Regency
-
రీజెన్సీ సిరామిక్స్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ గురువారం పునఃప్రారంభమైంది. కార్మికుల వివాదాల నేపథ్యంలో దశాబ్దంన్నర క్రితం యానాం రీజెన్సీ లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. రీజెన్సీ సిరామిక్స్‌ను తిరిగి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్లిష్టమైన డిజైన్లకు మారుపేరుగా నిలిచిన రీజెన్సీ సిరామిక్స్ తొలిసారి రీజెన్సీ నేచురల్ టైల్స్‌ను చెన్నయ్‌లో విడుదల చేసింది. రూ.70 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ నాలుగు టైల్స్ తయారీ లైన్లలో మొదటి దానిని ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. కంపెనీ మొదటి లైన్ రోజుకు 7 వేల చదరపు మీటర్లను ఉత్పత్తి చేయనుంది. దీనిని రోజుకు 25 వేల చదరపు మీటర్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అన్ని పరిమాణాలు, రకాలు, గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్, పాలి‹Ù్డ విట్రిఫైడ్ టైల్స్, డబుల్ చార్జ్డ్ టైల్స్, వాల్ టైల్స్, ఎక్స్టీరియర్ టైల్స్, స్టెప్స్, రైజర్లలో ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు. రీజెన్సీ ఉత్పత్తులను దేశంలోనే దక్షిణాది, తూర్పు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రీజన్సీ డైరెక్టర్ నరాల సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్నారు. రాజధాని నగరాలతోపాటు మిగిలిన నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. యానాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరి్థక వ్యవస్థ బలోపేతంలో రీజెన్సీ భాగస్వామ్యం వహిస్తుందని ఆయన చెప్పారు. -
యానాం రీజెన్సీకి పూర్వ వైభవం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ 11 ఏళ్ల తరువాత పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. 1985లో ఏర్పాటైన యానాం రీజెన్సీ 2012లో వివాదాల నేపథ్యంలో యాజమాన్యం లాక్ అవుట్ ప్రకటించింది. ఈ పరిణామంతో ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అప్పటినుంచి ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 50 వేల జనాభా గల యానాం అభివృద్ధిలో రీజెన్సీ సిరామిక్స్ పాత్ర ఎంతో ఉంది. 1980వ దశకంలో సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో జీఎన్ నాయుడు తదితరులు కలిసి ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా మంచిపేరు సంపాదించి 1986–87 వరకు సిరామిక్స్ టైల్స్‌ను విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అప్పట్లో ఈ ఫ్యాక్టరీలో రోజుకు 26వేల చదరపు అడుగుల మేర టైల్స్ ఉత్పత్తి చేసేవారు. రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమతో యానాం, దాని సరిహద్దున మన రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 6 వేల నుంచి 7 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. పరిశ్రమకు అనుబంధంగా సిరామిక్స్ టైల్స్ తయారీకి ఉపయోగపడే చిన్నతరహా పరిశ్రమలు, అట్టల తయారీ ఫ్యాక్టరీలను స్థాపించడంతో మహిళలకు ఉపాధి లభించింది. విధ్వంసం నేపథ్యంలో మూత వేతనాలు, పీఎఫ్ వంటి విషయాల్లో కార్మీక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో కార్మీకులు ఆందోళనకు దిగారు. కార్మీక సంఘ ప్రతినిధి మచ్చా మురళీమోహన్ యానాం పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. అనంతరం 2012 జనవరి 27న కొందరు దుండగులు సృష్టించిన విధ్వంసం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది.ఫ్యాక్టరీని తగులబెట్టి ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కె.చంద్రశేఖర్‌ను హత్య చేశారు. నాటి విధ్వంసంతో ఫ్యాక్టరీకి రూ.300 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిణామాలతో యాజమాన్యం ఫ్యాక్టరీని లాక్అవుట్ చేసింది. వేలాది మంది కార్మీకులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. కాగా.. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, రీజెన్సీ సీఎండీ గూడూరు నారయ్య నాయుడు, సీఈఓ, ఈడీ సత్యేంద్రప్రసాద్ తదితరులు మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలించి ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి యాజమాన్యం ముందుకొచ్చింది. వివాదానికి ముందు కార్మీకులకు చెల్లించాల్సిన సెటిల్మెంట్స్పై ఒక అంగీకారానికి వచ్చారు. ఫ్యాక్టరీకి సంబంధించి దనియాలతిప్పలో ఉన్న భూముల్లో కార్మీకులకు ప్లాట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అక్టోబర్ నెలలో తొలివిడత రూ.70 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని రీజెన్సీ సీఈవో సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద ధ్రువీకరించారు. మలి విడతలో 2025 మార్చి నాటికి మూడింతల రెట్టింపు ఉత్పత్తిని తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. రెండు నెలల్లో పునఃప్రారంభిస్తాం విజయ దశమి సందర్భంగా పరిశ్రమను పునఃప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ కోసం గెయిల్‌ను అభ్యర్థించాం. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కూడా నివేదించాం. కార్మీకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో పనులు అప్పగించడమే కాకుండా సర్వీస్ కూడా చేస్తున్నాం. – డాక్టర్ గుడారు నారయ్య నాయుడు, సీఎండీ, రీజెన్సీ సిరామిక్స్ 11 ఏళ్ల కల నెరవేరుతోంది యానాంలో పారిశ్రామిక రంగం పూర్వవైభవానికి రీజెన్సీ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించడం దోహదం చేస్తుంది. యాజమాన్యం ముందుకు రావడం శుభపరిణామం. వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా ఆదాయం సమకూరుతుంది. – గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఎమ్మెల్యే, యానాం -
భావవ్యక్తీకరణ లేకే ఉద్యోగ సాధనలో విఫలం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భావవ్యక్తీకరణ లేనందువల్లే చాలామంది ఉద్యోగాలు సాధించలేక నిరుద్యోగులుగా ఉండిపోతున్నారని శ్రీ సాయిగురు రాఘవేంద్ర బ్యాకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ పి.దస్తగిరి అన్నారు. ‘బ్యాంకు ఉద్యోగాలు సాధించడమెలా’ అనే అంశంపై స్థానిక ఆనంద్ రీజెన్సీలో మంగళవారం నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఆంగ్లభాషపై పట్టుసాధించాలన్నారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు బ్యాంకర్ కావాలనే లక్ష్యంతో ప్రతి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు హాజరైన నిరుద్యోగులకు ఆఫ్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు కావాల్సిన ఉచిత మెటీరియల్, డీవీడీలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ తమద్వారా దేశవ్యాప్తంగా 21 వేల మంది ఉద్యోగాలు సాధించారన్నారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కో డైరెక్టర్ పి.పేక్షావలిరెడ్డి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నెల రోజుల్లో ఆర్టీసీకి పాలకమండలి
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి 5న షీ-క్యాబ్స్ ప్రారంభం ఆర్సీ కార్డుపై ఫొటో ముద్రించే విధానం ప్రారంభం హైదరాబాద్: నెలరోజుల్లో తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు నెలల్లో రెండు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో ఆర్టీసీ విభజన జరిగేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నట్టు చెప్పారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నట్లు తెలిపారు. రవాణాశాఖ పనితీరును మంగళవారం సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బస్సు ఛార్జీలు తక్కువగానే ఉన్నాయని, 44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై భారం పడ్డ నేపథ్యంలో చార్జీల సవ రణ అంశం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే చార్జీలు పెంచే విషయంలో నిర్ణయం తీసుకోలేదన్నారు. రవాణాశాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2500 కోట్ల ఆదాయాన్ని సాధించాల్సి ఉందని, గడచిన నాలుగు నెలల్లో రూ.800 కోట్లు సాధించటం ద్వారా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరి చిందని, ఇందుకు అధికారులను అభినందిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని, ఇందుకు స్థలం సేకరించాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించినట్టు వెల్లడించారు. ఆగస్టు 15న షీ-క్యాబ్స్ ప్రారంభమవుతాయని, కోర్టు ఆదేశం మేరకు వాహనాలకు తెలంగాణ సిరీస్ విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్సీ కార్డుపై వాహన యజమాని ఫొటో.. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో వాహన యజమాని ఫొటో ముద్రించే కొత్త పద్ధతిని మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇక నుంచి ఆర్సీ కార్డుపై యజమాని ఫొటో వస్తుందని, దీన్ని పాత వాహనాల విషయంలో అమలు చేస్తామన్నారు. హరితహారం పథ కంపై అవగాహన కల్పించేందుకు హరితహారం లోగో ముద్రించిన లెసైన్సులనే జారీ చేస్తామన్నారు.