RBI Central Board
-
క్రిప్టోకరెన్సీ.. కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ
RBI On Cryptocurrency Control And Digital Currency: క్రిప్టోకరెన్సీ నియంత్రణ చట్టం విషయంలో కేంద్రం ఆచితూచీ వ్యవహరించాలని నిర్ణయించుకుంది. క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని ఓవైపు చెబుతూనే.. వాటిని ఆస్తులుగా పరిగణించే దిశగా చట్టంలో మార్పులు చేసినట్లు సంకేతాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో తన స్టాండర్డ్‌ను ప్రకటించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. ఈ మేరకు డిసెంబర్ 17న లక్నో(ఉత్తర ప్రదేశ్)లో జరగబోయే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది ఆర్బీఐ. ఆర్బీఐ తరపు నుంచి డిజిటల్ కరెన్సీని(క్రిప్టో పేరుతో కాకుండా) జారీ చేయడం? దాని రూపు రేఖలు.. ఎలా ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయానికి రానుంది. ఇక ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?.. ఒకవేళ ప్రైవేట్ క్రిప్టో నియంత్రణ బాధ్యతల్ని ముందుగా అనుకున్నట్లు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి కేంద్రం అప్పగిస్తే.. ఆ నిర్ణయాన్ని స్వాగతించాలా? లేదంటే వ్యతిరేకించాలా? అనే విషయాలపై బోర్డులో చర్చించనుంది ఆర్బీఐ. క్లిక్ చేయండి: క్రిప్టోతో పెట్టుకోవడం ఆర్బీఐకి మంచిది కాదు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం (13 డిసెంబర్, 2021)న ఆర్థిక మంత్రిత్వ శాఖ.. క్రిప్టోకరెన్సీ కోసం బిల్లు, నియంత్రణ మీద బిల్లు తుది రూపానికి వచ్చిందని, కేబినెట్ అంగీకారం ఒక్కటే మిగిలిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ వేగం పెంచింది. నిజానికి 17వ తేదీన జరగబోయే ఆర్బీఐ బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ కీలకాంశం ప్రస్తావనే లేదు!. కానీ, ఇలా ఎజెండాలో లేని కీలకాంశాలపై చర్చించడం బోర్డుకు కొత్తేం కాదని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చదవండి: క్రిప్టోకరెన్సీ లావాదేవీలు ఎలా జరుగుతాయో తెలుసా? -
మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్
ముంబై, సాక్షి: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్ము రేపుతున్నాయ్. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మిడ్‌సెషన్‌కల్లా మార్కెట్లు భారీగా ఎగశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 584 పాయింట్లు జంప్‌చేసి 47,028కు చేరింది. వెరసి మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడింది. ఇక నిఫ్టీ సైతం 165 పాయింట్లు ఎగసి 13,766 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం సెన్సెక్స్ 47,056 సమీపంలో, నిఫ్టీ 13,778 సమీపంలోనూ సరికొత్త గరిష్ట రికార్డులను సాధించాయి. జీడీపీ అంచనాలకు మించి వేగమందుకున్నట్లు ఆర్బీఐ నివేదిక తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటుకు జోష్ లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. (రికవరీ అంచనాలను మించుతోంది: ఆర్బీఐ) బజాజ్ ఆటో చకన్లో రూ. 650 కోట్లతో మోటార్ సైకిళ్ల తయారీ ప్లాంటుకి మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. 2023కల్లా ఉత్పత్తిని ప్రారంభించగల ఈ ప్లాంటులో అత్యంత ఖరీదైన కేటీఎం బైకులు, హస్క్వర్నా, ట్రయంప్ మోటార్ సైకిళ్లను తయారు చేయనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తినీ చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో తొలుత 3 శాతం ఎగసి రూ. 3,423ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 3,378 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో ఈ షేరు 6 శాతం పుంజుకుంది. టాటా కమ్యూనికేషన్స్ ఫ్రాన్స్‌కు చెందిన ఈసిమ్ టెక్నాలజీ కంపెనీ.. ఒయాసిస్ స్మార్ట్ సిమ్ యూరోప్‌ను కొనుగోలు చేసినట్లు టాటా కమ్యూనికేషన్స్ తాజాగా పేర్కొంది. ఈసిమ్, సిమ్ విభాగాలలో ఒయాసిస్ ఆధునిక టెక్నాలజీ సర్వీసులను అందిస్తున్నట్లు తెలియజేసింది. తద్వారా మూవ్టీఎం పేరుతో తాము అందిస్తున్న ఎండ్టుఎండ్ ఎంబెడ్డెడ్ కనెక్టివిటీ సర్వీసులు మరింత బలపడనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లింది. రూ. 1,145 వద్ద సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 1,067 వద్ద కదులుతోంది. ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ హెల్త్‌కేర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ కంపెనీ పేషంట్మ్యాటర్స్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించాక జోరందుకున్న ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ తాజాగా మరోసారి బలపడింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 89 సమీపానికి చేరింది. వెరసి 2008 తదుపరి గరిష్టానికి చేరింది. గత మూడు రోజుల్లోనూ ఈ షేరు 24 శాతం ర్యాలీ చేసింది. ఈ కౌంటర్లో మధ్యాహ్నానికల్లా నాలుగు రెట్లు అధికంగా 1.4 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 30కల్లా సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీలో 2.88 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఆర్పీ సంజీవ్ గోయెంకా కంపెనీ ఫస్ట్‌సోర్స్.. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీసులను అందించే విషయం విదితమే. -
ప్రైవేటు బ్యాంకుల ప్రమోటర్ల వాటాలపై సమీక్ష
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వాటి కార్పొరేట్ స్వరూపం, యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ సమీక్షించనుంది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్ పీకే మొహంతి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందం ఈ సమీక్ష చేపడుతుందని ఆర్బీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించి నియంత్రణలు, లైసెన్స్ నిబంధనలను సమీక్షించాలని ప్యానెల్‌ను ఆర్బీఐ కోరింది. యాజమాన్యం అధిక నియంత్రణ, అంతర్గత విధానాలపైనా ప్యానెల్ దృష్టి సారించనుంది. అలాగే, తొలిదశలో/లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత.. అనంతరం ప్రమోటర్ల వాటాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్ తగిన సిఫారసులు చేయనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో ప్రమోటర్లకు నిబంధనల కంటే అధిక వాటా ఉండగా, దీనిపై ఆర్బీఐ, బ్యాంకు మధ్య కోర్టు వెలుపల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోటక్ బ్యాంకులో ప్రమోటర్లు 26 శాతం వాటా కొనసాగించేందుకు అనుమతిస్తూ ఓటింగ్ హక్కులను 15 శాతం వాటాలకే ఆర్బీఐ పరిమితం చేసింది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లకు ప్రమోటర్ల వాటా 40 శాతానికి.. 10 ఏళ్లకు 20 శాతానికి, 15 ఏళ్లకు 15 శాతానికి తగ్గించుకోవాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కోటక్ బ్యాంకు మాదిరే తామూ 26 శాతానికి వాటా పెంచుకునేందుకు అనుమతించాలని ఇండస్ఇండ్ బ్యాంకు ప్రమోటర్లు అయిన హిందుజా సోదరులు ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోగా.. అందుకు కేంద్ర బ్యాంకు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఈ అంశంపై దృష్టి సారించనుంది. -
సహకార బ్యాంకుల పనితీరుపై ఆర్బీఐ సమీక్ష
భువనేశ్వర్: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ) స్కామ్‌తో లక్షల మంది డిపాజిటర్లు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్ సహకార బ్యాంకుల పనితీరును రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శనివారం సమీక్షించింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అంతర్గతంగాను.. అంతర్జాతీయంగాను దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన అంశాలు కూడా చర్చించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన సెంట్రల్ బోర్డు.. పట్టణ ప్రాంత కోఆపరేటివ్ బ్యాంకులు, వాటితో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు మొత్తం రూ. 6,226 కోట్ల మేర రుణాలిచ్చినప్పటికీ .. పీఎంసీ బ్యాంకు కేవలం రూ. 440 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ఆర్బీఐకి చూపించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ బైటపడటంతో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల విత్డ్రాయల్స్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. -
2000 నోటుపై అప్పుడే నిర్ణయం..
ముంబై: రెండు వేల రూపాయల నోట్లను చెలామణిలోకి తేవాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గతేడాది మే నెలలోనే నిర్ణయం తీసుకుంది. అయితే పాత పెద్ద నోట్లను రద్దు విషయం అప్పుడు ప్రస్తావనకు రాలేదని వెల్లడైంది. సమాచార హక్కు చట్టం కింద ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ సమర్పించిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. రూ.2000 నోట్లు ప్రవేశపెట్టేందుకు సెంట్రల్ బోర్డు 2016, మే 19న ఆమోదం తెలిపిందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ సమావేశంలో పాత పెద్ద నోట్ల రద్దు ప్రస్తావనే రాలేదని తెలిపింది. జూలై 7, ఆగస్టు 11న జరిగిన బోర్డు సమావేశాల్లోనూ పాత పెద్ద నోట్ల ఉపసంహరణపై ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేసింది. రఘురామ్ రాజన్ గవర్నర్ గా ఉన్నప్పుడే రూ. 2000 నోట్లు ప్రవేశపెట్టాలని ఆర్బీఐ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పదవీకాలం ముగియడంతో గతేడాది సెప్టెంబర్ 4న రాజన్ వైదొలగారు. తర్వాత రోజు ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు.