Rayalaseema Thermal Power Project
-
అవినాష్ దీక్షతో దిగివచ్చిన జెన్కో
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లోని 600 మెగావాట్ల ప్రాజెక్ట్‌కు భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో మంగళవారం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆర్టీపీపీలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి తనయుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీంతో ఏపీజెన్కో యాజమాన్యం దిగివచ్చింది. జెన్కో డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డిలతో రైతుల సమక్షంలో చర్చలు జరిపారు. 96 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని, అవి కూడా జనవరి 1న నేరుగా గేట్ పాసులు ఇచ్చి అనుమతిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో వారు ఇచ్చిన హామీ మేరకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దీక్షను విరమించారు. మొదటి దఫా చర్చలు విఫలం: ఆగ్రహించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి భూ నిర్వాసితుల తరఫున ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డిలు ఆర్టీపీపీ సీఈ ఛాంబరులో జెన్కో డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావుతో చర్చలు జరిపారు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాదులో ఏపీ జెన్కో ఎండీ, సీఎండీని తాను, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కలసి ఉద్యోగాలు ఇవ్వాలని కోరామన్నారు. అందుకే ఆయన మిమ్మల్ని ఆర్టీపీపీకి పంపారని చెప్పారు. ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, ఎంత మందికి ఇస్తారు, తదితర విషయాలు చె ప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయని కచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని డెరైక్టర్ చెప్పారు. దీంతో అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ భూములు తీసుకుని కాలయాపన చేసింది చాలక ఇంకా ఒత్తిళ్లు ఉన్నాయని తప్పుకునే ప్రయత్నం చేస్తారా’ అంటూ చర్చలో నుంచి లేచి వచ్చి ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఎంపీకి సంఘీభావంగా ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి కూడా కూర్చున్నారు. మూడు గంటల పాటు ఎంపీ దీక్ష... ఉదయం 11.45 నిమిషాలకు అవినాష్ దీక్ష ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీజెన్కో ఎండీ విజయానంద్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఎంపీకి ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరారు. తొలుత భూ నిర్వాసితులకు ఉద్యోగాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రెండో దఫా చర్చలు సఫలం... ఏపీ జెన్కో యాజమాన్యం దిగి వచ్చి రెండో దఫా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో చర్చలు జరిపింది. ఈసారి చర్చల్లో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డితో పాటు భూ నిర్వాసితులు, మహిళలు పాల్గొన్నారు. ఈ చర్చల్లో భూ నిర్వాసితులకు 96 ఉద్యోగాలు ఇస్తామని, అవి కూడా జనవరి 1వ తేదీలోగా గేట్ పాసులు ఇస్తామని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ చెప్పారని డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావు ప్రకటించారు. దీక్షను విరమింపజేసిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. చర్చలు సఫలం కావడంతో దీక్షలో కూర్చున్న భూ నిర్వాసితులకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డిలు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప జేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు. -
భుక్తిపోరు
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో 600 మెగావాట్ల ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు సోమవారం ఆర్టీపీపీని ముట్టడించారు. తమకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కదలి వచ్చారు. ప్రాజెక్టు గేటు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గేట్ వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య, వైస్ ఛైర్మన్ సుభాష్‌రెడ్డిలతో పాటు కౌన్సిలర్లు కూడా ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీఐ పీటీ కేశవరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి ఏపీ జెన్కో డెరైక్టర్ వై. వెంకటేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు భూ నిర్వాసితులు, నాయకులు కొందరు రావాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ డెరెక్టర్, సీఈ ఇక్కడికే వచ్చి నేరుగా భూ నిర్వాసితులతో చర్చలు జరపాలని కోరారు. ఎస్ఈ శేషారెడ్డి వచ్చి భూ నిర్వాసితులు చర్చలకు రావాలని విన్నవించడంతో సీఈ ఛాంబర్లో చర్చలు జరిపారు. ఏపీ జెన్కో డెరైక్టర్‌తో చర్చలు ఏపీ జెన్కో డెరైక్టర్‌తో జరిగిన చర్చల్లో సుధీర్‌రెడ్డి, శివనారాయణరెడ్డిలతో పాటు భూ నిర్వాసితులు, మహిళలు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన వారిందరికి ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన భూ నిర్వాసితులకు 95 ఉద్యోగాలు ఇస్తామని డెరైక్టర్ వైవీ రావు హామీ ఇచ్చారని భూ నిర్వాసితులు తెలిపారు. పది రోజుల్లో జాబితాను విడుదల చేస్తామని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. మళ్లీ నిరసనలు చేయమని భూ నిర్వాసితులు హామీ ఇవ్వాలని డెరైక్టర్ కోరారు. కాగా తమకు చెప్పిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని, మాట తప్పితే మళ్లీ ఉద్యమ బాట పడతామని భూ నిర్వాసితులు హెచ్చరించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా.. ‘ఆర్టీపీపీ అధికారులు మా భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం అడుక్కునే పరిస్థితి కల్పించారు’ అని భూ నిర్వాసితుడు సునీల్ వాపోయారు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తుండగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. తిప్పుకుంటున్నారు.. ‘మొదట్లో భూములు తీసుకునేటప్పుడు మమ్మల్ని నమ్మించారు. ఇప్పుడేమో మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు’ అని భూ నిర్వాసిత మహిళ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీపీపీ అధికారులు భూములు తీసుకుని తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయటి వ్యక్తులకు ఇవ్వడం దారుణమన్నారు. -
ఆర్టీపీపీ భూ బాధితులకు న్యాయం చేయండి
జెన్కో ఎండీని కోరిన వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే హైదరాబాద్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణలో భూములు కోల్పోయిన వారికి వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. బాధితులకు ఉద్యోగాలు ఇప్పించడంలో న్యాయం చేయాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శుక్రవారం జెన్కో ఎండీ కె విజయానంద్‌ను కలసి కోరారు. ఉద్యోగాల కోసం బాధితులు ఐదు రోజులగా ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేస్తున్న విషయాన్ని ఆ నేతలు జెన్కో ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన జెన్కో ఎండీ ఆదివారం ప్రాజెక్టు వద్దకు ఇద్దరు డైరక్టర్లను పంపుతానని హామీ ఇచ్చారు. అక్కడి వారితో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు డైరక్టర్లు రెండు, మూడు రోజులైన అక్కడే ఉంటారని చెప్పారు. ఎంతమందికి ఉద్యోగాలిచ్చేది ప్రకటన చేశాకే హైదరాబాద్‌కు వస్తారని చెప్పారు. -
ఆర్టీపీపీపై సవతి ప్రేమ
- ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా చేయండి - సింగరేణి కాలరీస్ ఎండీకి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమకు మణిహారంగా నిలుస్తున్న ఆర్టీపీపీకి అవసరమైన బొగ్గు సరఫరాలో సవతిప్రేమ చూపొద్దని, జెన్కో సంస్థతో చేసుకున్న అగ్రిమెంటు మేరకు బొగ్గు సరఫరా చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఆర్టీపీపీలో బొగ్గునిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ఎండీ సుతిత్రభట్టాచార్యకు సోమవారం లేఖ రాశారు. 1050 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు లేక యూనిట్లను నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 2030 వరకూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయాలనే ఒప్పందం ఉందన్నారు. రాష్ట్ర విభజన నాటినుంచి ఇప్పటి వరకూ అక్కడి నుంచి మోతాదు మేరకు సరఫరా లేకుండా పోయిందని ఆయన వివరించారు. జెన్కోకు ఉన్న ఒప్పందం ప్రకారం ఆర్టీపీపీకి ప్రతి ఏడాది 38.8లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా, ఆమేరకు బొగ్గు సరఫరా కావడం లేదని అవినాష్‌రెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు. జెన్కోలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆర్టీపీపీ ఏరోజుకారోజు బొగ్గు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈపరిణామానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్సీసీఎల్ కారణంగా ఉత్పత్తి ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు ఎస్సీసీఎల్ ఛెర్మైన్‌కు రాసిన లేఖలో తెలిపారు. -
ఇరవై నెలల్లోగా ఆరో యూనిట్ పూర్తి
ఎర్రగుంట్ల,న్యూస్‌లైన్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులు ఇరవై నెలల్లో పూర్తి చేసి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఏపీ జెన్కో ఎండీ కె.విజయానంద్ పేర్కొన్నారు. బుధవారం ఆర్టీపీపీలోని గెస్ట్‌హౌస్‌లో అధికారులు, ఆర్టీపీపీ పరిసర గ్రామాల సర్పంచ్‌లు, కార్మిక నాయకులు, స్ధానికులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీపీపీలోని ఆరో యూనిట్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే అన్నారు. అయినా ఇప్పటి నుంచి 20 నెలల్లోగా పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. కంపెనీ ప్రతినిధులతో ఇది వరకే మాట్లాడి పనులు వేగంగా చేయాలని ఆదేశించామన్నారు. బాయిలర్ , ఈఎస్పీ పనులు బాగా జరుగుతున్నాయని, ఇంకా జరగని పనులపై దృష్టి సారించి వాటిని వేగంగా చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. కూలింగ్ టవర్ డిజైన్‌లో ఏర్పడిన సమస్య కారణంగా టవర్ నిర్మాణం కొంత ఆలస్యమవుతోందన్నారు. మార్చికి కృష్ణపట్నంలో 1600 మెగా వాట్ల ప్రాజెక్టు పనులు పూర్తి 2014 జనవరి నాటికల్లా కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దశ పనులు పూర్తి చేస్తామని, అలాగే మార్చి నాటికి మరో 800 మెగావాట్ల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఎండీ విజయానంద్ తెలిపారు. అలాగే భూపాల్పల్లిలోని 600 మెగావాట్ల పనులను 2014 మే నాటికి పూర్తి చేస్తామన్నారు. కొత్త ప్రాజె క్టులకు అనుమతులు విజయవాడ, కొత్తగూడెం, కృష్ణపట్నంలలో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని విజయానంద్ తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని నాలుగు సంవత్సరాల్లోగా పూర్తి చేస్తామన్నారు. ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌కు వినతుల వెల్లువ ఏపీజెన్కో ఎండీ కె. విజయానంద్‌కు ఆర్టీపీపీ చుట్టు ప్రక్కల గల ఎనిమిది గ్రామాల సర్పంచ్‌లు వినతిపత్రాలు అందజేశారు. గ్రామాలలో సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం కార్మిక నాయకులు కలిసి మెయింటైన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని, గ్రేడింగ్‌ల ప్రకారం వేతనం అందించాలని కోరారు. ఈ వినతులపై ఎండీ విజయానంద్ సానుకూలంగా స్పందించారు. ప్లాంట్ పరిశీలన.. ఆర్టీపీపీలోని యూనిట్లను ఎండీ విజయానంద్ పరిశీలించారు. అనంతరం ఆర్టీపీపీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు, ఎస్ఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు.