riley dekshalu
-
అదే సంకల్పం...ఆగని సమరం
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 500 రోజులు పూర్తి కానున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను శతశాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని గతేడాది జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఉక్కు కార్మిక వర్గం భగ్గుమంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించింది. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండు రోజలు ధర్నాలు చేపట్టారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు దిగ్భందించారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనం, గేట్ల ముట్టడి చేపట్టారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు మద్దతు ఇస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. దీక్షలు ప్రారంభించి 500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నేడు నగరానికి మహా ప్రదర్శన ఉద్యమం 500వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ఆదివారం ఉదయం స్టీల్‌ప్లాంట్ నుంచి నగరానికి మహా ర్యాలీ నిర్వహించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ ఏర్పాట్లు చేసింది. 10వేల మంది ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, యువకులు, మాజీ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గోనున్నారు. ఈ నెల 27న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు. మహా ప్రదర్శన విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పరిరక్షణ పోరాట కమిటీ ప్లాంట్‌లో, ఉక్కునగరంలో, నిర్వాసిత కాలనీల్లో విస్తృత ప్రచారం చేసింది. మహా ప్రదర్శన రూట్‌మ్యాప్ ప్రదర్శన కార్యక్రమం ఆదివారం ఉదయం ఉక్కునగరం నుంచి దేశపాత్రునిపాలెం, శనివాడ, అగనంపూడి, కూర్మన్నపాలెం, వడ్లపూడి మీదుగా కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు బైక్‌లపై నగరంలో డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుని.. అక్కడ నుంచి కాలినడకన జీవీఎంసీ మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 2021 2న కేంద్ర నిర్ణయం బయటకు పొక్కింది. 3న వేలాది మంది కార్మికులు ఉక్కు పరిపాలన భవనాన్ని ముట్టడించారు 5న స్టీల్‌ప్లాంట్ ఆర్చి నుంచి నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. 7న ఉక్కు కార్మిక సంఘాలు, అధికార సంఘం, వివిధ అసోసియేషన్లతో పోరాట కమిటీ ఏర్పాటైంది. 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం 12న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన సీపీఐ నారాయణ, నాటి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 17న విశాఖ విమానాశ్రయంలో పోరాట కమిటీ నాయకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం 18న స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయపార్టీలతో భారీ బహిరంగ సభ 20న జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం దీక్షా స్థలి వరకు 25 కిలోమీటర్ల మేర ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతల పాదయాత్ర 26న జాతీయ రహదారిపై రాస్తారోకో 27, 28వ తేదీల్లో రెండు రోజుల పాటు జాతీయ రహదారి దిగ్భందం మార్చి 2021 9న ఉక్కు పరిపాలన భవనం ముట్టడి 14న కూర్మన్నపాలెం నుంచి గాజువాక వరకు పాదయాత్ర 15న ఢిల్లీలో వివిధ పార్టీల ఎంపీలకు వినతిపత్రాల సమర్పణ 20న వేలాది మందితో ఉక్కు త్రిష్ణా మైదానంలో కార్మిక గర్జన 26న రైతు చట్టాలు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై భారత్ బంద్ 31న నిర్వాసిత సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ఏప్రిల్ 2021 4న ఆర్.కె బీచ్‌లో నిరసన ప్రదర్శన 8న అగనంపూడి నుంచి బీహెచ్‌పీవీ వరకు 10 వేల మందితో 10 కిలో మీటర్ల మానవహారం 18న రైతాంగ పోరాట నాయకుడు రాకేష్ సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో రైతు, కార్మిక గర్జన మే 2021 22న దీక్ష శిబిరం వద్ద 100 జెండాలు, 100 మీటర్ల బ్యానర్‌తో వంద మంది దీక్ష 22న ఉద్యోగులు తమ ఇళ్ల వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జూన్ 2021 స్టీల్‌ప్లాంట్ కార్మిక నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జూలై 2021 8న ఉక్కు గేట్ల వద్ద ధర్నా 9న సీపీఐ కార్యదర్శి నారాయణ దీక్ష స్థలి సందర్శన 10న నగరంలోని మహాధర్నాకు బైక్ ర్యాలీ 15న కోక్‌ఓవెన్స్ నుంచి మెయిన్ గేటు వరకు పాదయాత్ర 27న చలో అడ్మిన్ కార్యక్రమం (చదవండి: ప్రజల చెంతకే పాలన... జగనన్నతోనే సాధ్యం) -
అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్రకాదు..
అమరావతి: అమరావతి రైతులు చేస్తున్నది పాదయాత్ర కాదు.. అది ఒక రాజకీయ యాత్ర అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ యాత్రకు కర్త,కర్మ,క్రియ అన్ని చంద్రబాబే.. అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు విమర్శించారు. బహుజన పరిరక్షణ సమితి నేతల దీక్షలు 400వ రోజులకు చేరుకున్నాయి. పేదవారికి ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. ‘న్యాయస్థానం–దేవస్థానం’ అంటూ చంద్రబాబు కొత్తనాటకానికి తెరతీశారని మండిపడ్డారు. -
‘అమరావతి’ హైడ్రామా అట్టర్ ప్లాప్
తాడికొండ: అమరావతి బినామీ ఉద్యమకారులు 600వ రోజు పేరిట చేసిన ‘న్యాయస్థానం–దేవస్థానం’ హైడ్రామా అట్టర్ ప్లాప్ షో అయిందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 314వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో ఆదివారం పలువురు నాయకులు ప్రసంగించారు. అమరావతి రెండేళ్ల క్రితం, సింగపూర్, అమెరికాలా ఉన్నట్లు.. ఇప్పుడు ఆ అభివృద్ధిని కోల్పోయినట్లు ఎల్లో మీడియా, పత్రికల్లో తప్పుడు కథనాలు వండివార్చడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 600వ రోజు పేరిట నిర్వహించిన ఉద్యమం అట్టర్ ప్లాప్ అయిందని, రైతుల ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ తొత్తులకు, చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమరావతి బినామీలు 600 రోజుల పేరిట ‘న్యాయస్థానం–దేవస్థానం’ అంటూ దొంగయాత్ర నిర్వహించడం నగుబాటుకు గురయ్యిందన్నారు. అమరావతి ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఇప్పటికే కరకట్ట అభివృద్ధితో పాటు ఇతర పనులు ప్రారంభమై చకచకా కొనసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, మాదిగాని గురునాథం , బేతపూడి రాజేంద్ర, ఆకుమర్తి చిన్నా, బూదాల సలోమీ, పులి జస్వంత్ రాణి, ఇందుపల్లి సుభాషిణి, ఓలేటి స్వప్న, శామ్యూల్, పల్లె బాబు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
సాక్షి, యాదాద్రి: మహాకూటమి అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో 15 రోజులుగా చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహా ర దీక్షను బుధవారం రాత్రి ఆయన టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలసి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ పోచంపల్లి చేనేత కార్మికుల 12 డిమాండ్లను మహాకూటమి ఎజెండాలో చేర్చి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 పింఛన్‌ను రూ.2,000కు పెంచుతామన్నా రు. భువనగిరికి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న భూములు, బంగారం, ఆస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీం ఆస్తులపై టీఆర్ఎస్ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నీ చేస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి ఏమీ చేయని కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి గోరీ కట్టాలని, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కేసీఆర్ సీఎం అయితే ఏదో ఉద్ధ రిస్తాడని, ప్రజల బతుకులు బాగుపడతాయని గెలి పిస్తే వాటన్నింటినీ మరిచిపోయారన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పేద ప్రజలకు వారి సొంత స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయలేకపోయారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని, చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పేద ల బాధలు తొలగాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా మహాకూటమి అధికారంలోకి రావడం అవసరమని పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ వైఫల్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నేతలు చింతకింది రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
'తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం'
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మిస్తున్నది ఏపీ రాజధాని కాదని, అదొక మాయాబజార్ అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పిలుపుమేరకు కడప కలెక్టరేట్ వద్ద శనివారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా ప్రారంభించారు. దీక్షా శిబిరాన్నిసందర్శించిన రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో రూ.1.50 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని, భవిష్యత్తులో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.