సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చేసిన ప్రకటనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగులు ఆందోళన బాట పడుతుంటే, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు తప్పడం లేదు. 2017 తర్వాత ఇప్పుడు టీచర్ల రిక్రూట్‌మెంట్ ఉంటుందంటే నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
విద్యాశాఖ దాదాపు 22 వేల ఖాళీలున్నాయని లెక్కగట్టడం దీనికి ఓ కారణం. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ కలిపి దాదాపు 6,612 పోస్టుల భర్తీకే సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది టెట్ అర్హులు టీచర్ నియామక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రకటనలో సగం పోస్టులు కూడా లేకపోవడంతో వాళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీచర్లలో అసంతృప్తి
ఇప్పటికే స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. వేరే సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తున్నారు. గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధ న చేపట్టారు. దీంతో టీచర్లు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉన్న రెండు సెక్షన్లకూ బోధన చే యాల్సి వస్తోంది. ఈ కారణంగా తమపై పని భారం పెరిగిందని టీచర్లు అంటున్నారు. రా ష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ స్కూళ్లలో 22 వేల వరకూ ఖాళీలున్నాయని విద్యాశాఖ గత ఏడా ది లెక్కలు వేసింది. ఇందులో 13,086 పోస్టు లు భర్తీ చేస్తామని ప్రభుత్వమే ప్రకటించింది.
ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం కూడా 9,370 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ప్ర త్యేక అవసరాల పిల్లలకు బోధించే టీచర్లను కలుపుకొంటే 6,612 మందిని మాత్రమే నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో భారీ ఎత్తున చేపట్టాల్సిన నియామకాల జాడే కన్పించలేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ లో ఎక్కువగా సైన్స్, సోషల్ సబ్జెక్టు టీచర్ పో స్టులే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంగ్లిష్, మా థ్స్ సబ్జెక్టులకు భారీగా కోత తప్పదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.
దీనివల్ల ఉన్న టీచర్లపై పనిభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు వస్తే తప్ప మి గతా ఖాళీలు భర్తీ చేయడానికి వీల్లేదని ప్రభు త్వం అంటోంది. న్యాయ వివాదం కొన్నేళ్లుగా నలుగుతోంది, దీంతో తమకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఆందోళన బాటలో నిరుద్యోగులు
టీచర్ ఉద్యోగాలపై టెట్ ఉత్తీర్ణులు ఎన్నో ఆశ లు పెట్టుకున్నారు. గత ఏడాది వరుస నోటిఫికేషన్ల సమయంలో కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు మానుకొని మరీ కోచింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఎలాగైనా మంచి ర్యాంకు సాధించాలని అప్పులు చేసి, హాస్టళ్లల్లో ఉండి సిద్ధమయ్యారు. కానీ టీచర్ల పదోన్నతులు ఇస్తేనే స్కూల్ అసిస్టెంట్స్, ఎస్‌జీటీ పోస్టుల ఖాళీలు తెలుస్తాయి.
వాటిని భర్తీ చేయడానికి వీలుంటుంది. ఇవేవీ జరగకపోవడంతో నిరుద్యోగులు ఏడాదిగా నలిగిపోతున్నారు. తాజాగా 6,612 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమ్మతించడంతో వారు ఆందోళనలకు దిగుతున్నారు, 13,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
Comments
Please login to add a commentAdd a comment