recruitment notifications
-
తగ్గిన పోస్టులు..పెరిగిన ఆందోళన
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చేసిన ప్రకటనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగులు ఆందోళన బాట పడుతుంటే, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు తప్పడం లేదు. 2017 తర్వాత ఇప్పుడు టీచర్ల రిక్రూట్మెంట్ ఉంటుందంటే నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విద్యాశాఖ దాదాపు 22 వేల ఖాళీలున్నాయని లెక్కగట్టడం దీనికి ఓ కారణం. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ కలిపి దాదాపు 6,612 పోస్టుల భర్తీకే సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది టెట్ అర్హులు టీచర్ నియామక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనలో సగం పోస్టులు కూడా లేకపోవడంతో వాళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్లలో అసంతృప్తి ఇప్పటికే స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. వేరే సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తున్నారు. గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధ న చేపట్టారు. దీంతో టీచర్లు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉన్న రెండు సెక్షన్లకూ బోధన చే యాల్సి వస్తోంది. ఈ కారణంగా తమపై పని భారం పెరిగిందని టీచర్లు అంటున్నారు. రా ష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 22 వేల వరకూ ఖాళీలున్నాయని విద్యాశాఖ గత ఏడా ది లెక్కలు వేసింది. ఇందులో 13,086 పోస్టు లు భర్తీ చేస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం కూడా 9,370 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్ర త్యేక అవసరాల పిల్లలకు బోధించే టీచర్లను కలుపుకొంటే 6,612 మందిని మాత్రమే నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో భారీ ఎత్తున చేపట్టాల్సిన నియామకాల జాడే కన్పించలేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ లో ఎక్కువగా సైన్స్, సోషల్ సబ్జెక్టు టీచర్ పో స్టులే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంగ్లిష్, మా థ్స్ సబ్జెక్టులకు భారీగా కోత తప్పదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. దీనివల్ల ఉన్న టీచర్లపై పనిభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు వస్తే తప్ప మి గతా ఖాళీలు భర్తీ చేయడానికి వీల్లేదని ప్రభు త్వం అంటోంది. న్యాయ వివాదం కొన్నేళ్లుగా నలుగుతోంది, దీంతో తమకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆందోళన బాటలో నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాలపై టెట్ ఉత్తీర్ణులు ఎన్నో ఆశ లు పెట్టుకున్నారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్ల సమయంలో కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు మానుకొని మరీ కోచింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఎలాగైనా మంచి ర్యాంకు సాధించాలని అప్పులు చేసి, హాస్టళ్లల్లో ఉండి సిద్ధమయ్యారు. కానీ టీచర్ల పదోన్నతులు ఇస్తేనే స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ పోస్టుల ఖాళీలు తెలుస్తాయి. వాటిని భర్తీ చేయడానికి వీలుంటుంది. ఇవేవీ జరగకపోవడంతో నిరుద్యోగులు ఏడాదిగా నలిగిపోతున్నారు. తాజాగా 6,612 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించడంతో వారు ఆందోళనలకు దిగుతున్నారు, 13,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. -
గ్రూపు-2లో ఇప్పటికే 302 పోస్టులు
⇒ విభజన లెక్కలు తేలితే రెట్టింపునకు మించి రానున్న పోస్టులు ⇒ అందులో విభాగాధిపతుల కార్యాలయాల్లోనివే ఎక్కువ ఖాళీలు ⇒ డిగ్రీ స్థాయి గ్రూపు-4లో ఇప్పటికే 192 పోస్టుల భర్తీకి నిర్ణయం ⇒ డిగ్రీతో 147 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ ⇒ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు 1,543 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు గ్రూపు-1, గ్రూపు-2, టీచర్లు, లెక్చరర్, గ్రూపు-4లోని జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర నియామక నోటిఫికేషన్ల కోసమే ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 25 వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు వస్తాయన్న ఆంచనాల్లో మునిగిపోయారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఏయే నోటిఫికేషన్లు జారీ అవుతాయన్న ఆశల్లో పడ్డారు. ఉపాధ్యాయులు, లెక్చరర్ల వ్యవహారం రేషనలైజేషన్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉన్నందున.. మిగతా పోస్టులైన గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4 నోటిఫికేషన్లపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈసారి సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఎక్కువ వస్తుండటంతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటికోసం సిద్ధమవుతున్నారు. గ్రూప్స్‌పై దృష్టి... ఎక్కువ మంది నిరుద్యోగులు శిక్షణ కేంద్రాల్లో చేరి మరీ శిక్షణ పొందుతున్న గ్రూపు-2 పోస్టులు 302 ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. ఇటీవల కేసీఆర్ భర్తీకి ఆమోదం తెలిపిన 17 వేల పోస్టుల్లో ఇవి కూడా ఉన్నాయి. రానున్న రోజుల్లో గ్రూపు-2లో భారీ సంఖ్యలో పోస్టులు రానున్నాయి. శాఖాధిపతి కార్యాలయాలు, సచివాలయంలోని ప్రధాన కేటగిరీలు అయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ వంటి పోస్టులు గ్రూపు-2లోనే భర్తీ చేయాల్సి ఉంది. అయితే వాటిల్లో ఒక్కదానికి కూడా ఇంతవరకు క్లియరెన్స్ లభించలేదు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయితే అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇవన్నీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినవే. ఇక డిగ్రీ స్థాయి గ్రూపు-4లో గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 192 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఇంటర్మీడియెట్, పదో తరగతి అర్హతతో భర్తీ చేసే గ్రూపు-4 పోస్టుల వివరాలు రావాల్సి ఉంది. ఇవీ వేలల్లో ఉండనున్నాయి. గ్రూపు-1లో మాత్రం ఇప్పటివరకు ఒక డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, 12 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టుల్లో మాత్రమే క్లియర్ వేకెన్సీలు ఉన్నాయి. ఉద్యోగుల విభజన పూర్తయితే ఇందులో మరిన్ని పోస్టులు రానున్నాయి. డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు, పోలీసు డీఎస్పీ, డీఎస్పీ జైల్స్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తదితర కేటగిరీల్లో విభజన తరువాతే పూర్తిగా ఖాళీల లెక్క తేలనుంది. మరోవైపు డిగ్రీ అర్హతతో 147 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది. ఎక్కువగా ఇంజనీర్ పోస్టులు త్వరలో భర్తీ చేయనున్న వాటిల్లో అత్యధికంగా 10,810 పోస్టులను పోలీసు విభాగంలోనే భర్తీ చేయనుండగా ఆ తరువాత స్థానంలో ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా 1,275 అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుండగా డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 200 అసిస్టెంట్ ఇంజనీర్, 68 సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల జారీలో తీవ్ర జాప్యం
మెదక్, న్యూస్‌లైన్: ఉద్యోగ నోటిఫికేషన్లకు విభజన సెగ తగి లింది. పంచాయతీ ఎన్నికల గండం గడిచిందని సంతోషించిన నిరుద్యోగులకు తెలంగాణ ఏర్పాటు ప్రకటన రావడం.. ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు కావడంతో నోటిఫికేషన్లకు బ్రేక్ పడింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తు న్న నిరుద్యోగులకు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. కొత్త నోటిఫికేషన్లు విడుదలకు నోచుకోక పోగా, విడుదలైన నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణ కూడా ప్రహాసనంగా మారింది. వేలాది రూపాయలు కుమ్మరిస్తూ కోచింగ్‌ల కోసం పట్నం వెళ్లిన యువకులు తిరిగి పల్లెబాట పడుతున్నారు. ఈ నియామకాల కోసం... టెట్, డీఎస్సీ, పంచాయతీ కార్యదర్శులు, గ్రూప్-2 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామంటూ గత జూన్ నెలలో ఓ వైపు ఏపీపీఎస్సీ, మరోవైపు ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. దీంతో నిరుద్యోగులు ఆశల పల్లకీలో ఊరేగారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో అప్పులు చేసి నగరానికి వెళ్లి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశించిన బీఈడీ, డీఈడీ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నవంబర్ 9, 10వ తేదీల్లో డీఎస్సీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా నోటిఫికేషన్ వెలువడక పోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ ఒకటిన జరగాల్సిన టెట్ పరీక్షలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,677 గ్రామ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనతో చాలామంది నిరుద్యోగులు ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకుంటున్నారు. అదేవిధంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు కూడా యువకులు శిక్షణ పొందుతున్నారు. కొంతమంది ఎస్జీటీలు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి స్కూల్ అసిస్టెంట్ ఇతర గ్రూప్ పోస్టులకు సిద్ధమవుతున్నారు. జాప్యంతో అవస్థలే... ఓ వైపు ఆర్థిక భారాన్ని భరిస్తూ కొలువులకు సిద్ధమవుతుంటే మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ వయో పరిమితి దాటిపోతున్న వారు మరింత ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు నోటిఫికేషన్లపై ఆశలు ఆవిరవుతుండటంతో చదువులు కూడా సాగడం లేదని వారు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు.