RC Book
-
డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ కార్డుల సమస్యకు చెక్ : ఏపీ
-
బండి లేకపోయినా..
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ పౌరుడు ఓ వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే... సవాలక్ష ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ స్లాట్ నుంచి ఆధార్ కార్డు వరకు వివిధ రకాలైన పత్రాలను జత చేసి, వాహ నం తీసుకుని యజమానే స్వయంగా వెళ్లి, కనీసం మూడునాలుగు గంటలు వెచ్చిస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాదు. ఆ తర్వాత ఆర్సీ చేతికి రావడానికి మరో వారం పది రోజులు పడుతుంది. హితేష్ నేతృత్వంలోని ముఠా రంగంలోకి దిగితే కేవలం ‘ఫార్మాలిటీస్’ తప్ప ఇంకేం అవసరం లేదు. వాహనాన్ని, దానికి సంబంధించిన పత్రాలను దాఖలు చేయాల్సిన పని లేదు. కేవలం స్లాట్ బుక్ చేసి, ఫామ్–20 లేదా ఫామ్–25 సమర్పిస్తే చాలు. గంటలోనే ఆర్సీ సిద్ధమైపోయి వీరి చేతికి వచ్చేస్తుంది. అసలు వాహనం లేకపోయినా పర్వాలేదు... భవిష్యత్తులో ‘ఖరీదు చేసే’ ఆలోచన ఉంటే చాలు రిజిస్ట్రేషన్ పూర్తయి ఆర్సీ వీరి చేతిలో ఉంటుంది. బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిన ‘బోగస్ రిజిస్ట్రేషన్ల దందా’ నేపథ్యమిదీ. 2015 నుంచి సాగిన ఈ అడ్డగోలు వ్యవహారంలో ఆర్టీఏ అధికారులకు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీఓ నుంచి క్లర్క్ వరకు మొత్తం నలుగురు అధికారులు/సిబ్బంది దళారి విఠల్‌రావుతో కుమ్మక్కైనట్లు ప్రాథమికంగా నిర్థారించారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన ఐదుగురు సభ్యుల ముఠా 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలకు రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్ర యించింది. ఆలుగడ్డబావికి చెందిన మెకానిక్ వద్ద దొరికిన ‘తీగ’ లాగిన టాస్క్ఫో ర్స్ ఈ ము ఠా గుట్టును రట్టు చేసింది. ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి హితేష్ పటేల్ వాహనాన్ని చూసి దాని మోడల్, ఏ ఏడాదిలో తయారయ్యిందో చెప్పగల నేర్పరి కావడం కొసమెరుపు. ఒక్కో వాహనానికి రూ.80 వేలు... ఓఎల్ఎక్స్ ద్వారా కాలం చెల్లిన వాహనాలను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఖరీదు చేసే హితేష్ వాటిని తొలుత మెకానిక్‌లకు అప్పగిస్తాడు. రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేసి వీటిని కొత్తగా తయారు చేయిస్తాడు. ఆపై ఒక్కో వాహనం కోసం ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ నుంచి కొన్ని నెంబర్లను ఎంపిక చేసి, ఇంజన్‌తో పాటు ఛాసిస్ నెంబర్లు సృష్టించి ఆర్టీఏ దళారి విఠల్‌రావుకు అందించేవాడు. వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయించడానికి ఇతను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇలా మొత్తమ్మీద గరిష్టంగా ఒక్కో వాహనానికీ రూ.80 వేల వరకు ఖర్చు చేసున్న హితేష్ గ్యాంగ్ దాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలను ఈ పంథాలో విక్రయించగా... వాటిలో అత్యధికం ఎన్ఫీల్డ్, యమహా బైక్‌లే కావడం గమనార్హం. మార్కెట్లో వీటికి ఎక్కువ క్రేజ్ ఉండటంతో హితేష్ వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. పత్రాలు ఇస్తే చాలు... ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని విఠల్‌రావు బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిస్తున్నాడు. ఒక్కో వాహనంపై ఆర్సీ సృష్టించడానికి గరిష్టంగా రూ.5 వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆర్టీఓకు రూ.1500, ఎంవీఐకి రూ.1000, సూపరింటెండెంట్‌కు రూ.1000, ఓ మహిళా క్లర్క్‌కు రూ.500లతో పాటు కొందరు కానిస్టేబుళ్లకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ మామూళ్లు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది వాహనం, ఇతర పత్రాలు తీసుకురాకపోయినా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. రీ–అసైన్‌మెంట్‌కు ఫామ్–20, రీ–రిజిస్ట్రేషన్‌కు ఫామ్–25 ఇస్తే చాలు ఆర్సీలు జారీ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎలాంటి వాహనాలు లేనప్పటికీ 14 ఆర్సీలు ఈ ముఠా వద్ద సిద్ధంగా ఉండటం. మరో 75 నెంబర్లను ఆర్సీల జారీ కోసం సిద్ధం చేసి ఉంచడం. అందరూ నకిలీ వ్యక్తులే... ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి యజమాని, వాహనం తప్పనిసరి. అయితే అధికారులను మేనేజ్ చేస్తున్న ఈ ముఠా వాహనాలు అసలే తీసుకువెళ్లట్లేదు. యజమానులుగా పరిచయస్తులైన మెకానిక్‌లతో పాటు ఇతరుల్ని తీసుకువెళ్తోంది. వీరితోనే వేలి ముద్రలు వేయించి, వీరే ఫొటోలు దిగిన తర్వాత డిజిటల్ సంతకాలు సైతం చేయించేస్తోంది. కొన్ని సందర్భాల్లో హితేష్ స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 35 ఆర్సీల్లో ఆరు హితేష్ పేరుతో, ఐదు అబు నాసిర్, మరో ఐదు రాజ్‌కుమార్, ఐదు మహ్మద్ సలీం పేరుతో మిగిలినవి గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో ఉండటం గమనార్హం. వీరే పదేపదే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్తూ తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసుకుని వాహనాలను అమ్మేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు... ఈ ముఠా విక్రయించిన వాటిలో కొన్ని కాలం చెల్లిన వాహనాలు, మరికొన్ని చోరీ వాహనాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా జరుగుతున్న రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఒకటికి మించి వాహనాలు తిరిగేస్తుంటాయి. ఫలితంగా హిట్ అండ్ రన్‌తో పాటు ఇతర నేరాలు జరిగినప్పుడు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసినా.. బాధ్యులను పట్టుకోవడంతో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చిక్కినా వీటికి ఇన్సూరెన్స్ ఉండవు. మరోపక్క చోరీ వాహనాలకు సైతం కొత్త నెంబర్ల వచ్చేస్తున్న నేపథ్యంలో ఎలా దర్యాప్తు చేసినా వీటిని పట్టుకోవడం కష్టం. దీంతో బాధితులు నష్టపోవాల్సి వస్తోంది. చిన్న ఆధారంతో ముందుకు.. మూడేళ్లుగా సాగుతున్న హితేష్ ముఠా దందాపై ఆలుగడ్డబావిలో టాస్క్‌ఫోర్స్‌కు ఆధారం దొరికింది. అక్కడి మెకానిక్ మైఖేల్ మోదీ ఇటీవల ఓ వాహనానికి ఇదే పంథాలో ఆర్సీ సృష్టించి విక్రయించాడు. అవే రిజిస్ట్రేషన్, ఛాసిస్, ఇంజిన్ నెంబర్లు మరో వాహనానికి తగిలించి తిరుగుతున్నాడు. ఈ ‘డబుల్ రిజిస్ట్రేషన్’ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... దందా మొత్తం వెలుగులోకి వచ్చి హితేష్, మోదీ సహా ఐదుగురు కటకటాల్లోకి చేరారు. ఈ ముఠాకు సహకరించిన ఇతర మెకానిక్‌లు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఆర్టీఏ అధికారులను ఆధారాలతో సహా గుర్తించడానికీ ప్రయత్నాలు చేస్తున్నారు. -
‘కార్డు’లెస్ డ్రైవింగ్!
గ్రేటర్ పరిధిలోని రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల కొరత మళ్లీ మొదటకొచ్చింది. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ చాలా మంది వినియోగదారులకు సకాలంలో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం లేదు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆర్సీలు చేతికందడం లేదు. కార్డుల తయారీ, ముద్రణకు అవసరమైన ఇంక్ రిబ్బన్ తదితర సామగ్రిని పంపిణీ చేసే కాంట్రాక్టర్ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం, తరచూ కాంట్రాక్టర్లు మారుతుండడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేక వాహనదారులు జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఏడాది కాలంగా ఈ పరిస్థితి నెలకొన్నా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డుల జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. అన్ని ఆఫీసుల్లోనూ వేల సంఖ్యలో కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్య తీవ్రంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి కొద్ది మొత్తంలో స్టేషనరీ సరఫరా చేస్తూ అప్పటికప్పుడు దాటవేయడం మినహా శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు అధికారుల మధ్య సమన్వయలోపం కూడా కార్డుల కొరతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేల సంఖ్యలో పెండింగ్.... గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, మెహిదీపట్నం, మేడ్చల్, అత్తాపూర్, కొండాపూర్, నాగోల్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, కూకట్పల్లి తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు సుమారు 2000 కొత్త వాహనాలు, మరో 1500 డ్రైవింగ్ లైసెన్సులకు కార్డులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 3500 నుంచి 4000 కార్డులు అవసరం. కార్డులతో పాటు వాటిపైన అక్షరాలను ప్రింట్ చేసేందుకు వినియోగించే రిబ్బన్‌కు కూడా డిమాండ్ మేరకు సరఫరా కావడం లేదు. గతంలో 3 నెలల గరిష్ట డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని స్టేషనరీ నిల్వలలు ఉంచేవారు. దీంతో కార్డుల ప్రింటింగ్, పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. కానీ ఏడాది కాలంగా తరచుగా కార్డుల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల కార్డులు ఉంటే రిబ్బన్ ఉండడం లేదు. రిబ్బన్ ఉన్న చోట కార్డుల కొరత ఉంది. ఎందుకీ నిర్లక్ష్యం.... డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ సేవలను కోరే వినియోగదారులు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఫీజులు చెల్లిస్తారు. తాము పొందే కార్డు చార్జీలు, రవాణా అధికారులు చేసిన సేవల రుసుము, ఆ కార్డులను ఇంటికి పంపించేందుకు అయ్యే పోస్టల్ చార్జీలతో సహా అన్ని రుసుములు కలిపి ముందుగానే డబ్బులు చెల్లిస్తారు. ఆర్టీఏ పౌరసేవల కోసం స్లాట్ నమోదు చేసుకోవడంతో పాటే ఈ ఫీజుల చెల్లింపు కూడా జరిగిపోతుంది. కానీ సేవల్లో మాత్రం తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం, సమన్వయలోపమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్లోనే పాతకాంట్రాక్ట్ సంస్థ గడువు ముగిసింది. తిరిగి దాని స్థానంలో కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకోలేదు. అలాగని పాతసంస్థతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే అవసరం మేరకు పాత కాంట్రాక్టర్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపైన స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల తరచుగా కొరత తలెత్తుతోంది. ఒక్కో ఆఫీసులో సుమారు ఐదు వేల చొప్పున కార్డులు పెండింగ్‌లో ఉంటున్నాయి. వారం రోజుల్లో వినియోగదారుడికి చేరాల్సిన లైసెన్సు నెల రోజులైనా అందడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడమే కారణం... రవాణాశాఖకు సంబంధించిన విధానపరమైన అంశాల్లో, పౌరసేవల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనేందుకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పటి కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖకు బదిలీ అయి ఏడాది గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. సీనియర్ అధికారుల్లో ఎవ్వరికీ ఆ బాధ్యతలను అప్పగించలేదు. దీంతో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. మరోవైపు ప్రతిఫైల్‌ను ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి సెక్రెటేరియట్‌లోని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇలా వేలాది మంది వాహన వినియోగదారులకు సంబంధించిన పౌరసేవల అమల్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకొంటోంది.