regularise
-
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
జేపీఎస్‌లను రెగ్యులర్ చేయండి.. కేసీఆర్‌కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ..
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీర్‌కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు దిగారని జీవర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు వాళ్లను రెగ్యులర్ చేయాలని కోరారు. కాగా.. తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్ 29 నుంచి నిరవదిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహ్యం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు కూడా పంపింది. మంగళవారం సాయంత్రం 5:00 గంటల్లోగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. విధుల్లో చేరిన తర్వాత రెగ్యులర్ చేసే విషయంపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలి
కొత్త జిల్లాలతో ఉద్యోగులపై పనిభారం ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ముకరంపుర : ఏపీపీఎస్సీ ద్వారా నియమించబడిన వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి పే స్కేలు వర్తింపజేయాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు కొనసాగిస్తున్న సమ్మె శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి, శ్రమదోపిడీపై స్పందించాల్సిందిగా కోరుతూ మానవlహక్కుల కమిషన్‌కు లేఖలు రాస్తానన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేసే వీఆర్ఏలు సమ్మెలో ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. తెలంగాణలో తాత్కాలిక ఉద్యోగాలు అనే మాట ఉండదని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పడంతో తాత్కాలిక ఉద్యోగులు రోడ్డునపడ్డారని అన్నారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు మినహా కిందిస్థాయి సిబ్బందిని నియమించకుండా వేగవంతమైన పరిపాలన ఎలా సాధ్యమన్నారు. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న ఉద్యోగులే 27 జిల్లాల్లో పని చేయాలంటే వారి విపరీతమైన భారం పడుతుందన్నారు. 58 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో రూ.63వేల కోట్ల అప్పులుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గత రెండేళ్లలోనే రూ.33 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ఆగస్టులోనే రూ.9వేల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. రానున్న ఐదేళ్ల కాలంలో అప్పులు రూ.లక్ష కోట్లు దాటుతాయన్నారు. సమ్మెలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి బాపుదేవ్, జిల్లా కార్యదర్శి గోపు రామకృష్ణ, ఆనంద్‌కుమార్, రవి, తిరుపతి, సజిత్‌రెడ్డి, సంకీర్తన, నరేందర్‌రావు తదితరులున్నారు. వైఎస్సార్సీపీ సంఘీభావం వీఆర్ఏల సమ్మె శిబిరాన్ని వైఎస్సార్సీపీ నాయకులు సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె.నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, సంయుక్త కార్యదర్శి గడ్డం జలజరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్‌రావు, వినుకొండ రామకృష్ణారెడ్డి, మందరాజేష్, నాయకులు సిరి రవి, జక్కుల యాదగిరి, సాన రాజన్న, దుబ్బాక సంపత్, గండి శ్యామ్, కంది వెంకటరమణారెడ్డి, బండమీది అంజయ్య, పావురాల కనుకయ్య, చొక్కాల రాము, గంటుక పంపత్ తదితరులున్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
చేవెళ్ల: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్ తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెలలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్‌ను మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం సంఘం కార్యకలాపాలు, భవిష్యత్‌లో అనుసరించబోయే కార్యాచరణపై విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌చేశారు. ఆలోగా తక్షణమే 10వ పే రివిజన్కమిషన్ ప్రకారం బేసిక్‌పే, డీఏను చెల్లించాలని తెలిపారు. తెలంగాణ ఏర్పడి , టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగాలను క్రమబద్ధీకరించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు వినాయక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వసంతరావు మాట్లాడుతూ..తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు మురళీకృష్ణ, నాగమల్లేశ్వరి, రజిత, శోభ, పండరి పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
కొత్తూర్ (శ్రీకాకుళం) : కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కొత్తూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు సాయిరాం, డివిజన్ అధ్యక్షుడు టి.చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధమే...
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాల్సిందే.. - సీఐటీయూ రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి సాయిబాబా వరంగల్ అర్బన్/ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ అధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం వరంగల్‌కు చేరింది. నగరంతోపాటు ములు గు, భూపాలపల్లిలో ఆయన కార్మికులనుద్ధేశించి మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సర్కా రు చెప్పిన అచ్చా దిన్ కార్మికులకు రాలేదని, సీఎం కేసీఆర్ ప్రకటించిన బంగారు తెలంగాణ కూడా కార్మికులకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనంగా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందజేయాలని, 8 గంటల పనివిధానాన్ని, ఈపీఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలు వర్తింపజేయూలని డిమాండ్ చేశారు. ఎంజీఆర్, ఓసీటీసీ, లిబ్రా వంటి 50 పరిశ్రమలు మూతపడడం కారణంగా రాష్ట్రంలో 30వేలకు పైగా కార్మికుల కుటుం బాలు రోడ్డున పడ్డాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలే ఇందుకు ప్రధాన కారణమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 938 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రస్తుతం కార్మికుల ఆత్మహత్యలు పెరిగేలా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్ట్ కార్మికులు రోడ్డున పడి సమ్మెలు చేస్తుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని, కార్మికులపై ప్రేమ ఉంటే యాజమాన్యంతో మాట్లాడి సత్వరమే పునరుద్ధరణ చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని వెంకటాపురం, గోవిందరావుపేట మండలాల్లో పుష్కల మైన బొగ్గు ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ నూతన సింగరేణీని ఏర్పాటు చేస్తే 60వేల మందికి... విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మరో 50వేల మం దికి ఉపాధి కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలమైన వనరులుండగా... రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కొడుకు కేటీఆర్‌ను విదేశాలకు పంపి ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజాలను ఆశ్రయిస్తున్నారని దుయ్యబట్టారు. జూలై 10న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, జయలక్ష్మి, రాములు, చుక్కయ్య, రొయ్యల రాజు, యాదానాయక్, బొట్ల చక్రపాణి, ఎండీ.అమ్జద్‌పాషా, రత్నం రాజేందర్, ప్రవీ ణ్, పి.మధు, పద్మారాణి, మోక్షారాణి పాల్గొన్నారు. -
'సెకండ్ ఏఎన్ఎమ్లను రెగ్యులరైజ్ చేయాలి'
నల్లగొండ: సెకండ్ ఏఎన్ఎమ్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లాలో నర్పులు ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం ప్రభుత్వాస్పత్రి వద్ద గురువారం జరిగింది. సెకండ్ ఏఎన్ఎమ్ నర్సులను రెగ్యులైజ్ చేసి వారికి సకాలంలో జీతాలు అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వారికి ఫస్ట్ ఏఎన్ఎమ్లు కూడా మద్దతు పలికారు. (నడిగూడెం) -
అక్రమాలను క్రమబద్ధీకరిస్తాం!
బంగారు బల్లిని తాకడం ద్వారా సమస్త బల్లిపాట్లని క్రమబద్ధీకరించారు శాస్త్రకారులు. తుమ్మినప్పుడల్లా ‘చిరంజీవ’ అనుకుంటూ, జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటాం. ఈ స్వైన్‌ఫ్లూ తర్వాత ఒకటికి రెండుసార్లు చిరంజీవ అనుకుంటున్నాం. ఏమైనా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ జనసామాన్యంలోకి బాగా వెళ్లింది. ఇదొక మంచి అవకాశం. సరి హద్దులు సరిగా లేవా? అను మతులు అసలే లేవా? నియ మ నిబంధనలను సైడు కాల్వ లో తొక్కారా? ఏమీ పర్వా లేదు. సరిచేస్తాం. క్రమబద్ధీకరి స్తాం. మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెడతాం. మిమ్మల్ని పెద్ద మనుషులం చేస్తాం- ఇటీవల రోజుల్లో రెండు రాష్ట్రాలూ తెలుగులో గోసిస్తున్నాయి. ఇదేమీ మనకి కొత్తకాదు. అప్పుడెప్పుడో చైనా వాళ్లు హద్దుమీరి ముందుకొచ్చేస్తే, చేసేది లేక క్రమబద్ధీకరిం చి, గట్టిగా బుద్ధి చెప్పి పంపేశాం. పండుగలకీ పబ్బాలకీ గజనేరగాళ్ల శిక్షల్ని క్రమబద్ధీకరించి, సత్ప్రవర్తన కోటాలో జైళ్ల నుంచి ఇళ్లకి పంపేస్తూ ఉంటారు. మురిగిపోయిన అప్పుని క్రమబద్ధీకరించడాన్ని ‘‘మారిటోరియం’’ అం టారు. పేరుకుపోయిన నల్లధనాన్ని క్రమబద్ధీకరిస్తే అది ‘‘వాలంట్రీ డిస్క్లోజర్’’? అపరాధ కానుకతో నామాల స్వామితో ఏ మొక్కునైనా క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇం దిరా ప్రియదర్శినితో పెళ్లి జరిపించడానికి ఖాన్జీని క్రమబద్ధీకరించారు కర్మచంద్ గాంధి. శివకేశవులకు భేదం లేదంటూ కొందరు కొన్నింటిని, ఛఛ ఉందంటూ కొందరు నుదుటి గీతల్ని క్రమబద్ధీకరిస్తుంటారు. లిక్కర్ షాపు వేళల్ని తరచూ క్రమబద్ధీకరిస్తుంటా రు. డోసేజ్ని క్రమబద్ధీకరించుకోమని సేవించే వారికి డాక్టర్లు, పోలీసులు సూచిస్తూ ఉంటారు. పిల్లల తయారీ ని ఒక పరిశ్రమ చెయ్యొద్దనీ, క్రమబద్ధీకరించుకోమని హెచ్చరిస్తూ ఉంటారు. చదువుల్లో కూడా క్రమబద్ధీకరణ ఉంది. మా పెద్దన్నయ్య థర్డ్ఫారమ్ మూడుసార్లు ఫెయిల్ అయితే క్రమబద్ధీకరించి పైతరగతిలో వేశారు. మూడేళ్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఎనిమిదో క్లాసు ప్రభుత్వ పాఠశాల విద్యార్థితో ఎనిమిది అంకెలు చెప్పించండని లోక్‌సత్తా సవాలు విసిరి, వానా కాలం చదువుల్ని క్రమబద్ధీకరించి నలభై రెండుకి కుదిస్తే - కుర్రాళ్లకి కొంచెం క్రమబద్ధంగా ఉం టుందేమో ఆలోచించాలి. మొన్నటికి మొన్న నగరంలో మూడంతస్తుల అను మతితో ఆరంతస్తులు కడితే, సర్కారు ‘‘ఆయ్’’ అంటూ కళ్లెర్ర చేస్తే - ‘‘మీరు తప్పులో కాలేశారు. మైనస్ రెండు, మై- ఒకటి, జీరో ఆపైన ఏక్‌దోతీన్ లెఖ్ఖ సరిపోయింది పొమ్మన్నాడా పెద్దమనిషి. అధికారులు నాలిక్కరుచు కుని, మైనస్‌లు జీరోల్ని క్రమబద్ధీకరించి ఇకపై ఈ లెక్క లు సాగవన్నారు. ఆర్నెల్లు తిరక్కుండా ఆరుగదుల పర్మి షన్లో పన్నెండు గదులు కట్టాడా పెద్ద మనిషి. ఈసారి సర్కార్ రెచ్చిపోయింది. పడగొట్టాల్సిందేనని యంత్రాం గంతో సహా వెళ్లింది. ఇందులో అక్రమం అణుమాత్రం కూడా లేదు. అసలు ఆరుగదులే, ఆ ఎగస్ట్రా ఆరు వాస్తు కోసం కట్టినవే గాని వాడకానికి కాదు అనే సరికి సర్కా రు ఉలిక్కిపడి, ‘‘అయితే ఓకే!’’ - కరచాలనం చేసి ‘‘వద్దండీ. మళ్లీ ఆరుగదులు వాస్తు కోసం వెయ్యాల్సివ స్తుందని’’ పెద్ద మనిషి బతిమాలుకున్నాడు. మనకి అన్ని తప్పులకీ ప్రాయశ్చిత్తాలున్నాయి. అసలు పశ్చాత్తాపానికి మించిన విరుగుడు లేదు. ప్రతి నిబంధనకి ఒక సవరింపు ఉంటుందని నానుడి. ఉద్య మాలు సఫలమయ్యాక సమస్త సివిల్ క్రిమినల్ కేసుల్నీ క్రమబద్ధీకరిస్తారు. ఆనాటి అవాంఛనీయ ఘటనలు నేడు మధుర ఘట్టాలవుతాయి. నాటి అల్లరిమూకలే నేటి దేశభక్తులు! జీవితంలోనే కాదు సాహిత్యంలో కూడా క్రమబద్ధీకరణలున్నాయ్. ‘‘పూర్వ కవుల ప్రయో గంబులు యాజ్‌టీజ్‌గా గ్రాహ్యంబులు’’ అనే సూత్రం తో రెగ్యులరైజ్ చేసిపడేశారు. బంగారు బల్లిని తాకడం ద్వారా సమస్త బల్లిపాట్లని క్రమబద్ధీకరించారు శాస్త్రకా రులు. తుమ్మినప్పుడల్లా ‘చిరంజీవ’ అనుకుంటూ, జీవి తాన్ని క్రమబద్ధీకరించుకుంటాం. ఈ స్వైన్‌ఫ్లూ తర్వాత ఒకటికి రెండుసార్లు చిరంజీవ అనుకుంటున్నాం. ఏమైనా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ జనసామాన్యంలోకి బాగా వెళ్లింది. ఎదురింటాయన వీధి చివర ఎదురు పడితే, ఏమిటి నడుచుకుంటూ వెళుతున్నారని అడిగా. ‘‘తలమాసింది. క్రమబద్ధీకరణకి సెలూన్‌కి పోతున్నా’’ అన్నాడాయన. మొత్తానికి భాష సంపన్నం అవుతోంది. అక్షర తూణీరం: శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)