రిపబ్లిక్ డేకు ట్విట్టర్ గిఫ్ట్‌! | Twitter introduces special RepublicDay emoji | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్ డేకు ట్విట్టర్ గిఫ్ట్‌!

Published Tue, Jan 26 2016 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

రిపబ్లిక్ డేకు ట్విట్టర్ గిఫ్ట్‌!

రిపబ్లిక్ డేకు ట్విట్టర్ గిఫ్ట్‌!

న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూగుల్ తరహాలో ట్విట్టర్‌ కూడా తనదైన ప్రత్యేకతను చాటుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా భారత నెటిజన్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసింది. ట్వీట్‌లో రిపబ్లిక్ డే హ్యాష్‌ట్యాగ్ (#RepublicDay)ను టైప్‌ చేయగానే మువన్నెల జెండాతో కూడిన ఎమోజి వచ్చేలా ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ రూపొందించింది. ఈ రిపబ్లిక్ డే ఎమోజిని క్లిక్ చేయగానే గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ట్వీట్లు, ఫొటోలు, ఖాతాలు, లైవ్ సమాచారం సమస్తం ట్విట్టర్‌లో లభిస్తుంది.

బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ ఖాతా ద్వారా ట్విట్టర్ ఈ స్పెషల్ ఎమోజీ గురించి ప్రకటించడం గమనార్హం. తన కొత్త చిత్రం 'నీరజ' షూటింగ్‌ సెట్‌లో జాతీయ జెండా పట్టుకొని తాను దిగిన ఫొటోను సోనం ట్విట్టర్‌లో పెట్టింది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. దీనిని రీట్వీట్ చేస్తూ స్పెషల్ ఎమోజీ గురించి  ట్విట్టర్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement