భోజనం తినలేదు..
తెల్లటి పొడవాటి గెడ్డం.. తెల్లవారితే తన 54వ పుట్టిన రోజు.. తెల్లవారితే ఉరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య యాకూబ్ మెమన్ అత్యంత ఉద్వేగానికి లోనయ్యాడు. బుధవారం నాడు జైలు అధికారులు తనకు పెట్టిన ఆహారాన్ని కూడా అతడు తీసుకోలేదు.
సీఏ పూర్తి చేసిన మెమన్.. దాంతోపాటు పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషు లిటరేచర్ లలో రెండు మాస్టర్స్ డిగ్రీలు కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. జైల్లో ఖైదీలకు అతడు బోధించేవాడు. దాంతో నాగ్ పూర్ జైల్లో ఉన్న ఖైదీలు అందరికీ మెమన్ బాగా తెలుసు. అయితే బుధవారం మాత్రం ఇతర ఖైదీలను మెమన్ తో కలవనివ్వలేదు. కాగా, నిబంధనల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మెమన్ ను నిద్ర లేపారు.