republicday
-
మెగా రిపబ్లిక్ డే సేల్స్.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌పై భారీ ఆఫర్స్
దసరా, దీపావళి, న్యూ ఇయర్.. ఇలా పండుగలు వస్తున్నాయంటే చాలు.. షాపింగ్ జోరు మొదలైపోతుంది. ఆఫ్‌లైన్ అయిన ఆన్లైన్ అయినా.. మనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాల్సిందే. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు సైతం భారీ డిస్కౌంట్స్ ప్రకటించేస్తాయి. అయితే.. ఈసారి రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎయిర్ టికెట్స్ వరకూ భారీ ఆఫర్స్ అందిస్తున్నాయి పలు దిగ్గజ కంపెనీలు. వరల్డ్ టాప్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఈ నెల 15 నుంచి 20 వరకూ రిపబ్లిక్ డే మెగా సేల్స్ నిర్వహించింది. మొబైల్స్, స్మార్ట్ వాచెస్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఇచ్చింది. ఇక ఫ్లిప్‌కార్ట్ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అందిస్తోంది. కేవలం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్సే కాదు.. ఆఫ్లైన్లోనూ గ్రాండ్ రిపబ్లిక్ డే సేల్ అంటూ భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి దిగ్గజ కంపెనీలు. టూ విలర్ కొనుగోలుదారులకు రూ.5 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది బజాజ్ సంస్థ. అంతేకాదు.. వినియోగదారులకు సులభ వాయిదాలు కూడా అందిస్తోంది. విజయ్ సేల్స్ కూడా మెగా రిపబ్లిక్ డే సేల్ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇస్తోంది. గాడ్జెట్స్, గృహోపకరణాలు వంటి వస్తువులపై 65 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకుంటున్నారా..? అయితే.. ఇదే మంచి సమయం.. మా షోరూంలో భారీ డిస్కౌంట్స్ లభిస్తాయంటూ రిపబ్లిక్ సేల్స్‌ను ప్రారంభించింది క్రోమా సంస్థ. ఈ నెల 29 వరకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ కొనుగోళ్లపై ఆఫర్స్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సేల్స్ కేవలం ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్స్కు మాత్రమే పరిమితం కాలేదు. దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, గో ఆసియా సైతం.. టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా కేవలం రూ.1705 రూపాయలకే టికెట్లు విక్రయించింది. డొమెస్టిక్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.1199లకు.. ఇంటర్నేషనల్ ట్రావెల్ టికెట్ల ప్రారంభ ధర రూ.6599లకు అందిస్తోంది గో ఆసియా ఎయిర్ లైన్స్. జాతీయ దినోత్సవాలను పురస్కరించుకుని మెగా సేల్స్, క్లియరెన్స్ సేల్స్ అంటూ భారీ డిస్కౌంట్లు ప్రకటించే సంస్కృతి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. అమెరికా ఇండిపెండెన్స్ డే అయిన జూలై 4 వచ్చిందంటే.. అక్కడ షాపింగ్ మాల్స్ వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఆ పాశ్చాత్య సంస్కృతి మన దేశంలోనూ మొదలైపోయింది. రిపబ్లిక్ డే షాపింగ్ డేగా మారిపోయింది. -
జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే వ్యాక్సిన్ ప్రారంభం
స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటక్ తోలిసారిగా జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం తెలిపారు. మౌలానా ఆజాద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన ఐఐఎస్ఎఫ్ ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్ విభాగంలో పాల్గొన్న కృష్ణ ముక్కుతో నేరుగా తీసుకునే ఈవ్యాక్సిన్ని రిపబ్లిక్ డే రోజున అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతేగాదు ఈ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి ఒక్కో వ్యాక్సిన్‌కి రూ. 325లకి, ప్రైవేట్ కేంద్రాలకి రూ. 800లకి విక్రయించనున్నట్లు పేర్కొంది. అలాగే ఆయన బోఫాల్‌లో జరిగి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి పశువులలో వచ్చే లంపి ప్రోవాక్ఇండ్కు సంబంధించిన వ్యాక్సిన్‌ను కూడా వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు) -
వింటేజ్ మోటార్ షో
-
అభివృద్ధి దిశగా అడుగులు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ – ఇండస్ట్రియల్ హబ్‌కు పది వేల ఎకరాల భూకేటాయింపులు – ఏర్పాటు కానున్న మరో మూడు సిమెంట్ పరిశ్రమలు – వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యం – ప్రపంచంలోనే గని, శకునాల అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు – వరి, పెసలు, మినుము సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు జిల్లా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. గురువారం 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగుర వేసి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందేశాన్ని జిల్లా ప్రజలకు వివరించారు. ఓర్వకల్లు మండలంలో రూ.25వేల కోట్ల పెట్టుబడి అంచనాలతో 10,922 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొలిమిగుండ్ల మండలంలో రూ.1200 కోట్లతో రామ్‌కో, రూ.2వేల కోట్లతో ప్రిజమ్, రూ.1400 కోట్లతో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా 5వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గని, శకునాలలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోందని, ఇది జిల్లాకే గర్వకారణమన్నారు. వరి, పెసలు, మినుము సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలించిందన్నారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఆదోని, నందికొట్కూరు ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీ విద్యార్థులకు జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించామన్నారు. ఆయన మాటల్లో మరికొన్ని అభివృద్ధి పనులు.. – నీరు-చెట్టు కార్యక్రమంలో రూ.148.69 కోట్లతో 634 చెరువుల్లో 1.50 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తొలగించాం. – ఈ ఏడాది ఏపీఎస్ఐడీసీ ద్వారా రూ.208.19 కోట్లతో 12 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించి 26,811 ఎకరాలకు సాగునీరు అందించాం. – గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద పులికనుమ, పులకుర్తి ప్రాజెక్టులను మార్చిలోపు పూర్తి చేసి 30 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం. – జిల్లాలో 22 శాతం వర్షపాతం నమోదైనప్పటికీ నీటిని సక్రమంగా వినియోగించుకొని కరువును పారద్రోలాం. వరి, పెసలు, మినుము ఉత్పతిలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. – ఈ యేడాది 1.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 51.97 కోట్ల సబ్సిడీతో అందించాం. – వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 50 శాతం రాయితీపై రూ.16 కోట్లతో 4వేల ఆధునిక వ్యవసాయ పరికరాలను అన్నదాతలకు అందించాం. పశుసంసర్ధక శాఖ ద్వారా తడకనపల్లెలో రూ.2కోట్ల ఉపాధి నిధులతో పశువుల వసతిగృహాన్ని రాష్ట్రంలోనే ప్రథమంగా నిర్మించాం. – ఓడీఎఫ్ కింద 76 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జనరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాం. – గ్రామాల్లో రూ.76 కోట్లతో 365 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశాం. – నిరాశ, నిస్పృహ, నిరాదరణకు గురైన మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆలూరు, ఆస్పరి మండల్లాల్లో జీన్స్ క్లస్టర్లు, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జూట్ బ్యాగు క్లస్టర్లను ప్రారంభించి వారికి వెన్నుదన్నుగా నిలిచాం. – గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా సింగిల్ విండో స్కీం కింద రూ.74.43 లక్షలతో 217 గ్రామాల్లో రక్షిత తాగునీటి పథకాలను మెరుగుపరిచాం. – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 14,800 గృహాలను మంజూరు చేశాం. – నగరపాలక సంస్థ పరిధిలో రూ.280.87 కోట్లతో 765 పనులు మంజూరు చేశాం. – పెద్దాసుపత్రిలో గుండె శస్త్ర చికిత్సలకు సంబంధించి రూ.7కోట్లతో కార్డియాక్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించి 30 బైపాస్ శస్త్ర చికిత్సలను నిర్వహించాం. – రెవెన్యూశాఖ ద్వారా మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని చేపట్టి భూ తగాదాలు, క్రయ విక్రయాల్లో వివాదాలు, 513 అంగన్వాడీ సొంత భవనాల నిర్మాణానికి రూ.36కోట్లు మంజూరు చేశాం. – 2014–15 సంవత్సరంలో రూ.93 కోట్లతో 230 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డును పూర్తి చేశాం. – ఈ ఆర్థిక సంవత్సరం 460 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.162 కోట్లతో 400 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేశాం. కార్యక్రమంలో జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, ఎంపీలు బుట్టా రేణుక, టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, డీఐజీ రమణకుమార్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ పాల్గొన్నారు. -
అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్లున్నా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.. పేదల పక్షపాతిగా మన్ననలు అందుకుంటోంది బడ్జెట్లో సంక్షేమానికే రూ.40 వేల కోట్లు వెచ్చిస్తోంది 2018నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్ లభ్యత ఈ ఏడాది చివర్లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో విడత టీ-హబ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శక పరిపాలన అందించడానికి శాయశక్తులా కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఎజెండా పేదల పక్షపాతిగా మన్ననలు అందుకుంటోందని ప్రశంసించారు. గడచిన 19 నెలల్లో ప్రజల అవసరాలు, ప్రాథమ్యాలు గుర్తించడంలో సఫలమైన ప్రభుత్వం.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. ‘ప్రియమైన రాష్ట్ర ప్రజలందరికీ..’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. ‘భూగర్భమున గనులు.. పొంగిపారే నదులు.. శృంగార వనతతుల సింగారముల పంట.. నా తల్లి తెలంగాణ రా.. వెలలేని నందనోద్యానమ్మురా!’ అని ఓ కవి రాసిన గీతాన్ని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షిస్తూ ఆంగ్లంలో ప్రసంగించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో సవాళ్లు ఉన్నా ప్రభుత్వం అనేక రంగాల్లో ముందడుగు వేస్తోందని చెప్పారు. తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ప్రక్రియను చేపట్టిందని, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గోదావరి, కృష్ణా నదులతో తెలంగాణ భూములు తడవాలని, పచ్చని పంటలతో ఈ నేల పరవశించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వామ్యం కావాలని యువతరానికి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధన లక్ష్యంలో అహర్నిశం కృషి చేద్దామంటూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆదర్శ సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆస రా పింఛన్లు వంటి పథకాలను ప్రవేశపెట్టింది. మూడేళ్లలో రాష్ట్రంలోని ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం 1.26 లక్షల కి.మీ. పొడవున ‘వాటర్ గ్రిడ్’ నిర్మించేందుకు రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. స్థానిక సంస్థల బలోపేతానికి ‘గ్రామజ్యోతి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున రాష్ట్రంలో ఇప్పటికే 66 వేల ఇళ్లను మంజూరు చేసింది. 2015-16లో లక్షా 15 వేల కోట్ల రూపాయల బడ్జెట్లో కేవలం సంక్షేమ రంగంపైనే రూ.40 వేల కోట్లు వెచ్చిస్తోంది. మైనారిటీల సంక్షేమానికి రూ.1,100 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ.8 వేల కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.5 వేల కోట్లను కేటాయించి సంక్షేమానికి పెద్దపీట వేసింది. విద్యుదుత్పత్తి, సరఫరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు విద్యుత్ కోతలకు ముగింపు పలికాయి. 2018 నాటికి 5వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తితో సహా మొత్తం 25 వేల మెగావాట్ల విద్యుత్ లభ్యతను సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. రానున్న ఐదేళ్లలో రూ.22,500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 45,300 చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తోంది. రూ.1,31,988 కోట్ల వ్యయంతో 34 భారీ, మధ్యతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏటా నీటిపారుదల ప్రాజెక్టుపై రూ.25 వేల కోట్లను ఖర్చు చేస్తాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమ రంగం రూ.68,258 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. రూ.2,35,000 కోట్ల ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేసే లక్ష్యంతో హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాల్లో కేంద్రం సాయంతో ఐటీఐఆర్ ప్రాజెక్టును చేపట్టాం. టీ-హబ్ తొలి విడతలో భాగంగా గచ్చిబౌలిలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ‘స్టార్ట్-అప్’ ఇన్క్యూబేటర్ను ప్రారంభించాం. ఈ ఏడాది చివర్లోగా రూ.150 కోట్ల పెట్టుబడితో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో విడత టీ-హబ్ ప్రారంభిస్తాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.25,000 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టింది. 1,013 కొత్త పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చింది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం నిర్వహణతో పాటు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు, గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించి రాష్ట్రంలో సంస్కృతీ, సాంప్రదాయ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. కృష్ణా పుష్కరాలు, సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. అమరవీరులకు సీఎం నివాళి పరేడ్ గ్రౌడ్లో నిర్వహిం చిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జెండా ఆవిష్కరణకు ముందు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వేడుకల్లో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, పద్మారావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డేకు ట్విట్టర్ గిఫ్ట్!
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూగుల్ తరహాలో ట్విట్టర్ కూడా తనదైన ప్రత్యేకతను చాటుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా భారత నెటిజన్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసింది. ట్వీట్లో రిపబ్లిక్ డే హ్యాష్‌ట్యాగ్ (#RepublicDay)ను టైప్ చేయగానే మువన్నెల జెండాతో కూడిన ఎమోజి వచ్చేలా ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ రూపొందించింది. ఈ రిపబ్లిక్ డే ఎమోజిని క్లిక్ చేయగానే గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ట్వీట్లు, ఫొటోలు, ఖాతాలు, లైవ్ సమాచారం సమస్తం ట్విట్టర్లో లభిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఖాతా ద్వారా ట్విట్టర్ ఈ స్పెషల్ ఎమోజీ గురించి ప్రకటించడం గమనార్హం. తన కొత్త చిత్రం 'నీరజ' షూటింగ్ సెట్లో జాతీయ జెండా పట్టుకొని తాను దిగిన ఫొటోను సోనం ట్విట్టర్లో పెట్టింది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. దీనిని రీట్వీట్ చేస్తూ స్పెషల్ ఎమోజీ గురించి ట్విట్టర్ ప్రకటించింది. While we look up to salute the Indian flag, here's to remembering our unsung heroes! #RepublicDay #Neerja pic.twitter.com/wSdB0yxdYw — Sonam Kapoor (@sonamakapoor) January 25, 2016 -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే స్వైన్‌ఫ్లూ: పొన్నాల
హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ ప్రబలిందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గాంధీ భవన్లో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవానికి హాజరైన పొన్నాల పైవిధంగా స్పందించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారు పాలనతో దేశంలో రాజ్యంగా స్ఫూర్తి, లౌకికవాదం పూర్తిగా దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రం విషయానికొస్తే టీఆర్ఎస్ పాలన కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టేలా ఉందంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ టీఆర్ఎస్ ప్రజాప్రయోజనాలను విస్మరిస్తోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాకే పెద్దపీట వేస్తూ ఆందోళన తెలంగాణగా మార్చిందని ఆయన మండిపడ్డారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా స్వైన్‌ఫ్లూ సాకుతో దళిత మంత్రిని బలిపశువును చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని స్వైన్‌ఫ్లూ ని అరికట్టగలిగిందని పొన్నాల సమర్థించుకున్నారు. -
మేం భద్రత కల్పించగలం!
ఒబామా పర్యటనపై అమెరికాకు భారత్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరవుతున్న దృష్ట్యా.. ఆ రోజు పరేడ్ జరిగే ఢిల్లీలోని రాజ్‌పథ్ చుట్టుపక్కల ఉన్న భవనాల పైన తమ దేశ సాయుధులే(స్నైపర్స్) పహారా ఉంటారన్న అమెరికా ప్రతిపాదనను భారత్ తోసిపుచ్చింది. మరో ఐదు రోజుల్లో ఒబామా భారత్‌లో అడుగిడుతుండటంతో.. ఆయన పర్యటన సమయంలో చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఇరుదేశాల అధికారులు సంప్రదింపులను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా అమెరికా సీక్రెట్ సర్వీసెస్ అధికారులు భారతీయ అధికారులకు పై స్నైపర్ ప్రతిపాదన చేశారని, దాన్ని భారతీయ అధికారులు తిరస్కరించారని భద్రతా ఏర్పాట్లలో భాగస్వామి అయిన అధికారి వెల్లడించారు. భారతీయ భద్రతాధికారులు సుశిక్షితులని, ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతావలయం గల ఒబామాకు రక్షణ కల్పించగల శక్తియుక్తులున్నవారని, ఒబామాకు భద్రత విషయంలో అమెరికా అధికారుల జోక్యం అవసరం లేదని వివరించారన్నారు. భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నేత తదితర ప్రముఖులు కూడా హాజరవుతున్నందువల్ల భద్రత ఏర్పాట్లను వేరేవారికి అప్పగించలేమని తేల్చిచెప్పారన్నారు. వేడుకలు జరిగే ప్రాంతాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలన్న అమెరికా విజ్ఞప్తిని కూడా భారత్ తోసిపుచ్చింది. ‘బీస్ట్’లోనా?.. ‘లైమో’లోనా?.. గణతంత్ర వేడుకలు జరిగే వేదిక వద్దకు ఒబామా ఏ వాహనంలో రావాలనే విషయంపై కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ప్రత్యేకంగా తన అత్యంత భద్రతాయుత వాహనం ‘బీస్ట్’లో ఒబామా వేదిక వద్దకు వస్తారని అమెరికా ఒత్తిడి తెచ్చింది. సాధారణంగా ముఖ్య అతిథి రాష్ట్రపతితో కలిసి వేదిక వద్దకు రావడం సంప్రదాయం. ఒకవేళ భారత రాష్ట్రపతి వచ్చే బుల్లెట్‌ప్రూఫ్ వాహనం లైమోజిన్లో ప్రణబ్‌తో కలసి ఒబామా వేదిక వద్దకు వస్తే.. విదేశంలో సొంత వాహనం ‘బీస్ట్’లో ప్రయాణించని తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలుస్తారు. అలాగే, భారత్‌లో ఒబామా ప్రయాణించేందుకు మూడు మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, వాటిలో ఆ సమయంలో మరే భారతీయ వీఐపీ ప్రయాణించకూడదని అమెరికా కోరింది. భారత్ దీన్ని తోసిపుచ్చింది. ఒబామా ప్రయాణించే మార్గంలోనే భారత రాష్ట్రపతి, ప్రధాని తదితర వీఐపీలు ప్రయాణిస్తారని తెలిపింది.