Respiratory failure
-
కరోనా మరణాలను దాచేందుకు చైనా కొత్త ఎత్తుగడ
బీజింగ్: ప్రజాగ్రహంతో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది చైనా. ఈ క్రమంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రానున్న 3 నెలల్లో దేశంలోని 60 శాతం మంది వైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈక్రమంలో కోవిడ్ ద్వారా సంభవించే మరణాలను దాచిపెట్టేందుకు డ్రాగన్ దేశం కొత్త ఎత్తుగడ వేసింది. శ్వాసకోశ అవయవాల వైఫల్యంతో మరణించిన వారినే అధికారికంగా కోవిడ్ మరణాలుగా పరిగణిస్తామని మంగళవారం ప్రకటించింది. ఆంక్షల సడలింపు తర్వాత మంగళవారం అత్యధికంగా 5 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అది అధికారిక లెక్కప్రకారమే. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య శాఖ ప్రకారం చైనాలోని ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్ వేరియంట్లు బీఏ.5.2, బీఎఫ్.7లు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ఈ ప్రకటన చేసింది. కేవలం శ్వాసకోశ సంబంధిత అవయవాల వైఫల్యంతో మరణించిన వారినే అధికారికంగా లెక్కల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ఏ విధంగా లెక్కిస్తామనే అంశాలపై నోటీసులు జారీ చేసింది. సైంటిఫిక్, రియలిస్టిక్ పద్ధతిలో ఆ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో కరోనా సోకిన తర్వాత గుండెపోటు, ఇతర వ్యాధులతో మరణించిన వారిని లెక్కల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక -
ముక్కులో కండ.. తగ్గుతుందా..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 28 సంవత్సరాలు. నాకు గత కొంతకాలంగా ముక్కులో కండమాదిరి పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుండడంతో డాక్టర్ని సంప్రదించాను. వారు వాటిని నాజల్ పాలిప్స్‌గా నిర్ధారించి, కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడుతున్నాను కానీ పూర్తి ఉపశమనం లభించడం లేదు. . హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే చెప్పగలరు. - నాగేంద్రకుమార్, కడప నాజల్ పాలిప్స్ అనేది దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సమస్య. చల్లని వాతావరణం ఏర్పడితే ఈ వ్యాధితో బాధపడేవారు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ తిరగబెట్టొచ్చు. మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా మీ సమస్య పూర్తిగా నయం అవుతుంది. ముక్కు, సైనస్లలో ఏర్పడే మృదువైన కండ కలిగిన వాపును నాజల్ పాలిప్స్ అంటారు. ఇది ముక్కు రెండు రంధ్రాలలోనూ, సైనస్‌లలోనూ ఏర్పడతాయి. ఏ వయస్సు వారైనా ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. కానీ యుక్త, మధ్యవయస్సు కలిగిన వారిలో, స్త్రీలలో కంటే 2-4 రెట్లు పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ముక్కు లోపలిభాగం, సైనస్‌లు ఒకవిధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పి ఉంటాయి. ఈ పొర ఒకవిధమైన పల్చటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కునూ, సైనస్లనూ తేమగా ఉంచుతూ ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన దుమ్మూధూళీ ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల లాంటి వాటి సాయంతో గొంతులోకి, ముక్కులోకీ చేర్చి తద్వారా బయటకు పంపేస్తుంటుంది. ఈ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా శోధకు గురయితే అది వాచి గురుత్వాకర్షణ వలన కిందకు వేలాడటం మూలాన పాలిప్స్ ఏర్పడతాయి. ఇవి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలుస్తాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కారణాలు: ఈ సమస్యకి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు కానీ తర చు ఇన్ఫెక్షన్కు గురికావడం, ఆస్తమా, దీర్ఘకాలికంగా సైనసైటిస్‌కు గురికావడం, అలర్జిక్ రైనైటిస్, ఆస్ప్రిన్ లాంటి మందులకు సున్నితత్వం కలిగి ఉండటం, వంశపారంపర్యత వంటి అంశాలు మాత్రం ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయని చెప్పొచ్చు. లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం తద్వారా నోటిద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఈ సమస్య వల్ల రాత్రిళ్లు నిద్రలో కొంత సమయం ఊపిరి ఆడకపోవడం వల్ల నిద్రసరిగా పట్టకపోవడం, గురక, వాసన, రుచిని గ్రహించే శక్తి మందగించటం, తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం, కళ్లలో దురద వంటివి. చికిత్స: హోమియోలో అందించే అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురయిన రోగనిరోధక శక్తిని సరిచేస్తారు. తద్వారా నాజల్ పాలిప్స్ సమస్య పూర్తిగా న యం అవుతుంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, సీఎండ్‌డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
శ్వాసకోశ వ్యాధితోనే బన్నప్ప మృతి!
పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడి విస్రా నివేదిక వస్తేనే.. పూర్తి వివరాలు పోలీసు బలగాల నడుమ బన్నప్ప అంత్యక్రియలు బస్తీలోనే మకాం వేసిన మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న బాధిత కుటుంబానికి జస్టిస్ చంద్రకుమార్ పరామర్శ హైదరాబాద్: మారేడ్‌పల్లి ఠాణాపై దాడి ఘటనకు సంబంధించిన కేసులో మృతుడు బన్నప్ప(35) శ్వాసకోశ సమస్యతోనే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. బన్నప్ప మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో ప్రొఫెసర్ రమణమూర్తి ఆధ్వర్యంలో మారేడుపల్లి ఎమ్మార్వో సైదులు సమక్షంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరిపారు. మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న బస్తీలోనే మకాం వేసి ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ముగిసిన వెంటనే బన్నప్ప మృతదేహాన్ని వాల్మీకినగర్‌కు తీసుకురాగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బన్నప్ప కుటుంబ సభ్యు లు నేతలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్వాసకోశ సమస్యతోనే..: శ్వాసకోశ సమస్యతోనే బన్నప్ప మృతిచెందినట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మృతుని ఒంటిపై, అంతర్గతంగా ఎటువంటి గాయాలు లేవని, ఎడమకాలుకు గీరుకున్న గాయమే ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలి సింది. మృతుని కడుపులో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, పడుకున్నప్పుడు వాంతులు కావడంతో, ఆహారం శ్వాసకోశ నాళానికి అడ్డుపడి ఉండొచ్చని, దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి బన్నప్ప మృతిచెంది ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. విస్రా నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడి కావచ్చన్నారు. ఇద్దరు ఎస్సైలపై వేటు: బన్నప్ప మృతికి కారణమైన ఇద్దరు ఎస్ఐలపై ఉన్నతాధికారులు వేటువేశారు. ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకున్న ఎస్సైలు బాధ్యతారహితంగా వ్యవహరించారని పేర్కొంటూ ఎస్సై రవికుమార్, మధులను హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. సోమవారం రాత్రి ఠాణాపై బన్నప్ప బంధువుల దాడి అనంతరం నగర పోలీస్ కమి షనర్ మహేందర్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. దాడి ఘటనపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై సోమవారం రాత్రి దాడికి పాల్పడి కీలకమైన ఫైళ్లతోపాటు పోలీస్‌స్టేషన్ ధ్వంసానికి పాల్పడిన వారిపై మొత్తం 4 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి, విధ్వంసంలో సుమారు 100 మంది పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ దగ్గరున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడి ఘటనపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌బాబు పోలీస్‌స్టేషన్ లోపల ధ్వంసమైన కంప్యూటర్లు, రికార్డులను పరిశీలించారు. జస్టిస్ చంద్రకుమార్ పరామర్శ బన్నప్ప కుటుంబ సభ్యులను మంగళవారం జస్టిస్ చంద్రకుమార్ పరామర్శించి మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మనుషులను కొట్టడం చట్ట వ్యతిరేకమని, ప్రజలు కూడా దాడులకు పాల్పడటం తగదన్నారు. ఆలిండియా లాయర్ల సంఘం విచారణ బన్నప్ప మృతి, స్టేషన్‌పై దాడికి సంబంధించిన వివరాల్ని ఆలిండియా న్యాయవాదుల సంఘం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో పార్థసారథి, శివకుమార్, పాశం యాదగిరి, మాధవరెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.