resumes
-
వోయేజర్–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్‌లో అనన్య పాండే : ఆయన కోసమే! -
స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ రెజ్యూమ్స్: ఫోటోలు చూశారా?
యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని వారు 18ఏళ్ల వయసులో ఉన్నప్పుడు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. టెక్ ప్రపంచంలో ఎవరికివారే అన్నట్టు ఎదిగిన వీరి రెజ్యూమ్స్ ఇక్కడ చూడవచ్చు.స్టీవ్ జాబ్స్ రెజ్యూమ్ ప్రకారం, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీపై మక్కువ ఉందని తెలుస్తోంది. ఇది 1973లో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో తనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉందని ప్రస్తావించారు.ఇక బిల్ గేట్స్ రెజ్యూమ్ గమనిస్తే.. ఇది 1971లో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కోబాల్ట్, బేసిక్, పీడీపీ-10, పీడీపీ-8, సీడీసీ-6400 వంటి కంప్యూటర్లతో సహా వివిధ ప్రోగ్రామింగ్ భాషలలో తనకు అనుభవం ఉన్నట్లు వెల్లడించారు. అందులోనే తన జీతం అప్పట్లో 15000 డాలర్లుగా ప్రస్తావించారు. 970లలో ఒక విద్యార్థికి ఇది చాలా ఎక్కువ శాలరీ అనే చెప్పాలి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెజ్యూమ్స్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీనిపైన కొంతమంది తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Steve Jobs and Bill Gates’ resumes at age 18: pic.twitter.com/tFTltp80jM— Jon Erlichman (@JonErlichman) August 27, 2024 -
సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: ‘సార్...ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. మా ప్రతిభ ఏంటో నిరూపిస్తాం’ అంటున్నారు పలువురు ఇన్స్పెక్టర్లు. ఈ క్రమంలోనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పోస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎలాగైతే రెజ్యూమ్‌లు సమర్పిస్తారో.. అచ్చం అలాగే పలువురు ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు ఎస్హెచ్ఓ బాధ్యతల కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అవినాశ్ మహంతి సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ఠాణాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై నిగ్గు తేలుస్తూ ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిషనరేట్‌లోని ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి. సమర్ధత, నిబద్ధతలకే ప్రాధాన్యం.. గతంలో ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓ పోస్టు పొందాలంటే మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను ఉన్నతాధికారులకు సమర్పిస్తే తప్ప.. పోస్టింగ్ వచ్చేంది కాదు. హై ప్రొఫైల్ పీఎస్ అయితే డిమాండ్ మారీ ఎక్కువగా ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతి అధికారులపై వేటు వేస్తున్నారు. సిఫారసు లేఖలతో వస్తే పోస్టింగ్ సంగతి దేవుడెరుగు.. కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కొత్త పోలీసు బాస్‌ల రాకతో ప్రతిభ, సమర్ధత, విశ్వసనీయత, నిబద్ధతలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ పోస్టింగ్ ఇస్తున్నారు. ఇటీవల శివారు ప్రాంతాల్లోని ఠాణాలకే కాకుండా ప్రధాన నగరంలో డిమాండ్ ఉన్న స్టేషన్లకు సైతం కొత్త వారిని ఎస్‌హెచ్‌ఓలుగా నియమించడమే ఇందుకు ఉదాహరణ. ఈ ఠాణాలకు తొలిసారిగా ఎస్హెచ్ఓలు.. ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం ఒక్కసారి కూడా ఎస్హెచ్ఓగా పోస్టింగ్ పొందని వారు చాలా మందే ఉన్నారు. పీఎస్‌లో రెండవ ప్రాధాన్య పోస్టు అయిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గానో, క్రైమ్ వింగ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), ఐటీ ఇతరత్రా విభాగాలలో ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజా పరిస్థితులలో వీరందరిలో ఆశలు చిగురించాయి. ఇప్పటివరకు 40–50 మంది ఇన్స్పెక్టర్లు ఎస్హెచ్ఓ పోస్టింగ్ కోసం రాతపూర్వక దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే మాదాపూర్, మెకిలా, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్, దుండిగల్, శంషాబాద్, జీడిమెట్ల ఠాణాలకు ఎస్హెచ్ఓ పోస్టింగ్ పొందిన ఇన్స్పెక్టర్లు తొలిసారి ఎస్‌హెచ్‌ఓలుగా నియమితులైనవాళ్లే. అలాగే ఆర్జీఐఏ, ఇతర కొన్ని పీఎస్‌లలో రెండవ సారి ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు నియమితులయ్యారు. త్వరలోనే గచ్చిబౌలి , రాయదుర్గం, నార్సింగి వంటి హైప్రొఫైల్ ఠాణాలకు సైతం కొత్త అధికారులు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. -
ఇలా చేస్తే జాబ్ పక్కా! ఐఐటీయన్, స్టార్టప్ ఫౌండర్ సూచన..
ఉద్యోగ సాధనలో అత్యంత కీలకమైనది రెజ్యూమ్. ఇది ఎంత ఆకట్టుకునేలా ఉంటే జాజ్ వచ్చే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. అయితే మంచి జాబ్ సాధించాలంటే ఒక్క రెజ్యూమ్ సరిపోదంటున్నారు ఐఐటీయన్, ఢిల్లీకి చెందిన స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్. విభిన్నమైన జాబ్లకు విభిన్న రెజ్యూమ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచిస్తూ.. ఢిల్లీ ఐఐటీలో ప్లేస్మెంట్ల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని, విభిన్న రెజ్యూమ్‌లతో తనకు కలిగిన ప్రయోజనాన్ని స్మార్ట్బుక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ కుమార్ ట్విటర్ ద్వారా ఉద్యోగార్థులకు తెలియజేశారు. ఇదీ చదవండి ➤ లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? ఐఐటీలో ఇంటర్న్‌షిప్, ప్లేస్మెంట్ సందర్భంగా వివిధ కంపెనీలు, జాబ్లకు విభిన్న వెర్షన్ల రెజ్యూమ్‌లను రూపొందించుకోవాలని తమకు చెప్పేవారని పేర్కొన్నారు. మీరు కన్సల్టింగ్ జాబ్లకు దరఖాస్తు చేస్తున్నట్లయితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి, అదే డెవలప్మెంట్కు సంబంధించిన జాబ్‌ల కోసమైతే మీ డెవలప్మెంట్ నైపుణ్యాలను చూపించే ప్రాజెక్ట్‌ల గురించి రెజ్యూమ్‌లలో వైవిధ్యంగా పేర్కొనాలని సూచించారు. విభిన్న రెజ్యూమ్‌లలో ప్రతి అంశమూ విభిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు. కీలకమైన అంశాన్ని విభిన్నంగా పేర్కొంటే సరిపోతుందని ఆయన సూచిస్తున్నారు. తమ ఐఐటీలో అలా విద్యార్థులకు అలా సూచించేవారని, మిగిలిన ఐఐటీలు తమ విద్యార్థులకు అలాంటి సలహా ఇచ్చాయో లేదో తనకు కచ్చితంగా తెలియదని సౌరభ్‌కుమార్ అన్నారు. కాగా సౌరభ్‌కుమార్ సూచనలతో పలువురు యూజర్లు ఏకీభవిస్తూ కామెంట్లు చేశారు. In IIT during internship/placement season we were often told to keep multiple versions of our resume Different resume for different kind of company or role you’re applying for For instance, having different resumes for different roles such as Dev based roles Quant based… — Saurabh Kumar (@drummatick) July 16, 2023 -
ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? ఈ ఐదు తప్పులు చేయకండి!
గూగుల్‌లో జాబ్ సంపాదించడమే మీ లక్ష్యమా? గూగుల్‌తో పాటు ఇతర టెక్ కంపెనీల్లో ఐసైతం జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ రెజ్యూమ్‌లో ఇలాంటి తప్పులు చేయకండి. గూగుల్ రిక్రూటర్ చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే దిగ్గజ కంపెనీల్లో జాబ్ సంపాదించడం అంత కష్టం కాదని అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా! ►మీరు కోరుకున్న డ్రీమ్ జాబ్ పొందడంలో రెజ్యూమ్ కీరోల్ ప్లే చేస్తోంది. చాలా మంది జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి సంస్థలు రెజ్యూమ్‌ను కేవలం వ్యక్తిగత వివరాల్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటారు.కానీ అందులో వాస్తవం లేదని, అభ్యర్ధి తెలివితేటలకు పరీక్ష పెడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీ రెజ్యూమ్‌ను అర్హతలకు అనుగుణంగా తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. ►ఒకవేళ మీరు గూగుల్ లేద ఇతర దిగ్గజ కంపెనీల్లొ జాబ్ కొట్టాలంటే రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకూడదని గూగుల్ రిక్రూటర్ ఒకరు టిక్‌టాక్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ►చికాగోకు చెందిన గూగుల్ సీనియర్ రిక్రూటర్ ఎరికా రివెరా టిక్ టాక్‌లో మీ రెజ్యూమ్‌ను ఆకర్షణీయంగా మార్చేలా పలు సూచనలు చేశారు.ఆ వీడియోను 2మిలియన్ల మంది యూజర్లు వీక్షించగా..ఆ వీడియోలో ఎరికా..తాను ఇప్పటి వరకు వేలాది వెబ్ సైట్లను స్క్రీనింగ్ చేసినట్లు చెప్పారు. అభ్యర్ధులు వారి రెజ్యూమ్‌లో అసందర్భమైన డేటాను పొందుపరిచినట్లు గుర్తించినట్లు తెలిపారు. అలా సందర్భం లేని ఇన్ఫర్మేషన్ రెజ్యూమ్‌లో ఉండకూడదన్నారు. ►రెజ్యూమ్‌లో అభ్యర్ధులు పూర్తి అడ్రస్‌ను చేర్చాల్సిన పనిలేదని చెప్పారు. నగరం, లేదా రాష్ట్రాన్ని మాత్రమే ప్రస్తావిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు. ►సీవీలో చేర్చగూడని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కానీ ఆ విషయం మొత్తంలో సీవీలో ప్రస్తావించకూడదు. మీరు ఏ సంస్థకి ఇంటర్వ్యూకి, ఏ రోల్ జాబ్ ఇంటర్వ్యూకి వెళుతున్నారో..ఆరోల్‌కు అనుగుణంగా రెజ్యూమ్‌ను తయారు చేసుకోవాలని సూచించారు. ►రెజ్యూమ్‌లో మీరు గతంలో పనిచేసిన సంస్థ గురించి ప్రస్తావిస్తూ..ఆ సంస్థలో సాధించిన విజయాల గురించి ఒక టీం చేసిన విధంగా చెప్పాలి. అంతే తప్పా అన్నీ నేనే చేశాను అని మాత్రం ప్రస్తావించకూడదు. ►రెజ్యూమ్‌లో సంబంధం లేకుండా రెఫరెన్స్ నేమ్స్, వారి వివరాల్ని పొందుపరుస్తుంటారు.అలాంటి విషయాలు అవసరం లేదని ఎరికా టిక్ టాక్ వీడియోలో చెప్పారు.రిక్రూటర్లకు అవసరం అయితే మిమ్మల్ని అడుగుతారని, అంతే తప్పా మీరే స్వయంగా చెప్పకూడదని అన్నారు. -
‘నెపా’ మళ్లీ షురూ: ఉద్యోగాలపై కోటి ఆశలు
నెపానగర్ (మధ్యప్రదేశ్): ప్రభుత్వరంగ న్యూస్ ప్రింట్ తయారీ సంస్థ అయిన ‘నెపా లిమిటెడ్’ ఆరేళ్ల విరామం తర్వాత తయారీ కార్యకలాపాలను మంగళవారం ప్రారంభించింది. తయారీ సామర్థ్యాన్ని లక్ష టన్నులకు (వార్షిక) పెంచింది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దీన్ని ప్రారంభించారు. సంవత్సరానికి 1 లక్ష టన్నుల మెరుగైన ఉత్పత్తి సామర్థ్యంతో పునఃప్రారంభం కానున్న ఈ కేంద్రం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. న్యూస్‌ప్రింట్‌లో దేశ స్వయం సమృద్ధికి ఈ ప్లాంట్ దోహదపడుతుందని చెప్పారు. 2018 అక్టోబర్‌లో రూ.469 కోట్లతో ఈ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.395 కోట్ల టర్నోవర్ సాధిస్తామని నెపా చైర్మన్, ఎండీ సౌరభ్దేవ్ తెలిపారు. 2023–24లో రూ.554 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటామన్నారు. మూతబడడానికి ముందు 2015-16లో నెపా టర్నోవర్ రూ.72 కోట్లుగా ఉంది. న్యూస్‌ప్రింట్‌తో పాటు రైటింగ్, ప్రింటింగ్ పేపర్ ముద్రించడంలో కూడా విస్తరించాలని యోచిస్తోంది. కాగా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభంతో 1956 ఏప్రిల్ 26న, భారతదేశ మొదటి ప్రధానమంత్రి దివంగత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ మిల్లును జాతికి అంకితం చేశారు. అయితే 2016లో మూతపడింది. -
ఇంటర్వ్యూలకు రెజ్యూమ్‌లు అవసరం లేదు, టిక్‌టాక్ తరహాలో వీడియోలు చాలు
కాలం మారింది గురూ. ఇకపై పేజీలకు పేజీలు రెజ్యూమ్‌లు చేతపట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు. నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం, సర్టిఫికెట్స్ ధ్రువీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా టిక్ టాక్ తరహాలో వీడియోలు చేసి..ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వొచ్చు. సబీర్ భాటియా- జాక్ స్మిత్‌లు 1996లో తొలిసారి ఫ్రీ వెబ్ ఆధారిత ఇమెయిల్ సర్వీస్ 'హాట్‌మెయిల్'ని బిల్డ్ చేశారు. ఏడాది వ్యవధిలోనే హాట్ మెయిల్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. కాల క్రమేణా ఆ హాట్ మెయిల్ కాస్తా విండోస్ లైవ్ హాట్ మెయిల్, ఔట్లుక్ గా యుజర్లకు పరిచయం అయ్యింది. ఇప్పుడు హాట్ మెయిల్ సృష్టికర్త సబీర్ భాటియా షోరీల్‌ను అనే సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం బీటా వెర్షన్లో ఉన్నా ఈ యాప్ ..త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ షోరీల్ యాప్.. టిక్ టాక్ తరహాలో ఉండే సోషల్ మీడియా యాప్. టిక్ టాక్‌ను ఎంటర్ టైన్మెంట్ కోసం వినియోగిస్తే.. షో రీల్‌ను ఉద్యోగాలు దక్కించుకునేందుకు ఉపయోగపడుతుంది. షో రీల్ ఎలా పని చేస్తుంది..? మీరు ఏదైనా సంస్థలో జరిగే ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలంటే టిక్ టాక్ తరహాలో షార్ట్ వీడియోని తయారు చేయాలి. ఆ వీడియో సైతం క్యూ అండ్ ఏ (question and answer) తరహాలో ఉండాలి. మీరు ఏ జాబ్ రోల్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో అందుకు సంబంధించిన ప్రశ్నలు షో రోల్ యాప్‌లో ముందుగా ఉంటాయి. ఆ యాప్‌లో లాగిన్ అయ్యి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే కంపెనీని సెలక్ట్ చేసుకోవాలి. సెలక్ట్ చేసుకుంటే సదరు సంస్థ మీ జాబ్ ప్రొఫైల్‌కు తగ్గట్లు ప్రశ్నల్ని సిద్ధం చేస్తుంది. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా వీడియో ఫార్మాట్లో ఉంటుంది. ఆ వీడియోలన్నీ రికార్డ్ అవుతాయి. అలా రికార్డ్ చేసిన వీడియోలు.. టిక్ టాక్ వీడియోల్ని ఎలా స్వైప్ చేసి చూస్తామో..అలాగే వేరే వాళ్లు ఇంటర్వ్యూకు అటెండ్ అయిన వీడియోల్ని వీక్షించవచ్చు. మీరు ఈ వీడియోలను మీరు పని చేయాలనుకుంటున్న కంపెనీలతో అటాచ్ చేయొచ్చు. మీ షోరీల్ వీడియోకు నేరుగా లింక్ చేసి మీ రెజ్యూమ్‌కి క్యూఆర్ కోడ్‌ను యాడ్ చేయవచ్చు. షోరీల్లో సంస్థలు అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేసుకుంటాయ్? షోరీల్ లో అటు సంస్థలు, ఇటు జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధుల ప్రొఫైల్స్ ఉంటాయి. షోరీల్ లో జాబ్ కేటగిరి ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా మీకు ఎలాంటి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నారో..అందుకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. కంపెనీలు నేరుగా ఆ విభాగంలో ప్రశ్నలను పోస్ట్ చేస్తాయి. మీరు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీడియోలతో ఇంటర్వ్యూ సాధ్యమేనా? షో రోల్ సంస్థ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడమే ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ ఫౌండర్ సబీర్ భాటియా తెలిపారు. వీడియో రెజ్యూమ్‌ల ద్వారా ఇంటర్వ్యూ ప్రాసెస్ వేగవంతం అవుతుందన్నారు. అయితే వీడియో ఇంటర్వ్యూల తీరుతెన్నుపై అనేక అనుమానాలు వ్యక్తమవ్వడంపై సబీర్ మాట్లాడుతూ..అభ్యర్ధుల ఎంపిక విషయం పక్షపాతం ఉండే అవకాశం ఉందని, అందుకే అభ్యర్ధులు వారి ముఖాన్ని చూపించాల్సిన అవసరం లేదన్నారు. అవతార్ ఆకారాల్ని క్రియేట్ చేస్తామని చెప్పారు. కేవలం ఆడియో రికార్డింగ్ చేయొచ్చని తెలిపారు. చదవండి: టీసీఎస్ రూల్స్ మార్చేసింది.. అవి ఏంటంటే? -
వీసాల పునరుద్ధరణ తక్షణం అమల్లోకి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం రద్దు చేసిన వీసాలను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్, టూరిస్టు, మెడికల్ కేటగిరీ మినహా మిగిలిన అన్ని రకాల వీసాలను పునరుద్ధరిస్తారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. భారత్‌ను సందర్శించేందుకు గాను ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(పీఐఓ) కార్డుదారులకు, ఇతర విదేశీయులకు టూరిస్టు వీసా మినహా ఇతర వీసాలు మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీని ద్వారా విదేశీయులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశ సందర్శనకు కాకుండా వారు వ్యాపారం, సదస్సులు, ఉద్యోగాలు, విద్యాభ్యాసం, పరిశోధనల కోసం ఇండియాకు రావొచ్చు. కరోనా వైరస్ బయటపడడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విదేశాల నుంచి జనం రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అన్‌లాక్‌లో భాగంగా ఆంక్షలను క్రమంగా సడలిస్తోంది. అలాగే వీసాలు, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. అందులో భాగంగా వీసాలను పునరుద్ధరించింది. ఒకవేళ వాటి గడువు తీరిపోతే మళ్లీ వీసాలు పొందవచ్చని కేంద్రం సూచించింది. విదేశీయులు భారత్‌లో వైద్య చికిత్స పొందాలని భావిస్తే మెడికల్ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేసింది. -
సందడి..సందడిగా...
మొన్నటి దాకా షూటింగ్స్ లేక లొకేషన్స్ అన్నీ వెలవెలబోయాయి. ఇప్పుడు ఒక్కో సినిమా సెట్స్ మీదకు వెళ్లడంతో కళకళలాడుతున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణలు మొదలుపెట్టింది ఇండస్ట్రీ. సెట్లో జనం తగ్గినా సందడి తగ్గకుండా పని చేసుకుంటున్నారు. చిత్రీకరణకు కావాల్సిన వాటితో పాటు శానిటైజర్లు, మాస్కులు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ ‘ఆన్ లొకేషన్’ అప్డేట్స్ మీకోసం. సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జున షూటింగ్‌కి తొలి అడుగు వేశారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్లో గత వారంలో జాయినయ్యారాయన. ‘నేను కూడా డాడీ’ అంటూ ఈ వారం నాగచైతన్య తన ‘లవ్‌స్టోరీ’ను తిరిగి ప్రారంభించారు. ‘‘కంటిన్యూస్‌గా 15 రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నాం. లొకేషన్లో కేవలం 15 మంది మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాం. షెడ్యూల్ పూర్తయ్యేవరకూ ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా లొకేషన్ దగ్గరే ఉండేట్లు బస ఏర్పాటు చేశాం’’ అని ‘లవ్‌స్టోరీ’ నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ రావు తెలిపారు. సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, అదా శర్మ థ్రిల్లర్ చిత్రం ‘?’ (సినిమా టైటిల్ క్వొశ్చన్ మార్క్), కీర్తీ సురేష్ ‘గుడ్ లక్ సఖీ’ (తన పాత్ర చిత్రీకరణను గురువారంతో పూర్తి చేసి, ఈ యూనిట్‌కి బైబై కూడా చెప్పారు కీర్తి), బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘బ్లాక్ రోజ్’, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ చిత్రాలు చిత్రీకరణ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని చిత్రాల షూటింగ్ కూడా జరుగుతోంది. షూటింగ్ సందడి కనిపించే ‘ఆన్ లొకేషన్’ ఫొటోలను షేర్ చేశారు ఆయా చిత్రబృందాలు. ఆ ఫొటోలను ఇక్కడ చూడొచ్చు. ‘సోలో ‘బ్రతుకే సో బెటర్’ బెల్ బాటమ్ బ్లాక్ రోజ్ ’లవ్‌స్టోరీ’ ‘గుడ్ లక్ సఖీ’ -
ఆర్థికమంత్రిగా తిరిగి విధుల్లోకి అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అమెరికా వెళ్లిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తిరిగి ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. అరుణ్ జైట్లీ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం కశ్మీర్‌లోని పుల్వామాలో 44మంది సీఆర్ఫీఎఫ్ జవానులు అసువులు బాసిన ఉగ్రదాడిపై చర్చించడానికి జరగనున్న కేబినెట్ కమిటీ సమావేశానికి కూడా హాజరవుతారని తెలిపారు. కాన్సర్‌తో బాధపడుతున్న జైట్లీ చికిత్స నిమిత్తం జనవరి 13న న్యూయార్క్ వెళ్లారు. దీంతో తాత్కాలిక ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ జైట్లీ స్థానంలో బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి1న పార్లమెంటులో సమర్పించాల్సిన కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను కూడా గోయల్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం గతవారమే జైట్లీ ఇండియాకు చేరుకున్నారు. కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుల్వామా ఘటనపై సమీక్షించేందుకు రక్షణ,హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలుతోపాటు కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఇవాళ జరగాల్సిన బహిరంగ సభను కూడా ప్రధాని రద్దు చేసుకున్నారు. -
జాబ్ కోసం రోడ్డెక్కి.. వైరల్
ఉండటానికి ఇళ్లు లేదు.. చేయటానికి పని లేదు. కానీ, అతని ప్రతిభే.. అతనికి ఓ దారి చూపింది. ఉద్యోగం కోసం రోడ్డెక్కిన అతను చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే.. బడా కంపెనీలు సైతం స్పందించి అతనికి జాబ్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... సిలికాన్ వ్యాలీ: డేవిడ్ కసరెజ్(26) టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ నుంచి మెనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆస్టిన్(టెక్సాస్)లో ఓ మోటర్ కంపెనీలో వెబ్ డెవలపర్‌గా పని చేశాడు కూడా. అయితే కొత్త లైఫ్ కోసం కాలిఫోర్నియాకు వచ్చే క్రమంలో అతను తాను నివసించే వ్యాన్‌ను(సంచార జీవనం) పోగొట్టుకున్నాడు. దీంతో ఓ పార్క్ ఫుట్‌పాత్‌పై నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నాడు. అయితే కొత్త ప్రాంతం కావటం.. పైగా డబ్బు తక్కువగానే ఉండటంతో మరో ఆలోచన చేశాడు. రెజ్యూమ్‌ను వందల సంఖ్యలో కాపీలు తీయించి టిప్ టాప్‌గా రెడీ అయి శుక్రవారం ‘మౌంటెన్ వ్యూవ్’లోని ఓ సిగ్నల్ వద్ద నిల్చున్నాడు. ‘ఇళ్లు లేదు. విజయం కోసం పరితపిస్తున్నా. దయచేసి నా రెజ్యూమ్ తీసుకోండి’ అంటూ ఓ ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. సిగ్నల్ వద్ద వాహనాల్లో ఉన్నవారికి రెజ్యూమ్ పంచుతూ పోయాడు. (రియాల్టీ షోలో ఊహించని ఘటన) మరోవైపు సోషల్ మీడియాలో కూడా అతగాడి గురించి స్టోరీలు తెగ వైరల్ అయ్యింది. ఏదైతేనేం మొత్తానికి ఆ ఐడియా వర్కవుట్ అయ్యింది. మంచి ప్రొఫైల్ కావటంతో గూగుల్, నెఫ్లిక్స్, లింక్డిన్, సహా దాదాపు 200 కంపెనీలు అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బి అవుతున్న కసరెజ్.. ఆలోచించుకుని మంచి కంపెనీలో జాయిన్ అవుతానని చెబుతున్నాడు. ‘డబ్బు సాయం చేస్తామని చాలా మంది ముందుకొచ్చారు. కానీ, నాకు కావాల్సింది ఉద్యోగమే. నేను తలెత్తుకుని జీవించాలనుకుంటున్నా. ఈ ప్రయత్నం విఫలమైతే తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోదామనకున్నా. కానీ, సక్సెస్ అయ్యా’ అని కసరెజ్ అంటున్నాడు. -
కశ్మీర్లో మళ్లీ ‘ఆపరేషన్లు’
న్యూఢిల్లీ/శ్రీనగర్: రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటిని పునరుద్ధరించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలని, ఉగ్ర దాడులు, హత్యాకాండ వంటి వాటిని నిలువరించాలని భద్రతా దళాలను ఆదేశించామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, హింస లేని వాతావరణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. శాంతి కోరుకునే వారంతా ఏకతాటిపైకి రావాలని, తప్పు దారిలో వెళుతున్న వారిని శాంతి మార్గంలోకి తీసుకురావాలని కోరారు.∙రంజాన్ మాసం సందర్భంగా మే 17 నుంచి కశ్మీర్లో సైనిక ఆపరేషన్లను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. రంజాన్ మాసం ప్రశాంతంగా సాగేందుకు ఆపరేషన్లను నిలుపుదల చేసి సహకరించిన భద్రతా బలగాలను రాజ్‌నాథ్ అభినందించారు. అధికారిక సమాచారం ప్రకారం ఏప్రిల్ 17 నుంచి మే 17 మధ్య 18 ఉగ్ర దాడుల సంఘటనలు నమోదైతే.. ఆపరేషన్ల నిలుపుదల తర్వాత ఆ సంఖ్య 50కిపైగా పెరిగింది. నిరాశ కలిగించింది: రాజకీయ పార్టీలు ‘కేంద్రం ప్రకటన అసంతృప్తి కలిగించింది. ఇది అనూహ్య పరిణామం’ అని ప్రధాన ప్రతిపక్షం నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధికార ప్రతినిధి జునైద్ మట్టు అన్నారు. భద్రతా దళాల కార్యకలాపాల విరమణను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. కేంద్రం నిర్ణయం నిరాశ కలిగించిందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో విరమణ పొడిగింపు సాధ్యం కాదని అధికార పీడీపీ ప్రధాన కార్యదర్శి పీర్జాదా మన్సూర్ అన్నారు. ‘శాంతి ప్రక్రియ టూ వే ట్రాఫిక్ లాంటిది. మా తరఫున చేయాల్సిందంతా చేశాం. విశ్వాసం కలిగించే చర్యలన్నిటినీ తీసుకున్నాం. కానీ బుఖారీకి ఏం జరిగింది? ఆయన్ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు’ అని పీర్జాదా అన్నారు. కశ్మీర్ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టమైన విధానం లేదని జమ్మూ కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీఏ మిర్ విమర్శించారు. -
ప్రక్షాళన షురూ
రామాలయ విధుల నుంచి ఇద్దరు ప్రధాన అర్చకుల తొలగింపు భద్రాద్రి చరిత్రలో ఇదే తొలిసారి నగల మాయంపై విచారణకు సిద్ధమైన అధికారులు విచారణ అధికారిగా డీఈ రవీందర్ భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నగలు మాయమై..ఆ తర్వాత ప్రత్యక్షమైన వ్యవహారంలో దేవస్థానం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈఓ రమేష్‌బాబు ఇద్దరు ప్రధానార్చకులను రామాలయ విధుల నుంచి తప్పించారు. భద్రాద్రి రామాలయంలోని గర్భగుడి బీరువాలో ఉన్న బంగారు నగలు గత నెల 19న మాయమైన విషయం విదితమే. 10 రోజుల తర్వాత యథాస్థానంలో ప్రత్యక్షమైనప్పటికీ ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నెలరోజులు దాటినా దోషులెవరో తేలకపోవడం..అర్చకుల నడుమ వాగ్వాదాలు...ఆపై దోషులెవరో తేల్చమంటూ అర్చకులే ముందుకు రావడంతో దేవాదాయ శాఖాధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.స్వామి వారి నిత్యకల్యాణోత్సవంలో వినియోగించే బంగారు నగలు తరచు మాయమవుతుండటం, ఆ తర్వాత ప్రత్యక్షమవ్వడం ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని, దీనికి ఇద్దరు ప్రధాన అర్చకులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడమే దీనికి కారణమని ఈఓ నిర్ధారణకు వచ్చారు. అర్చకులపై సరైన అజమాయిషీ లేకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండటం వల్లనే ఇదంతా జరిగిందని, దీనికి ఆ ఇద్దరిని బాధ్యులను చేస్తూ ప్రధాన ఆలయ విధులు నుంచి ఈఓ తొలగించారు. పొడిచేటి జగన్నాథాచార్యులను తాతగుడి సెంటర్లో ఉన్న గోవిందరాజస్వామి వారి ఆలయానికి, పొడిచేటి సీతారామానుజాచార్యులను గోదావరి నదికి వెళ్లే దారిలో ఉన్న నర్సింహస్వామి వారి ఆలయానికి బదిలీ చేశారు. ఇలా చేయడం భద్రాచలం ఆలయ చరిత్రలోనే ప్రథమం. ఆ రెండు ఉపాలయాలలో పనిచేస్తున్న అర్చకులను ఉప ప్రధానార్చకులైన విజయరాఘవన్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆలయంలో స్వామి వారి పూజా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా అర్చకులకు విధులు కేటాయించే బాధ్యతను ఉప ప్రధానార్చకులకు అప్పగించారు. విచారణ అధికారిగా రవీందర్ నగలు మాయం..తర్వాత జరిగిన పరిణామాలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని దేవస్థానంలోని ఇంజనీరింగ్ శాఖ డీఈ రవీందర్‌కు సూచించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నగల మాయం, ఆ తర్వాత ఎలా ప్రత్యక్షమయ్యాయి, అర్చకుల మధ్య జరుగుతున్న వివాదాలు వంటి అంశాలపై డీఈ విచారణ చేయనున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. ప్రక్షాళన దిశగా.... బంగారు ఆభరణాలు మాయం కావడం అందులో సీతమ్మ వారి పుస్తెలతాడు ఉండటంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. నగల మాయం కేసు పూర్వాపరాలపై ‘సాక్షి’ దినపత్రికలో విశ్లేషణాత్మకమైన కథనాలు సైతం వెలువడ్డాయి. దీంతో మేల్కొన్న దేవాదాయ శాఖాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తాన్ని స్థానభ్రంశం చేయగా అర్చకులకు సైతం రోటేషన్ పద్ధతుల్లో విధులు కేటాయించారు. తాజాగా ఇద్దరు ప్రధానార్చకులను ప్రధాన ఆలయంలో విధులు లేకుండా బదిలీ చేశారు. ఈ పరిణామాలు సర్వత్రా చర్చకు దారి తీశాయి. ఆలయ ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పూర్తి ప్రక్షాళన చేయడం మంచిదేనని భక్తులు అంటున్నారు. అయితే నగల మాయం వ్యవహారంలో విచారణ పక్కదారి పట్టకుండా పారదర్శకంగా జరిగేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ప్రతిష్టే ముఖ్యం: దేవస్థానం ఈఓ రమేష్‌బాబు భద్రాచలం రామాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఆలయ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని దేవస్థానం ఈఓ రమేష్‌బాబు అన్నారు. ప్రధానార్చకుల వైఫల్యం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. నగల మాయం, వివాదాలకు కారకులైన వారిని ఇప్పటికే గుర్తించడం జరిగిందని శాఖాపరంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకే మరోసారి విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధ్యులైన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. -
అమర్నాథ్ యాత్ర పునః ప్రారంభం
జమ్ము: ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు అదుపులోకి వస్తుండటంతో అమర్ నాథ్ యాత్రపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గడిచిన మూడు రోజులుగా నిలిచిపోయిన యాత్రను సోమవారం మధ్యాహ్నం నుంచి పునఃప్రారంభించారు. దీంతో జమ్ములో చిక్కుకుపోయిన వేలాది మంది భక్తులు ఊపిరి పీల్చుకున్నట్లయింది. మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలిరావడం, అదే సమయంలో కశ్మీర్ లోయలో ఆందోళనలు జరగడడంతో సర్వత్రా ఆందోళనక పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి: అమర్నాథ్లో మనోళ్ల పాట్లు) జమ్ము సిటీ లోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి సోమవారం సాయంత్రం దాదాపు 40 బస్సులు అమర్ నాథ్ వైపునకు బయలుదేరాయని, యాత్రికుల కాన్వాయ్ కి భారీ భధ్రత కల్పిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. కాగా, ఇప్పటికే యాత్ర ముగించుకుని 200 బస్సుల ద్వారా జమ్ముకు చేరుకోనున్న వారి కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు, రైలు జమ్ము స్టేషన్ నుంచి సోమవారం రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని అదికారులు పేర్కొన్నారు.