Revanth Redy
-
TS: గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథార్టీ(HMDA) ఆమోదించింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్
-
ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం మీడియా చిట్ చాట్‌లో పాల్గొని కీలక విషయాలు వెల్లడించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ నిర్మిస్తామని, కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని అన్నారు. అధికారుల నియామకంలో ఫైరవీలు ఉండని అన్నారు. అధికారుల బదిలీలు ఉంటాయని, కానీ బదిలీ విషయంలో వారి వెంటపడమని సీఎం రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12, 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదన్నారు. అన్ని అంశాలపై, అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. రేపు(శుక్రవారం) బీఏసీలో సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో ఉపయోగకరంగా ఉండదని, విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్ చేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. చదవండి: ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం -
రేవంత్‌రెడ్డి వేగం.. హెలికాప్టర్‌తో ప్రచారం
కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న కుట్రలు, కుతంత్రాలకు తెరదించుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. కోస్గి, దౌల్తాబాద్, మద్దూరు మండలాలకు చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు వంద నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యత అప్పగిందని చెప్పారు. ఇందుకోసం హెలికాప్టర్ వసతి కల్పించారని తెలిపారు. కేసీఆర్‌ను అధికారంలోకి తెచ్చుకోవడానికి అడ్డదారిలో పయనిస్తున్న వారి వివరాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం కొనసాగిస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రలా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన ప్రచారం నిమిత్తం హెలికాప్టర్లో ఆసిఫాబాద్‌కు వెళ్లారు. -
భద్రత బాధ్యత ఎన్నికల సంఘానిదే
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతల భద్రత విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ జారీ అయి, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత ఎన్నికల బరిలో నిలిచిన నేతల భద్రత బాధ్యత ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రాణహాని ఉన్నందున భద్రత కల్పించాలని నేతలు అభ్యర్థించినప్పుడు, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తేల్చి చెప్పింది. ఈ బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోజాలదని పేర్కొంది. అధికార పార్టీ నేతలు, సంఘ విద్రోహశక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున కేంద్ర బలగాలకు చెందిన 4+4 సిబ్బందితో భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు కేంద్ర బలగాలకు చెందిన 4+4 సిబ్బందితో భద్రత కల్పించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని, రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ భద్రతను కొనసాగించాలని పేర్కొంది. అయితే, ఈ భద్రతకు అయ్యే వ్యయాన్ని మాత్రం రేవంత్‌రెడ్డే భరించాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. రేవంత్ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి సోమవారం మరోసారి విచారణ జరిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది భద్రత మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని తెలిపారు. రాజకీయ నేతల భద్రత తమ పరిధిలోని వ్యవహారం కాదని, వ్యక్తిగత భద్రత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని వివరించారు. ఎన్నికలు జరుపుతున్నంత మాత్రాన శాంతి భద్రతల బాధ్యతాధికారం ఎన్నికల సంఘానికి బదిలీ కాదన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సంతోష్ వాదనలు వినిపిస్తూ రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రేవంత్ దరఖాస్తును ఎన్నికల ప్రధాన అధికారి తమకు పంపారని, దాని ప్రకారం భద్రత కల్పించేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. గతంలో భద్రతను తగ్గించినప్పుడు రేవంత్ పిటిషన్ దాఖలు చేశారని, అప్పుడు కేంద్రం కౌంటర్ దాఖలు చేస్తూ భద్రత వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే అప్పుడు తాము పరిశీలిస్తామని చెప్పిందని సంతోష్ పేర్కొన్నారు. జీవితకాలం అడగటం లేదు... మోహన్‌రెడ్డి స్పందిస్తూ పిటిషనర్ జీవితాంతం భద్రత కల్పించాలని కోరడం లేదని, ఈ ఎన్నికల సమయం వరకే భద్రతను కోరుతున్నారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాది మోహన్‌రెడ్డి వాదనలతో ఏకీభవించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత ఎన్నికల బరిలో ఉన్న నేతల భద్రత బాధ్యత ఎన్నికల సంఘానిదేనని తేల్చి చెప్పారు. రాష్ట్రం కల్పించే భద్రతపై మాకు నమ్మకం లేదు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల నోటిఫికేషన్, ప్రవర్తనా నియమావళి విడుదలైన తరువాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషనర్ గళం విప్పారని, అందువల్ల ప్రభుత్వాధినేతల నుంచి ఆయన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రతపై తమకు నమ్మకం లేదని, ఆ భద్రత సిబ్బంది చేత పిటిషనర్ కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వానికి ఈ ఉద్దేశం ఉంది కాబట్టే, భద్రత కల్పిస్తామంటూ ముందుకొచ్చిందని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది సంతోష్ జోక్యం చేసుకుంటూ ఈ వాదనను ఆమోదిస్తే, రేపటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరూ భద్రత కోసం హైకోర్టుకొస్తారని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘వస్తే రానివ్వండి.. వారికి కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. ఆ బాధ్యత నుంచి ఎన్నికల సంఘం వెనక్కి వెళ్లలేదు’అని తేల్చి చెప్పారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఎన్.రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, వ్యక్తుల భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమన్నారు. గతంలో కూడా తాము ఇదే విషయాన్ని స్పష్టం చేశామన్నారు. -
'కేసీఆర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ అమరవీరులకు న్యాయం చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలస్యం చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే కుటుంబ సభ్యులకు అధికారం పంచిన కేసీఆర్ తెలంగాణ బిడ్డలపై కేసులు ఉపసంహరించడంలో.. అమరవీరుల కుటుంబాల వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెల్లని నియామక పత్రాలు అమర వీరుల కుటుంబాలకు ఇవ్వడం దారుణం అని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 27మందికి నియామక పత్రాలు ఇవ్వగా వారికి అలాంటి ఉద్యోగాలు లేవని తిప్పిపంపారనే విషయం గుర్తు చేశారు. ఇది వారిని అవమానించడమే అన్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసుల విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా నల్గొండకు చెందిన జేఏఈసీ కన్వీనర్ రాయపూడి చిన్ని, కో కన్వీనర్ బంగారు నాగమణి, తెలంగాణ విద్యావంతుల వేదిక చిలక రమేష్, జీఎల్ఎన్ రెడ్డి కోదాడ కోర్టు వద్ద పడిగాపులు పడ్డారని లేఖలో ప్రస్తావించారు. ఇంకా అనేక ప్రాంతాల్లో కేసులతో సతమవుతున్నవారి వివరాలు లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఉద్యమ సమయంలో మొత్తం 3152 కేసులు ఉంటే అందులో ఇంకా వెయ్యి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు పెట్టిన కేసులు కూడా ఎత్తివేయించే చొరవ తీసుకోవాలని, ఈవిషయంలో తమ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల వివరాలు, వారి కుటుంబాలకు అందిన సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన లేఖపై స్పందన రాకుంటే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.