real mafia
-
తాళ్ల చెరువును తోడేస్తుండ్రు...
సాక్షి, వనపర్తి: ఓవైపు చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి నాటి గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేస్తుంటే, కొందరు చెరువుల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల మరమ్మతు చేసిన వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు ఓ వైపు ఆక్రమణకు గురైంది. మరోవైపు అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు రియల్ వ్యాపారులు చెరువులోని మట్టిని తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషమై స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొంచి ఉన్న ముప్పు చిన్ననీటి పారుదల నిబంధనల ప్రకారం చెరువు కట్టకు పదిమీటర్ల దూరం వరకు కనీసం పూడికతీత పనులు చేపట్టనివ్వరు. చెరువుకట్టకు సమీపంలో గోతి ఎక్కువగా చేస్తే నీరు నిల్వ అయిన సమయంలో కట్ట కిందభాగం నుంచి అవతలికి నీరు వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో క్రమక్రమంగా కట్టబలహీనపడి తెగిపోయే పరిస్థితులు వస్తాయి. ఇంత ప్రమాదం ఉన్నా.. అధికారులతో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఆధీనంలోని చెరువులో నుంచి కొందరు రియల్ వ్యాపారులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ చెరువు కింద ప్రస్తుతం ఆయకట్టు చాలా తక్కువగా ఉంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిన్నపాటి తాళ్ల చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని ఏడాది పొడవునా.. నీటితో నిల్వ ఉంచి భూగర్భజలాలను పునఃరుద్ధరించాలని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. తాళ్ల చెరువు అభివృద్ధి పనుల కోసం ఎస్టిమేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు మౌకిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్షం రోజుల్లో ఎస్టిమేట్ సిద్ధమయ్యే సమయంలో రియల్ వ్యాపారులు చెరువులో మట్టితవ్వకాలకు తెగబట్టారు. సుమారు 2వేల ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యమే తాళ్ల చెరువులో కొందరు ఓ ప్రొక్లెయినర్, సుమారు పది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని చెరువుకు సమీపంలో నివాసం ఉండేవారు చిన్ననీటి పారుదలశాఖ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. దీనికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతస్థాయి అధికారి సమాధానం ఇచ్చారని సదరు వ్యక్తి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారిని ప్రశ్నలతో ఎదురుదాడి చేయటానికి ప్రయత్నించటం విస్మయానికి గురిచేసిందని ‘సాక్షి’తో వాపోయారు. అక్రమణల పర్వం ఇలా.. ఇప్పటికే తాళ్ల చెరువు వాగు ఆక్రమణకు గురైంది. 1999, 2008లో రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు నీరంతా నిండి ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చాయి. 1999లో చోటుచేసుకున్న సంఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు గతంలో చోటుచేసుకున్న విషయం తెలిసినా.. అధికారులు చెరువుల విషయంలో అలసత్వం ప్రదర్శించటం ఏమిటని పలువురు అసహనం వ్యక్తంచేశారు. గతంలో చెరువులో నుంచి అలుగుపారడంతో పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్, శ్వేతానగర్, దామోదర్ కాలనీ, బ్రహ్మంగారివీధి, శంకర్‌గంజ్, రాంనగర్ కాలనీ, రామాటాకీస్, బంగారం దుకాణాలు, ఆర్అండ్బీ కార్యాలయం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, టౌన్‌పోలీస్‌స్టేషన్ జలమయం అయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రియల్ వ్యాపారులు చేసిన తవ్వకాలతో భవిష్యత్‌లో కట్టకు ఏదైనా ప్రమాదం జరిగితే సంభవించే నష్టాన్ని ఊహించటం కష్టమే. వెంటనే చర్యలు తీసుకుంటాం తాళ్ల చెరువులో మట్టి తవ్వకాల గురించి ఇప్పటికే స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే చెరువును సందర్శిస్తాం. అక్రమ మట్టి తరలింపును అడ్డుకుంటాం. మినీట్యాంక్‌బండ్ తరహాలో తాళ్ల చెరువును అభివృద్ధి చేసేందుకు ఎస్టిమేట్లు త్వరలో పూర్తి చేస్తాం. – భరత్, అసిస్టెంట్ ఇంజనీర్, వనపర్తి -
పేదల భూములపై పెద్దల పాగా!
అక్రమాలకు అడ్డగా పీర్లపల్లి రియల్ వెంచర్ ►అసైన్డ్ భూములను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న ఇంక్రిడబుల్ ఇండియా ప్రాజెక్టు లిమిటెడ్ ►లబోదిబోమంటున్నదళిత కుటుంబాలు దళితుల గోడును ప్రచురించిన ‘సాక్షి’కి లాయర్ నోటీసులు పంపిన యాజమాన్యం ► క్షేత్రస్థాయిలో పరిశీనలలో బయటపడ్డ అసలు నిజం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : పేదల భూములపై పెద్దల కన్నుపడింది.. వెంటనే దళారులను ఉసిగొల్పారు.. డబ్బును ఆశ చూపించారు. దళితుల అవసరం మీద దెబ్బకొట్టారు. ఏకంగా ఎస్సీ కార్పొరేషన్ పంచిన భూములనే తీసుకున్నారు. కొల్లగొట్టిన భూమిని ప్లాట్లుగా మార్చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫాం హౌస్‌ను ... గజ్వేల్ ఔటర్ రింగు రోడ్డును ఆశ చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని పీర్లపల్లి వద్ద జరుగుతున్న రియల్ దందాను తెలుసుకున్న దళితులు రోడ్డెక్కారు.అన్యాయమని నినదించారు. అయితే ‘రియల్’ ధనబలం ముందు దళితులగోడు ఎవరికీ వినిపించలేదు. దీంతో ‘సాక్షి’ దళితుల పక్షాన నిలబడింది. వారి కన్నీటిని అక్షరబద్ధం చేసి కథనం ప్రచురించింది. ‘రియల్’ మాఫియా దందాను బయటపెట్టింది. ఇది జీర్ణించుకోలేని రియల్ మాఫియా ‘సాక్షి’కి లాయర్ నుంచి నోటీసులు పంపింది. ఆ నోటీసులకు బదులిచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను శోధిస్తే రియల్టర్లు అసలు బాగోతం బయట పడింది. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన ఎండవల్లి యాదగిరి నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన పట్టా భూమిని 1994 జూన్ 24న ఎస్సీ కార్పొరేషన్‌కు విక్రయించారు. సర్వే నంబర్లు 24, 28, 52, 54,40,401లలోని 33.28 ఎకరాల భూమికి అప్పుడున్న మార్కెట్ ధర కట్టించి ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ మొత్తం భూమిని ఎస్సీ కార్పొరేషన్ 40 మంది దళిత కుటుంబాలకు పంపిణీ చేసింది. ఈ 40 మంది లబ్ధిదారులకు అదే ఎడాది అప్పటి మంత్రి గీతారెడ్డి పట్టాలు అందించారు. ఈ భూముల్లో దళితులు చాలా ఏళ్ల పాటు పంటలు పండించారు. తర్వాత కాలంలో నీటి వసతి సరిగా లేకపోవడంతో కొంత కాలం ఆ భూములు బీడుగా మారాయి. సరిగ్గా ఇదే సమయంలో బడాబాబులు దళితులపై వల విసిరారు. గ్రామానికి చెందిన వారిని దళారులుగా వాడుకొని చౌకగా భూములు కొనుగోలు చేశారు. 2008 నుంచి ఈ భూ కొనుగోలు తంతు మొదలైంది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు గడీల ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు దశల వారీగా భూమిని కొనుగోలు చేసినట్లుగా రెవెన్యూ రికార్డులను బట్టి తెలుస్తోంది. అప్పట్లో ఎకరాకు రూ.1.20 లక్షలు ఇస్తామని చెప్పి ధర మాట్లాడుకోవడంతో పాటు ఈ డబ్బును రెండు వాయిదాల్లో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు బాధితుల మాటలను బట్టి తెలుస్తోంది. అయితే మొదటి వాయిదా కింద రూ. 50 వేలు ఇచ్చిన రియల్ వ్యాపారులు మిగతా సొమ్మును మాత్రం ఎగ్గొట్టారని, ఇదేమని అడిగితే ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు ఉన్నాయని కట్ చేసుకున్నామని చెప్పారని బాధితులు చెప్తున్నారు. అవినీతికి ‘అడ్డా’.. 2011లో హైదరాబాద్‌కే చెందిన రియల్టర్.. పీర్లపల్లి గ్రామ శివారులో ఎక్కువ మొత్తంలో భూమి కొనుగోలు చేశారు. ఆ పక్కనే ఉన్న దళితుల భూములు కూడా కలుపుకొని దాదాపు 200 ఎకరాల్లో ఇంక్రిడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో సంస్థ నెలకొల్పి ‘అవెసొం అడా’్డ పేరుతో వెంచర్ చేశారు. దళిత భూములు కొన్నవారికి గజ్వేల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాకుండా తూప్రాన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వెంచర్‌కు పూర్తి స్థాయి అనుమతులు లేవు. వేర్వేరు పరిమాణాల్లో ప్లాట్లుగా చేసి 150 గజాల ప్లాట్‌ను రూ .3 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. అవసరమైనప్పుడు ఈ భూములను ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వీటిని మ్మినా.. కొన్నా నేరమే. దళితులను అమ్మకానికి ప్రేరేపించినా నేరమే అవుతుంది. అసైన్డ్ భూములపై రెవెన్యూ చట్టంలో బలమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చినా, అధికారులు స్పందించకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, పైగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గజ్వేల్ డెవలప్మెంటు అథారిటీ (గడా) ఉన్నప్పటికీ దళితుల హక్కులను కాపాడలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విజయవాడలో రియల్ మాఫియా
-
చెరువుకు ముప్పు తప్పదా?
ఇబ్రహీంపట్నం: మండలంలో 1000 ఎకరాలకు పైబడి భూములకు సాగునీరందించే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఉనికికి ముప్పు పొంచి ఉంది. దురాక్రమణలు, రియల్ మాఫియా, మైనింగ్ మాఫియా, అధికారయంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటం ఇబ్రహీంపట్నం చెరువు ఉనికికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. వర్షాలు లేకపోవడం వల్లనే చెరువు నిండటంలేదని అనుకుంటున్నా వర్షాలు కురిసినా చెరువులోని నీరురావడం అంత సులువుకాదన్నది నిజం. రైతులకు నాటి భరోసా ఏదీ? ఇబ్రహీంపట్నం చెరువు పూర్తిస్థాయిలో నిండితే కొన్ని సవంత్సరాలు కరువుఛాయలు దరిచేరవని రైతాంగంలో భరోసా ఉండేది. చెరువులోని నీరు సం వృద్ధిగా చేరితే సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు, ప్రజల్లో గతంలో నమ్మకం ఉండేది. ఆ భరోసా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి లేదు. కబ్జాకోరల్లో చెరువు రియల్టర్లు, మైనింగ్ మాఫియా ఇష్టానుసారం రెచ్చిపోవడంతో ఇబ్రహీంపట్నం చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంటోంది. 800 ఎకరాల్లో ఉన్న చెరువు ప్రధాన నాలాలు, వాగులు పరాధీనం అవుతున్నాయి. దీంతో 47 గొలుసు చెరువులకు ప్రాణాధారమైన వనరులన్నీ హరించుకుపోతున్నాయి. ప్రధానంగా 85 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఫిరంగి నాలా అన్యాక్రాంతం అరుుంది. షాబాద్ మండలం చందన్వెల్లి మీదుగా ప్రారంభం అయ్యే ఈ నాల చేవెళ్ల, సరూర్‌నగర్, శంషాబాద్ మండలాల మీదుగా ఆదిబట్లద్వారా ఇబ్రహీంపట్నం చెరువులోకి వచ్చిచేరుతుంది. ఈ నాలాను ప్రస్తుతం ఆక్రమించడం, పూడిపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. తాజాగా చెరువులో సైతం అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. చెరువు నిండితే పండగే: పోచారం వాగులో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు, ఫిరంగి నాలా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపితే ఇక్కడి రైతాంగం కళ్లలో ఆనందంచూడొచ్చు. ఇబ్రహీంపట్నం తూర్పుభాగంతోపాటు మంచాల, హయత్‌నగర్, సంస్థాన్ నారాయణ్‌పూర్, చౌటుప్పల్ మండలాల్లోని వందగ్రామాల రైతాంగం, ప్రజలకు సాగు, తాగునీరు కు ఈచెరువు ఆధారం. వర్షాభావ పిరిస్థితులు, చెరువు నుంచి నీటి విడుదల అయ్యేమార్గం లేకపోవడంతో ఆయకట్టు భూముల్లో కంపచెట్లు మొలకెత్తున్నాయి. -
‘రియల్’ దోపిడీ!
బలహీనవర్గాలకు చెందిన డీ పట్టా భూములు దోపిడీదారుల ప్లాట్లుగా మారిపోయాయి. రియల్ మాఫియా చేతిలో చిక్కి ఇళ్ల స్థలాలుగా రూపం మార్చుకొని కాసుల వర్షం కురిపించాయి. అధికారుల అండతో నిబంధనలకు నిలువు పాతరేసి.. అమాయక లబ్ధిదారులను మాయమాటలతో మోసపుచ్చి రియల్ మాఫియా కోట్లు కూడబెట్టుకుంది. దీనిపై గ్రీవెన్స్‌సెల్‌లో పలుమార్లు ఫిర్యాదులు అందినా అధికార యంత్రాంగం కళ్లు తెరవడంలేదు. అక్రమార్కుల అంతు చూడటం లేదు. రాజాం రూరల్: అవన్నీ ఎప్పుడో 1975లో ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా భూములు. పేద కుటుంబాలు వ్యవసాయం చేసుకుని ఫలసాయం అనుభవించేందుకు వీలుగా అప్పటి ప్రభుత్వం ఈ భూములు ఇచ్చింది. ఆ భూములన్నీ ఇప్పుడు అన్యాక్రాంతమై.. అక్రమార్కులకు కోట్లు కురిపిస్తున్నాయి. అప్పట్లో చిన్న గ్రామంగా ఉన్న గోపాలపురం బౌండరీ పరిధిలోని వాసవీ జూట్ మిల్లు వెనుక భాగంలో సర్వే నెం. 51/6లో 0.60 ఎకరాలు, 51/5లో 0.49 ఎకరాలు, 53/3లో 0.39 ఎకరాలు, 53/4లో 0.24 ఎకరాలు, 50/3లో 1.73 ఎకరాలు, 48/4లో 1.50 ఎకరాలు, 48/5లో 1.95 ఎకరాలు, 49/2లో 0.83 ఎకరాలు, 49/1లో 2.58 ఎకరాలు, 49/5లో 1.60 ఎకరాలు, 49/7లో 0.41 ఎకరాలు, 51/1లో 2.39 ఎకరాలు, 51/2లో 0.67 ఎకరాలు, 50/1లో 0.80 ఎకరాలు.. మొత్తం 16 ఎకరాలను ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున కేటాయించి డీ పట్టాలు ఇచ్చారు. కొంతకాలం లబ్ధిదారులు వాటిని సాగు చేసుకొని అనుభవించారు. 2000 సంవత్సరం తర్వా త ఏర్పడిన కరువు పరిస్థితుల్లో పంటలు పండక భూములు బీడువారి పోవడంతో లబ్ధిదారులు కూలీలుగా మారిపోయారు. మాఫియా కన్ను రైతుల దుస్థితిని గమనించిన రియల్ మాఫియా వారి స్థలాలపై కన్నేసింది. ఇదే సమయంలో రాజాం నగర పంచాయతీ హోదా పొందడం, గోపాలపురం ప్రాంతం అందులో విలీనం కావడం, ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో భూము ల ధరలకు రెక్కలొచ్చాయి. అందులోనూ ఇళ్ల స్థలాలకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. దీంతో రైతుల పేరిట ఉన్న డీ పట్టా భూ ములను ఏదో రకంగా చేజిక్కించుకొని ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్ముకోవాలని రియల్టర్లు పన్నాగం పన్నారు. నిబంధనల మేరకు డీ పట్టా భూములను అమ్ముకోవడానికి వీల్లేదు. వాటిని సాగు చేసుకొని అనుభవించడమే తప్ప క్రయవిక్రయాలు నిషిద్ధం. ఈ ప్రతిబంధకాన్ని అధిగమించేందుకు రియల్టర్లు అధికారులను మ చ్చిక చేసుకున్నారు. మామూళ్లతో ముంచెత్తారు. అనంతరం లబ్ధిదారులైన రైతుల వద్దకు వెళ్లి వేల రూపాయల ఆశ చూపి ఆ భూ ములు తమకు అమ్మాలని ఒత్తిడి తెచ్చారు. ఈ భూములు అమ్మడానికి పనికిరావని, కేవలం పంటలు పండించుకోవడానికే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని రైతులు చెప్పగా.. అవన్నీ మేం చూసుకుంటామని నమ్మబలికి అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు అలా చేజిక్కించుకున్న డీపట్టా భూములను ప్లాట్లుగా విభజించి అమ్మేస్తున్నారు. తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు సైతం చేయిస్తున్నారు. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన బ్యాంకు రుణాలు, ఫీజిబులిటీ సర్టిఫికెట్లు అందవని తెలియక చాలామంది వీటిని కొనేస్తున్నారు. ఇదొక్కటే కాకుండా.. రాజాం ప్రాంతంలో ఇలా చాలా భూములు రియల్మాయలో పడి ఇళ్ల స్థలాలుగా మారి చేతులు మారిపోతున్నాయి. వీటిపై పలువురు ఇప్పటికే పాలకొం డ, రాజాంలలో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదులు చేశారు. అయినా ఇప్పటివరకు అధికారులు ఈ అక్రమాలపై దృష్టి పెట్టలేదు. క్రిమినల్ కేసులు పెడతాం ఈ విషయూన్ని రాజాం తాహశీల్దార్ రామారావు వద్ద ప్రస్తావించగా ఈ అంశం తన దృష్టికి వచ్చిందని, దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. సర్వే జరిపి డీపట్టా భూములైతే వాటిని స్వాధీనం చేసుకొని విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
విజయవాడలో రియల్ మాఫియా హల్చల్
-
పడగ విప్పుతున్న రియల్ మాఫియా
విజయవాడ, న్యూస్‌లైన్ : నగర శివార్లలో రియల్ మాఫియా పడగ విప్పింది. ‘కాదేదీ కబ్జాకనర్హం’ అన్న చందాన అసైన్డ్ భూములు, ఇతర ప్రాంతాల్లో ఉండేవారి రిజిస్టర్డు ఖాళీ స్థలాలే లక్ష్యంగా విజంభిస్తుంది. తాము నిర్మించే అపార్టుమెంట్లకు అడ్డంకిగా ఉన్న పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేస్తున్నారు. ఈ మాఫియాకు పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలుంటున్నాయి. భవానీపురం, విద్యాధరపురం, ఊర్మిళానగర్, జోజినగర్, గొల్లపూడి వంటి శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తున్న అసాంఘిక శక్తులు కనిపించిన ఖాళీస్థలాలను కాజేస్తున్నాయి. ఖాళీ స్థలాల యజమానులు ఎవరో తెలుసుకోవడం, వారిలో ఒంటరి మహిళలు, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని గుర్తించడం మొదటి పనిగా చేస్తున్నారు. ఆ స్థలాలను ఆక్రమించి సర్వేరాళ్లు, సిమెంట్ స్తంభాలు, ఫెన్సింగ్ తొలగిస్తున్నారు. ముఖ్యంగా వెనకా ముందూ ఎవరూ లేని మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. రెండు నెలల్లో మూడు ఘటనలు డిసెంబర్, జనవరి రెండు నెలల్లోనే గట్టు వెనుక మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులుకూడా నమోదయ్యాయి. డిసెంబర్లో విద్యాధరపురం సితార జంక్షన్ సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన ఒక స్థలం విషయంలో రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. ఒక వ్యక్తికి అమ్మిన ఇంటిని అతను రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో సుమారు పదేళ్ల తరువాత మరొక వ్యక్తికి అమ్మి రిజస్ట్రేషన్ చేశాడు. సుమారు 20 రోజుల క్రితం ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి వచ్చి ఆ ఇంటిని పడగొట్టేందుకు ప్రయత్నించటంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.ఇటీవల జోజినగర్ చర్చి సమీపంలో ఉన్న ఒక ఖాళీ స్ధలం చుట్టూ వేసిన ఫెన్సింగ్, సిమెంట్ స్తంభాలను కొందరు వ్యక్తులు తొలగించి ఎత్తుకెళ్లిపోయారు. 5వ తేదీన ఊర్మిళానగర్ ఏకలవ్యనగర్ ఒకటవ లైన్లో నివసిస్తున్న గోవిందు, శివకుమారిల మూడు గదుల రేకులషెడ్‌ను కొందరు వ్యక్తులు ఉదయం 11గంటల సమయంలో జేసీబీతో కూల్చేశారు. -
రియల్ దందాపై స్పందించిన యంత్రాంగం
భద్రాచలం, న్యూస్‌లై న్ : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు హెచ్చరిం చారు. గిరిజన చట్టాలను కాలరాస్తూ భద్రాచలంలో సాగుతున్న ‘రియల్ దందా’ పై సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆర్డీఓ స్పందించారు. స్థానిక రెవెన్యూ, ఇతర సిబ్బందితో కలసి భద్రాచలం పట్టణంతో పాటు, ఎటపాక, గుండాల కాలనీల్లో పర్యటించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అదే విధంగా 1/70 చట్టానికి విరుద్దంగా క్రయ విక్రయాలు జరుగుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై స్వయంగా ఆరా తీశారు. గుండాల కాలనీలో కొంతమంది ప్లాట్లను చేసి విక్రయిస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న భూమిని పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు తనకు అందజేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. అదేవిధంగా ఎటపాక సమీపంలోని ఆక్రమిత భూములను కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న పదిఎకరాల తొమ్మిది సెంట్ల భూమిలో 5 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా ఉన్నందున దీనిపై సమగ్రంగా సర్వే జరిపి ప్రభుత్వ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఆదేశించారు. అలాగే చర్ల రోడ్లో పాలకేంద్రం వద్ద ఆక్రమిత భూములను కూడా పరిశీలించారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో సర్వేచేసి నివేదిక అందజేయాలని తహశీల్దార్ కనకదుర్గకు సూచించారు. భద్రాచలం డివిజన్లో ఎన్వోసీ లేకుండా కొత్తగా నిర్మాణాలు చేపట్టరాదని, అటువంటి వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతి లేని భూముల్లో నిర్మాణాలు చేపడితే ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిరిజనేతరుల మధ్య ఎటువంటి భూ క్రయ విక్రయాలు జరగడానికి వీల్లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీఓ వెంట పర్యటనలో తహశీల్దార్ కనకదుర్గ, ఆర్ఐ మోహన్‌రావు, వీఆర్వోలు లక్ష్మణ్‌రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రియల్ దందాపై సర్వత్రా చర్చ : భద్రాచలంలో సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రభుత్వ భూ ఆక్రమణలను తేటతెల్లం చేస్తూ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘రియల్ దందా’ కథనంపై శనివారం పట్టణంలో సర్వత్రా చర్చసాగింది. దీనిపై భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి కూడా స్పందించి రియల్ దందాతో తనకెటువ ంటి సంబంధం లేదని విలేకరుల సమావేశంలో వెల్లడించటం గమనార్హం. భూ ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సాక్షి కథనం ఎంతో ఉపయోగరంగా ఉందని గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు సోందివీరయ్య ‘న్యూస్‌లైన్’తో అన్నారు.