సందడి..సందడిగా... | Movie shooting start after lockdown in film industry | Sakshi
Sakshi News home page

సందడి..సందడిగా...

Sep 11 2020 6:58 AM | Updated on Sep 11 2020 6:58 AM

Movie shooting start after lockdown in film industry - Sakshi

మొన్నటి దాకా షూటింగ్స్‌ లేక లొకేషన్స్‌ అన్నీ  వెలవెలబోయాయి.  ఇప్పుడు ఒక్కో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడంతో  కళకళలాడుతున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణలు  మొదలుపెట్టింది ఇండస్ట్రీ.  సెట్లో జనం తగ్గినా సందడి తగ్గకుండా పని చేసుకుంటున్నారు. చిత్రీకరణకు కావాల్సిన వాటితో పాటు శానిటైజర్లు, మాస్కులు ఉండేలా చూసుకుంటున్నారు.  ఆ ‘ఆన్‌ లొకేషన్‌’ అప్‌డేట్స్‌ మీకోసం.

సీనియర్‌ స్టార్‌ హీరోల్లో నాగార్జున షూటింగ్‌కి తొలి అడుగు వేశారు. ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా షూటింగ్‌లో గత వారంలో జాయినయ్యారాయన. ‘నేను కూడా డాడీ’ అంటూ ఈ వారం నాగచైతన్య తన ‘లవ్‌స్టోరీ’ను తిరిగి ప్రారంభించారు. ‘‘కంటిన్యూస్‌గా 15 రోజుల పాటు షూటింగ్‌ చేయబోతున్నాం. లొకేషన్‌లో కేవలం 15 మంది మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాం. షెడ్యూల్‌ పూర్తయ్యేవరకూ ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా లొకేషన్‌ దగ్గరే ఉండేట్లు బస ఏర్పాటు చేశాం’’ అని ‘లవ్‌స్టోరీ’ నిర్మాతలు నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌ రావు తెలిపారు.

సాయిధరమ్‌ తేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, అదా శర్మ  థ్రిల్లర్‌ చిత్రం ‘?’ (సినిమా టైటిల్‌ క్వొశ్చన్‌ మార్క్‌), కీర్తీ సురేష్‌ ‘గుడ్‌ లక్‌ సఖీ’ (తన పాత్ర చిత్రీకరణను గురువారంతో పూర్తి చేసి, ఈ యూనిట్‌కి బైబై కూడా చెప్పారు కీర్తి), బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌటేలా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘బ్లాక్‌ రోజ్‌’, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ‘బెల్‌ బాటమ్‌’ చిత్రాలు చిత్రీకరణ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని చిత్రాల షూటింగ్‌ కూడా జరుగుతోంది. షూటింగ్‌ సందడి కనిపించే ‘ఆన్‌ లొకేషన్‌’ ఫొటోలను షేర్‌ చేశారు ఆయా చిత్రబృందాలు. ఆ ఫొటోలను ఇక్కడ చూడొచ్చు.


‘సోలో ‘బ్రతుకే సో బెటర్‌’


బెల్‌ బాటమ్‌


బ్లాక్‌ రోజ్‌


’లవ్‌స్టోరీ’


‘గుడ్‌ లక్‌ సఖీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement