రైతులకు ఉచితంగా రిమోట్ పంపుసెట్లు
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రైతులకు రిమోట్ ఆపరేట్ సిస్టమ్తో కూడిన పంపుసెట్లను ఉచితంగా అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి నారాయణతో కలసి ఆయన మాట్లాడారు. 15లక్షల మంది రైతులకు గాను మొదటి దశలో 2 లక్షల మందికి వీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్ల పాటు ఈ పంపుసెట్ల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వీటి వినియోగంతో రైతులకు 400 మిలియన్ యూనిట్ల కరెంట్ ఆదా అయ్యే అవకాశముందన్నారు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వచ్చే నెల 7న విజయవాడలోని హోటల్ తాజ్ గేట్వేలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.