redcorpet
-
ఆస్కార్ రెడ్ కార్పెట్: ఆ స్టార్ల రెడ్ పిన్ కథేమిటి?
ఆస్కార్ 2024 సంరంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులుగాభావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్‌పై ప్రత్యేకంగా కనిపించారు. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు స్టార్లు అంతా రెడ్ పిన్లు ధరించడం విశేషంగా నిలిచింది. వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. భీకర బాంబుల దాడులతో దద్దరిల్లిన గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ వారంతా రెడ్ పిన్‌లను ధరించారు. అలాగే కాల్పుల విరమణకు పిలుపు నివ్వమని అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను కోరుతూ ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇజ్రాయెల్, గాజాలో హింసను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో వేలాదిమంది, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతిని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని 'పూర్ థింగ్స్' నటుడు రమీ యూసఫ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రతకో పిలుపునిస్తున్నామనీ, పాలస్తీనా ప్రజలకు శాశ్వత న్యాయం , శాంతి కలిగేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. అరచేతిలో ఒక నల్ల రంగు గుండెతో డిజైన్ చేసిన ఈ రెడ్ పిన్నులను ఆర్టిస్ట్4సీజ్ఫైర్ అనే సంస్థ తయారు చేసింది. -
చైనా టు అమరావతి: చెన్కు ఎర్రతివాచీ
విజయవాడ: ఒక విశిష్ఠ అతిథి కోసం బెజవాడ నగరం అందంగా ముస్తాబు అయింది. గన్నవరం విమానాశ్రయం నుంచి గేట్ వే హోటల్ వరకు భారత్, చైనా జాతీయ జండాలు రెపరెపలాడుతున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ శాఖ సహాయ మంత్రి చెన్ ఫింగ్స్‌యాంగ్. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఏవిధంగా సాగుతున్నదో పరిశీలించేందుకు సోమవారం విజయవాడకు రానున్న చెన్ యాంగ్ కు ఘనస్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఏ. బాబు ఆదివారం మీడియాకు తెలిపారు. చైనా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న చెన్.. సోమవారం ఉదయం 8.50 గంటలకు అమరావతి చేరుకుంటారు. అక్కడి నుంచి గేట్ వే హోటల్ కు చేరుకుని 10.20 వరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో భేటీ అవుతారు. 10.30కు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సీఎం, మంత్రులు, ఇతర అధికారులతో జరిగే కీలక సమావేశంలో చెన్ ఫింగ్స్‌యాంగ్ పాల్గొంటారు. అనంతరం మద్యాహ్నం మూడు గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అమరావతికి చేరుకుంటారు. నూతన రాజధాని ప్రాంతంలోని గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లను చెన్ పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హోటల్ కు చేరుకుని రాత్రి అక్కడే బసచేసి మంగళవారం ఉదయం 8:15 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.