RAW అధిపతిగా రవి సిన్హా నియామకం
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవి సిన్హాను భారత నిఘా విభాగమైన రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(RAW) అధిపతిగా ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయానికి ‘నియామకాలపై కేంద్ర మంత్రుల కమిటీ’ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం రా చీఫ్‌గా పని చేస్తున్న సమంత్ కుమార్ గోయెల్ పదవీకాలం జూన్ 30, 2023న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో రా అధిపతిగా సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రెటేరియట్ స్పెషల్ సెక్రెటరీగా ఉన్నారు. సిన్హా గత ఏడేళ్లుగా ‘రా’ ఆపరేషనల్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. కాగా విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను ‘రా’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Ravi Sinha, IPS (CG:88) to be the new Secretary, Research & Analysis Wing. pic.twitter.com/vEr3hfokZJ
— ANI (@ANI) June 19, 2023
చదవండి: పరువుహత్య చేసి.. బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా పడేశారు