reverse pumping
-
'రివర్స్ వాటర్ ఫాల్'.. ఎక్కడో కాదు మన దేశంలోనే
ముంబై: ఎత్తైన కొండల నుంచి కిందికి జాలువారే జలపాతాల్ని చాలానే చూసి ఉంటాం. కానీ గాల్లో పైపైకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? అలా ఎలా అనుకుంటున్నారా? అవునండి అది నిజమే.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం ఎక్కడో కాదు మన దేశంలోనే కనువిందు చేస్తోంది. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనే ఈ ప్రకృతి అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత్ నంద.. ఆకాశంలోకి ఎగిరే జలపాతం అద్భుత దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాదు.. అసలు ఇలా రివర్స్ వాటర్‌ఫాల్ ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని వివరించారు. గురుత్వాకర్షణ, గాలి ఒకదానినొకటి వ్యతిరేక దిశలో సమానంగా ఉన్నప్పుడు ఇలాంటివి సంభవిస్తాయని తెలిపారు. పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ వద్ద ఆదివారం ఇదే జరిగిందంటూ దానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. When the magnitude of wind speed is equal & opposite to the force of gravity. The water fall at its best during that stage in Naneghat of western ghats range. Beauty of Monsoons. pic.twitter.com/lkMfR9uS3R — Susanta Nanda IFS (@susantananda3) July 10, 2022 వర్షాకాల సోయగం.. ఈ ప్రకృతి అద్భుతాన్ని 'వర్షాకాల సోయగం'గా అభివర్ణించారు నంద. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 3 లక్షల వీక్షణలు, 15వేలకుపైగా లైక్‌లు సంపాదించింది. చాలా మంది ఆ అద్భుతంపై కామెంట్లు చేశారు. 'ఆ ప్రాంతాన్ని నేను సందర్శించాను. అది భూలోక స్వర్గం' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. 'దీనికన్నా సుందరమైనదాన్ని ఇప్పటి వరకు చూడలేదు' అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: IndiGo Airlines: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
రివర్స్ పంపింగ్‌తో ఉపయోగం ఉందా?
కథలాపూర్/మేడిపల్లి (వేములవాడ): కాళేశ్వరం జలాల రివర్స్ పంపింగ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కథలాపూర్ జెడ్పీటీసీ భూమయ్య, మేడిపల్లి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డితో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కడ ఉంది.. దానికి పరిష్కార మార్గాలు.. వరద కాలువలో ప్రవహిస్తున్న కాళేశ్వరం జలాల విషయమై చర్చించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి వస్తున్న నీటితో రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతోందని ఆరా తీశారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలతోపాటు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు నాన్ ఆయకట్టు కింద ఉన్నాయని, ఇక్కడ నీటి సమస్య ఉన్నట్లు భూమయ్య, శ్రీపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. వరద కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా కాలువ పై భాగంలోని చెరువులు, కుంటలు నింపితే సమస్య తీరుతుందన్నారు. వేములవాడ, చొప్పదండి, కోరుట్ల, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని నీటి సమస్య ఉన్న గ్రామాలకు నాలుగు నెలల్లో నీరు అందేలా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలసి శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. -
ఐటీ కారిడార్‌కు జలహో
సాక్షి, సిటీబ్యూరో: రాబోయే వేసవిలో ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు లింగంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ విధానంలో నీటి సరఫరా జరుగుతుండటంతో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు భారీ రింగ్ మెయిన్ పైపులైన్ ఏర్పాటు చేయాలని జలమండలి సంకల్పించింది. గతంలో రూ.420 కోట్ల అంచనా వ్యయంతో ఘన్పూర్ భారీ స్టోరేజ్ రిజర్వాయర్ నుంచి.. ముత్తంగి జంక్షన్ వరకు భారీ పైపులైన్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా.. ముత్తంగి జంక్షన్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకాపేట వరకు భారీ రింగ్ మెయిన్ పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.285 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేపట్టనున్న పనులకు సంబంధించి.. త్వరలో మున్సిపల్ శాఖ పరిపాలన పరమైన అనుమతులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పనులను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయడం ద్వారా గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, కోకాపేట్, నల్లగండ్ల, కొల్లూరు తదితర ప్రాంతాలకు తాగునీటి కష్టాలు సమూలంగా తీరనున్నాయి. ఈ పనుల పూర్తితో గ్రేటర్‌కు మణిహారంలా.. 158 కిలో మీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ముందడుగు పడనుండటం విశేషం. వాటర్ గ్రిడ్‌తో.. దాహార్తి దూరం.. మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీతో పాటు.. ఔటర్‌రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ఈ భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఐటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, నూతనంగా ఏర్పాటు కానున్న టౌన్‌షిప్‌లు, కాలనీలకు నిరంతరాయంగా 24 గంటలపాటు కొరత లేకుండా తాగునీటిని అందించడంతోపాటు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి వ్యక్తికీ తలసరి నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్ పర్ క్యాపిటా డైలీ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటర్‌గ్రిడ్ పథకానికి జలమండలి శ్రీకారం చుట్టనుంది. ఏడు చోట్ల వాటర్ గ్రిడ్ జంక్షన్లు.. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాల నీటిని వాటర్‌గ్రిడ్ రింగ్‌మెయిన్ భారీ పైప్‌లైన్‌కు అనుసంధానించేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ 7 చోట్ల గ్రిడ్ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. పటాన్చెరు వద్ద ఏర్పాటుచేయనున్న జంక్షన్‌కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్ పైపులైన్‌కు అనుసంధానించనున్నారు. ఇక శామీర్‌పేట్ వద్ద కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్‌కు కలపనున్నారు. వెలిమాల జంక్షన్ వద్ద సింగూరు జలాలను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నీటిని కిస్మత్పూర్ వద్ద, బొంగ్లూరు జంక్షన్ వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలాలను కలుపుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మ నాగారం (చౌటుప్పల్) నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్పేట్ ఔటర్ జంక్షన్ వద్ద గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్ గ్యాలన్ల శుద్ధిచేసిన తాగునీరు ఈ గ్రిడ్‌లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. ఈ నీటిని ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఏమూలకైనా తరలించే అవకాశం ఉంది. వాటర్‌గ్రిడ్ కాన్సెప్ట్ అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పలు మహానగరాల్లో అమల్లో ఉంది. -
మరో ఘట్టం ఆవిష్కృతం
మంథని: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మహాఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాణహిత జలాలను ఎల్లంపల్లి వద్ద గోదావరిలో కలపాలన్న సీఎం కేసీఆర్ కల సాకారమైంది. 20 రోజుల క్రితం మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా రివర్స్ పంపింగ్‌తో మొదలైన కాళేశ్వరం జలాలు.. 120 కిలోమీటర్లు ఎదురెక్కి పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ(సుందిళ్ల) పంప్‌హౌస్ డెలివరీ సిస్టం వరకు చేరాయి. దీంతో బుధవారం సాయంత్రం 7 గంటలకు మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతను ప్రారంభించారు. ఈ నీరు కిలోమీటరు పైపులైన్ ద్వారా.. మరో కిలోమీటరు దూరం గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రయాణించి గురువారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఘట్టం పూర్తవుతుంది. ఎల్లంపల్లి నుంచి ఈ నెల 5వ తేదీన నీటిని ఎత్తిపోసేందుకు ముహూర్తం ఖరారైంది. 3 బ్యారేజీలు, 3 పంపుహౌస్‌లు దాటిన కాళేశ్వరం జలాలు ఎల్లంపల్లికి చేరుతుండటంతో ఇంజనీరింగ్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రివర్స్ పంపింగ్ ఎస్సారెస్పీ దాకా చేయాలి
రెండు లిఫ్టుల భారం తగ్గుతుంది: జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం దాకా ఉపయోగిస్తున్న రివర్స్ పంపింగ్ విధానాన్ని ఎస్సారెస్పీ వరకు కొనసాగించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లా డుతూ కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్‌తో తరలించడం ద్వారా వరద సమయంలో విద్యుత్ ఉత్పత్తికూడా కలిసి వస్తుందన్నారు. ఈ ప్రతిపాదన ద్వారా 50 కిలోమీటర్ల కాలువ నిర్మాణం, అదనంగా రెండు లిఫ్ట్‌ల భారం తగ్గు తుందన్నారు. గోదావరి ద్వారా రివర్స్ పంపింగ్‌ను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా వస్తా యన్నారు. అలాగే కడెంకు దిగువన మరో ప్రాజెక్టు నిర్మిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీటి తరలింపుపై ప్రభుత్వమే నిర్ణయం మార్చుకోవడం సంతోషకరమన్నారు. కోర్టుకెళ్లడమే తప్పంటే ఎలా? మంత్రి హరీశ్‌రావుకు న్యాయవ్య వస్థపై గౌరవముందా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కోర్టులకు ఎవరైనా వెళ్లొ చ్చునని, అయితే కోర్టులు ఏం తీర్పులు చెబుతున్నాయనేది ముఖ్య మన్నారు. భూసేకరణ చట్టం–2013 పక్కన పెట్టినందుకే బాధితులు కోర్టులకు వెళ్లారని చెప్పారు. కోర్టులకు వెళ్లడమే తప్పు అన్నట్టుగా సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదని, ఇది న్యాయ వ్యవస్థను తప్పుపట్టే విధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనన్నారు. జీఎస్టీని అద్భుతం అని కేసీఆర్ పొగడ్తలు కురిపించినప్పుడు నిజాలే మిటో తెలియదా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ దీక్షకు దిగితే అరెస్టు చేసి, దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామి కమని విమర్శించారు.