ఆర్టీపీపీ భూ బాధితులకు న్యాయం చేయండి | Artipi do justice to the victims of land | Sakshi
Sakshi News home page

ఆర్టీపీపీ భూ బాధితులకు న్యాయం చేయండి

Published Sat, Nov 8 2014 3:57 AM | Last Updated on Wed, Jul 25 2018 6:05 PM

ఆర్టీపీపీ భూ బాధితులకు న్యాయం చేయండి - Sakshi

ఆర్టీపీపీ భూ బాధితులకు న్యాయం చేయండి

జెన్‌కో ఎండీని కోరిన వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే
 
హైదరాబాద్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణలో భూములు కోల్పోయిన వారికి వైఎస్సార్‌సీపీ నేతలు అండగా నిలిచారు. బాధితులకు ఉద్యోగాలు ఇప్పించడంలో న్యాయం చేయాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శుక్రవారం జెన్‌కో ఎండీ కె విజయానంద్‌ను కలసి కోరారు. ఉద్యోగాల కోసం బాధితులు ఐదు రోజులగా ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేస్తున్న విషయాన్ని ఆ నేతలు జెన్‌కో ఎండీ దృష్టికి తీసుకొచ్చారు.

స్పందించిన జెన్‌కో ఎండీ ఆదివారం ప్రాజెక్టు వద్దకు ఇద్దరు డైరక్టర్లను పంపుతానని హామీ ఇచ్చారు. అక్కడి వారితో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు డైరక్టర్లు రెండు, మూడు రోజులైన అక్కడే ఉంటారని చెప్పారు. ఎంతమందికి ఉద్యోగాలిచ్చేది ప్రకటన చేశాకే  హైదరాబాద్‌కు వస్తారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement