Reservation for women
-
47% కొలువులు మహిళలకే
సాక్షి, హైదరాబాద్: గడిచిన మూడు నెలల్లో మొత్తం 28,942 కొలువులను భర్తీ చేయగా, అందులో 13,571 (47 శాతం) కొలువులను మహిళలు, 15,371 (51 శాతం) ఉద్యోగాలను పురుషులు దక్కించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్గా అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.3 జారీ చేయగా, దీనితో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు, పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోటా మాత్రమే ఉన్నా, వారు ఏకంగా 47 శాతం ఉద్యోగాలను దక్కించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాల మేరకు 2022 లోనే రాష్ట్ర ప్రభుత్వం 7593 మెమో జారీ చేసిందని, దాని ఆధారంగానే ప్రభుత్వం ఇటీవల జీవో నం. 3 జారీ చేసిందని అధికారవర్గాలు తెలిపాయి. -
ఇంతింతై.. ఆకాశమంతై..
సాక్షి, అమరావతి: ‘నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారు.. అన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు.. అన్నది ప్రశ్న.’ ప్రముఖ రచయిత్రి, తత్వవేత్త అయిన్ రైన్డ్ చెప్పిన ఈ మాటలకు అర్థం ఈ రోజు మన రాష్ట్రంలో కళ్లెదుటే కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ కన్పిస్తున్న ఆత్మవిశ్వాసమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి రచించిన ప్రణాళికను 58 నెలలుగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో సింహభాగం వాటా ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారత సాధించారు. అదే ఒరవడిలో అమ్మ ఒడి, ఆసరా, చేయూత వంటి పథకాల అమలుతో తరుణీమణులకు చేయూతనిచ్చి ఆర్థిక సాధికారత సాధించారు. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా విద్యా సాధికారత, మహిళా సాధికారతకు బాటలు వేశారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహిళలు సాధికారత సాధించారు. మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా.. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ ఛైర్ పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. హోం, వైద్యారోగ్య, మహిళా శిశుసంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించారు. మహిళా రాజకీయ సాధికారతలో మనమే నంబర్ వన్ ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకేనేమో.. స్త్రీవాద రచయిత చలం తన రచనల్లో.. ‘స్త్రీకి శరీరం ఉంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి.. మెదడు ఉంది.. జ్ఞానం ఇవ్వాలి.. హృదయం ఉంది.. అనుభవం ఇవ్వాలి..’ అని ఉన్నతంగా చెప్పారు. ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె.. ముద్దారగ నేర్పించినన్..’ అన్నారో కవి. ఆచరణకొచ్చేసరికి అతివల మాటకు విలువిచ్చే నేతలెందరుంటారు? వారికి సమున్నతంగా రాజకీయ పదవులు ఇచ్చి గౌరవించే నాయకులు ఎందరుంటారు? మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ‘నేనున్నా..’ అని మహిళాలోకాన్ని అన్నింటా ముందు వరుసలో నిలిపి, ఊహలకు ఆచరణ రూపమిచ్చిన ధైర్యశాలి. అచ్చమైన మహిళా పక్షపాతి. కందుకూరి, గురజాడల ఆదర్శబాటసారి. చరిత్రాత్మక చట్టం చేసి మరీ పదవులు నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో 50 శాతం ఇంతులకు ఇచ్చేలా సీఎం జగన్ ఏకంగా చట్టం చేశారు. దేశ చరిత్రలో నామినేషన్ పదవుల్లో, పనుల్లో 50 శాతం నారీమణులకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ న్యాయం చేయడం ఇదే తొలిసారి. ఆ చట్టంలో పేర్కొన్న దాని కంటే నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు పడతులకే ఇచ్చారు. మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో 586 ప్రమద లోకానికే ఇచ్చారు. రాష్ట్రంలో 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పోస్టుల్లో 102 మహిళలకే ఇచ్చారు. 1,356 రాజకీయ నియామకాల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం తరుణీమణులకే కేటాయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంమంత్రిగా నియమించిన సీఎం వైఎస్ జగన్ ► రాష్ట్రంలో 13 జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో ఏడుగురు (54 శాతం) మహిళలకు అవకాశం ఇచ్చారు. ► 26 జడ్పీ వై‹స్ చైర్పర్సన్లలో 15 మంది (58 శాతం) మహిళలకు పదవీయోగం కల్పించారు. ► 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం మహిళలకు ఇచ్చారు. ► మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో 671 మంది కార్పొరేటర్లు ఉంటే.. అతివలకే 54 శాతం అంటే 361 పదవులు దక్కాయి. ► 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది.. అంటే 64 శాతం మహిళలే ఛైర్ పర్సన్లు. ► ఈ మున్సిపాల్టీల్లోని 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది.. అంటే 55 శాతం ప్రమదలకే దక్కేట్లు చేశారు. ► సర్పంచి పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండలాధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం ముదితలే ఎన్నికయ్యారు. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన దాదాపు 2.65 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం వనితలనే నియమించారు. ఇంకా దాదాపు 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో.. 51 శాతం మహిళలే ఉన్నారు. -
ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: చట్ట సభలు, నామినేటెడ్ పదవుల్లోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని గురువారం.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశంపై సభలో మాట్లాడారు. 1962 లోక్‌సభ ఎన్నికల్లో 46.7 శాతం మంది మహిళా ఓటర్లు పాల్గొనగా, 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి అది 67.18 శాతానికి పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా రాజకీయాల్లో గానీ, చట్టసభల్లో గానీ మహిళల ప్రాతినిధ్యం పెరగలేదని పేర్కొన్నారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సేకరించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జాతీయ పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం విషయంలో భారతదేశం చాలా దిగువన ఉండిపోయిందన్నారు. 1998లో 95వ స్థానంలో ఉన్న భారతదేశం 2021 నాటికి 148వ స్థానానికి పడిపోయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో 60 శాతం మంది మహిళలకు మేయర్, చైర్పర్సన్ పదవులు దక్కడం మహిళా ప్రాతినిధ్యం దిశగా వేసిన ముందడగుగా ఆయన అభివర్ణించారు. మొత్తం 86 ఉన్నత పదవుల్లో 52 మహిళలే దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదో రికార్డు. మహిళా సాధికారిత దిశగా, పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి ఇది ప్రబల తార్కాణమని విజయసాయి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్షా 50 వేల పంచాయతీల్లో 50 శాతం పైగా అంటే 78 వేల పదవులను మహిళలే అలంకరించారు. మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడానికి రిజర్వేషన్లు ఎంత అవసరమో దీనినిబట్టి స్పష్టం అవుతోంది. కాబట్టి అన్ని నామినేటెడ్ పోస్టులు, చట్ట సభలలో మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వ్ చేస్తూ చట్టం తీసుకురావలసిన ఆవశ్యకత ఉంది. ఈ దిశగా చట్టం రూపకల్పనకు కృషి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. చదవండి: ఉయ్యాలవాడ’ పేరుతో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు: సీఎం జగన్ హోదా వద్దు అన్నది చంద్రబాబే -
రిజర్వేషన్ల రగడ
బోథ్: పంచాయతీ రిజర్వేషన్లు కుదించడంపై బీసీ సామాజిక వర్గాల్లో అసంతృప్తి రాజుకుంటోంది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 60.19శాతం రిజర్వేషన్లు అమలు కాగా.. ప్రస్తుతం 50 శాతం మించవద్దంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం 50 శాతానికి రిజర్వేషన్లను పరిమితం చేసేందుకు వారం క్రితం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రాతిపాదికన రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 60 శాతంగా చట్టం చేశారు. న్యాయపరంగా చిక్కులు వస్తాయని భావించిన ప్రభుత్వం చట్టంలో మార్పు చేస్తూ 50 శాతానికి కుదించి ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో బీసీలకు 34గా ఉన్న రిజర్వేషన్లు 22.79 శాతానికి తగ్గించారు. ఈ లెక్కన బీసీలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు తక్కువగా వచ్చాయి. దీంతో బీసీ సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ బీసీలను అణగదొక్కడమేనని వారు పేర్కొంటున్నారు. పంచాయతీలు పెరిగినా..తగ్గిన బీసీ రిజర్వేషన్లు ఆదిలాబాద్ జిల్లాలో గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బీసీలకు కేటాయించిన పంచాయతీ స్థానాలు తగ్గాయి. ఇది శాతాల పరంగా చూస్తే 11.21గా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు జిల్లాలో 243 పంచాయతీలు ఉండేవి. ఆ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 60.19 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 20.46, ఎస్టీలకు 5.73 శాతం పంచాయతీలను రిజర్వ్ చేశారు. దీంతో ఎస్టీలకు ఏజెన్సీ ప్రాంతాలు, వంద శాతం ఎస్టీ ప్రాంతాలు, 5.73 శాతం రిజర్వేషన్లను కలుపుకుని గత ఎన్నికల్లో 148 పంచాయతీలు కేటాయించారు. ఎస్సీలకు 20.46 శాతంతో 16 పంచాయతీలు, బీసీలకు 34 శాతానికి 34 సీట్లు కేటాయించారు. మిగిలిన స్థానాలు 45 జనరల్ కేటగిరీగా కేటాయించారు. కాగా 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గతేడాది 500 జనాభా కలిగిన ప్రతీ తండా, గూడేంను నూతన పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో 243గా ఉన్న పంచాయతీలు 467 అయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీ చట్టంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించింది. 50 శాతం రిజర్వేషన్లు దాటరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్డినెన్స్ ద్వారా బీసీల రిజర్వేషన్లను 22.79 శాతానికి తగ్గించింది. దీంతో 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 243 పంచాయతీల్లో 34 పంచాయతీలు కేటాయించగా, ప్రస్తుతం 467 పంచాయతీల్లో బీసీలకు 47 పంచాయతీలు కేటాయించారు. స్థానాలు పెరిగినా పంచాయతీలతో పోలిస్తే మరో 11 శాతం పంచాయతీలు బీసీలకు అదనంగా రావాల్సి ఉంది. ప్రస్తుతం జరగనున్న ఎన్నికలో ఎస్టీలకు 322, ఎస్సీలకు 25, బీసీలకు 47, ఆన్ రిజర్వ్డ్ 103 రిజర్వేషన్లను కేటాయించారు. ఆందోళనబాటలో బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాక జరుగుతున్న ఎన్నికలు కావడంతో టీఆర్ఎస్ వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు కచ్చితంగా సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పినా రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాలేదు. దీంతో బీసీ సంఘాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను ప్రభుత్వం విస్మరించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వ తీరును ఎండగట్టుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర బీసీ మహాజన సంఘం నేతలు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. -
ఆమెకు ఎదురులేదు!
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని విషయాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈ పనులు పురుషులు మాత్రమే చేయగలరనే భావనను చెరిపేస్తూ.. అవకాశమిస్తే తాము దూసుకుపోతామని నిరూపిస్తున్నారు. అవనిలోనే కాదు.. అంతరిక్షంలోనూ ‘ఆమె’ ఎదురులేదని నిరూపిస్తోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో రాజకీయాల్లోనూ వీరి ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఇటీవల ముగిసిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వీరి సంఖ్య అమాంతం పెరిగిపోవడమే అందుకు నిదర్శనం. 2006కు ముందు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండటంతో జిల్లాలోని 53 జెడ్పీటీసీ స్థానాల్లో 17 స్థానాలను మహిళలు కైవసం చేసుకున్నారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు.. బీసీలు ఏడుగురు.. అన్ రిజర్వు కింద ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రిజర్వేషన్ 50 శాతానికి చేరుకున్న నేపథ్యంలో 27 మంది మహిళలు జెడ్పీటీసీ స్థానాల్లో పాగా వేశారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలు 1, ఎస్సీలు 5, బీసీలు 11, అన్ రిజర్వు కింద 10 స్థానాలను మహిళలకే కేటాయించారు. గత నెల 6, 11 తేదీల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఈ స్థానాల్లో మహిళలు విజయఢంకా మోగించారు. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 14 మంది మహిళలు.. టీడీపీ తరఫున 11, కాంగ్రెస్ తరఫున 1, ఆర్పీసీ తరఫున ఒకరు జెడ్పీ పాలనలో భాగస్వాములు కానుండటం విశేషం. టీడీపీ మహిళా జెడ్పీటీసీలు వి.సరస్వతి(కల్లూరు), ఎం.లక్ష్మిదేవి(క్రిష్ణగిరి), పి.జగదీశ్వరమ్మ(గోస్పాడు), నారాయణమ్మ(పాణ్యం), వెంకటలక్ష్మమ్మ(రుద్రవరం), పి.సుశీలమ్మ(ఆస్పరి), సరస్వతి(దేవనకొండ), లక్ష్మి(కౌతాళం), పుష్పావతి(నందవరం), ఈ.సుకన్య (పత్తికొండ), కె.వరలక్ష్మి(తుగ్గలి). కాంగ్రెస్, ఆర్పీఎస్ మహిళా జెడ్పీటీసీలు జి.శారదమ్మ(కోడుమూరు), రాధమ్మ(పగిడ్యాల). వైఎస్సార్సీపీ మహిళా జెడ్పీటీసీలు ఎం.పద్మావతమ్మ(బేతంచెర్ల), బి.కె.నాగజ్యోతి(గూడూరు), ఎం.కె.మాధవి(కర్నూలు), చింతకుంట లక్ష్మి(నందికొట్కూరు), బి.అశ్వర్థమ్మ(బండిఆత్మకూరు), టి.నాగమ్మ(చాగలమర్రి), వై.సరస్వతి(కొలిమిగుండ్ల), ఎం.లక్ష్మిదేవి(నంద్యాల), గోపిరెడ్డి సుభద్రమ్మ(ఉయ్యాలవాడ), రాములమ్మ(గోనెగండ్ల), కె.గంగమ్మ (హొళగుంద), దళవాయి మంగమ్మ(కోసిగి), రేణుకాదేవి(పెద్దకడుబూరు), జయమ్మ(ఎమ్మిగనూరు).