Rivals
-
పుతిన్ కక్ష సాధింపు..! ప్రత్యర్థి భార్యపై వారెంట్
మాస్కో: అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వేట ఆగలేదు. ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు కొనసాగుతోంది.గతంలో జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని భార్య యులియా నవల్నయాపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయింది. తీవ్రవాదసంస్థలో చేరినందుకుగాను వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.యులియాను రెండు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అనుమతిచ్చినట్లు మాస్కోలోని బాస్మన్నే కోర్టు వెల్లడించింది. తనపై వారెంట్ జారీ అవడం పట్ల యులియా తీవ్రంగా స్పందించారు. పుతిన్ ఒక హంతకుడు, వార్ క్రిమినల్, జైలులో ఉండాల్సిన వాడని మండిపడ్డారు. యులియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు ఆమె సిబ్బంది ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించారు.యులియా భర్త, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతిపై అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. నవాల్ని మృతి చెందిన తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకువెళతానని భార్య యులియా ప్రతిజ్ఞ చేశారు. -
Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం
ఎన్నికల ప్రచారం అనగానే ప్రత్యర్థులపై, అవతలి పారీ్టపై విమర్శలు సహజం. చాలాసార్లు పరిస్థితి వ్యక్తిగతంగా తిట్ల దండకాల దాకా వెళ్తుంది. కానీ ప్రత్యర్థులిద్దరూ మంచి స్నేహితులైతే? 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో అలాగే జరిగింది. స్నేహితులిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడ్డారు. ప్రచారం చేసుకున్నారు. అయినా మంచి స్నేహితులుగానే మిగిలారు. వాళ్లే ప్రముఖ కాంగ్రెస్ నేత విష్ణు గాడ్గిల్, పిజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ లీడర్ కేశవరావ్ జేఢే. సోషలిస్ట్ వెటరన్ బాబా అధవ్ ఆ ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటికాయనకు 22 ఏళ్లు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘గాడ్గిల్పై తిలక్ ప్రభావం ఎక్కువ. కాంగ్రెస్‌లో బ్రాహ్మణ శ్రేణి ప్రముఖునిగా ఉండేవారు. మరాఠ్వాడాకు చెందిన జేఢే బహుజన ఉద్యమ భాగస్వామి. జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్తో కలిసి పనిచేశారు. బ్రాహ్మణవాదానికి అతి పెద్ద విమర్శకుడు. 1920ల్లో వారిద్దరూ ప్రత్యర్థులు. స్వాతంత్య్రోద్యమంలో జైలుపాలయ్యాక మంచి స్నేహితులయ్యారు. దళితుల కోసం పార్వతి ఆలయాన్ని తెరవడానికి 1929లో అంబేడ్కర్ నడిపిన ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1934లో రెండు కేంద్ర అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. గాడ్గిల్ మద్దతుతో జేఢే 1938లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1947లో కాంగ్రెస్‌ను వీడి పీడబ్ల్యూపీని స్థాపించారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో పుణే సెంట్రల్ నుంచి గాడ్గిల్పైనే పోటీ చేయాల్సి వచి్చంది. ప్రత్యర్థులుగా మారినా ప్రచారంలో పరస్పర దూషణల వంటివి అస్సలుండేవి కాదు. ప్రసంగాలూ స్నేహపూర్వకంగానే సాగేవి. ఒక్కోసారి అభ్యర్థులంతా ఒకే వేదిక నుంచి ప్రచారం చేసేవారు. మొదట జేఢే, తరువాత గాడ్గిల్, చివరికి సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఎస్.ఎమ్.జోషి మాట్లాడేవారు. ఒకరినొకరు నిందించుకోలేదు. పారీ్టలను తిట్టుకోలేదు. కులపరంగా ఓట్లడగలేదు. కేవలం హామీలపైనే దృషి సారించి ప్రచారం చేశారు. గాడ్గిల్‌కు 102,692 ఓట్లు, జేఢేకు 42,200 ఓట్లొచ్చాయి’’ అని అధవ్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: వారే వీరయ్యారు!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి నిరూపించాయి. గతంలో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని, ఎత్తుకు పై ఎత్తులు వేసిన నేతలు ఇప్పుడు హఠాత్తుగా మిత్రులైపోయారు. కొత్త మిత్రుల గెలుపు కోసం లోక్‌సభ సమరాంగణంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో స్నేహితులుగా ఉన్నవారు కాస్తా ఇప్పుడు శత్రువులుగా మారి రాజకీయ చదరంగంలో కొత్త గెలుపు ఎత్తులు వేస్తున్నారు. అజిత్ వర్సెస్ కోల్హే 2019 లోక్‌సభ ఎన్నికల్లో శిరూర్ శివసేన సిట్టింగ్ ఎంపీ శివాజీరావ్ అథాల్‌రావ్ పాటిల్‌ను ఎలాగైనా ఓడించాలని అజిత్ కంకణం కట్టుకున్నారు. టీవీ, సినీ రంగ ప్రముఖుడు అమోల్ రాంసింగ్ కోల్హేను శివసేన నుంచి ఎన్సీపీలో చేర్చుకుని మరీ శివాజీరావ్పై పోటీకి దింపారు. విస్తృత ప్రచారం చేసి కోల్హేను గెలిపించారు. కానీ ఎన్సీపీ చీలిక ఎపిసోడ్లో కోల్హే అజిత్‌ను కాదని శరద్ పవార్‌కు మద్దతుగా నిలవడంతో వారిద్దరికీ చెడింది. బీజేపీ, శివసేనతో సీట్ల సర్దుబాటులో భాగంగా షిరూర్‌లో సొంత అభ్యరి్థని నిలబెట్టే అవకాశం అజిత్‌కు లభించింది. దాంతో కోల్హేను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకోసం గత ఎన్నికల్లో తానోడించిన అథాల్‌రావ్ పాటిల్‌నే కోల్హేపై పోటీకి నిలబెట్టారు! ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. వదినా మరదళ్ల వార్ బారామతిలో చాన్నాళ్లుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అజిత్ తన భార్య సునేత్రను బరిలో దింపారు. దీంతో వదినా మరదళ్లు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. పైగా అజిత్ తమ్ముడు శ్రీనివాస్, ఆయన కుటుంబీకులు సూలేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు! ఇది అజిత్ కుటుంబంలో మరో చీలికకు కారణమవుతోంది. నాడు వేర్వేరు సభలు.. ఇప్పుడు ఒకే స్థానం కోసం పోరు రాహుల్ రమేశ్ షేవలే, అనిల్ దేశాయ్ అవిభాజ్య శివసేనలో సన్నిహిత మిత్రులుగా మెలిగారు. రాహుల్ రెండుసార్లు సౌత్ సెంట్రల్ ముంబై ఎంపీగా గెలవగా అనిల్ రాజ్య సభ సభ్యునిగా ఉండేవారు. శివసేన చీలాక రాహుల్ షిండే వర్గంలో చేరగా అనిల్ ఉద్ధవ్ వర్గంలోనే కొనసాగారు. ఈసారి ఇద్దరూ సౌత్ సెంట్రల్ ముంబై నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. అనిల్‌కు ముంబై కాంగ్రెస్ చీఫ్ వర్షా గైక్వాడ్ మద్దతు పలికారు. వర్ష తండ్రి ఏక్నాథ్ను 2014 లోక్‌సభ ఎన్నికల్లో షేవలే ఓడించడమే అందుకు కారణం. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్ చాణిక్యంతో చీలికలు తేనంతవరకూ శివసేన, ఎస్సీపీ కుటుంబ పారీ్టలుగా నిక్షేపంగా ఉండేవి. వాటిలో చీలి కతో లోక్‌సభ ఎన్నికలు మహాభారత యుద్ధా న్నే తలపిస్తున్నాయి. కుటుంబసభ్యులే పరస్పరం పోటీపడుతూ ప్రత్యర్థులకు సాయం చేస్తున్నారు’’ అని సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్ అకోల్కర్ అభిప్రాయపడ్డారు. చిఖ్లీకర్ కోసం చవాన్ ప్రచారం గురువారం నాందేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బీజేపీ అభ్యర్థి ప్రతాప్ పాటిల్ చిఖ్లీకర్ ఒకే వేదికను పంచుకున్నారు. గత ఫిబ్రవరి దాకా వారిద్దరూ బద్ధ శత్రువులు. చిక్లీకర్ లోహా నుంచి శివసేన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అశోక్ చవాన్‌ను మట్టికరిపించారు. చవాన్ కూడా తాజాగా బీజేపీలో చేరడంతో వారి మధ్య వైరం మటుమాయమైంది. ఫిబ్రవరిలో బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన చవాన్ ఇప్పుడు చిక్లీకర్కు స్నేహహస్తం అందించారు. చిక్లీకర్ గెలుపు కోసం మరఠ్వాడాలో తెగ ప్రచారం చేస్తున్నారు. బరనే కోసం అజిత్... గత లోక్‌సభ ఎన్నికల్లో మావల్ నుంచి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కుమారుడు పార్థపై శివసేన నేత శ్రీరంగ్ బరనే గెలిచారు. నాటినుంచి అజిత్, బరనే మధ్య వైరం పెరిగింది. కానీ తాజా పరిణామాలతో వారి మధ్య స్నేహం చిగురించింది. శివసేనను ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి బీజేపీతో జట్టుకట్టడం తెలిసిందే. బరనే కూడా షిండే వెంట నడిచారు. దాంతో అజిత్‌తో ఆయన శత్రుత్వం సమసిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ ఈసారి బరనే కోసం ప్రచారం చేస్తున్నారు. నాడు ఓడించి నేడు ప్రచారం చేస్తూ.. బీజేపీ అధిష్టానం ఈసారి బీడ్ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రీతం ముండే స్థానంలో ఆమె సోదరి, మాజీ మంత్రి పంకజా ముండేను ఎంపిక చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ తన బంధువైన ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే చేతిలో ఓడారు. ఇప్పుడాయన అజిత్ ఎన్సీపీలో ఉన్నారు. బీజేపీతో ఎన్సీపీ చెలిమి నేపథ్యంలో పంకజ తరపున ధనంజయ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. –సాక్షి, న్యూఢిల్లీ -
TS: చేతికే చెక్ పెట్టాలి!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం తన సన్నద్ధతను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వేగవంతం చేసింది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత జాతీయ, రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఆ పార్టీ.. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎదురయ్యే పోటీపై లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల గణాంకాలు, వివిధ రూపాల్లో అందిన నివేదికల ఆధారంగా తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనన్న అంచనాకొచ్చింది. ఆ పార్టీ అనుసరించే వ్యూహాలు, ఎత్తుగడలు, ఇస్తున్న హామీలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తీరుతెన్నుల వంటి అంశాలపై లోతుగా దృష్టి సారించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు వరుస సభలు, సమావేశాలతో క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల పేరిట పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అక్కడి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల పనితీరుపై కూడా కేసీఆర్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్సే.. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2014లో 21 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, మరో 50 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 19 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ మరో 68 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఇక 2014లో ఐదు స్థానాల్లో, 2018లో కేవలం ఒకే చోట బీజేపీ అభ్యర్థులు గెలిచారు. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ పది నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలవగా, ఇందులో సగం వరకు హైదరాబాద్ నగరంలోనే ఉండటం గమనార్హం. ఈ గణాంకాలతో పాటు, ప్రస్తుతం వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వేలు, నిఘా సంస్థల నివేదికల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ప్రధాన పోటీ ఉంటుందో బీఆర్ఎస్ అధినేత విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కొంత పుంజుకున్నట్లు కనిపించినా, కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా తగ్గినట్లు అధికార పార్టీ అంచనా వేస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కొంత మెరుగయ్యే అవకాశమున్నా ప్రధాన ప్రత్యరి్థగా మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు కాంగ్రెస్‌తోనే ప్రధానంగా పోటీ ఉంటుందని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. చేరికలతో బలోపేతం రాష్ట్ర అవతరణ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ 2014 ఎన్నికల తర్వాత 25 మంది ఇతర పారీ్టల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు ఉన్నారు. టీడీపీ నిరీ్వర్యమైనా, 2018 ఎన్నికల్లో మొత్తం మీద 87 స్థానాల్లో కాంగ్రెస్ తన పట్టు ప్రదర్శించింది. 2018 తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించిన హుజూర్నగర్, మునుగోడు స్థానాలను ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో వివిధ పారీ్టల నుంచి చేరిన 25 మంది ఎమ్మెల్యేలకు తిరిగి 2018లో బీఆర్ఎస్ టికెట్లు దక్కగా, తీగల కృష్ణారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్ ఓటమి పాలయ్యారు. అయితే వీరిపై గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తర్వాతి పరిణామాల్లో బీఆర్ఎస్ గూటికే చేరుకోవడం గమనార్హం. ఈ విధంగా కాంగ్రెస్ కుదేలైనట్లు కనిపిస్తున్నా పొంగులేటి, జూపల్లి వంటి నేతలు ఆ పారీ్టలో చేరితే ఆ పార్టీయే తమ ప్రధాన ప్రత్యరి్థగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు పార్టీ 2014 2018 కాంగ్రెస్ 07 12 టీడీపీ 12 02 వైఎస్సార్సీపీ 03 – బీఎస్పీ 02 – సీపీఐ 01 – ఇతరులు – 02 మొత్తం 25 16 -
ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. కళ్లలో కారం చల్లి..
సాక్షి,నిడమనూరు(నల్గొండ): ఉదయం 8:30 గంటల ప్రాంతం.. ఇంట్లోని వారంతా తలా ఒక పని చేసుకుంటున్నారు.. ఇంతలోనే ముగ్గురు వ్యక్తులు కత్తులు, కారం డబ్బాలతో ఒక్కసారిగా ఇంటిపై దాడి చేశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కళ్లలో కారం చల్లి.. కత్తులతో పొడుస్తూ వీరంగం సృష్టించారు.. కళ్లు మూసి తెరిచేలోపల వృద్ధురాలి ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదేదో సినిమాలోని సీన్ కాదు.. నిడమనూరు మండలం బొక్కమంతులపాడ్‌లో రాయలసీమ ఫ్యాక్షన్‌ను తలపించేలా ఓ కుటుంబంపై మంగళవారం జరిగిన దాడి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతులపాడ్ గ్రామానికి చెందిన కమతం భిక్షమయ్య, అచ్చమ్మ(60) దంపతుల కుమారుడు శివనారాయణకు అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ, యశోద దంపతుల కూతురు శ్యామలతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివనారాయణ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా కాలంలో ఐటీ రంగం దెబ్బతినడంతో రెండేళ్లుగా గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. తరచూ గొడవలే.. శివనారాయణ, శ్యామల దంపతులకు మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో తరచూ శ్యామల పుట్టింటి వారు జోక్యం చేసుకుంటుండడంతో వివా దం పెద్ద మనుషుల వద్దకు చేరింది. పలుమార్లు పంచాయితీలు జరిగినా దంపతుల మధ్య గొడవలు ఆగడం లేదు. దీంతో శివనారాయణ భార్యను పుట్టింటికి వెళ్లనీయడం లేదు. ఫలితంగా రెండు కుటుంబాల మధ్య కక్షలు పెరిగిపోయాయి. దాడి చేసి.. ప్రాణం తీసి.. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకే వీధిలో ఉంటున్న సూర్యనారాయణ, యశోద దంపతులు కుమారు డు శివతో కలిసి ఉదయం వియ్యంకుడు భిక్షమయ్య ఇంటిపై కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా అరుచుకుంటూ వచ్చిన వారు తొలుత కళ్లలో కారం చల్లి, కత్తులతో కమతం అచ్చమ్మ గుండె, వీపు భాగంలో పొడిచారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అనంతరం భోజనం చేస్తున్న భిక్షమయ్యపై దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లుతూ కత్తులతో విచక్షణారహితంగా పొడుస్తూ వీరంగం సృష్టించారు. శివనారాయణపై దాడి చేయగా అతడి భార్య శ్యామల అడ్డువచ్చింది. అనంతరం అచ్చమ్మ తల్లి నారాయణమ్మపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో వీరి అరుపులు, కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకోగానే వారు పారిపోయారు. దాడిలో గాయపడిన భిక్షమయ్య, నారాయణమ్మ, శివనారాయణను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం మేరకు సాగర్ సీఐ గౌరీనాయుడు, ఎస్ఐ సైదులు ఘటన స్థలాన్ని పరి శీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుడు శివనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, దాడి చేసిన నిందితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. చదవండి: ‘కొడుకా.. ఎంత పనాయె.. నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా’ -
వ్యాపారంలో తలెత్తిన వివాదం.. రూ.లక్ష సుపారి ఇచ్చి అంతమొందించాడు
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో భాగస్వామిని హత్య చేసిన వ్యక్తితో పాటు హత్యలో పాల్గొన్న సుపారి హంతకులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. షేక్‌పేట్ గుల్షన్ కాలనీకి చెందిన నసీర్ అహ్మద్ ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రషీద్ ఖాన్‌తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే సంవత్సరం నుంచి వీరి మధ్య వివాదం నెలకొంది. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని రషీద్ ఖాన్.. నసీర్ అహ్మద్‌తో చెప్పేవాడు. అయితే డబ్బులు ఇచ్చేది లేదని నసీర్ అహ్మద్ ఖరాఖండిగా తేల్చేశాడు. దీంతో కక్ష పెంచుకున్నాడు. తన తమ్ముడు అంజద్ ఖాన్‌తో రషీద్ పథకం వేశాడు. రషీద్ ఆదేశాల మేరకు అంజద్ ఖాన్ సయ్యద్ షా అక్బర్ అలీ, నియాజ్ మహ్మజ్ హాజీ, మీర్జా ఫయాజ్ అలీ బేగ్, ఉమర్ ఫారూక్ రూ.లక్షకు సుపారి ఇచ్చి అంతమొందించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజద్, రషీద్ ఆదేశాల మేరకు సుపారి హంతకుల ముఠా ఈనెల 2న గుల్షన్ కాలనీలో స్కూటర్ పై వెళ్తున్న నసీర్ అహ్మద్‌ను కత్తులతో పొడిచి పారిపోయారు. కాగా నసీర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రషీద్‌ఖాన్, అంజద్ ఖాన్‌తో పాటు సయ్యద్ షా, అక్బర్ అలీ, నియాజ్ మహ్మద్ హాజి, మీర్జా ఫయాజ్ అలీబేగ్, ఉమర్ ఫారూక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వైఎస్సార్సీపీ నేతపై హత్యాయత్నం
గాలివీడు: వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం తూముకుంట పంచాయతీ పరిధిలోని మరికుంటపల్లెకు చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కుడుముల బయారెడ్డిపై ప్రత్యర్థి వర్గీయులు సోమవారం హత్యాయత్నం చేశారు. పొలం వెళుతున్న బయారెడ్డిని ప్రత్యర్థులు ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన బయారెడ్డి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పరుగున అక్కడకు వచ్చారు. గమనించిన ప్రత్యర్థులు అక్కడినుంచి పారిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి గాయపడిన బయారెడ్డిని రాయచోటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వేలూరుకు తరలించారు. రౌడీషీటర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు ఈ హత్యాయత్నానికి సంబంధించి బయారెడ్డి కుమార్తె లావణ్య ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు గాలివీడు ఎస్ఐ ఇనాయతుల్లా తెలిపారు. భూతగాదాలు, రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే తమ తండ్రిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామానికి చెందిన రౌడీషీటర్ ఈశ్వరరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, భూషణ్‌రెడ్డిల ప్రమేయం ఉందని తెలిపారు. దీంతో ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ హత్యాయత్నం విషయం తెలిసిన వెంటనే లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సీఐ విలేకరులతో మాట్లాడుతూ నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బయారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరా తీశారు. ఫోన్లో బయారెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్ -
‘లావుగా ఉన్నానన్నాడు.. అందుకే చంపేశా’
లక్నో : గ్యాంగ్‌స్టర్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ మున్నా బజరంగీ సోమవారం ఉదయం బాగ్పట్ జైల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. అదే జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతీ బజరంగీని తుపాకితో కాల్చి చంపాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడిలో ఉన్న రాతీ విచారణలో ‘బజరంగీ తనను లావుగా ఉన్నాని హేళన చేశాడని, అందుకే తాను బజరంగీని హత్య చేసినట్లు’ తెలిపాడు. ఈ విషయం గురించి రాతీ ‘ఆ రోజు నేను మా గదిలో ఎప్పటిలానే నడుస్తూ ఉన్నాను. ఇంతలో బజరంగీ నన్ను దాటుకుని ముందుకు వెళ్లి, నేను చాలా లావుగా ఉన్నానంటూ హేళన చేయడం ప్రారంభించాడు. నేను అతని మాటలను వ్యతిరేకించాను. నన్ను హేళన చేయవద్దని చెప్పాను. అయినా అతను వినలేదు. దాంతో మా మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇంతలో బజరంగీ ఉన్నట్టుండి తుపాకీ తీశాడు. దాంతో నేను అతన్ని కొట్టి అతని చేతిలో నుంచి తుపాకీని లాక్కున్నాను. వెంటనే ఆ తుపాకీలో ఉన్న తుటాలన్నింటిని బజరంగీ తలలోకి దింపేశాను’ అన్నాడు. అనంతరం ఆ తుపాకీని బయట మురుగు కాల్వలో పడేశానని తెలిపాడు. అయితే రాతీ, బజరంగీ మధ్య గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న మరో ఖైదీ రాతీ వ్యాఖ్యలను ఖండించాడు. అసలు వారిద్దరి మధ్య ఎటువంటి గొడవ జరగలేదని తెలిపాడు. రాతీ కావాలనే బజరంగీపై దాడి చేశాడని.. కనీసం బజరంగీకి పారిపోయే అవకాశం కూడా దొరకలేదని తెలిపాడు. వీరిద్దరి మాటలను రికార్డు చేసిన పోలీసు అధికారులు ‘బజరంగీని అతని శత్రువులు పథకం ప్రకారమే హత్య చేయించి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కేసు నిమిత్తమై కోర్టులో ప్రవేశపెట్టేందుకు గాను బజరంగీని ఆదివారమే ఝాన్సీ జైలు నుంచి బాగ్పట్ జైలుకు తీసుకువచ్చారుము. కాబట్టి రాత్రికి రాత్రే బజరంగీ ఆయుధాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లేదు అని పోలీసులు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఆడి రికార్డు అమ్మకాలు
బెర్లిన్: జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ ఆడి 2016 లో దూసుకుపోయింది. గత సంవత్సరం డీజిల్ ఉద్గారాలు కుంభకోణంలో అభియోగాలు, ప్రత్యర్థుల గట్టి పోటీ ఉన్నప్పటికీ, విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఫోక్స్ వ్యాగన్ గ్రూపు లగ్జరీకార్లు, స్పోర్ట్స్ యుటిలీటీ వాహనాల అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2015 నాటి 1.80 మిలియన్ల వాహనాల విక్రయాలతో పోలిస్తే 2016, డిసెంబర్ అమ్మకాల్లో 1.87 మిలియన్ యూనిట్లను సాధించినట్టు కంపెనీ ప్రతినిధి శనివారం వెల్లడించినట్టు నివేదికలు చెబుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లో నెం. 2గా ఉన్న ఆడి బ్రిటన్ లో 6.4 శాతం, యునైటెడ్ స్టేట్స్ లో 4 శాతం, ఎక్కువ అమ్మకాలు సాధించింది. అయితే కంపెనీ అధికారిక లెక్కల్ని సోమవారం (జనవరి 9) ప్రకటించనుంది. అయితే ఎమిషన్స్ స్కాంతో గ్లోబల్ లగ్జరీ కార్ల బ్రాండ్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి పడిపోయినా అమ్మకాల్లో హవా కొనసాగించింది.ప్రదాన పత్యర్థులు మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూలతో పోలిస్తే ర్యాకింగ్స్ లో రెండు స్థానాలు వెనుకబడిందని నిపుణుల అంచనా. మరోవైపు ఉద్గారాల కుంభకోణంపై ఇంకా ఎలాంటి తీర్పు వెలువడకపోయినప్పటికీ.... లగ్జరీ కార్ మేకర్ ఆడి అమెరికాలో డీజిల్ కార్ల అమ్మకాలను మళ్లీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
రౌడీషీటర్ నాగాకు స్పాట్
శివమొగ్గలో పేరు మోసిన రౌడీ బెయిల్‌పై బయటకు వచ్చి ప్రత్యర్థుల చేతిలో హతం నిందితుడిపై గూండా చట్టం శివమొగ్గ : పట్టణంలో పేరు మోసిన రౌడీ నాగరాజు అలియాస్ స్పాట్ నాగ (38) మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు మారణాయుధాలతో విచక్షణా రహితంగా నరికివేశారు. వివరాలు... పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళ్తుండగా అతనికి ఎటువ ంటి అనుమానం రాకుండా వెంబడించిన ప్రత్యర్థులు బీహెచ్ రోడ్డు వద్ద చుట్టుముట్టారు. మారణాయుధాలతో విచక్షణారహితంగా నరికివేశారు. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం నాగ హత్యతో స్థానికులు హడిలిపోయారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కౌశలేంద్రకుమార్, అడిషనల్ ఎస్పీ దయాల్, డీవైఎస్పీ శివకుమార్, ఇన్స్పెక్టర్ మంజునాథ్ సంఘటన స్థాలాన్ని పరిశీలించారు. దొడ్డపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్పాట్ నాగ హత్యకు సంబంధించి తమిళ రమేష్, రౌడీ హంది (పంది) అణ్ణి సోదరులు గిరిష్, బీఆర్పీ రఘు, మరి కొంత మంది హస్తం ఉందని నాగ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం ఎస్పీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పేరుమోసిన రౌడీ : శివమొగ్గలో స్పాట్ నాగపై పలు హత్యలు, దోపిడీలు, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఓ కేసులో జైలులో ఉన్న నాగ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. బయటకు వచ్చినా కూడా నేరవృత్తి వీడలేదు. నాగకు రౌడీ హెబ్బెట్టు మంజుతో పాత కక్షలు ఉన్నా యి. జైలులో ఉండగానే నాగను హత్య చేయడానికి పథకం రచించారని తెలుసుకున్న జైలు సిబ్బంది నాగను మరోజైలుకు తరలించారు. వీరి నేర ప్రవృత్తిని అదుపు చేయాలని జిల్లా కలెక్టర్ విపుల్ బన్సాల్, ఎస్పీ నాగపై గుండా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే 15 రోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన నాగ హత్యకు గురికావడంతో పోలీసులు నిఘాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.