Receptionist
-
జిమ్ రిసెప్షనిస్ట్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాగలకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దావణగెరెకి చెందిన మల్లనగౌడ, జ్యోతి దంపతుల కుమార్తె శ్రావణి(22) దాసరహళ్లిలో ఉంటూ బాగలకుంట పరిధిలోని గోల్డెన్ జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. సోమవారం ఉదయం రోజులాగే పనికి వెళ్లిన శ్రావణి హఠాత్తుగా కూర్చున్న చోటే వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై కుప్పకూలింది. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. శ్రావణికి తలంలితండ్రులు వివాహం నిశ్చయించారు. అయితే ఆమె శంకర్ అనే యువకుడిని ప్రేమిస్తోందని సమాచారం. శ్రావణిని పెళ్లికి ఒప్పించాలని తల్లితండ్రులు ఇటీవల బెంగళూరు వచ్చారు. అయితే వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని శ్రావణి చివరిసారిగా ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పటికే ఆమె విషం తాగింది. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆ నలభై నిమిషాల్లో ఏం జరిగింది..?
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలో శనివారం రాత్రి వెలుగులోకి వచ్చిన యువతి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు. పట్టణంలోని సుందర్‌నర్‌కు చెందిన దండగల వెంకన్న అలివేలు దంపతుల కుమార్తె దండగల శోభ(18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్సనిస్టుగా పనిచేసిన శోభ పరీక్షలు ఉండటంతో ఇంటి వద్దనే ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో ఏమైందో ఏమో గాని శనివారం రాత్రి 7:40 గంటల సమయంలో బైపాస్‌రోడ్డు వెంట ఉన్న వైష్ణవి అపార్ట్మెంట్ వద్దకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యం బైపాస్‌రోడ్డు వెంట ఉన్న ఖలీల్ దాబా ఎదురుగా ఉన్న సీసీ కెమరాల్లో రికార్డు కాగా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైష్ణవి అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తు వరకు శోభ చేరుకున్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. కూపీ లాగుతున్న పోలీసులు కాగా, వైష్ణవి అపార్ట్మెంట్లోకి శనివారం రాత్రి 7.40 గంటలకు చేరుకున్న శోభ మరో 40నిమిషాల అనంతరం రెండో అంతస్తు నుంచి కిందపడింది. అయితే, అపార్ట్‌మెంట్‌కు శోభ ఎందుకు వెళ్లింది? ఎవరితో మాట్లాడింది.? 40నిమిషాల్లో ఏం జరిగింది. అనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, శోభ తన సెల్‌ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్లింది. ఘటన తర్వాత పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఐదు నెలల కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు. కాగా, కూతురు మృతిపై అనుమానాలున్నాయని శోభ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లో తమకు తెలిసిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా, ఆది వారం మధ్యాహ్నం శోభ మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శోభ మృతి విషయం తెలుసుకున్న వారి బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ తెలిపారు. -
పోలీసుల ప్రతిష్టను పెంచేది రిసెప్షనిస్టులే
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించడంలో పోలీస్స్టేషన్లలోని రిసెప్షన్ ఆఫీసర్ పాత్ర కీలకమని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. రాష్ట్రంలోని పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ ఆఫీసర్ స్టాఫ్ ఫంక్షనల్ వర్టికల్స్‌పై తొలిసారిగా మంగళవారం రాష్ట్రంలోని 736 మంది రిసెప్షన్ అధికారులతో డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు 17 ఫంక్షనల్ వర్టికల్స్ ప్రవేశపెట్టామని తెలిపారు. వీటిలో మొదటిదైన రిసెప్షన్ ఆఫీసర్ వర్టికల్ అత్యంత కీలకమని అన్నారు. కాగా, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్‌ను డీజీపీ ఆకస్మికంగా సందర్శించారు. పీటీవో విభాగం పనితీరు, వాహనాల నిర్వహణ విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో పోలీస్ డ్యూటీ మీట్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను సెప్టెంబర్‌లోగా నిర్వహించనున్నామని, ఆ బాధ్యతలను సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్‌కు అప్పగిస్తున్నామని డీజీపీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌లో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్లో మెడల్స్ సాధించిన తెలంగాణ పోలీసు అధికారులు, కోచ్‌ల సన్మాన కార్యక్రమం డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్లో నాలుగు విభాగాల్లో ఐదుగురికి అవార్డులు లభించాయి. మెడల్స్ సాధించింది వీరే... లిఖిత పరీక్ష విభాగంలో ఎల్.బి.నగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎ.మన్మోహన్‌కు బంగారు పతకం లభించింది. పోలీస్ వీడియోగ్రఫీ విభాగంలో సైబరాబాద్ కానిస్టేబుల్ అనిల్ కుమార్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ విభాగంలో ఎస్.ఐ.బి. ఇంటెలిజెన్స్ ఎస్.ఐ. బి.వెంకటేశ్, ఇంటెలిజెన్స్ సెల్లో హెడ్ కానిస్టేబుల్ బి. విజయ్‌కి సిల్వర్ మెడల్స్ లభించాయి. యాంటీ సాబోటేజ్ చెకింగ్ విభాగంలో తెలంగాణ పోలీస్ శాఖకు మూడవ ట్రోఫీ లభించింది. -
రిసెప్షనిస్ట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది?
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్, 19ఏళ్ల యువతి హత్య కేసు రాజకీయంగా దుమారానికి దారితీసింది. ఈ కేసులో బహిష్కృత భాజపా నేత కుమారుడు, రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, ఇద్దరు సిబ్బందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. హత్యకు ముందు యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని పోస్ట్‌మార్టం నివేదికలో తేలినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమె వేళ్లు, చేతులు, వీపు భాగాల్లో గాయాలైనట్లు గుర్తులు కనిపించినట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించనున్నట్లు చెప్పారు. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు. ఇదీ కేసు.. భాజపా బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు రిషికేశ్‌లో రిసార్టు ఉంది. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి ఇటీవలే హత్యకు గురైంది. కొద్దిరోజుల తర్వాత అక్కడికి దగ్గర్లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. రిసార్టుకు వచ్చే అతిథులకు ఆమె ‘ప్రత్యేక’ సేవలు చేసేందుకు నిరాకరించినందుకే పుల్కిత్, మరో ఇద్దరు సిబ్బంది ఆమెను హత్యచేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు, ఓ ఫోన్ కాల్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదీ చదవండి: Uttarakhand: రిసెప్షనిస్ట్ అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం -
Bharat Jodo Yatra: మహిళలను వస్తువుల్లా... చూస్తున్న బీజేపీ
మలప్పురం: మహిళలను ఒక వస్తువుగా చూసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ల భావజాలం ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్య ఘటనతో తేటతెల్లమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర 20వ రోజు మంగళవారం మలప్పురం జిల్లాలో ప్రవేశించింది. తచ్చింగనాదం హైస్కూల్ వద్ద ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అంకితకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్యోదంతంతో బీజేపీ నేత కుమారుడికి సంబంధముందన్న ఆరోపణలపై రాహుల్ స్పందించారు. ‘చెప్పినట్లు వినలేదనే అంకితను చంపేశారు. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవమిదే. ఆర్ఎస్ఎస్, బీజేపీ మహిళలను వస్తువులుగా రెండో తరగతి పౌరులుగా చూస్తున్నాయి. ఇది సిగ్గుచేటు. మహిళలను గౌరవించని, సాధికారిత కల్పించని దేశం ఏమీ సాధించలేదు’ అని ఆయన అన్నారు. ‘బీజేపీ నాయకులకు కావాల్సింది అధికారం. అధికారం దక్కాక, దానిని నిలుపుకునేందుకు ఏదైనా చేస్తారు. ఆ క్రమంలోనే అంకిత హత్యకు గురైంది’అని రాహుల్ వ్యాఖ్యానించారు. మహిళలను చిన్నచూపు చూడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమనే హెచ్చరికను బీజేపీకి పంపాలని కోరారు. ‘జస్టిస్ ఫర్ అంకిత, జస్టిస్ ఫర్ ఇండియన్ ఉమెన్, బీజేపీ సే బేటీ బచావో’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. -
నన్ను ఏమార్చారు.. నా కూతుర్ని కడసారి చూసుకోనివ్వలేదు
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ అంకిత భండారీ గతవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య యువతి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. అయితే తన కూతుర్ని కడసారి కూడా చూసుకోనివ్వకుండా తనను ఏమార్చారని అంకిత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తనను అధికారులు ఎలా మోసం చేశారో ఓ వీడియోలో చెప్పారు. అంకిత మృతి వార్త తెలిసి ఆమె తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని ఆమె వెల్లడించింది. తన కూతుర్ని చూపిస్తామని చెప్పి నలుగురు వచ్చి అడవిలో ఉన్న తమను తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత తనతో అబద్దాలు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లి, వీల్‌ఛైర్‌లో బలవంతంగా కూర్చొబెట్టారని పేర్కొన్నారు. అనంతరం సెలైన్ పెట్టి ఫోటోలు తీసుకున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నా కావాలనే ఇదంతా చేశారని వివరించారు. తాను ఎన్నిసార్లు అడిగినా తన కూతురి దగ్గరికే తీసుకెళ్తున్నట్లు చెప్పి నమ్మించి మోసం చేశారని వాపోయారు. మరోవైపు తన భర్తను బలవంతంగా అంకిత మృతదేహం వద్దకు తీసుకెళ్లారని తల్లి ఆరోపించారు. తనను మాత్రం అంకితను కడసారి చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. బీజేపీ నేత కుమారుడే.. బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్యకు చెందిన రిసార్టులో అంకిత భండారీ రిసెప్షనిస్టుగా పనిచేసేది. గత ఆదివారం ఆమె అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. నిందితుడు అంకిత్ ఆర్యతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు రిసార్టు సిబ్బందిని అరెస్టు చేశారు. శనివారం అంకిత మృతదేహం కాలువలో లభించింది. మొదట అంత్యక్రియలు నిర్వహించేందుకు ససేమిరా అన్నారు అంకిత తండ్రి. ఆ తర్వాత సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇచ్చిన హామీతో మనసు మార్చుకుని ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ఇదే.. -
అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్’ విచారణ
డెహ్రాడూన్/రిషికేశ్: రిషికేశ్‌లోని రిసార్టు రిసెప్షనిస్ట్ అంకితా భండారి(19)హత్యపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెడతామన్నారు. ఈ హామీ అనంతరం కుటుంబసభ్యులు అంకిత అంత్యక్రియలు పూర్తి చేశారు. హత్యపై కీలక ఆధారాలు దొరికే అవకాశమున్న రిసార్ట్‌ను ప్రభుత్వం ఎందుకు కూల్చేసిందని అంకిత తండ్రి అంతకుముందు ప్రశ్నించారు. దోషులను శిక్షించాలంటూ రిషికేశ్–బద్రీనాథ్ జాతీయ రహదారిపై 8 గంటలు ఆందోళనజరిగింది. మరోవైపు హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితుడు, మాజీ మంత్రి వినోద్ దకొడుకు పులకిత్ ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. వినోద్ మాత్రం తన కొడుకు అమాయకుడంటూ వెనకేసుకుని వచ్చారు. -
నాటకీయ పరిణామాల మధ్య అంకిత అంత్యక్రియలు
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రిసెప్షనిస్ట్ అంకిత భండారీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొదట పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆమె భౌతిక కాయాన్ని మార్చురీ నుంచి తీసుకెళ్తామని చెప్పిన కుటుంబసభ్యులు .. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. అంకిత హత్య కేసు విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేయడమే గాక, తుది పోస్టుమార్టం నివేదికను బహిరంగంగా వెల్లడిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చారు. దీంతో అంకిత భౌతిక కాయాన్ని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు తల్లిదండ్రులు. అయితే ఈ కార్యక్రమానికి స్థానికులను ఎవరినీ అనుమతించలేదు. మరోవైపు అంకిత తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అంకితకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అంకిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం ధామీ చెప్పారు. బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్యకు చెందిన రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే అంకిత భండారీ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత ఆదివారం అదృశ్యమైన ఆమె శనివారం కాలువలో శవంగా లభించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంకిత్ ఆర్యను విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అంకిత్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు రిసార్టు సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. -
రిసెప్షనిస్ట్ హత్యోదంతం.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు!
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్, రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్కిత్ ఆర్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున నిందితుడి తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్య. పుల్కిత్ అమాయకుడని పేర్కొన్నారు. ‘అతడు ఒక సాదా సీదా అబ్బాయి. తన పనేదో తాను చూసుకుంటాడు. నా కుమారుడు పుల్కిత్, హత్యకు గురైన యువతి ఇరువురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. పుల్కిత్ ఇలాంటి వాటిలో ఎప్పుడూ పాల్గొనలేదు. అతడు నిర్దోషి.’ అని తెలిపారు వినోద్ ఆర్య. చాలా రోజులుగా పులికిత్ తమ కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాడని చెప్పారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. హత్యకు గురైన రిసెప్షనిస్ట్, 19 ఏళ్ల యువతి పని చేస్తున్న రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను శుక్రవారమే అరెస్ట్ చేశారు పోలీసులు. దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాలు, బాధితురాలి మొబైల్ ఫోన్ ఛాటింగ్ ప్రకారం..టూరిస్టులకు ‘ప్రత్యేక సేవలు’ అందించాలని ఆమెపై ఒత్తిడి చేసినట్లు తేలిందని పోలీసు అధికారి అశోక్ కుమార్ శనివారం వెల్లడించారు. నిందితుడు పుల్కిత్ ఆర్య, హత్యకు గురైన యువతి ఇదీ చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ -
రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు..
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని రిసార్టులో పనిచేసే రిసెప్షనిస్టును హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రిసార్టుకు వచ్చే అతిథులకు ప్రత్యేక సేవలు చేయాలని ఓనర్ పుల్కిత్ ఆర్య అంకిత భండారీని తీవ్ర ఒత్తిడి చేశాడని చెప్పారు. అందుకు ఆమె నిరాకరించిందని, ఈ క్రమంలోనే ఆమెతో గొవడపడి సిబ్బందితో కలిసి హత్య చేశాడని పేర్కొన్నారు. యువతి తన ఫ్రెండ్‌తో చేసిన చాటింగ్‌ను పరిశిలిస్తే తమకు ఈ విషయం తెలిసిందని డీజీపీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని అంకితను ఓనర్ బెదిరించాడని ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకరు ఇప్పటికే ఆరోపించారు. అందుకు ఒప్పుకోనందుకే ఆమెను హత్య చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య ప్రముఖ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు. ఆదివారం అదృశ్యమైన అంకితను అతడే హత్య చేశాడని తెలిసి స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓవైపు అధికారులు జేసీబీతో రిసార్టును కూల్చివేసే సమయంలో స్థానికులు వచ్చి భవనానికి నిప్పుపెట్టారు. ఈ హత్య ఉందంతో వినోద్ ఆర్య, అతని మరో కుమారుడ్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. యువతి మృతదేహన్ని పోలుసులు శనివారం కాలువలో కనుగొన్నారు. చదవండి: యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ -
యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని వంతారా రిసార్టులో రెసెప్షనిస్ట్ హత్యకు గురైన ఘటన ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్కిత్ ఆర్యను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ మరునాడే ఆయన తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే జిల్లా పరిపాలనా యంత్రాంగం హత్యపై విచారణ జరిపి ఆ తర్వాత తమపై ఏ చర్యలు తీసుకున్నా ఓకే అని వినోద్ ఆర్య తెలిపారు. హరిద్వార్‌కు చెందిన ఈయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ మాటీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు, నిందితుడు పుల్కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్య ఓబీసీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సస్పెన్షన్‌తో ఇప్పుడు పదవి పోయింది. రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య ఆదివారం జరగ్గా.. కాలువలో కొట్టుకుపోయిన ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ తనయుడి క్రూర చర్యకు స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హత్య జరిగిన రిసార్టుకు నిప్పుపెట్టారు. హత్య ఘటన దురదృష్టకరం అని, పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏం జరిగింది? పుల్కిత్ ఆర్య యజమానిగా ఉన్న వంతారా రిసార్టులో పనిచేసే రిసెప్షనిస్ట్ అంకితా భండారీ ఆదివారం అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. పుల్కిత్ ఆర్య కూడా ఏమీ తెలియనట్లు స్టేషన్‌కు వెళ్లి రిసెప్షనిస్ట్ కన్పించడం లేదని ఫిర్యాదు చేశాడు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు పుల్కిత్ ఆర్యపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. రిసార్టులో పనిచేసే మరో ఇద్దరు సిబ్బందితో కలిసి పుల్కిత్ ఆర్యనే ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. అంకిత భండారీతో గొడవపడి ఆమెను రిసార్టు వెనకాల కాలువలోకి తోసేసినట్లు పుల్కిత్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. ఆరు రోజుల తర్వాత శవాన్ని గుర్తించారు. పుల్కిత్తో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్‌భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు. అయితే తమ కుమార్తెపై లైంగిక దాడి జరిగిందని, ఆ తర్వాతే హత్యకు గురైందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నట్లు చెప్పారు. చదవండి: యువతి హత్య కేసులో బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
రిసెప్షనిస్ట్ హత్యోదంతం... కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో రిసార్ట్‌కి నిప్పు పెట్టి...
Receptionist murder case: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్యోదంతం పెద్ద కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెచ్చకున్నాయి. ఈ రిసెప్షనిస్ట్ హత్య కేసులో బీజేపీ నేత వినోద్ కుమార్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర ధామీ ఈ ఘటన కఠిన చర్యల తోపాటు, నిందితుడి రిసార్ట్ని కూడా బుల్డోజర్లతో కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా రిసార్ట్‌లో కొంతభాగాన్ని కూల్చివేశారు కూడా. అంతేగాక ఈ కూల్చివేతను సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కూడా. పైగా ఈ కేసుని త్వరితగతిన దర్యాప్తు చేసేలా డీఐజీ పి రేణుకా దేవి నేతృత్వంలో సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేయడమే కాకుండా శనివారం ఉదయమే ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహోజ్వాలాలు మిన్నంటాయి. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు పుల్కిత్ ఆర్య రిసార్ట్‌కి స్థానికులు నిప్పు పెట్టారు. ఐతే ప్రభుత్వమే ఒక పక్క కూల్చివేత పనులు ప్రారంభిస్తే ...మరోవైపు స్థానికులు కోపంతో రిసార్ట్‌లోని మిగిలిని భాగాన్ని తగలు బెట్టేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. WATCH | #AnkitaBhandari murder case: Locals set Vanatara resort in Rishikesh, Uttarakhand on fire. The resort is owned by BJP leader Vinod Arya's son Pulkit Arya. Three accused, including Pulkit, have been arrested in connection with the murder case. pic.twitter.com/7Zx0T6HJIB — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 24, 2022 (చదవండి: రిసెప్టనిస్టు హత్యోదంతం...బుల్డోజర్లతో రిసార్ట్ కూల్చివేత..లైంగిక దాడి అనుమానాలు!) -
ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రైవేటు రిసార్టులో యువతి హత్య
-
రిసెప్షనిస్ట్ హత్యోదంతం.. రిసార్ట్ కూల్చివేత
ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్యోదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానిక బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య.. 19 ఏళ్ల యువతి హత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తక ముందే కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం భావించింది. Uttarakhand receptionist murder: యువతి హత్య ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు మొదలవుతున్న క్రమంలో.. సీఎం పుష్కర్ ధామి ఆదేశాలనుసారం బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. రిషికేష్‌లో పుల్కిత్‌కు చెందిన వనతారా రిసార్ట్‌ను బుల్డోజర్లు కుప్పకూల్చాయి. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అభినవ్ కుమార్ దగ్గరుండి ఈ కూల్చివేతను పర్యవేక్షించడం గమనార్హం. ఈ కూల్చివేత.. నేరం చేయాలనుకునేవాళ్లకు భయం పుట్టిస్తుందని యమకేశ్వర్ ఎమ్మెల్యే రేణు బిష్ట్ చెప్తున్నారు. ఈ ఘటనలో చర్యలకు ఆదేశించిన సీఎం ధామికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు.. బాధితురాలి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇక కేసులో నిందితులైన పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్‌భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలను అరెస్ట్ చేసి.. జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు ఉత్తరాఖండ్ పోలీసులు. Uttarakhand: Illegal construction at Vanantra resort demolished by bulldozer in Ganga Bhogpur Talla Accused Pullkit Arya, son of BJP leader, is owner of resort. Accused Saurabh Bhaskar, Ankit Gupta are workers of resort. Receptionist Ankita Bhandari was killed & thrown in canal pic.twitter.com/nObxRAwddC — Anshul Saxena (@AskAnshul) September 23, 2022 Uttarakhand | Ankita Bhandari murder case: Visuals from Vanatara resort in Rishikesh that was owned by BJP leader Vinod Arya's son Pulkit Arya who allegedly murdered Ankita Bhandari pic.twitter.com/cKHcdrfHqx — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 24, 2022 ఘటన దురదృష్టకరం. కానీ, పోలీసులు ఈ కేసును వీలైనంత త్వరగా చేధించారు. నిందితులను అరెస్ట్ చేశారు. నేరస్తులు ఎలాంటి వాళ్లైనా.. కఠిన చర్యలు కచ్చితంగా ఉంటాయి అని సీఎం ధామి స్పష్టం చేశారు. హరిద్వార్‌కు చెందిన బీజేపీ నేత వినోద్ ఆర్య.. ఉత్తరాఖండ్ మతి కళా బోర్డుకు గతంలో చైర్మన్‌గా కూడా పని చేశారు. ఈయన కొడుకే పుల్కిత్ ఆర్య. సెప్టెంబర్ 18 నుంచి రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే అంకిత భండారి కనిపించకపోగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. దాదాపు వారం తర్వాత ఆమె హత్యకు గురైందన్న విషయం బయటపడింది. ఇదిలా ఉంటే.. శనివారం ఉదయం ఆమె మృతదేహాన్ని కాలువ నుంచి కనుగొన్నారు పోలీసులు. అయితే.. తన కూతురిపై లైంగిక దాడి జరిగిందని, ఇందుకు సంబంధించిన ఆడియో సాక్ష్యం తమ వద్ద ఉందని బాధితురాలి తండ్రి చెప్తున్నారు. ఇదీ చదవండి: సీఎంగా వారసుడిని ప్రకటించాల్సింది ఇక వాళ్లే! -
ట్రిక్ టెస్ట్.. 5 నిమిషాల్లోనే రిజెక్ట్ చేశారు!
న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు చాలా మంది భయపడతారు. అలా భయపడటం సర్వసాధారణ విషయం. ఇక్కడ ఉద్యోగం వస్తుందా.. రాదా అనే టెన్షన్లో చాలామంది తమ ఇంటర్య్వూలో విఫలం అవుతూ ఉంటారు. ఇంటర్య్వూకి వెళ్లే ముందు బాగానే ప్రిపేర్ అయినా చిన్నచిన్న కారణాలతో వచ్చిన అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు. మనం ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అక్కడ పని చేసే ప్రతి వ్యక్తిని గౌరవించడం ఎల్లప్పుడూ ముఖ్యం. అక్కడ మనని చాలా మంది గమనిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడటం మంచిది. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్లి "5 నిమిషాల్లోనే వెనక్కి వచ్చేశాడు. దీనికి సంబంధించి రెడ్డిట్ చేసిన పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అయ్యింది. రెడ్డిట్ పోస్ట్ లో తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్వ్యూకి వెళ్లిన అభ్యర్థి అక్కడ తనని పలకరించిన "రిసెప్షనిస్ట్"తో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో ఉద్యోగానికి అతనని ఎంపిక చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ వ్యక్తిని పలకరించిన మహిళా రిసెప్షనిస్ట్ కాదు, ఆమె ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తి. ఆ మహిళా ఆలా ప్రవర్తించడానికి కారణం.. ఉద్యోగ ఎంపిక విషయంలో ఇది ఒక చిన్న పరీక్ష లాంటిది. ఆ ట్రిక్ టెస్టులో విఫలం కావడంతో సదరు నిరుద్యోగి తన ఉద్యోగవకాశాన్ని కోల్పోయాడు. ట్రిక్ టెస్టులో భాగంగా రిసెప్షన్ వేష ధారణలో ఉన్న ఆమెతో మాట్లాడానికి అతను ఇష్టపడలేదు. ఆ ఉద్యోగి వచ్చిన వెంటనే రిసెప్షన్ సీట్లో ఉన్న హైరింగ్ మేనేజర్ గౌరవంగా పలకరించినా అతను మాట్లాడటానికి ఆసక్తిచూపలేదు. ఆమె పలుమార్లు మాట్లాడటానికి ప్రయత్నించినా లైట్ తీసుకున్నాడు. ‘నీతో నాకు పనిలేదు’ అన్నట్లు ఆమె వైపు చూశాడు. తనే డెసిషన్ మేకర్ గా అన్నట్లుగా ప్రవర్తించాడు’. ఇదే అతను ఉద్యోగ అవకాశాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. కానీ అభ్యర్థి గ్రహించని విషయం ఏమిటంటే "రిసెప్షనిస్ట్" తనని ఎంపిక చేసే వ్యక్తి అని. ఈ సంభాషణ తర్వాత "ఆమె అతన్ని ఇంటర్వ్యూ చేసే గదికి పిలిచింది. తనతో ఇలా మాట్లాడింది.. మా బృందంలోని ప్రతి వ్యక్తి ఎంత విలువైన వారో అలాగే వారి యొక్క గౌరవ మర్యాదలు కూడా ముఖ్యం అని చెప్పింది. 'రిసెప్షనిస్ట్'తో అతని ప్రవర్తన కారణంగా తను ఈ పోస్ట్ కి అర్హుడు కాదని భావించింది. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు, మీ ఇంటర్వ్యూ ముగిసింది" అని చెప్పి అతన్ని పంపించారు. -
సున్నా నుండి శిఖరం వరకు
జీవితంలో కోరుకున్న స్థాయికి ఎదగాలనే కలలు ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. భవిష్యత్తు అంతా శూన్యంలా అనిపించవచ్చు. అంతమాత్రాన జీవితమే లేదని నిరాశకు గురికావల్సిన పనిలేదు అని నిరూపిస్తోంది సౌమ్య. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన సౌమ్య పైలట్ కావాలని కలలు కంది. శిక్షణ కూడా పూర్తి చేసుకుంది. కానీ, పైలట్ జాబ్ పొందలేక జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. కాల్సెంటర్లో పనిచేసింది. ఇప్పుడు 35 మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చి సొంత కంపెనీని నడుపుతోంది. కృషి, పట్టుదల ఉంటే ఎంచుకున్న మరో రంగంలోనూ ఉన్నతిని సాధించవచ్చని నిరూపిస్తోంది. పదిహేనేళ్ల క్రితం పైలట్ కావాలని సౌమ్య ఎన్నో కలలు కన్నది. అందుకు ఆమె తల్లిదండ్రులూ వెన్నుదన్నుగా నిలిచారు. 65 లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో పైలట్ శిక్షణ పూర్తి చేసింది. అప్పటికి సౌమ్య వయసు 19 ఏళ్లు. శిక్షణ ముగిసేనాటికి అమెరికాలో ఆర్థికమాంద్యం అక్కడి ఉద్యోగవకాశాలను కల్పించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పైలట్‌గా ఉద్యోగం దొరకలేదు. ‘2006లో అలా నా కెరియర్ ప్రారంభమయ్యేలోపు ముగిసిపోయింది. శిక్షణ తర్వాత జాబ్ రావడం ఖాయం అనుకున్నాను. ఏడాది పాటు చేయని ప్రయత్నం లేదు. కానీ, ఆర్ధికమాంద్యంంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ దివాలాతీశాయి. నాకు జాబ్ రాలేదు. మున్ముందు ఏం చేయాలో అర్ధం కాలేదు. అంతా శూన్యంగా అనిపించింది. విసిగిపోయి ఇండియా వచ్చేశాను. 2008లో జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరాను. అప్పుడు నా జీతం రూ.5000లు మాత్రమే. ఆ జాబ్ చేస్తూనే కాల్ సెంటర్లో చేరాను. రాత్రి పూట కాల్‌సెంటర్ ఉద్యోగం, పగటి పూట జిమ్‌లో రిసెప్షన్. ఈ సమయంలోనే రాబర్టో కావల్లి, గొట్టి వంటి బ్రాండ్ల నుండి దుస్తులను దిగుమతి చేసుకుంటూ వ్యాపారం చేస్తున్న ఒకావిడ పరిచయం అయ్యింది. ఆమె నుండి 20 డ్రెస్సులను అప్పు మీద తీసుకున్నాను. నా ఫ్రెండ్స్‌కు సెల్‌ఫోన్ ద్వారా ఆ డ్రెస్సుల గురించి, వాటి ధరల గురించి చెప్పాను. ఒక గంటలో ఆ 20 డ్రెస్సులను అమ్మేశాను. దాంతో నూటికి నూరు శాతం లాభం వచ్చింది. అంతే.. కాల్ సెంటర్ ఉద్యోగం మానేసి దుస్తుల వ్యాపారంలోకి దిగాను. అక్కడ నుంచి డిజైనర్ల దగ్గర నుంచి తీసుకున్న విభిన్న మోడల్ దుస్తులను ఆన్లైన్లో మార్కెటింగ్‌కి పెట్టాను. ఈ బిజినెస్‌లో రాత్రింబవళ్లు మునిగితేలాను. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ ఇతర పెద్ద, చిన్న ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో బట్టలు అమ్మడం విస్తృతం చేశాను. రీటెయిల్ బిజినెస్ ద్వారా స్వదేశీ, విదేశీ కంపెనీలను కాంటాక్ట్ చేస్తుంటాను. ఇప్పుడు ప్రతిరోజూ వివిధ బ్రాండ్స్‌కి చెందిన 10 వేల డ్రెస్సులను అమ్ముతున్నాను. అమెరికా, కెనడా, ఐరోపాలో కూడా బ్రాంచ్‌ల ఏర్పాటు చేశాను. ప్రస్తుతం 35 మంది ఉద్యోగులు నా ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం కరోనా కారణంగా వ్యాపారం తగ్గినట్టుగా అనిపిస్తున్నా.. త్వరలోనే ఇది పుంజుకుంటుంది. ప్రముఖ బ్రాండెడ్, డిజైనర్ మాస్కుల వినియోగం బాగా పెరిగింది’ అంటూ తెలియజేసింది సౌమ్య. జీవితంలో ముందుకు సాగడానికి ఒక దారి మూసుకుపోతే వేల దారులు మనకోసం తప్పక తెరిచి ఉంటాయి. అవకాశాల దారుల్లో మన కలలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగడమే మార్గం అంటున్న సౌమ్య లాంటి వారు నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. –ఆరెన్నార్ -
అమ్మాయి కాదు... బొమ్మాయి!
‘‘అందాల చిన్నది... ఆహ్వానించుచున్నది’’అంటూ సరదాపడిపోయారు ఆ డిపార్ట్మెంట్ స్టోర్స్‌కు వచ్చిన కస్టమర్లు. అయితే ఆ ఆహ్వానంలో ‘ప్రాణం’ లేదని తెలిసి ‘హా’శ్చర్యపోయారు. జపాన్ రాజధాని నగరం టోక్యోలో మిట్సుకుషి నిహోంబషి డిపార్ట్మెంట్ స్టోర్స్‌కు ఇటీవల కొత్త రిసెప్షనిస్ట్ వచ్చింది. కస్టమర్లను అందంగా విష్ చేస్తూ వయ్యారంగా వెల్కమ్ చెబుతూ అవసరమైన సమాచారాన్ని కూడా చకచకా అందిస్తోంది. ఆ చిన్నదాని హుషారు చూసి ‘‘ఎవరీ ముద్దుగుమ్మ? అలసటెరుగని చక్కనమ్మ?’’అని సతమతమైన కస్టమర్ల సందేహాలు కాసేపటిలోనే నివృత్తి అయిపోయాయి. తమకు ఇష్టురాలైపోయిన ఆ రిసెప్షనిస్ట్ నిజంగా అందాల ‘బొమ్మే’నని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ‘‘అయికో చిహిరా’అనే పేరుతో రిసెప్షనిస్ట్‌గా ఆండ్రాయిడ్ మీద పనిచేసే ఒక రోబోను ప్రవేశపెట్టి అందర్నీ ఆకట్టుకుందీ డిపార్ట్మెంట్ స్టోర్స్. ఆ రోబోను ఒసాకా యూనివర్సిటీ ఇంటెలిజెంట్ రోబోటిక్స్ లేబరేటరీలో అభివృద్ధి చేశారట.