redsandles
-
స్మగ్లర్ తంగప్పన్ అరెస్టు
తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ దళం జరిపిన కూంబింగ్‌లో స్మగ్లర్ తంగప్పన్తో పాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పెరుమాళ్లపల్లిలోని ఎస్వీనగర్ రైల్వే ట్రాక్ సమీపంలో 28 ఎర్రచందనం దుంగలను అధికారులు పట్టుకున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన స్మగ్లర్ తంగప్పన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి: చంద్రగిరి మండలం రంగపేట వద్ద టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించింది. టాస్క్ ఫోర్స్ కు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దీంతో సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపగా కూలీలు పారిపోయారు. ఆ ప్రాంతంలో పోలీసులు రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఐజీ కాంతారావు పరిశీలించారు. -
రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు
-
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పుత్తూరు: మరోసారి ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు చెక్ పోస్టు వద్ద పోలీసులు తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించగా ఓ పాల వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు కనిపించాయి. దీంతో మొత్తం 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. -
శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్
చిత్తూరు: శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. అనంతరం ఏడుగురిని అరెస్టు చేశారు. 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.