జగన్ను కలిసిన కాపు కుటుంబ సభ్యులు
రాయదుర్గం అర్బన్ : మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం హైదరాబాద్లోని లోటస్పాండ్లో వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తన సోదరుడు వరికూటి హంపారెడ్డి, మంజుల దంపతుల తనయుడు నవీన్కుమార్రెడ్డికి, విశాఖకు చెందిన వెంకట మహేశ్వర్రెడ్డి, జయలక్ష్మి పద్మజ దంపతుల తనయ రిషితరెడ్డికి ఆగస్టు ఏడో తేదీన వివాహం జరగనుంది.
ఈ వివాహానికి హాజరుకావల్సినదిగా కాపు రామచంద్రారెడ్డి తన సతీమణి కాపు భారతితోపాటు హంపారెడ్డి దంపతులు, మహేశ్వరరెడ్డి దంపతులు ఆహ్వానపత్రికను జగన్కు అందజేశారు.