జిల్లాల ఏర్పాటుపై 1,424 అప్పీళ్లు
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవె న్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ఆదివారం రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 1,424 అప్పీళ్లు అం దాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. కొత్త జిల్లాలకు సంబందించి అప్పీళ్లను పౌరులు నేరుగా, ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు, ఈవిధానం సులభతరంగా ఉండేలా వెబ్సైట్ ఏర్పాటు చేశారు. అభ్యంతరాలు నమోదు కోసం www.newdistrictsformation.telangana.gov.in వెబ్సైట్లోకి లాగినై వివరాలు తెలియజేయాలి. చేతిరాతతో రాసిన కాగితంకానీ, డీటీపీ ద్వారా తయారు చేసిన డాక్యుమెంట్ స్కాన్‌చేసి మీ అభిప్రాయం వెబ్సైట్లో ఆటాచ్ చేసే అవకాశం ఉంటుంది. మీ అప్పీల్ ఫైల్ అయినట్లు మీ సెల్‌కు సమాచారం వస్తుంది.