Realty company
-
వెలుగులోకి రాని వేల కోట్ల వ్యాపారాధిపతి.. ఎవరీ బిలియనీర్?
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లోకి వచ్చే వ్యాపారవేత్తలు భారత్‌లో అనేక మంది ఉన్నారు. అయితే సంబంధిత వ్యాపార రంగాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ లో ప్రొఫైల్‌లో ఉండడానికి ప్రయత్నించేవారూ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi). బాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నప్పటికీ, ప్రజల దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.ఎవరీ వికాస్ ఒబెరాయ్?వికాస్ ఒబెరాయ్.. ఒబెరాయ్ రియాల్టీకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన తండ్రి రణవీర్ ఒబెరాయ్ ఈ రియల్-ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ఇది వికాస్ నాయకత్వంలో దేశంలోని అగ్రశ్రేణి రియల్-ఎస్టేట్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఆతిథ్యం, రిటైల్, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌తో సహా విభిన్న రంగాలలోకి ప్రవేశించింది.ముంబైలో హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు, వాణిజ్య స్థలాలనెన్నో అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రధాన పేరుగా మారింది. ఒబెరాయ్ రియాల్టీకి అధిపతి మాత్రమే కాకుండా వికాస్ ఒబెరాయ్ ముంబైలోని ఫైవ్ స్టార్ వెస్టిన్ హోటల్‌ను కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని మొదటి రిట్జ్-కార్ల్టన్ హోటల్‌తోపాటు విలాసవంతమైన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.వికాస్ ఒబెరాయ్ నేపథ్యంముంబైలో పుట్టి పెరిగిన వికాస్ ఒబెరాయ్ నగరంలోని జై హింద్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తరువాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, వివేక్ శిక్షణ పొందిన పైలట్ కూడా. ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది.ప్రముఖ బాలివుడ్ నటి గాయత్రీ జోషిని వికాస్ ఒబెరాయ్ వివాహం చేసుకున్నారు. మోడల్ నుండి నటిగా మారిన ఆమె షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో గీత పాత్రను పోషించారు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పటి నుండి అందరి దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి విహాన్ ఒబెరాయ్, యువన్ ఒబెరాయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో వీరు ఇటలీలోని సార్డినియాలో విహారయాత్ర చేస్తుండగా కారు ప్రమాదంలో చిక్కుకుని అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు.చదవండి: అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ జీతం ఇంతేనా?వికాస్ ఒబెరాయ్ నెట్వర్త్ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోని అత్యంత ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ నెట్‌వర్త్ 6.5 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు). -
రూ.10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల వృద్ధి.. ఎక్కడంటే..
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో దక్షిణాసియాలో అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన ‘ఎక్స్‌కాన్-2023’ను బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో డిసెంబర్ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వృద్ధిని సాధించాలని మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా వాహనాల నుంచి వచ్చే కార్బన్‌ను తగ్గించి కార్బన్ న్యూట్రల్ దేశం కోసం కృషిచేయాలని కోరారు. దాంతోపాటు ఉద్యోగాల కల్పన జరుగుతోందని చెప్పారు. ‘బిల్డింగ్ ఇండియా టుమారో’ పేరిట అయిదు రోజులపాటు జరగనున్న ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 1200 మంది ప్రదర్శనకారులు హాజరయ్యారు. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతీయ నిర్మాణ సామగ్రి తయారీదారుల సంఘం ఈ ఈవెంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లతో దేశంలో నిర్మాణ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది. దాదాపు రూ.10 వేల కోట్లను విశాఖకు కేటాయించనుంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక పురోగతి, పోటీతత్వానికి అనుకూలమైన వాతావరణాన్ని ఈ పెట్టుబడులు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వినూత్న పరికరాలకు ఈ ప్రదర్శన వేదికగా నిలుస్తుంది. నిర్మాణ సామగ్రి పరిశ్రమ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 26% వృద్ధి సాధించింది. ఎక్స్‌కాన్ 2023లో భాగంగా హైడ్రోజన్, డీజిల్ ఇంజిన్లను సైతం ప్రదర్శించారు. ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..! -
ఒబెరాయ్ రియల్టీ జూమ్- ర్యాలీస్ డౌన్
వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 238 పాయింట్లు జంప్‌చేసి 40,669ను తాకింది. నిఫ్టీ 56 పాయింట్లు ఎగసి 11,929 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ.. ఇకపై మెరుగైన పనితీరు ప్రదర్శించనుందన్న అంచనాలు ఒబెరాయ్ రియల్టీ కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెస్టెంబర్) ఫలితాలు నిరాశపరచడంతో ర్యాలీస్ ఇండియా కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి ఒబెరాయ్ రియల్టీ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ర్యాలీస్ ఇండియా నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఒబెరాయ్ రియల్టీ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఒబెరాయ్ రియల్టీ నిర్వహణ లాభం(ఇబిటా) 12 శాతం క్షీణించి రూ. 187 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 36 శాతం నీరసించి రూ. 316 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు భారీగా జంప్‌చేసి 59 శాతాన్ని తాకాయి. పండుగల సీజన్ నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి కంపెనీ పనితీరు జోరందుకునే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. థానే తదితర ప్రాంతాలలో ప్రాజెక్టులు ఇందుకు సహకరించగలవని అంచనా వేసింది. దీంతో ఎన్ఎస్ఈలో ఒబెరాయ్ రియల్టీ షేరు తొలుత 15 శాతం దూసుకెళ్లి రూ. 446ను తాకింది. ప్రస్తుతం 13 శాతం లాభంతో రూ. 440 వద్ద ట్రేడవుతోంది. ర్యాలీస్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ర్యాలీస్ ఇండియా నికర లాభం 2 శాతం తగ్గి రూ. 83 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 3 శాతం నీరసించి రూ. 725 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 16.1 శాతం వద్ద స్థిరత్వాన్ని చూపాయి. అమ్మకాలలో దేశీయంగా సస్యరక్షణ విభాగం 8 శాతం, విత్తనాల బిజినెస్ 29 శాతం పుంజుకున్నప్పటికీ.. ఎగుమతులు 29 శాతం క్షీణించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీస్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5.5 శాతం పతనమై రూ. 259 దిగువకు చేరింది. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 263 వద్ద ట్రేడవుతోంది. -
రియల్టీ దూకుడు- లాభాలు స్వల్పమే
కోవిడ్-19 సవాళ్లనుంచి రియల్టీ రంగానికి ఉపశమనాన్ని కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా 2021 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ 3 శాతం స్టాంప్ డ్యూటీని మాత్రమే విధించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్టాంప్ డ్యూటీ 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గనుంది. 2021 జనవరి- మార్చి మధ్య కాలంలో 2 శాతంగా అమలుకానుంది. ఈ నేపథ్యంలో రియల్టీ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి ఎన్ఎస్ఈలో రియల్టీ ఇండెక్స్ ఏకంగా 6.5 శాతం జంప్‌చేసింది. తొలుత డబుల్ సెంచరీ విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివర్లో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు బలపడి 39,113 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 11,559 వద్ద ముగిసింది. అయితే తొలి సెషన్లో సెన్సెక్స్ 39,327 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 39,047 వరకూ వెనకడుగు వేసింది. ఇక నిఫ్టీ 11,617- 11,541 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. బుధవారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. రియల్టీ దూకుడు ఎన్ఎస్ఈలో ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, మీడియా 1-0.5 శాతం మధ్య పుంజుకోగా.. ఎఫ్ఎంసీజీ, ఐటీ స్వల్పంగా నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్ 6.5 శాతం జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఎస్బీఐ, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, యాక్సిస్, మారుతీ, సిప్లా, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ 4.2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, బజాజ్ ఆటో, జీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హీరో మోటో, ఐవోసీ, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్ 1-0.6 శాతం మధ్య నష్టపోయాయి. డీఎల్ఎఫ్ జూమ్ ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో డీఎల్ఎఫ్, సెంచురీ టెక్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, పిరమల్, జూబిలెంట్ ఫుడ్, బంధన్ బ్యాంక్, బాటా, ఎక్సైడ్, అపోలో టైర్, ఎస్కార్ట్స్ 9.5-3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, చోళమండలం, ఎంజీఎల్, మణప్పురం, మైండ్‌ట్రీ, టీవీఎస్ మోటార్, భెల్, సెయిల్, రామ్‌కో సిమెంట్, టొరంట్ పవర్, ఐజీఎల్ 2.7-1.6 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ కౌంటర్లలో ప్రెస్టీజ్, ఒబెరాయ్, సన్‌టెక్, శోభా, బ్రిగేడ్ 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1430 లాభపడగా.. 1438 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,581 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,195 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు 1,481 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 173 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
అతి తెలివి వద్దు... మీకూ ఇళ్లు లేకుండా చేస్తాం!
న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ, ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్న రియల్టీ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లకు అత్యున్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు చేసింది. అతితెలివి ప్రదర్శించవద్దని, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆటలాడవద్దని స్పష్టంచేసింది. అలా చేస్తే డైరెక్టర్లకూ ఇళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించింది. గ్రూప్ పెండింగ్ రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్ల ప్రతి ఒక్క ఆస్తినీ అమ్ముతామని, తద్వారా డబ్బును రికవరీ చేయిస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘కొనుగోలుదారులు వారి గృహాలను సొంతం చేసుకునే విషయంలో మీ నుంచి జరుగుతున్న ఆలస్యమే ప్రస్తుతం సమస్య. అతి తెలివి ప్రవర్తించవద్దు. మీ ప్రతి ఒక్క ఆస్తినీ విక్రయిస్తాం. మిమ్మల్నీ ఇళ్లు లేని వారిని చేస్తాం. మీరు గృహ కొనుగోలుదారుల విషయంలో చేసినట్లే, మీ ఆస్తికోసం మీరూ ఎదురుచూసేలా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది. రూ.4,000 కోట్లకు రూ. 400 కోట్లేమిటి? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.4,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అయితే ఇందుకు సంబంధించి రూ.400 కోట్ల విలువైన కమర్షియల్ ఆస్తుల విక్రయానికి ఆమ్రపాలి గ్రూప్ చేసిన ప్రతిపాదన పట్ల ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008లో ఒక ప్రాపర్టీకి ఒక గృహ కొనుగోలుదారు రూ.50 లక్షలు వెచ్చిస్తే, ఇప్పుడు దాని విలువ రూ.2.5 కోట్లవుతుందనీ, రూ. కోటి వెచ్చిస్తే, దాని విలువ ఇప్పుడు రూ. 4 కోట్లని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఆస్తుల వివరాలకు ఆదేశం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు అందరూ తమ స్థిర, చర ఆస్తుల వివరాలను 15 రోజులలోపు సమర్పించాలని ఈ సందర్భంగా బెంచ్ స్పష్టం చేసింది. వాటి విలువల రిపోర్ట్‌నూ న్యాయస్థానం ముందుంచాలని పేర్కొంది. అలాగే రూ.4,000 కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సుస్పష్టమైన ప్రతిపాదనలనూ ఆగస్టు 14వ తేదీలోపు తన ముందు ఉంచాలని గ్రూప్‌నకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 2008 నుంచి నిర్వహణలో ఉన్న గ్రూప్ కంపెనీలు, డైరెక్టర్ల బ్యాంక్ అకౌంట్ల వివరాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పించాలని కూడా గ్రూప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 14వ తేదీన తదుపరి విచారణ ఇళ్ల కొనుగోలుదారుల నుంచి రూ.6,119 కోట్లను గ్రూప్ సమీకరించగలదని ఆమ్రపాలి తరఫు న్యాయవాది గౌరవ్ భాటియా చేసిన వాదనపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఫ్లాట్స్ అందజేతలో ఆలస్యం అవుతున్నందుకుగాను ఆమ్రపాలినే గృహ కొనుగోలుదారులకు డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదాపడింది. ఆమ్రపాలి గ్రూప్ 42,000 మందికి ఫ్లాట్లను బదలాయించాల్సి ఉంది. గ్రూపునకు చెందిన పనులను నిర్వహించేందుకు ప్రభుత్వరంగంలోని ఎన్బీసీసీకి ఇప్పటికే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు ఆమ్రపాలి గ్రూప్ నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. -
టాటా హౌసింగ్ ఆన్లైన్ ఎగ్జిబిషన్
న్యూఢిల్లీ : రియల్టీ సంస్థ టాటా హౌసింగ్ ఆన్లైన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ఇది జూలై 13-15 మద్య జరగనుంది. సంస్థ ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఏడు పట్టణాల్లోని 11 ప్రాజెక్టులకు సంబంధించిన దాదాపు 200 ఫ్లాట్లను విక్రయించాలని భావిస్తోంది. వీటి ధరలు రూ.13-50 లక్షల శ్రేణిలో ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనే ఇంటి కొనుగోలుదారులు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండానే వారు కొనుగోలు చేసిన ఇంటితోపాటు మరో రూమ్‌ను అదనంగా పొందవచ్చు. గత ఏడాదిన్నర కాలంలో టాటా హౌసింగ్ ఆన్లైన్ ద్వారా దాదాపు 1,500 ఫ్లాట్లను విక్రయించింది. సంస్థ ఆన్లైన్ ఫ్లాట్ల విక్రయాలు 2013 డిసెంబర్లో ప్రారంభ మయ్యాయి. -
రియల్టీ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయరేం!: సుప్రీం
న్యూఢిల్లీ: రియల్టీ రంగానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇందుకు ఎన్నేళ్లు పడుతుందని కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్కే కౌల్‌ను ప్రశ్నించింది. రియల్టీ సంస్థల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఒక నియంత్రణ సంస్థ అవసరమని దాఖలైన ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పీఐఎల్) సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కౌల్ సమాధానం చెబుతూ, కేంద్రం రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) బిల్లు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. తదుపరి పరిణామాల గురించి తెలియజేయడానికి న్యాయవాది ఆరు వారాల సమయాన్ని కోరారు. ఇందుకు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏకే శిక్రిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది.