస్థానం వద్ద ముగించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామీణ యువతలో అవగాహన కల్పించేందుకు ఈ యాత్రను చేపడుతున్నామని వివరించారు. అయితే, పోలీసులు శాంతిభద్రతలను, ప్రస్తుతం విద్యార్థులకు జరుగుతున్న వార్షిక పరీక్షలను కారణంగా చూపుతూ అనుమతి నిరాకరించారని, కానీ అసలు ఉద్దేశం వీహెచ్‌పీ కార్యకలాపాలను అడ్డుకోవడమేనని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఈ యాత్రలో ఎంత మంది పాలుపంచుకుంటారు? ఎన్ని వాహనాలుంటాయి? అని ప్రశ్నించగా జనం అనుసరించే యాత్ర కాదని, ఈ యాత్రలో గరిష్టంగా పది మంది ఉంటారని, యాత్ర ఒక్కో ఊరికి చేరుకోగానే ఆ ఊరి ప్రజలు యాత్రలో పాల్గొని వెళ్లిపోతుంటారని హరినాథ్ చెప్పారు. అయితే, ఈ యాత్ర వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ తెలిపారు. మైనారిటీల్లో భయాందోళలను సృష్టించేందుకే ఈ యాత్ర చేపడుతున్నారని తెలిపారు. జిల్లాలు, డివిజన్ల వారీగా సమా చారం తెప్పించుకోవాల్సిన అవసరముందని, దీనిని విశ్లేషించాక పూర్తి వివరాలను కోర్టు ముందుంచగలనని చెప్పారు. కౌంటర్ దాఖలు చేసే వరకు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును గురువారం వెలువరిస్తానని ప్రకటించారు. -
శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ హీరో, దర్శకుడు రాఘవలారెన్స్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి మంత్రాలయం వచ్చారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టారు. రాఘవేంద్రస్వామి మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రథయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు తల్లి కల్మణి, తమ్ముడు ఎల్విన్విన్ పాల్గొన్నారు. లారెన్స్ మాట్లాడుతూ దాదాపు 420 చిత్రాలకు నృత్య దర్శకుడిగా, 10 చిత్రాలకు దర్శకుడిగా, 16 చిత్రాల్లో నటుడిగా పనిచేసినట్లు వెల్లడించారు.