rest house
-
ఇక రోడ్డు పక్కనే రెస్ట్ హౌస్
జాతీయ రహదారులపై ప్రయాణించేవారు బడలిక తీర్చుకునేందుకు కాసేపు సేదదీరాల్సి వస్తుంది. భోజనం, టిఫిన్లు చేసేందుకు రెస్టారెంట్స్ వద్ద ఆగాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించేవారు చార్జింగ్ చేసుకునేందుకు వేచి ఉండక తప్పదు. రాత్రివేళ డ్రైవర్లకు నిద్ర ఆవహిస్తుంటే ఓ కునుకు తీసేందుకు సురక్షితమైన ప్రదేశం ఏదన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ అవసరాలు తీర్చే ప్రదేశాలు వేర్వేరు ప్రదేశాల్లో కాకుండా ఒకేచోట అందుబాటులో ఉంటే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా.. సురక్షితంగా ఉంటుంది. అందుకోసమే ‘వే సైడ్ ఎమినిటీస్’ (డబ్ల్యూఎస్‌ఏ)లు నిర్మించాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ‘వే సైడ్ ఎమినిటీస్’ను నిర్మించే ప్రణాళికకు ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. – సాక్షి, అమరావతిఅన్ని వసతులూ ఒకేచోట..దేశంలో హైవేల వెంబడి రెస్ట్హౌస్ల తరహాలో నిర్మించే ‘వే సైడ్ ఎమినిటీస్’లలో ప్రయాణికులు సేదతీరేందుకు అన్ని వసతులు ఒకేచోట ఉండేలా చూస్తారు. ఇప్పటివరకు హైవేల నిర్మాణంతోపాటే ఎంపిక చేసిన ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా ‘పార్కింగ్ బే’లను నిర్మిస్తున్నారు. ఆ ప్రదేశంలో లారీలు, ఇతర వాహనాలను నిలిపేందుకు మాత్రమే అవకాశం ఉంది. కానీ.. డ్రైవర్లు, ప్రయాణికులకు విశ్రాంతి, భోజనం, ఆహ్లాదం, నిద్రించేందుకు ఎటువంటి వసతులు ఉండటం లేదు. భోజనం, టిఫిన్లు చేసేందుకు ఎక్కువగా ప్రైవేటు దాబాల వద్ద వాహనాలను నిలుపుతున్నారు. కానీ.. విశ్రాంతి తీసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. ప్రధానంగా రాత్రి వేళల్లో ప్రయాణికుల భద్రతపై భరోసా ఉండటం లేదు. దాంతో అప్పటికే అలసిపోయినప్పటికీ, అర్ధరాత్రి అయినప్పటికీ వాహన ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఈ అనివార్య పరిస్థితి రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తోంది. దీనికి పరిష్కారంగానే ప్రయాణికులకు అన్ని వసతులతో కూడిన ‘వే సైడ్ ఎమినిటీస్’ నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. వాటిలో రెస్టారెంట్లు, డార్మెటరీలు, పిల్లల ఆట స్థలాలు, పెట్రోల్ బంక్‌లు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, ఏటీఎంలు వంటి అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తారు.రాష్ట్రంలో తొలి దశలో 75 నిర్మాణందేశవ్యాప్తంగా హైవేలపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ‘వే సైడ్ ఎమినిటీ’ నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. తొలి దశలో దేశంలో 1,000 చోట్ల వీటి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. హైవే నిర్మాణ కాంట్రాక్టులో భాగంగా కాకుండా ప్రత్యేకంగా వే సైడ్ ఎమినిటీస్ నిర్మిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఒక్కొక్కటి సగటున రూ.10 కోట్ల చొప్పున మొత్తం మీద రూ.10 వేల కోట్లతో నిర్మించాలన్నది ప్రణాళిక. పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో వాటిని నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 8,683 కిలోమీటర్ల మేర హైవేలు ఉన్నాయి. ఏపీలో 75 ‘వే సైడ్ ఎమినిటీస్’ నిర్మించనున్నారు. కాగా.. వాటిలో అత్యంత ప్రధానమైనది కోల్‌కతా–చెన్నై హైవే రాష్ట్రంలో 1,025 కి.మీ. పొడవున ఉంది. మొదటి దశలో కోల్‌కతా–చెన్నై హైవే వెంబడి 25 నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం ఎన్హెచ్ఏఐ త్వరలోనే నిర్ణీత ప్రదేశాలను ఎంపిక చేయడంతోపాటు టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది. రానున్న మూడేళ్లలో వాటిని నిర్మించాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా నిర్ణయించింది.దేశంలో వే సైడ్ ఎమినిటీలు ఇలా..ఎక్కడ: ప్రతి 50 కి.మీ.కు 1ఎన్ని చోట్ల: 1,000ఒక్కోదానికి అయ్యే వ్యయం: రూ.10 కోట్లుమొత్తం వ్యయం: రూ.10,000 కోట్లుఆంధ్రప్రదేశ్లో మొత్తం హైవేలు: 8,683 కి.మీ ఏపీలో నిర్మించనున్న వే సైడ్ ఎమినిటీలు: 75మొదటి దశలో నిర్మించేవి: 25ఎన్నేళ్లల్లో నిర్మిస్తారు: 3 -
మహాత్మా మన్నించు..
దేశమంతటా తిరంగా ఉత్సవాల్లో మునిగితేలుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిని నడిపించి అహింసా విధానంలో స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన గాంధీజీకి జేజేలు పలుకుతున్నాం. కానీ ఆయన విశ్రమించిన భవనాల బాగోగులూ ఎవరికీ పట్టడం లేదు. తుమకూరు: జాతి పిత మహాత్మా గాంధీ నడయాడిన స్థలాలు ఎంతో పేరుపొంది నేడు పర్యాటక ప్రదేశాలుగా మారాయి. ఆ మహానుభావుడు బసచేసిన భవనాలు స్మారక కట్టడాలుగా పేరు పొందాయి. కానీ తుమకూరు జిల్లాలోని తిపటూరులోని ఓ కట్టడానికి ఆ భాగ్యం కలగలేదు. గాంధీజీ సేదతీరిన ఒకనాటి ఇల్లు నేడు కనీస పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. తిపటూరులోని పాత బీడిఓ కార్యాలయం ప్రస్తుతం తాలూకా పంచాయతీ ఆఫీసు వెనుక భాగంలో ఉన్న ఓ ఇల్లు ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో.. 1927 ఆగస్టు 21వ తేదీన దేశమంతటా పర్యటిస్తూ తిపటూరుకు వచ్చిన బాపూజీ ఇదే గదిలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఉన్న చేద బావి నీటిని ఉపయోగించారు. అలా ఆ భవనం చరిత్రకెక్కింది. 1915– 1948 వరకు సంఘటనలతో కూడిన డీటైల్డ్ క్రోనాలజీ అనే పుస్తకంలో కూడా నమోదు చేశారు. జయదేవ హాస్టల్ ఆవరణలో సభలో గాంధీజీ ప్రసంగిస్తూ స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ ఘన చరిత గల భవనం నేడు నిర్లక్ష్యపు చీకట్లో మగ్గుతోంది. చుట్టూ చెత్త పేరుకుపోయింది. జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. తుమకూరు కాలేజీ మైదానం గది కూడా.. అలాగే తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న మహాత్మా గాం«దీజీ స్మారక భవనం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యే పరమేశ్వర్ ఆదివారం ఆ భవనాన్ని పరిశీలించారు. 1932లో, 1937లో గాం«దీజీ పలుమార్లు తుమకూరు జిల్లాకు వచ్చారని, అప్పుడు కాలేజీ మైదానంలో ఉన్న గదిలో బస చేశారని చెప్పారు. ఆ గదిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పటికైనా సంరక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: వీడియో: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు.. ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి -
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి
సాక్షి, గజ్వేల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విశ్రాంత ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గజ్వేల్‌లో నిర్మించిన రిటైర్డ్ ఉద్యోగుల అతిథి భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచే పోటీ చేసి ముఖ్యమంత్రి కావడం గజ్వేల్ ప్రజల అదృష్టమని తెలిపారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తుందని.. వర్షాకాలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. లాక్డౌన్ కారణంగా చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వారిని దృష్టిలో ఉంచుకుని లాక్డౌన్లో సడలింపులు ఇచ్చామని పేర్కొన్నారు. 21 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని.. అందులో భాగంగా గజ్వేల్‌లో ప్రతి వీధిలో మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్ధిపేటను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్ధే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. -
జోరుగా జూదం
ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణంలో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. లక్షల్లో కరెన్సీ చేతులు మారుతోంది. స్థానికులే కాకుండా దూరప్రాంతాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లతో పట్టణంలోని హోటళ్లు జూదానికి కేంద్రాలుగా మారుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంపై పోలీసుల నిఘా పెద్దగా ఉండదన్న ధైర్యంతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. సెల్ఫోన్లతో సమాచారం అందించి ఎంపిక చేసుకున్న హోటళ్లు, లాడ్జిలు, రెస్ట్ హౌస్‌లలో యథేచ్చగా జూదం నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జూదాన్ని వ్యసనంగా మార్చుకున్న కొంత మంది బడా బాబులకు తిరుపతి నగరం సురక్షిత ప్రాంతంగా కనిపించింది. ఎందుకంటే..ఈ పట్టణానికి నిత్యం వేలాది మంది యాత్రికులు వచ్చి పోతుంటారు. హోటళ్లు, లాడ్జిలన్నీ యాత్రికులు, పర్యాటకులతో నిండి ఉంటాయి. ఇక్కడి హోటళ్లలో జూదం ఆడితే పోలీసులు పెద్దగా పట్టించుకునే వీలుండదన్నది జూదరుల భావన. దీంతో పట్టణంలోని ఒక్కో లాడ్జిని ఒక్కో రోజు ఎంపిక చేసుకుంటూ పేకాట సాగిస్తున్నారు. సరదాగా పేకాట ప్రారంభించి వ్యసనంగా చేసుకున్న వారు కొందరైతే, అదే వృత్తిగా చేసుకున్న వారు మరికొందరు ఉన్నారు. ఆరు నెలలుగా పరిశీలిస్తే...ఐదారుసార్లు పోలీసులు దాడులు చేసి రూ.20 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ జూదం ఆగలేదు. సోమవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని ఓ పేరున్న స్టార్ హోటల్‌పై దాడిచేసిన పోలీసులు 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తూ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాన్ని గుర్తిం చడం, అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేయడం, ఆటతో సంబంధం ఉన్న వారికి ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడమనే మూడు ప్రక్రియల్లో జూదం సాగుతోంది. తిరుపతిలోని కీలక హోటళ్లను వీరు ఎంపిక చేసుకుంటున్నారు. ఆరు నెలల కిందట బస్టాండ్ దగ్గర ఓ స్టార్ హోటల్లో పోలీసులు దాడిచేసి పది మందికిపైగా జూదరులను పట్టుకున్నారు. ఆ తరువాత కొర్లగుంట, లక్ష్మీపురం, బస్టాండ్ సెంటర్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో దాడులు జరిగాయి. మరి కొంతమంది జూదరులను, నిర్వాహకులనూ పోలీ సులు అరెస్టు చేశారు. రియల్ వ్యాపారులు, బిల్డర్లు, పొలిటికల్ లీడర్లు వీరిలో ఉన్నారు. ఒకప్పుడు చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో నిర్వహించే క్లబ్బుల్లో ఆడే ఆటగాళ్లు కొందరు అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో మకాం తిరుపతికి మార్చుకున్నారు. పోలీసులతో మంచి సంబంధాలు కలిగిన కొంత మంది కీలక వ్యక్తులు పేకాట స్థావరాలను మేనేజ్ చే స్తున్నారు. ఆటకింతని డబ్బు తీసి సొంతంగా నిఘా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. పోలీసులకూ తెలుసు.. ఏ రోజు ఎక్కడ జూదం నడుస్తుందో పోలీసులకూ తెలుస్తుందనీ, అయితే విషయం ఎస్పీ దాకా వెళ్లే అవకాశం ఉందని పసిగట్టినపుడే దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. చిన్నాచితకా స్థావరాలపై దాడులు జరపకుండా నెలవారీ మామూళ్లు అందుకుంటున్న పోలీసులూ ఉన్నారు. దీనివల్ల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికే విచ్చలవిడి మద్యం దుకాణాలతో కంపుకొట్టే నగరం జూదానికి కేంద్రంగా మారితే అసాంఘిక శక్తులు హెచ్చుమీరే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో నిఘా ఉంది నగరంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంది. ప్రధానంగా పేకాట స్థావరాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీనికితోడు సమర్థవంతమైన సమాచార వ్యవస్థ కూడా ఉంది. ఎవర్నీ వదలిపెట్టం. హోటళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నాం. ఇకపై ఏదైనా జరిగితే యజమానులు బాధ్యత వహిం చాల్సి ఉంటుందని చెబుతాం. – మునిరామయ్య, ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ, తిరుపతి -
భవనానికి "విశ్రాంతి"
అనంతపురం అగ్రికల్చర్ : రైతుల కోసం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్మించిన ‘రైతు విశ్రాంతి భవనం’ ప్రస్తుతం ఎందుకూ కొరవడకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు 13ఏళ్లుగా భవనం విశ్రాంతి తీసుకుంటూనే ఉంది. అందులో ఒక్కరోజు కూడా రైతులు విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవు. భవనాన్ని 15ఏళ్ల క్రితం దాదాపు రూ.10లక్షలు వెచ్చించి అధికారులు నిర్మించారు. నిర్మించిన తర్వాత రెండేళ్లు అడపాదడపా వాడారు. ఆపై సమైఖ్యాంధ్ర ఉద్యమం సమయంలో స్పెషల్ పార్టీ పోలీసులకు.. ఇతర కార్యక్రమాలకు వాడుకున్నారు. నాటి నుంచి నేటి దాకా తిరిగి ఆ భవనాన్ని రైతుల కోసం ఉపయోగించుకోలేదు. ప్రస్తుత మార్కెట్ కమిటీ పాలక వర్గం, అధికారులతో పాటు ముందున్న వారు కూడా నిర్లక్ష్యం చేయడంతో లక్షలు వెచ్చించి కట్టించిన విశ్రాంతి భవనం క్రమంగా పాడవుతోంది. విశ్రాంతి భవనం ఉందనే విషయం కూడా తెలియనంతగా పర్యవేక్షణ కొరవడటంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో శిథిలావస్థకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. కొన్నింటికి వాకిళ్లు, కిటికీలు కూడా పగులగొట్టారు. బాత్రూంలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఇక కొళాయిలు విరిగిపోయాయి. విశ్రాంతి భవనంలోపల, పరిసర ప్రాంతాల్లో మద్యం సీసాలు, ఇతరత్రా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. శని, ఆదివారం రోజుల్లో గొర్రెలు, మేకలు, పశువుల సంతలు జరగడం, ఇక రోజు వారీ పండ్ల మార్కెట్ నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు వస్తూ ఎండ, వాన, చలికి ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.