Red scandal illegal transport
-
ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
ఆళ్లగడ్డ(కర్నూలు జిల్లా): అక్రమంగా 21 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎనిమిది మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బుధవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఆహోబిలం అటవీ ప్రాంతంలో జరిగింది. వివరాలు.. ఆహోబిలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి ఎనిమిది మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 5లక్షలు విలువ చేసే 21 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేను దొంగను కాదు... వ్యాపారిని
మదనపల్లె రూరల్/పూతలపట్టు: ‘‘సారీ.. ఐయామ్ నాట్ ఏ తీఫ్.. ఐయామ్ ఏ బిజినెస్ పర్సన్..(నేను దొంగను కాదు... వ్యాపారిని)’’ అంటూ విలేకరుల ముందు చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ చెన్యీ ఫియాన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య ప్రోద్భలంతో అప్పుచేసి వడ్డీకి తెచ్చిన డబ్బుతో వ్యాపారం చేయడానికి ఢిల్లీకి వచ్చానన్నారు. తనను పోలీసులు అరెస్టు చేశారని, తన భార్య చుయాన్‌ఛుంగ్ ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని విలపించాడు. కాగా, ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడైన చెన్యీఫియాన్ను పోలీసులు బుధవారం మదనపల్లె కోర్టులో హాజరు పరిచారు. 14రోజుల రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. మరో నిందితుడు సెల్వరాజ్‌ను చిత్తూరు కోర్టులో హాజరు పరిచగా... అతడికీ 14 రోజుల పాటు రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది.