release funds
-
ఉపాధి నిధులు విడుదల చేయండి.. కేంద్రానికి ఎంపీ వంగా గీత విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత కేంద్రాన్ని కోరారు. కేంద్రం కూలి పనిదినాలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 1,18,626 లక్షల పనిదినాల సంబంధించిన 4,97,650 లక్షల రూపాయలు విడుదల చేయాలని విజ్క్షప్తి చేశారు. -
హుజూరాబాద్‌లో దళితబంధుకు 500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దళితబంధు పథకం అమలు మరింత వేగవంతమైంది. గతవారం ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన భువనగిరి జిల్లా వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు ప్రభుత్వం రూ.7.6 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలు కోసం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాసాలమర్రి గ్రామం వరకు ప్రాథమికంగా విడుదల చేసిన మార్గదర్శకాలనే ఇక్కడ కూడా అమలు చేయాలని సూచించారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ను ఆదేశించారు. దీంతో కార్పొరేషన్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (వీసీఎండీ) బీఎస్ఎస్ భవన్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకుకు లేఖ రాశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు రూ.500 కోట్లు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ పద్ధతిలో విడుదల చేయాలంటూ రెండు చెక్కులతో కూడిన లేఖను సమర్పించారు. దీంతో బ్యాంకు నుంచి నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయి. -
రాష్ట్రాలకు కేంద్రం 11 వేల కోట్ల నిధులు
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసర నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎంఎఫ్) కింద రాష్ట్రాలకు 11,092 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఈ నిధులను క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర వ్యవహారాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం ఈ నిధులు విడుదల చేయడం గమనార్హం. -
మత్స్య అభివృద్ధికి రూ.1,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో చేపలు లభ్యమయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి (ఐఎఫ్‌డీఎస్) రూపకల్పన చేసింది. ఈ పథకం అమలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపల ఉత్పత్తిని పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, అవసరమైన మౌలిక సదుపాయా లను ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స్య సహకార సంఘాలు, మత్స్య మార్కెటింగ్ సంఘాలు, జిల్లా మత్స్య సహకార సంఘాలు, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య సభ్యులు లబ్ధిపొందుతారు. రొయ్యలు, చెరువుల్లో, పంజరాల్లో చేపల సాగు వంటి విభిన్న పద్ధతుల ద్వారా చేపల పెంపకం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు అనేక రకాల పరికరాలు అందజేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. వాటిలో లబ్ధిదారులకు 75 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీ లభిస్తుంది. చేపలు అమ్ముకునేందుకు 50 వేల ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం అందించనుంది. వాటిని 75 శాతం రాయితీపై ఇవ్వనుంది. -
22 పాఠశాలలకు ఒకరే హెచ్ఎం
బెజ్జూర్ (సిర్పూర్): ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 22 పాఠశాలలకు ఒక్కరే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలో మొత్తం 79 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 22 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. అలాగే రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యావలంటీర్లతో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్గుపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంధం తిరుపతికి 22 పాఠశాలల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన అన్ని పాఠశాలలను సరిగా పర్యవేక్షించలేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాలల నిధులు పక్కదారి మరో పక్క బెజ్జూర్ మండలంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాల గ్రాంటు నిధులు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. 2017–18 విద్యాసంవత్సరానికిగాను ప్రతీ పాఠశాలకు రూ.పది వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితో పాఠశాలలకు అవసరమయ్యే బీరువాలు, కుర్చీలు తదితర సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంది. కాని ఇప్పటివరకు ఈ పాఠశాలల్లో ఎలాంటి సామగ్రి కొనుగోలు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదం మేరకు సామగ్రిని కొనుగోలు చేసి బిల్లులు పొందుపర్చి నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే మండలంలో ఏ పాఠశాలలో కూడా సామగ్రి కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడంలేదు. ఎంఈవో, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కలసి ఈ నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎంఈవోకు కొందరు రాజకీయ నాయకుల మద్దతు ఉండటంతోనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల కమిటీ బ్యాంకు ఖాతాలో ఉండాల్సి ఉండగా, ఎంఈవో తన సొంత ఖాతాలోకి మార్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయమై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. జూన్‌లో కొనుగోలు చేస్తాం ఈ విషయమై ఎంఈవో రమేశ్ బాబును వివరణ కోరగా నిధులు తన వద్దనే ఉన్నాయని, జూన్‌లో పాఠశాలలకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇన్చార్జి హెచ్ఎం గంధం తిరుపతినివివరణ కోరగా 22 పాఠశాలలకు సంబంధించిన చెక్కులను ఎంఈవోకు ఇచ్చానని తెలిపారు. -
సీఎస్టీ బకాయిలు విడుదల చేయండి
⇒ అరుణ్‌జైట్లీని కోరిన ఈటల ⇒ ఈ నెలలో రూ.400 కోట్ల విడుదలకు జైట్లీ అంగీకారం సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నుంచి వివిధ పథకాల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ విషయంలో కల్పించుకొని నిధుల విడు దలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. తెలంగాణకు రావాల్సిన రూ.10 వేల కోట్ల సీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌తో కలసి ఈటల గురువారం ఢిల్లీలో జైట్లీతో భేటీ అయ్యారు.æ సీఎస్టీ బకాయిలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ. 400 కోట్లను ఈ నెల 24లోపు విడుదలయ్యేలా చూస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.450కోట్ల రెండో విడత నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ‘భగీరథ’కు నిధులు చూద్దాం... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల కు నీతిఆయోగ్ చేసిన సిఫారసులకు అను గుణంగా రూ.19వేల కోట్లు కేటాయించాల ని జైట్లీని ఈటల కోరారు. కాగా, ఈ ప్రాజెక్టులకు నిధుల విడుదలను ‘చూద్దాం’ అన్నట్టుగా జైట్లీ స్పందించారని సమావేశం అనంతరం ఈటల మీడియాకు తెలిపారు. ఇదిలాఉండగా కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమైన ఈటల.. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రోడ్ల విషయంలో అన్యా యం జరిగిందని వివరించారు. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజ న, వెనుకబడిన జిల్లాల కోటాలో నిధులు కేటాయించాలని కోరారు.రాష్ట్రంలో కొత్త జిల్లాలన్నింటిలో కృషి విజ్ఞాన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కేంద్ర వ్యవ సాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ను ఈటల కోరగా, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, మం చిర్యాల, సిరిసిల్ల రాజన్న తదితర జిల్లాల్లో ఈ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌తో సమావేశమై న ఈటల.. సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.1,008 కోట్లను విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేసేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ట్టు మంత్రి ఈటల తెలిపారు. ఆదాయ పెంపు వృత్తులు, సేవా వృత్తులను విభజించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. గొర్రెలు, చేపల పెంపకం, నీటిపారుదల, వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్నారు. -
అడిగింది కొండంత, ఇచ్చింది గోరంత..
-
నిధులు ఫుల్.. పనులు నిల్
- 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.11.89 కోట్లు విడుదల - 13వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.35 కోట్ల పనులు పెండింగ్ - నిధుల విడుదలకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ మెలిక పెట్టిన ప్రభుత్వం - హడావుడి పనులకు అధికారుల శ్రీకారం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొంది. నిధులు వరదలా వస్తుంటే పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.11.89 కోట్లు నగరపాలక సంస్థకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తేనే 14 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని మెలిక పెట్టింది. దీంతో పాలకులు, అధికారుల్లో హైరానా మొదలైంది. పెండింగ్ పనుల్ని యుద్ధప్రాతిపదికన నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. 13వ ఆర్థిక సంఘం కింద 2009-10 నుంచి 2014-15 మధ్య కాలానికి కార్పొరేషన్‌కు రూ.61 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.26 కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి. రూ.35 కోట్ల పనులు జరగాల్సి ఉంది. కొన్ని పనులైతే టెండర్ల దశ దాటలేదు. గంగిరెద్దుల దిబ్బ పటమట ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించేందుకు పైప్‌లైన్ పనులకు రూ.9 కోట్లు కేటాయించారు. సర్కిల్-2లో రూ.3.50 కోట్లతో, వన్‌టౌన్ ప్రాంతంలో రూ.9 కోట్లతో సంప్ నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వర్క్ ఆర్డర్ ఇచ్చారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. నాణ్యతపై అనుమానాలు 14వ ఆర్థిక సంఘం నిధుల్ని అందిపుచ్చుకొనేందుకు అధికారులు మాస్టర్‌ప్లాన్ వేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనుల్ని ప్రారంభించడంతో పాటు నిధుల వినియోగానికి సంబంధించి ఖర్చును చూపేందుకు సిద్ధమవుతున్నారు. చేపట్టిన పనుల్ని రెండు, మూడు నెలల వ్యవధిలో పూర్తిచేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హడావిడి పనుల వల్ల నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వన్‌టౌన్‌లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, వివిధ గ్రాంట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత సన్నగిల్లిందన్న విమర్శలు ఉన్నాయి. వన్‌టౌన్ ప్రాంతంలో పర్యటన సందర్భంగా మేయర్ కోనేరు శ్రీధర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. పనుల్లో నాణ్యత ఉన్నట్లు ముగ్గురు స్థానికులు ధృవీకరిస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అధికారులు హడావిడిగా చేసే పనుల్లో నాణ్యత ఎంతమేర ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆడిట్‌పై దృష్టి ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. రూ.50 లక్షలు దాటిన వ ర్క్స్పై సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆలోపు అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో చెక్ మెజర్మెంట్స్ ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఎం(మెజర్మెంట్) బుక్స్‌ను తప్పనిసరిగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థలో అత్యధిక శాతం పనులకు సంబంధించి ఎంబుక్స్ లేవని సమాచారం. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై సాధ్యమైనంత త్వరలో ఆడిట్ పూర్తి చేసి 14వ ఆర్థిక సంఘం నిధుల్ని అందిపుచ్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా కలెక్టరేట్ సోమవారం ఉదయం పలు ప్రజా సంఘాలు, పార్టీల ధర్నాలతో దద్దరిల్లింది. వివిధ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ.. కేవీపీఎస్.. కల్లు గీత కార్మిక సంఘం.. దళిత, గిరిజన కూలీ లు, చేతివృత్తిదారులు, వికలాంగులు, మహిళల సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఈ ధర్నాలు జరిగాయి. ఇవన్నీ ఒకేసారి జరగటంతో అటు వివిధ పనులపై కలెక్టరేట్‌కు వచ్చిన సందర్శకులు, ఇటు పోలీసులు కాస్త ఇబ్బంది పడ్డారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, దీనికి ఆధార్‌తో ముడి పెట్టవద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షు డు కె.నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు పైడి వేణుగోపాలం మాట్లాడుతూ బయోమెట్రిక్, ఆన్లైన్ విధానాల వల్ల జిల్లాలోని బడుగు, పేద వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ ఏడాది కొన్ని కళాశాలల విద్యార్థులు ఉపకార వేతనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బకాయిల మొత్తం రూ.9 కోట్లకు చేరుకుందన్నారు. అనంతరం కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు వినతిపత్రం సమర్పిం చారు. ధర్నాలో పార్టీ నేతలు శవ్వాన ఉమామహేశ్వరి, పూడి తిరుపతిరావు, రౌతు చిరంజీవి, కె.వెంకట్రావు, పి.మన్మధరావు, సువ్వారి సన్యాసప్పారావు, పి.యోగేశ్వరరావు, ఎస్.వెంకటేశ్వర్లు, టి.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 101 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ దళిత, గిరిజన కూలీలు, చేతివృత్తిదారులు, మైనారిటీలు, వికలాంగులు, మహిళల సంఘాలు ధర్నా చేశాయి. ఈ సందర్భంగా సంఘాల సమన్యయ కమిటీ కన్వీనర్ టి.తిరుపతిరావు మాట్లాడుతూ 101 జీవో వల్ల అన్నింటికీ ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి రావటం, సమయం తక్కువగా ఉండటం, వయో పరిమితి తగ్గించటం వల్ల నిరక్ష్యరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని పైవర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కార్యక్రమాలు, రుణాలకు సంబంధించిన సెలక్షన్ కమిటీలో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ధర్నాలో సంఘాల నేతలు కె.అప్పారావు, డి.గణేశ్, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కల్లుగీత కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం నేతలు కె.అప్పారావు, దుబ్బ కోటేశ్వరరావు, డి.సూర్యనారాయణలు మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి భద్రత లేదని అన్నారు. గీత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘం నేతలు టి.సింహచలం, డి.గణేశ్, దానయ్య, ఏ.గోదావరి, కె.మోహనరావు, తిరుపతిరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో దళితులకు ఇచ్చిన పట్టాలకు వెంటనే సబ్ డివిజన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకా లు, యాజమాన్య హక్కు పుస్తకాలు వెంటనే అందజేయాల ని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు బి.అచ్చెయ్య, తాండ్ర అరుణ మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం డి-పట్టాలిచ్చినా ఇంతవరకు సబ్ డివిజన్ చేయలేదన్నారు. దీనివల్ల వీరి భూములను పెత్తందార్లు ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ధర్నాలో సంఘం సభ్యులు దంతూలుని వర్మ, బంటు గురుమూర్తి, బి.గణేశ్, దాసరి సింగయ్య తదితరులు పాల్గొన్నారు.