Registrations details
-
ఎల్ఐసీ బీమా సఖి.. 30 రోజుల్లో 50,000 రిజిస్ట్రేషన్లు
బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఇటీవల ప్రారంభించిన బీమా సఖి యోజనలో నెలలోపే 50,000కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పథకంలో నమోదైన 52,511 మందిలో 27,695 మంది బీమా సఖిలకు పాలసీలను విక్రయించేందుకు నియామక పత్రాలు అందించినట్లు ఎల్ఐసీ తెలిపింది. ఇప్పటికే 14,583 మంది పాలసీలను విక్రయించడం మొదలుపెట్టారని పేర్కొంది. మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయ ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థిక అక్షరాస్యత పెంపొందించి, బీమాపై అవగాహనను కల్పించడం ఈ పథకం లక్ష్యంగా ఎల్ఐసీ గతంలో తెలిపింది.ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకందేశవ్యాప్తంగా మహిళల సాధికారత లక్ష్యంగా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) బీమా సఖి యోజన పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2024 డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకంలో బీమా సఖీలుగా పిలువబడే ఏజెంట్లుగా మారడానికి మహిళలకు శిక్షణ ఇస్తారు. దాంతో వారికి ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.లక్ష్యాలు, ప్రయోజనాలుగ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత, బీమాపై అవగాహనను పెంపొందించడం బీమా సఖి యోజన(LIC Bima Sakhi Yojana) ప్రాథమిక లక్ష్యం. పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 1,00,000 మంది మహిళలను, వచ్చే మూడేళ్లలో 2,00,000 మంది మహిళలను ఈ పథకంలో భాగం చేయడం దీని లక్ష్యం. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి బీమాను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు, సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.ఈ పథకంలో చేరినవారు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఈ సమయంలో వారికి నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. మొదటి ఏడాది స్టైపెండ్ రూ.7 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేలు ఉంటుంది. దాంతోపాటు నిబంధనలకు అనుగుణంగా ఇన్సెంటివ్‌లు అందిస్తారు. ఆర్థిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందకుండా మహిళలు తమ శిక్షణపై దృష్టి పెట్టడానికి ఈ ఆర్థిక వెసులుబాటు సహాయపడుతుంది. బీమా విక్రయ లక్ష్యాలను సాధించిన మహిళలు కమీషన్ ఆధారిత రివార్డులను కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: ఆసియా.. ఇండియాలోని ధనవంతుల జాబితాఅర్హతలు ఇవే..కనీసం పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్నవారు ఎల్ఐసీ ఏజెంట్లుగా మారి వారు విక్రయించే పాలసీల ఆధారంగా కమీషన్లు(Commissions) పొందవచ్చు. బీమా సఖి యోజన ప్రారంభమైనప్పటి నుంచి మొదటి నెలలోనే 50,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరిలో 27,695 మంది మహిళలకు అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేయగా, 14,583 మంది ఇప్పటికే పాలసీలను విక్రయించడం ప్రారంభించారు. ఏడాదిలోగా దేశంలోని ప్రతి పంచాయతీకి కనీసం ఒక బీమా సఖిని అందించాలని ఎల్ఐసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోగ్రామ్‌లో చేరిన గ్రాడ్యుయేట్ మహిళలను భవిష్యత్తులో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు. -
తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల వివరాలు
- సబ్‌రిజిస్ట్రార్ నుంచి నేరుగా భూముల క్రయ, విక్రయాల సమాచారం సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల్లో భూమి హక్కులను బదిలీ (మ్యుటేషన్) ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నారు. ఇకపై రాష్ట్రంలోని ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జరిగినా... ఆ డాక్యుమెంట్ కాపీలతో సహా సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత మండల రెవెన్యూ కార్యాలయానికి చేరేలా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, రెవె న్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో రికార్డుల్లో పేర్లు మార్చే మ్యుటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదనే అభిప్రాయముంది. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రెవెన్యూ శాఖకు పంపుతున్నామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతుండగా... రిజిస్ట్రేషన్ అధికారులిచ్చిన సమాచారం (అమ్మినవ్యక్తి పేరు, విస్తీర్ణం, భూమిస్థితి తదితర వివరాలు) రెవెన్యూశాఖ వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమాచారంతో సరిపోలకపోవడం వల్లనే మ్యుటేషన్లు చేయలేకపోతున్నామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయినా మ్యుటేషన్లు జరగక సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. అసలు మ్యుటేషన్ల విషయంగా రెవెన్యూ యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్‌పీటర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మ్యుటేషన్ కోసం 8 లక్షలకు పైగా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సీసీఎల్ఏ దృష్టికి వచ్చింది. ఆయన చొరవ ఫలితంగా పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్ దరఖాస్తుల సంఖ్య మూడు నెలల్లోనే 40 వేలకు తగ్గినట్లు తెలిసింది. జూన్ 2 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లపై ఆరా.. మ్యుటేషన్ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడంతో పాటు దరఖాస్తు చేసుకోని రిజిస్ట్రేషన్లపై కూడా సీసీఎల్ఏ దృష్టి సారించారు. తెలంగాణ ఏర్పడిన (జూన్ 2, 2014) నాటి నుంచి ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను డాక్యుమెంట్లతో సహా తహసీల్దార్లకు అందజేయాలని ఇటీవల రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను సీసీఎల్ఏ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూశాఖ వద్ద వెబ్‌ల్యాండ్‌లో స్పష్టమైన సమాచారం ఉన్నందున, సదరు సమాచారాన్ని తనిఖీ చేశాకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని... వెబ్‌ల్యాండ్‌లో లేని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను తిరస్కరించాలని సూచించారు. సరైన సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారి వివరాలను వెబ్‌ల్యాండ్‌లోకి అప్లోడ్ చేయడంతో పాటు వెబ్‌ల్యాండ్‌లో అప్డేట్ అయిన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వెనుక ముద్రించేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీని ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు వీలవుతుందని ఇరు శాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు. నెలాఖరులోగా 22ఏ నోటిఫికేషన్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా 22ఏ (నిషేధిత భూముల) నోటిఫికేషన్ జారీ చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు. సెక్షన్ 22ఏ లో రెవెన్యూ శాఖ పొందుపరిచిన వివిధ ప్రభుత్వ శాఖల భూములను ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయకుండా నియంత్రించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు సెక్షన్ 22ఏలో చేర్చేందుకు ఆయా ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూముల వివరాలను అందజేయాలని దేవాదాయశాఖ కమిషనర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, వక్ఫ్‌బోర్డ్ సీఈవోలకు సీసీఎల్ఏ లేఖలు రాశారు. విక్రయించేందుకుగానీ, రిజిస్ట్రేషన్ చేసేందుకుగానీ వీలులేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు, సెక్షన్-43 కింద రిజిస్టరైన దేవాదాయశాఖ భూములు, సెక్షన్-37 ప్రకారం రిజిస్టరైన వక్ఫ్ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి (యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్‌పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాల వివరాలు సెక్షన్ 22ఏలో ఉంటాయి.