Regional director
-
వ్యాక్సిన్ డ్రాపౌట్స్ లేకుండా చూడండి
విజయవాడ(లబ్బీపేట) : జిల్లాలో ఇమ్యునైజేçషన్ కార్యక్రమం వందశాతం జరగాలని, డ్రాపావుట్స్ ఎవరూ ఉండరాదని గుంటూరు, రాజమండ్రి జోన్ల రీజినల్ డైరెక్టర్ డాక్టర్ డి.షాలినీదేవి అన్నారు. లబ్బీపేటలోని మలేరియా కార్యాలయంలో జిల్లాలోని వైద్యాధికారులు, ఇమ్యునైజేషన్ సిబ్బందితో శనివారం వేర్వేరుగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో పుట్టిన వెంటనే వేసే జీరో వ్యాక్సిన్ల నుంచి ప్రతి వ్యాక్సిన్లు చిన్నారులకు సకాలంలో వేయాలన్నారు. హైరిస్క్ ఏరియాల్లో డ్రాపవుట్స్ ఉంటున్నట్లు గతంలో గుర్తించామని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిలవ కూలీలు, క్రషర్స్‌లో ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలకు వ్యాక్సిన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసేలా ఆరోగ్య కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని ఆమె సూచించారు. అంతేకాకుండా చిన్నారికి వేసిర టీకాలను ఆ«ధార్ ఆధారంగా ఆన్లైన్ చేయాలన్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వారంలో ఆరు రోజులు వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని, జీరో బేస్ వ్యాక్సిన్‌లుఏడురోజులువేస్తారని డాక్టర్ షాలినీదేవి చెప్పారు. ఇమ్యునైజేషన్‌ను సమర్థంగా ఎలా నిర్వహించాలో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునేజేషన్ అధికారి డాక్టర్ అమృత, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, జిల్లాలోని వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్
తిరువూరు (కృష్ణా జిల్లా) : ఓ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏపీ పురపాలక శాఖ రీజినల్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే... పెడన మునిసిపల్ ఉద్యోగి ఒకరికి గతంలో మెమో జారీ కాగా, దానిపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రాజేంద్రప్రసాద్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు సమాచారం. దాంతో సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను సంప్రదించారు. కాగా మంగళవారం తిరువూరులో నగర పంచాయతీల కమిషనర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాజేంద్రప్రసాద్ పెడన మునిసిపల్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటుండగా ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
పూర్వ కమిషనర్‌పై చర్యలు
నల్లగొండ టుటౌన్ :ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నల్లగొండ మున్సిపాలిటీ పూర్వ కమిషనర్‌పై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. అయిన వారి కోసం నిబంధన లు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. 2010 వరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన ఎం.వెంకటేశ్వర్లు ప్రకాశం బజారులోని కూరగాయల మార్కెట్ కోసం నిర్మించిన దుకాణ సముదాయాన్ని వ్యాపారులకు కేటాయించడంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగం ఎదర్కొంటున్నారు. అర్హులైన తమకు దుకాణాలు కేటాయించకుండా కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు వ్యాపారులు లోకాయుక్తను ఆశ్రయిం చారు. దీంతో ఆరు నెలల క్రితం మున్సిపల్ రీజినల్ డెరైక్టర్ విచారణ జరిపి నివేదికను కోర్టుకు అందజేశారు. పూర్తి వివరాలను పరిశీలించిన కోర్టు వెంకటేశ్వర్లుపై చర్యలకు ఆదే శించింది. 140 దుకాణాల్లో 15 దుకాణాలను ఒకే కుటుం బంలో నలుగురికి, ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించినట్లు విచారణలో తేలింది. గతంలో న్యూప్రేంటాకీస్ స్థలం విషయంలోనూ హైకోర్టు ఈయనపై మొట్టికాయలు వేసిన విషయం తెలి సిందే. వెంకటేశ్వర్లు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో పని చేస్తున్నట్లు తెలిసింది. దుకాణాల కేటాయింపే విరుద్ధం ప్రకాశం బజారులో కూరగాయల వ్యాపారుల కోసం మున్సిపాల్టీ ఆధ్వర్యంలో దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. వీటి కేటాయింపులో అర్హులైన చిరు వ్యాపారులకు కాకుండా బడా వ్యాపారులకు పెద్ద పీట వేశారు. మొత్తం 140 దుకాణాలలో అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని పలువురు వ్యాపారులు అప్పట్లో ఆందోళన కూడా చేశారు. ఓ బడా వ్యాపారి తన కుటుంబ సభ్యుల పేరు మీద నాలుగు దుకాణాలను దక్కించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కేటాయించడంతో దుకాణాలు దక్కని వారు లోకాయుక్తను ఆశ్రయించారు. కొంత మంది మూడు నాలుగు దుకాణాల మధ్య ఉన్న గోడలను కూల గొట్టి ఒకే దుకాణంగా నిర్వహిస్తున్నా అధికారులు నోరుమెదపడం లేదు. దుకాణా ల కేటాయింపు కూడా బహిరంగ వేలం ద్వారా కాకుండా అప్పటి అధికార పార్టీకి చెందిన వారు చెప్పిన విధంగా చేశారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. వేలానికి ఏర్పాట్లు ప్రకాశం బజారులో ఉన్న కూరగాయల మార్కెట్ సముదాయాన్ని బహిరంగ వేలం ద్వారా వ్యాపారులకు కేటాయించేందుకు మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల గుత్తాధి పత్యానికి చెక్ పెట్టడానికి కోర్టు తీర్పు మున్సిపాల్టీకి అనుకూలంగా మారింది.