Rental of buses
-
అద్దె రూట్లు మళ్లీ పాత వారికే: ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : అద్దె బస్సుల కాలపరిమితి పూర్తయ్యాక ఆయా రూట్లలో కొత్త బస్సులు తిప్పుకొనే వెసులుబాటును పాత యజమానులకే ఇవ్వనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. మళ్లీ టెండర్లు పిలవకుండా పాతవారికే కేటాయించనున్నట్టు తేల్చి చెప్పింది. కాలపరిమితి పూర్తయిన రూట్లలో కొత్త బస్సులు తీసుకునేప్పుడు టెండర్లు ఆహ్వానిస్తే నిరుద్యోగులు సహా కొత్తవారు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పాతవారికే మళ్లీ కట్టబెట్టడం వల్ల కొత్తవారికి అవకాశం లేకపోవటంతోపాటు, ఆ ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయే అవకాశం ఉంటుందంటూ ఇటీవల ‘అమ్మకానికి ఆర్టీసీ బస్సు రూట్లు’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆర్టీసీ, 2008లో అద్దె ప్రాతిపదికన తీసుకున్న 507 బస్సుల్లో ఈ నెలాఖరుతో 27 బస్సుల కాలపరిమితి తీరుతుందని, వచ్చే ఏడాది నాటికి దశల వారీగా అన్ని బస్సుల గడువు పూర్తవుతుందని పేర్కొంది. గడువు పూర్తయిన వాటి స్థానంలో మళ్లీ పాతవారికే కొత్త బస్సులు నడుపుకొనే అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. టెండరు ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉన్నా.. అది పెద్ద విషయం కాదని తెలిపింది. పాతవారికే బస్సులు కేటాయించే విషయంలో అక్రమాలకు అవకాశం లేదని చెప్పడం విశేషం. -
టెండర్.. వండర్!
19 రూట్లకు 1414 దరఖాస్తులు లాటరీ పద్ధతిలో ‘అద్దెబస్సులు’ ఖరారు విశాఖపట్నం: అవసరమైన రూట్లలో అద్దె బస్సులు నడపడానికి విశాఖ ఆర్టీసీ రీజియన్‌లో పిలిచిన టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. 19 రూట్లకు గాను జిల్లాలో 23, నగరంలో 68 వెరసి 91 అద్దెబస్సుల కోసం మంగళవారం టెండర్లను ఆహ్వానించింది. ఆయా బస్సు యజమానుల నుంచి 1414 టెండర్లు దాఖలయ్యాయి. అంటే సగటున ఒక్కో రూటుకు 70 మంది పోటీ పడ్డట్టయింది. ఇందులో అత్యధికంగా నర్సీపట్నం-విశాఖపట్నం మధ్య నడపనున్న 12 నాన్‌స్టాప్ డీలక్స్ సర్వీసులకు 307 టెండర్లు దాఖలు చేశారు. ఆ తర్వాత శ్రీకాకుళం-విశాఖల మధ్య నడిచే 4 నాన్‌స్టాప్ డీలక్స్ సర్వీసులకు 246 టెండర్లు పడ్డాయి. అత్యల్పంగా విశాఖ(మధురవాడ)-కర్నూలు, ఆరిలోవ-రైల్వేస్టేషన్ (69వ నం.సర్వీసు), సింహాచలం-ఆర్కేబీచ్ (28జెడ్) సర్వీసులకు ఒక్కో టెండరు మాత్రమే దాఖలయింది. అలాగే సింహాచలం-చోడవరం మధ్య ఆరు మెట్రో సర్వీసులకు 182, మద్దిలపాలెం-రైల్వేస్టేషన్- తగరపువలస మధ్య ఆరు మెట్రో సర్వీసులకు 135 టెండర్లు పడ్డాయి. 91 అద్దెబస్సుల్లో మూడు తెలుగు వెలుగు (నర్సీపట్నం-తుని), నాలుగు సూపర్ లగ్జరీ, 16 డీలక్స్, 24 సిటీ ఆర్డినరీ, 44 మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. అత్యధికంగా 735 కిలోమీటర్ల దూరం ఉన్న విశాఖ-కర్నూలు రూటుకు ఒకే టెండరు దాఖలయింది. మొత్తమ్మీద చూస్తే ప్రైవేటు బస్సు యజమానులు రోడ్లు సిటీ రూట్లకు, నాన్‌స్టాప్ రూట్లకు బాగా మొగ్గు చూపారు. లాటరీ ద్వారా కేటాయింపు: మంగళవారం రాత్రికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఆర్టీసీ అధికారులు బుధవారం ఆయా టెండర్లను లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. ఆశించిన రూటు దక్కని బస్సు యజమానులకు ఒక్కో టెండరు దాఖలైన రూట్లకు అవకాశం కల్పించారు. అయితే దీనికీ పోటీ పెరగడంతో వాటినీ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈఎండీ కింద చెల్లించిన రూ.50 వేలను టెండరు దక్కని వారికి బుధవారం తిరిగి చెల్లించారు. -
సమ్మె మాటున ఆర్టీసీ దందా
- అద్దె బస్సుల యాజమాన్యంతో అధికారుల కుమ్మక్కు - స్లాబ్ పద్ధతిలో టికెట్ ధరలు పెంచి బస్సులు నడిపిస్తున్న యాజమాన్యం - వచ్చిన ఆదాయాన్ని అధికారులే నొక్కేస్తున్న వైనం - 150 బస్సులు తిరిగినా రూ.లక్ష కూడా దాటని రాబడి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సమ్మె సాకుతో ఆర్టీసీని లూటీ చేస్తున్నారు.. అద్దె బస్సుల యాజమాన్యంతో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కై వచ్చిన ఆదాయాన్ని నొక్కేస్తున్నారు. మొదటి నుంచి బస్సులను స్వల్పంగా నడుపుతున్నారు. సదరు బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. కానీ ఈ నాలుగు రోజుల్లో ఏ ఒక్క రోజూ కనీసం రూ.లక్ష కూడా ఆర్టీసీ ఖాతాలో జమ కాలేదు. బస్సులు నడిపి సమ్మెను నిర్వీర్యం చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఆదాయం విషయాన్ని గాలికి వదిలేసింది. దీంతో అద్దె బస్సుల యాజమాన్యం ఆర్టీసీ అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని రాబడిని పక్కదారి పట్టిస్తున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో... నిత్యం జిల్లాలోని ఏడు డిపోల్లో కలిపి 610 బస్సులు తిరగుతాయి. రోజుకు కనీసం రూ.50 లక్షల ఆదాయం సమకూరుతుంది. గ్రామీణ ప్రాంత రూట్లల. -
రోడ్డెక్కిన అద్దెబస్సులు
- మూడో రోజుకు చేరిన కార్మిక సంఘాల సమ్మె - ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన అధికారులు - రాకపోకలు సాగించిన 183 బస్సులు - క్యాజువల్ డ్రైవర్, కండక్టర్ల తొలగింపు - వంటావార్పు, ధర్నాలతో కార్మికుల నిరసన - కొనసాగుతున్న ప్రైవేటు వాహనాల దోపిడీ.. నల్లగొండ : ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె మూడో రోజుకు చేరింది. విరమించే పరిస్థితి కనిపించకపోవడంతో రీజియన్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేశారు. శుక్రవారం పలుచోట్ల అద్దె బస్సులు రోడ్డెక్కాయి. కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ డిపోల ఎదుట ధర్నా నిర్వహించారు. విధుల్లోకి వచ్చిన ప్రైవేటు ఉద్యోగులను అడ్డుకున్నారు. నల్లగొండ నుంచి దేవరకొండ వెళ్తున్న బస్సును కనగల్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనపై అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రహదారుల మీద ప్రైవేటు వాహనాల దోపిడీ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్టీసీ..ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సేవలు వినియోగించుకుంటోంది. శనివారం నుంచి మరిన్ని అద్దె బస్సులను రోడ్డుమీద తిప్పేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. డిపోనకు 40 బస్సుల చొప్పున శనివారం మరో 280 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం 183 బస్సులు వివిధ మార్గాల్లో ప్రయాణించగా వాటిల్లో ఆర్టీసీ 33, అద్దె బస్సులు 150 ఉన్నాయి. నల్లగొండ డిపో నుంచే 23 బస్సులు వివిధ ప్రాంతాలకు పంపించారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మిగిలిన బస్సులను అక్కడి నుంచే ఆపరేట్ చేశారు. పోలీస్ ఎస్కార్ట్ సహాయంతోనే బస్సులు ప్రయాణించాయి. ఇదిలావుంటే క్యాజువల్ కండక్టర్లు, డ్రైవర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆర్ఎం బి.రవీందర్ అన్ని డిపోలకు ఉత్తర్వులు జారీ చేశారు. సంఘాల నిరసనలు.. నల్లగొండ డిపో వద్ద ధర్నా చేస్తున్న సంఘాలకు వివిధ పార్టీల అనుంబంద సంఘాలు సంఘీభావం తెలిపాయి. పోలీస్ ఎస్కార్ట్‌తో భువనగిరి ప్రాంతంలో నల్లగొండ, గజ్వెల్ ప్రజ్ఞాపూర్, పికెట్ డిపోలకు చెందిన అద్దె బస్సులు, కొన్ని ప్రైవేట్ బస్సులు నడిచాయి. గ్రామాలకు కాకుండా పట్టణ ప్రాంతాలకు బస్సులు పంపించారు. చౌటుప్పల్‌లో ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైవేపై నిరసన ర్యాలీ నిర్వహించారు. దేవరకొండ డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆటోలు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేశారు. కోదాడలో కార్మికులు డిపో నుంచి బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అధికారులు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను బయటకు పంపడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా చేరేందుకు ప్రయత్నించగా వారిని కూడ కార్మికులు అడ్డుకొని డిపో లోనికి వెళ్లనీయలేదు. మిర్యాలగూడ డిపోలో బస్సులు గేటు బయటకు రాలేదు. సమ్మెలో భాగంగా కార్మికులు డిపో గేటు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపోలోనే మధ్యాహ్న భోజనాలు చేశారు. కార్మికుల సమ్మెకు సీపీఐ, బీజేపీ, స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. సూర్యాపేటలో బస్టాండ్ ఆవరణ నుంచి ఒక్క బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. అలాగే ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. -
మరిన్ని డిపోల్లో అదే గోల్మాల్
వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వెలుగుచూసిన అక్రమాలు ‘సాక్షి’ కథనంతో రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ బృందాల తనిఖీలు హైదరాబాద్: ఆర్టీసీలో అద్దె బస్సుల పేర జరుగుతున్న అక్రమాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఐదేళ్లు దాటిన బస్సులను తిరిగి కొనసాగించాల్సి వస్తే... తదుపరి చెల్లింపుల్లో కిలోమీటరుకు 99 పైసల చొప్పున తగ్గించాలనే నిబంధనను పక్కన పెట్టి అక్రమంగా చెల్లింపులు జరుపుతున్నారు. బిల్లుల తయారీ సమయంలో, చెల్లింపు సమయంలో సంబంధిత విభాగాలు నిబంధనను తుంగలో తొక్కుతుండగా చూడాల్సిన ఆడిట్ విభాగం కూడా నిద్రపోతోందని స్పష్టమవుతోంది. వరంగల్ జిల్లా తొర్రూరు డిపోలో రూ.10.80 లక్షల వరకు నిధులను అక్రమంగా చెల్లించిన అంశం ఇప్పుడు ఆర్టీసీలో దుమారం రేపుతోంది. దీన్ని వెలుగులోకి తెస్తూ ‘ఆర్టీసీ ఖజానాకు అద్దె బస్సుల కన్నం’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో కదలిన ఆర్టీసీ యాజమాన్యం పూర్తిస్థాయిలో తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆడిట్ విభాగాలు తనిఖీలు ప్రారంభించాయి. దీంతో పలు డిపోల్లో అద్దె బస్సుల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. 4 నెలల క్రితం వరంగల్ జిల్లాలోనే మరో డిపోలో రూ.8 లక్షలు ఇలాగే అక్రమంగా చెల్లించినట్టు తేలింది. దీనిపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తం కావడంతో హడావుడిగా ఆ మొత్తాన్ని రికవరీ చేసినట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ డిపోలో రూ.10 ల క్షల వరకు అదనంగా చెల్లించినట్టు తేలింది. కూడబలుక్కునే అద్దె బాగోతాలు... ఒకటి, రెండు డిపోల్లోనే కాకుండా పలు డిపోల్లో ఇదే విధంగా అద్దె బస్సులకు అక్రమ చెల్లింపుల వ్యవహారం వెలుగుచూస్తుండడంతో ఆర్టీసీ యాజమాన్యం దీనిని సీరియస్‌గా తీసుకుంది. సిబ్బంది కూడబలుక్కునే ఈ తతంగాన్ని నడుపుతున్నట్టు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండుసార్లు పొరుపాటు పేరుతో కథ నడిపి, ఎవరైనా పసిగడతారన్న అనుమానం రాగానే రికవరీ చేస్తున్నారని, లేకపోతే స్వాహా చేయవచ్చనే ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని కొన్ని డిపోలకు సంబంధించి ... ఆర్టీసీ అధీనంలోని దుకాణాల అద్దెలను కూడా ఇదే తరహాలో మింగేశారు. వసూలు చేసిన మొత్తంలో కొంత మినహాయించుకుని బ్యాంకులో జమ చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఇలా దాదాపు రూ.2 కోట్ల వరకు స్వాహా చేశారు. ఈ విషయం వెలుగు చూడడంతో తాత్కాలిక పద్ధతిలో నియమించుకుని రిటైర్డ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పైగా... అభియోగాలు ఎదుర్కొంటున్న కొందరి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఉన్నతాధికారులే చక్రం తిప్పారు. ఆర్టీసీలో ఆడిట్ విభాగం నిర్వీర్యం కావడంతో ఇలా అద్దెల బాగోతాలు చోటు చేసుకుంటున్నాయి. -
అద్దె బస్సులో.. పల్లెకు చలో..
సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు అనేక మంది బస్సులు, కార్లు, ఇతర వాహనాలను అద్దెకు తీసుకుని ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ మేరకు గోరేగావ్‌లో నివసించే కరీంనగర్ వాసి అయిన మైలారపు శంకర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము 16వ తేదీ రాత్రి లేదా 17వ తేదీ ఉదయం ఊరికి వెళ్లేందుకు ప్రైవేట్ బస్సును అద్దెకు మాట్లాడుకున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 50కిపైగా కుటుంబాలు పశ్చిమ గోరేగావ్‌లోని తీన్డోంగ్రీ ప్రాంతంలో స్థిరపడ్డాయని, తామంతా కలిసి ఒకేసారి ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్ కోసం యత్నిస్తే దొరకలేదని, అందుకే ఒక ఊరివారమంతా ఒకే బస్సులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన యశ్వంత్రావ్పేట్తోపాటు ఇతర గ్రామాలకు చెందిన వారు కూడా బస్సులను అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.. ఒక్కరు చాలు : కరీంనగర్ జేసీ సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వలసబిడ్డలందరూ ఊళ్లకు రావల్సిన అవసరంలేదని, ఒక్కరు ఉంటే చాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫ్రాజ్ అహ్మద్ తెలిపారు. సర్వేపై ముంబైతోపాటు మహారాష్ట్రలో నివసించే ప్రజల్లో నెలకొన్న అయోమయ పరిస్థితి గురించి ‘సాక్షి’ ఆయనకు ఫోన్లో వివరించింది. దీనిపై స్పందించిన ఆయన ముంబై, భివండీతోపాటు మహారాష్ట్రలో నివసించే జిల్లా ప్రజలందరూ స్వగ్రామాలకు రావల్సిన అవసరం లేదన్నారు. కుటుంబసభ్యుల అన్ని వివరాలు చెప్పగలిగే ఒక్కరు వస్తే చాలని, అయితే అక్కడి వివరాలను ఆధారాలతోపాటు చూపించాల్సిన అవసరం ఉందన్నారు.