Regular Plan
-
ఇన్వెస్ట్ చేసేందుకు పీపీఎఫ్ మంచిదా? ఈఎల్ఎస్ఎస్ మంచిదా?
ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకం రెగ్యులర్ ప్లాన్ ఎన్ఏవీ, డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీకి భిన్నంగా ఉంటుందా? ఒకే పెట్టుబడికి ఈ రెండు ప్లాన్లలో కేటాయించే యూనిట్లలో వ్యత్యాసం ఉంటుందా? – శామ్ మీరు అడిగింది నిజమే. మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్ల నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) వేర్వేరుగా ఉంటాయి. కారణం ఏమిటంటే..? ఒక ఫండ్ ఎన్ఏవీని నిర్ణయించేవి రెండు అంశాలు. ఆ పథకం పోర్ట్‌ఫోలియోతోపాటు, ఎక్స్పెన్స్ రేషియో. కనుక ఒక పథకం పోర్ట్‌ఫోలియో, ఎక్స్‌పెన్స్‌రేషియో అనేవి భిన్నంగా ఉండొచ్చు. కనుక ఎన్ఏవీలో మార్పు ఉండొచ్చు. అయితే, ఒక పథకం రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పోర్ట్‌ఫోలియో ఒకటే ఉంటుంది. కాకపోతే ఎక్స్పెన్స్ రేడియో మాత్రం వేర్వేరుగా ఉంటుంది. కనుక ఎన్‌ఏవీపై దీని ప్రభావం పడుతుంది. రెగ్యులర్ ప్లాన్లకు పంపిణీదారుల కమీషన్‌ను కూడా కలుస్తుంది. కనుక రెగ్యులర్ ప్లాన్ల ఎన్ఏవీ అధికంగా ఉంటుంది. డైరెక్టర్ ప్లాన్లలో ఎలాంటి పంపిణీదారుల కమీషన్ ఉండదు. కనుక వాటి ఎన్ఏవీ తక్కువగా ఉంటుంది. ఒక పథకంలో ఇన్వెస్టర్ పెట్టుబడికి ఎన్ని యూనిట్లు వస్తాయనేది.. యూనిట్ ఎన్ఏవీపైనే ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టర్ మొత్తం పెట్టుబడిని, ఎన్ఏవీతో భాగిస్తే ఎన్ని యూనిట్లు వస్తాయో తెలుస్తుంది. ఒక పథకం రెగ్యులర్ ప్లాన్ ఎన్ఏవీ రూ.11గా ఉండి.. రూ.10,000 పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. అప్పుడు ఈ పెట్టుబడికి 909.09 యూనిట్లు వస్తాయి. డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ రూ.10 ఉందనుకుందాం. అప్పుడు అదే రూ.10,000 పెట్టుబడికి 1,000 యూనిట్లు లభిస్తాయి. నా వయసు 51 ఏళ్లు. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 2023 మార్చితో 15 ఏళ్ల కాల వ్యవధి ముగుస్తుంది. దీన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉందని తెలిసింది. దాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పట్లో డబ్బులతో పని లేదు. నెలకు రూ.12,500 చొప్పున పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే పీపీఎఫ్‌ను కొనసాగించుకోవాలా లేదా అది ముగిసిన తర్వాత.. ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలా? పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులపై పన్ను లేదు. ఈఎల్ఎస్ఎస్లోనూ పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. నేను 20 శాతం పన్ను పరిధిలో ఉన్నాను. మంచి సలహా ఇవ్వగలరు? – సెంతిల్ కుమార్ ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా డెట్‌తో పోలిస్తే మెరుగైన రాబడులు సొంతం చేసుకోవచ్చని వ్యాల్యూరీసెర్చ్ తరచూ చెబుతుంటుంది. మీకు సమీప కాలంలో డబ్బుతో అవసరం లేదంటున్నారు. కనుక పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన ఆలోచన అవుతుంది. మీకు ఈక్విటీల పట్ల తగినంత అనుభవం ఉందని అనుకుంటున్నాం. అలాగే, మీ పెట్టుబడుల కాల వ్యవధి కనీసం ఐదేళ్ల నుంచి ఏడేళ్లు ఉంటుందనే అంచనాతో ఈ సూచన చేస్తున్నాం. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని మర్చిపోవద్దు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ల్లో పన్ను మినహాయింపు పరిశీలిస్తే.. పీపీఎఫ్తో పోలిస్తే పన్ను చెల్లింపుల తర్వాత రాబడులు ఈఎల్ఎస్ఎస్లోనే ఎక్కువ. పన్ను ఆదా కోసం పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనాల్లో ముందు రాబడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ప్రైవేట్ బ్యాంక్స్.. టాప్ గన్స్!
రుణాల వృద్ధి, మొండిబాకీల తగ్గుదలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ సంస్థలు మెరుగైన పనితీరు కనపర్చవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ త్రివేది. బ్యాంకింగ్ విభాగంలో ప్రైవేట్ బ్యాంకులు ఆశావహంగా కనిపిస్తున్నాయని, ఫార్మా కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్నికలు.. మార్కెట్లపై.. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దేశీ ఈక్విటీ మార్కెట్ల పనితీరు ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్ఐఐ) రాకతో ప్రస్తుతం ఈ లోటు తీరగలదని అంచనాలు ఉన్నాయి. తొలి రెండు నెలల్లో ఎఫ్ఐఐలు దాదాపు 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు వెల్లడయ్యే దాకా స్వల్పకాలిక ఇన్వెస్టర్లు కాస్త నెర్వస్‌గానే ఉండొచ్చు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధానంగా కంపెనీల ఆదాయాల అంచనాలు, వాటికి తగ్గట్లుగా షేరు ధరలు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ప్రైవేట్ రంగ బ్యాంకులు మెరుగ్గా ఉన్నట్లు భావిస్తున్నాం. మూలధనం తగినంత స్థాయిలో ఉన్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధికి సంబంధించి ప్రైవేట్ బ్యాంకులు ముందంజలో ఉండే అవకాశం ఉంది. గత కొన్నాళ్లుగా ఫార్మా రంగం అంతగా రాణించలేకపోయినప్పటికీ .. ప్రస్తుతం ఎకానమీ, ఎగుమతులు పుంజుకుంటున్న నేపథ్యంలో కొంత మెరుగుపడే అవకాశం ఉంది. మధ్యకాలికంగా చూస్తే ఐటీ రంగం కూడా బాగానే కనిపిస్తోంది. డీల్స్ సంఖ్య పెరుగుతోంది. అమ్మకాలపరంగా ఆటోమొబైల్ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. కానీ వేల్యుయేషన్స్ ప్రస్తుతం బాగా కరెక్షన్కు లోనయ్యాయి. కొన్ని షేర్లు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తున్నాయి. స్థూల గణాంకాలు చూస్తుంటే ఆర్థిక కార్యకలాపాలు కాస్త తగ్గిన ట్లుగా కనిపిస్తోంది. డిమాండ్‌పరంగా మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్దిష్ట రంగం లేదా స్టాక్‌పైనే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. ఉదాహరణకు రుణ వృద్ధి పుంజుకోవడం, మొండిబాకీలు తగ్గుతుండటం వంటివి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మెరుగైన పనితీరు కనపర్చవచ్చు. ఇక ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికం సీజనల్‌గా బలహీనంగానే ఉంటుంది. కరెన్సీపరమైన ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు. ఇక మా నిర్వహణలోని యూటీఐ టీఅండ్ఎల్ ఫండ్ ప్రధానంగా రవాణా, ఆటో, లాజిస్టిక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇటీవలి కాలంలో వాహన రంగం చాలా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఫలితంగా కొనుగోలుదారులపై అధిక భారం మోపాల్సి వస్తోంది. ఇలా కొనుగోలు వ్యయాలు పెరిగిపోతుండటం వల్ల డిమాండ్ మందగించింది. పండుగల సీజన్, ఆ తర్వాత కూడా ఇదే ధోరణి నెలకొంది. వ్యయాలు పెరిగిపోవడం, డిమాండ్ తగ్గడం వంటి అంశాలతో వాహన కంపెనీల లాభాల అంచనాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో వాటి వేల్యుయేషన్స్ సైతం కరెక్షన్కు లోనయ్యాయి. అయితే, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భారత మార్కెట్లో వాహనాల వినియోగం ఇంకా పూర్తి స్థాయికి చేరలేదు. పెరుగుతున్న తలసరి ఆదాయాలతో డిమాండ్ కూడా మెరుగుపడవచ్చు. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్ ఉన్న వాహనాలకు అప్‌గ్రేడ్ అవుతుండటంతో.. వాహన కంపెనీలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టే ఈ రంగంపై మేం ఆశావహంగా ఉన్నాం. ఆటోమొబైల్, లాజిస్టిక్స్‌లో వృద్ధి అవకాశాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ప్రస్తుత ఈక్విటీ మార్కెట్లపై అంచనాలు.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కంపెనీల వాస్తవ ఆర్థిక పనితీరు .. ఏడాది ప్రారంభంలో వేసే అంచనాలకన్నా తక్కువగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో కొన్ని త్రైమాసికాలుగా ఆదాయాల డౌన్‌గ్రేడ్స్ మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఆదాయాల వృద్ధి కొంత మెరుగుపడుతున్న ట్రెండ్ కనిపిస్తున్నప్పటికీ.. వేల్యుయేషన్స్‌పరంగా సవాళ్లు ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ50 తీసుకుంటే దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే సుమారు 18% ప్రీమియంతో ట్రేడవుతోంది. అలాగే మిడ్‌క్యాప్ సూచీలు దాదాపు 8% ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. మొత్తం మీద కంపెనీల ఆదాయాలు మరింతగా మెరుగుపడాలి. ఇవి కాకుండా వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం కూడా కొంత మేర భారత మార్కెట్లకు ఊతంగా ఉండగలదని అంచనా. -
మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్‌కు మారాలంటే..
నేను ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. రెగ్యులర్ ప్లాన్ కంటే అదే స్కీమ్‌కు సంబంధించి డెరైక్ట ప్లాన్‌కు వ్యయాలు తక్కువగా ఉంటాయని, రాబడులు ఎక్కువగా ఉంటాయని మిత్రులంటున్నారు. నేను ఈ రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారవచ్చా? ఇలా మారడాన్ని మ్యూచువల్ ఫండ్ సలహాదారుకు తప్పనిసరిగా వెల్లడించాలా ? మారడానికి సంబంధించిన విధి విధానాలేంటి? - సుధాకర్, ఖమ్మం ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారవచ్చు. ఈ విషయాన్ని మీ మ్యూచువల్ ఫండ్ సలహాదారుకు వెల్లడించాలా, వద్దా అనేది మీ ఇష్టం. రెగ్యులర్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు మారేటప్పుడు ఆన్లైన్లో డెరైక్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక ఆఫ్‌లైన్‌లో అయితే సదరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు తర్వాత, ఏఆర్ఎన్ కోడ్ దగ్గర.. ఈ రెండు చోట్లా డెరైక్ట్ అని స్పష్టంగా తెలియజేయాలి. రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్‌కు ఇన్వెస్టర్లు మారితే వారిపై ఎగ్జిట్ లోడ్‌ను ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేయడం లేదు. అయినప్పటికీ, మీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎగ్జిట్ లోడ్‌ను వసూలు చేస్తోందా లేదా అన్న విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇలా ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్‌కు మారడాన్ని... ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడంగా భావిస్తారు. కాబట్టి ఏమైనా మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సి ఉంటుందేమోనని విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం నేను ఎస్బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్, ఎస్బీఐ ఫార్మా ఫండ్, యూటీఐ టాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్, యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్, యూటీఐ ఎంఎన్సీ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్ అపర్చునిటీస్ ఫండ్ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం నేను ఏమైనా పన్ను రాయితీలు పొందవచ్చా? - ప్రశాంతి, గుంటూరు మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తేనే పన్ను రాయితీలు లభిస్తాయి. దురదృష్టవశాత్తూ మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్( ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కాదు. అందుకని మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు ఎలాంటి పన్ను రాయితీలు లభించవు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. స్థలం కొనుగోలు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్) నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుందామనుకుంటున్నాను. దీనికి సంబంధించిన విధి విధానాలేంటి? ఏమేం డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది ? - భవానీ, హైదరాబాద్ నిర్దేశిత ఉద్యోగ సర్వీస్ పూర్తి చేస్తేనే మీరు ఈపీఎఫ్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. స్థలం కొనుగోలు కోసం ఈపీఎఫ్ నుంచి మొత్తం కాకుండా పాక్షికంగానే డబ్బులను విత్‌డ్రా చేసుకునే వీలుంది. మీరు ఏ కారణం వల్ల డబ్బులను విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో, దానికి తగ్గట్లుగా మీ సర్వీస్ ఉండాలి. ఉదాహరణకు మీ ఉద్యోగ సర్వీస్ ఐదేళ్లు పూర్తయితేనే మీరు స్థలం కోసం ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లతో పాటు పార్షియల్ విత్‌డ్రాయల్ పార్మ్ను మీ కంపెనీకి అందజేయాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. మీ క్లెయిమ్‌ను వెరిఫై చేసి, డబ్బులను మీ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, విత్‌డ్రాయల్ దరఖాస్తును నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయంలో కూడా సమర్పించవచ్చు. నేను 2009, మార్చిలో హెచ్డీఎఫ్సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్-2లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.12,000 చొప్పున ప్రీమియమ్‌లు చెల్లించాను. ఇప్పుడు నేను ఈ పాలసీని సరెండర్ చేస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - ప్రకాశ్ జైన్, హైదరాబాద్ హెచ్డీఎఫ్సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్ టూ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ), ఈ ప్లాన్‌ను ఇప్పుడు ఈ కంపెనీ నిలిపేసింది. ఈ పాలసీలో మీరు ఏడేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించారు. కాబట్టి మీపై ఎలాంటి సరెండర్ చార్జీల భారం ఉండదు. మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి సరెండర్ వేల్యూపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ పాలసీని సరెండర్ చేసేటప్పుడు ఆ ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే దాని సరెండర్ వేల్యూగా పరిగణిస్తారు. యూఎల్‌పీపీలు కొంత సంక్లిష్టమైన ప్లాన్లే. ఈ ప్లాన్లపై మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అధిక చార్జీలు వసూలు చేస్తాయి. ఫలితంగా రాబడులు తగ్గుతాయి. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఇక బీమా కోసం తగిన బీమా కవరేజ్ ఉండే టర్మ్‌బీమా పాలసీ తీసుకోవాలి - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్