ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
ఆత్మకూరురూరల్ : ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న గుండవోలు చిన్నా అలియాస్ గూడూరు చిన్నాను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ ఎస్కే ఖాజావలి తెలిపారు. సీఐ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన రూ.44.50 లక్షల విలువైన దుంగలను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అప్పటి నుంచి గుండవోలు చిన్నా పరారీలో ఉన్నాడు. గతంలో చిన్నా సోమశిల, అనంతసాగరం, మర్రిపాడు తదితర ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవాడు. నిందితుడు శుక్రవారం నెల్లూరుపాళెం వద్ద ఉన్నట్లు సమాచారం అందటంతో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. పోలీసు సిబ్బంది చెన్నకేశవ, అశోక్ తదితరులున్నారు.