rishab
-
షూటింగ్లో నిజంగా పేలిన బాంబు.. హీరోకు గాయాలు
అప్పట్లో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు అధికంగా డూప్‌లనే వినియోగించేవారు. ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకొని హీరోలు కష్టపడకుండా డూప్లతనే పని కానిచ్చేవారు. కానీ ఈమద్య ట్రెండ్ మారడంతో అన్ని సన్నివేశాలు డూప్‌లు లేకుండా సొంతంగా సాహసం చేస్తున్నారు. రియాల్టీ కోసం యాక్షన్ సన్నివేశాలను కూడా అవలీలగా చేసేస్తున్నారు. అయితే ఇలాంటి రిస్క్ తీసుకునే ముందు తప్పగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం బాధ్యతారహితంగా ఉన్నా పెద్ద ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే కన్నడ సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి కూడా ఇలాగే షూటింగ్లో గాయ పడగా.. ఈ విషయం కాస్త ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. గణవి లక్ష్మణ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలవ్వగా.. ఆడియోన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం మార్చి 5న థియేటర్లలో విడుదల కానుంది. అయితే హాసన్ జిల్లాలోని బేలుర్లో షూటింగ్ చేస్తున్న క్రమంలో ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా రిషబ్, గణవిపైకి పెట్రోల్ బాంబ్‌ను విసరాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరు పక్కకు దూరంగా వెళ్లాలి. కానీ వీరిద్దరు కాస్త ఆలస్యంగా మూవ్ కావడంతో అప్పటికే బాంబు పేలి మంటల చెలరేగడంతో రిషబ్‌కు స్పల్ప గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌ను నిలిపివేసి హీరోను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ పరిశ్రమలో రిషబ్ శెట్టికి బాగానే ఫాలోయింగ్ ఉంది. తుగ్లక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ బెల్ బటమ్ చిత్రంలో మంచి గుర్తింపు సాధించారు. అప్పటి నుంచి వరుస సినిమా అవకాశాలు తలుపు తట్టడంతో బిజీగా మారాడు. చదవండి: వకీల్‌సాబ్ అప్డేట్.. రెండో పాటకు రేపే ముహూర్తం! తెలంగాణ యాసలో అలరించనున్న ‘బేబమ్మ’ -
పెట్రోలు బాంబు మంటల్లో హీరోకు గాయాలు
సాక్షి, బెంగళూరు: కన్నడ సినిమా షూటింగ్లో కథానాయకుడు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తోన్న ‘హీరో’ సినిమా షూటింగులో పెట్రోలు బాంబు మంటల్లో గాయపడ్డాడు. ఇటీవల హాసన్ జిల్లా బేలూరులో పోరాట దృశ్యాల చిత్రీకరణలో ఈ ఘటన జరిగింది. స్క్రిప్ట్ ప్రకారం పెట్రోల్ బాంబు విసిరి నటులు రిషబ్, గానావి లక్ష్మణ పరారీ కావాల్సి ఉంటుంది. అయితే బాంబు విసిరి పరిగెత్తే లోపు మంటలు అంటుకుని గాయపడినట్లు సమాచారం. చదవండి: (టాలీవుడ్లో తీవ్ర విషాదం..) -
రిషబ్ చిట్‌ఫండ్స్ నిందితుల అరెస్ట్
-
రిషబ్ చిట్‌ఫండ్స్ నిందితుల అరెస్ట్
హైదరాబాద్: రిషబ్ చిట్ ఫండ్స్ మోసం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. చిట్‌ఫండ్స్ నిర్వాహకులు శైలేష్ గుజ్జర్, నందినీ గుజ్జర్లను బోయగూడలోని వారి నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని రిషబ్ చిట్‌ఫండ్ కార్యాలయానికి తీసుకువచ్చి వారి సమక్షంలోనే సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కేసులో సుమారు 600 మంది బాధితులు ఉన్నారని, దాదాపు రూ.70 కోట్ల వరకు చిట్‌ఫండ్స్ పేరిట మోసం జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలిందన్నారు. బాధితుల నుంచి తీసుకున్న డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసిందన్నారు. శైలేశ్ గుజ్జర్ ఇళ్లు, ఆఫీసులు, పలు డాక్యుమెంట్లు, బ్యాంకు అకౌంట్లు కూడా సీజ్ చేసినట్లు జోగయ్య తెలిపారు. నిందితులను రేపు కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
సీక్వెల్ పార్టీ
బడ్జెట్ 4 కోట్లు.. వసూళ్లు 50 కోట్లు. ఇలాంటి సినిమా తీస్తే తీసినవాళ్లు, కొన్నవాళ్లు పార్టీ చేసుకుంటారు. మంచి సినిమా చూసినందుకు ఆడియన్స్ పండగ చేసుకుంటారు. ‘కిరిక్ పార్టీ’ అలాంటి సినిమానే. 2016లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. రక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ చేశారు. ఈ సూపర్ డూపర్ హిట్ మూవీకి సీక్వెల్ తీయాలనే ప్లాన్‌లో ఉన్నామని రక్షిత్ శెట్టి పేర్కొన్నారు. ఆల్రెడీ ‘కిరిక్ పార్టీ 2’ అనే టైటిల్‌ని కూడా రిజిస్టర్ చేసేశారు. అయితే రక్షిత్ ప్రస్తుతం ‘అవనే శ్రీమన్నారాయణ’ అనే సినిమాతోనూ, రిషబ్ శెట్టి వేరే సినిమాతోనూ బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక సీక్వెల్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ‘‘మోస్ట్లీ ఈ ఏడాది మేలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది’’ అని రక్షిత్ పేర్కొన్నారు. అన్నట్లు.. ‘కిరిక్ పార్టీ’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నిఖిల్ హీరోగా ‘కిరాక్ పార్టీ’ పేరుతో ఈ సినిమా వచ్చే నెల 9న విడుదల కానుంది. -
రిషబ్ ముందంజ
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు రిషబ్ అగర్వాల్, విష్ణువర్ధన్ ముందంజ వేశారు. త్రివేండ్రం టెన్నిస్ క్లబ్లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో రిషబ్ అగర్వాల్ 4–6, 6–3, 6–1తో భారత్‌కే చెందిన చంద్రిల్ సూద్‌పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. మరో మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్ 3–6, 6–7 (3/7)తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–7 (3/7), 6–4, 10–3తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్ (జర్మనీ) జంటపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో ‘సూద్’ బ్రదర్స్ చంద్రిల్– లక్షిత్ (భారత్) జంట 6–1,6–2తో మొహమ్మద్ నజీమ్– గౌతమ్ కృష్ణన్ రమేశ్ జోడీపై గెలుపొందింది.