Revantreddy
-
నాయకత్వాన్ని మార్చండి..
సాక్షి, న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పార్టీలో అసంతృప్తి క్రమంగా సెగలుగక్కుతోంది. పీఠంపై కన్నేసిన ఆశావహులు పలువురు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తమ్ మూడున్నరేళ్ల పనితీరు బాగా లేదని, ప్రజల్లోనూ శ్రేణుల్లోనూ పార్టీ పట్ల నమ్మకం సడలుతోందని అధ్యక్షుడు రాహుల్‌కు, ఇతర పెద్దలకు వివరించాలని నిశ్చయించారు. రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతో పాటు గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు సహా దాదాపు 21 మంది నేతలు మంగళవారం ఢిల్లీ వచ్చారు. వారంతా బుధవారం ఉదయం 10.15కు ఆయనతో భేటీ అవనున్నారు. పార్టీ పరిస్థితిని వీలైతే రాహుల్‌కే నేరుగా చెప్పాలని, లేదంటే పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉత్తమ్‌ను తప్పించేందుకు అవసరమైతే అంతా ఏకం కావాలని నేతలంతా మంగళవారం మంతనాలు సాగించినట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా కుంతియాతో లాభం లేదని, ఆజాద్ వంటి బలమైన మైనారిటీ నేత కావాలని కూడా పలువురు నేతలు భావిస్తున్నారు. సౌమ్యుడన్న ఉద్దేశంతోనే ఉత్తమ్ నాయకత్వాన్ని గ్రూపులకతీతంగా అంగీకరిస్తే ఇప్పుడాయన తానే పార్టీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఆయనకసలు పోరాట పటిమే లేదని ఆక్షేపించారు. అధికారం తన వద్దకే నడుచుకుంటూ రావాలనుకునే వారితో పార్టీ ముం దుకు సాగదంటూ విమర్శించారు. అధికార పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూంటే విపక్ష పార్టీ నేత లు ఇళ్లకు, పార్టీ కార్యాలయాలకు పరిమితమైతే ప్రజ లెలా నమ్ముతారని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత ప్రశ్నించారు. నాయకులకు పనే లేకుండా పోయిందని, ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా పర్మిషన్లు కావాలంటే ఎలాగని ఓ యువ నేత వాపోయారు. -
బీసీల హక్కులు హరిస్తారా: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో అమల వుతున్న రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. మైనారిటీలను బీసీల్లో చేర్చడంవల్ల బీసీలకు స్థానిక సంస్థల్లో అన్యాయం జరుగుతుందన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో 50 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయితే వీటిలో 30 వార్డుల్లో బీసీ–ఇ కేటగిరీకి చెందిన ముస్లిం మైనారిటీలే గెలిచారని తెలిపారు. 50 స్థానాల్లో బీసీలు కేవలం 20 స్థానాల్లో మాత్రమే గెలిచారని వివరించారు. దీనివల్ల బీసీలకు అన్యాయం జరగడం లేదా అని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలుచేస్తామం టున్న కేసీఆర్, మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధం
♦ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ♦ ఆర్డీఎస్ సాధనకు ఎమ్మెల్యే సంపత్ మహాదీక్ష సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎడారిగా మారుతున్న పాలమూరు జిల్లాను రక్షించుకోవడానికి సాగునీటిలో తెలంగాణ వాటా పొందేందుకు ఎవరితోనైనా యుద్ధం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం సింగనూరు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కాలువ వద్ద సోమవారం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చేపట్టిన ఒకరోజు మహా దీక్షలో ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలి ఫ్లోర్‌లీడర్ షబ్బీర్ అలీ, మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, తమ రాజకీయ అవసరాల కోసం రాజోలిబండ వంటి సాగునీటి ప్రాజెక్టులను ముందుపెట్టి ప్రజల్లో ఆశలు రేపిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తరువాత దాని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. అయితే ఆ పేరుతో జరిగే అవినీతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలలో అవాస్తవిక రేట్లను టెండర్లలో కోట్ చేసి వేల కోట్ల రూపాయలను దిగమింగడానికి ప్రభుత్వం పక్కాప్లాన్ చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుల్లో ఆంధ్రులకు కాంట్రాక్టు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎందుకు ఉత్సాహం చూపుతున్నారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు కోసం కనీసం రెండు టీఎంసీలకు తగ్గకుండా విడుదల చేయాలని మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, ఇరిగేషన్ శాఖ మంత్రి పాటిల్‌ను కలసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఆర్డీఎస్ పూర్తయ్యే వరకు పోరాటం ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తిచేసేంత వరకు ప్రజల పక్షాన పోరాడుతామని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. రూ.800 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కుర్చీ వేసుకొని కూర్చొని ఆర్డీఎస్ను పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఇటు రాకపోవడం ఆయనకు అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఆర్డీఎస్ పనులను కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి సత్వరమే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు పక్కనపెట్టి కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు మరో ఉద్యమం చేయాలని తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోనన్నారు. ప్రభుత్వం అలంపూర్ నియోజకవర్గంపై చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నా రు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ఈ ప్రాజెక్టు సాధనకు కాంగ్రెస్ పోరాడుతుందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, బచావో తెలంగాణ మిషన్ నేత నాగం జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న ఆర్డీఎస్‌పై సీఎం కుర్చీ అలంపూర్: ఆర్డీఎస్ కెనాల్ వద్ద సీఎం కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన కుర్చీ నిరసన ఆకట్టుకుంది. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. ఆర్డీఎస్ వద్ద కుర్చీ వేసుకుని పనులు చేసి నీళ్లు పారిస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని గుర్తు చేస్తూ ఈ కుర్చీ ఏర్పాటు చేశారు. -
ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం
రోడ్డెక్కిన మధ్యమానేరు నిర్వాసితులు వంటావార్పునకుకదిలిన పల్లెలు మద్దతు తెలిపిన నాగం, రేవంత్, పొన్నం, సింగిరెడ్డి మార్చి 2న ఎమ్మెల్యే, 14న సీఎం నివాసాల ముట్టడి వేములవాడ రూరల్ : మధ్యమానేరు భూనిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం దిగొచ్చేదాకా ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని వివిధ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం నిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. పరిహారం, పునరావాసం విషయంలో న్యాయం చేయూలని, గతేడాది జూన్ 18న సీఎం కేసీఆర్ వేములవాడలో ఇచ్చిన హామీ మేరకు డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయూలని నిర్వాసితులు సోమవారం రోడ్డెక్కారు. మధ్యమానేరు ముంపు గ్రా మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేములవాడ మండలం రుద్రవరం పునరవాస కాలనీ వద్ద వంటావార్పు, ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. వేములవాడ, సిరిసిల్ల, బోరుునపల్లి మండలాల్లోని 12 గ్రామాల నిర్వాసితులు ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, టఫ్ నేత విమలక్క, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ మద్దతు తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. నిర్వాసితులతో కలిసి రోడ్డుపై భోజనాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడుతాయనుకున్న ప్రజలకు కేసీఆర్ పాలనతో నిరాశే మిగిలిందని నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎలాంటి హక్కులు ఇవ్వకుండా తన బంధువులతో రాబంధు పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. ముంపు గ్రామాల న్యాయమైన డిమాండ్‌ను నెరవే ర్చేవరకు జెండాలు ఎజెండాలు పక్కన బెట్టి, ఐక్యవేదిక ద్వారా ఉద్యమాలను చేపడదామని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గతేడాది జూన్ 18న వేములవాడ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మార్చి 2న వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు ఇంటి ముందు నిరసన తెలుపుతామని, 14న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులు రవీందర్, పిల్లి కనకయ్య, కూస రవీందర్, ఎర్రం నర్సయ్య పాల్గొన్నారు. -
దత్తత గ్రామాన్ని వల్లకాడు చేసిన సీఎం కేసీఆర్
చిన్నముల్కనూర్ సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చిగురుమామిడి: మండలంలోని చిన్నముల్కనూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చి నేడు గ్రామాన్ని వల్లకాడు చేశాడని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. చిన్నముల్కనూర్ గ్రామాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డిలతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. డబుల్ బెడ్రూం నిర్మాణం కోసం ఉన్న ఇళ్ల్లను కూల్చివేసుకుని గుడిసెలు, రేకుల షెడ్లలో కాలం వెళ్లదీస్తున్న చిలుకమ్మ, రజితతోపాటు పలువురు బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చిన్నముల్కనూర్‌లోని మహిళల మానప్రాణాలతో సీఎం ఆటలాడుకుంటున్నాడని, గోనె సంచులు అడ్డంకట్టుకుని స్నానాలు చేస్తున్న పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ఇండ్లు కూల్చివేసి పందిళ్ల కింద తలదాచుకుంటున్నా సీఎంకు ఎందుకు కనికరం కలగడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే గ్రామంలో ఏడు నెలల కింద నిర్మించిన మోడల్ హౌస్‌కు అధికారులు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ముందుంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుతాన్ని నిలదీస్తామన్నారు. -
పాలమూరు ఇజ్జత్ తీసేసిండు