
స్మగ్లర్ తంగప్పన్ అరెస్టు
తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ దళం జరిపిన కూంబింగ్లో స్మగ్లర్ తంగప్పన్తో పాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పెరుమాళ్లపల్లిలోని ఎస్వీనగర్ రైల్వే ట్రాక్ సమీపంలో 28 ఎర్రచందనం దుంగలను అధికారులు పట్టుకున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతానికి చెందిన స్మగ్లర్ తంగప్పన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.