పేద విద్యార్థులకు వరం
కడు పేదరికం ముందు ఆ కుటుంబాల్లోని విద్యార్థులకు కార్పొరేట్ విద్య గగన కుసుమం అవుతున్న తరుణంలో మహానేత... మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం పేద విద్యార్థుల చదువులకు ప్రాణం పోసింది. ఉన్నత చదువు చదివి తర్వాత ఉద్యోగమొస్తే అది బతుకు తెరువు అవుతుంది. అయితే చదువుకునేటప్పడే ఫీజు రీయింబర్స్‌మెంటును డాక్టర్ వై.ఎస్. ఇచ్చి పేద పిల్లల చదువుకు ఓ తెరువును చూపించిన దేవుడు.
ఫీజు రీయింబర్స్‌మెంటు వల్ల నాలాంటి సామాన్య కుటుంబాలకు చెందిన ఆడపిల్లలే కాదు..పేద కుటుంబాలకు చెందిన అనేకమంది విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల మెట్లు ఎక్కి గౌరవప్రదంగా చదువుకుంటున్నారు. ఇదంతా మహనేత వై.ఎస్.పుణ్యమే.
- ఆచంట సౌందర్య. ఎంసీఏ విద్యార్థిని, భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల