రావి ఆకుపై వైఎస్సార్ చిత్రం
సనత్‌నగర్, న్యూస్‌లైన్: తన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని రావిఆకుపై చిత్రించి అబ్బురపరిచారు.. మారిషస్ దేశంలో పుట్టి పెరిగిన తెలుగు చిత్రకారుడు సంజీవ నరసింహ అప్పడు. వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడిగా పనిచేసే ఆయన చిత్రకళను ప్రవృత్తిగా మలచుకున్నారు. ముఖ్యంగా రావి ఆకులపై బొమ్మలు వేయడంలో సిద్ధహస్తుడు. 1400 బొమ్మల్ని రావిఆకులపై వేసి రికార్డు సృష్టించిన ఆయన.. వైఎస్ఆర్ చిత్రాన్ని వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఇటీవల మారిషస్‌లో పర్యటించి వచ్చిన ప్రయోగాత్మక దర్శకుడు, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు గ్రహీత పీసీ ఆదిత్య ఆయన వేసిన చిత్రాలను తిలకించి సన్మానించారు. వచ్చే నెల మొదటి వారంలో నరసింహఅప్పడు నగర పర్యటనకు వస్తున్న సందర్భంలో వైఎస్ఆర్సీతన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని రావిఆకుపై చిత్రించి అబ్బురపరిచారు.. మారిషస్ దేశంలో పుట్టి పెరిగిన తెలుగు చిత్రకారుడు సంజీవ నరసింహ అప్పడు. వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడిగా పనిచేసే ఆయన చిత్రకళను ప్రవృత్తిగా మలచుకున్నారు.పీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మికి తాను వేసిన వైఎస్ చిత్రాన్ని అందజేయనున్నారు.