Rohtak court
-
దళితున్ని పెళ్లి చేసుకుందని కోర్టు ఆవరణలోనే..
చండీగఢ్ : పంజాబ్‌లో ఘోరం చోటుచేసుకుంది. దళిత యువకున్ని పెళ్లిచేసుకుందని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కాల్చిచంపాడో కసాయి తండ్రి. ఈ ఘటన రోహ్తక్ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఆమెకు రక్షణగా ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. బావమరిది కూతురు మమతను రమేష్ 2002లో దత్తత తీసుకున్నాడు. మమత సోంబిర్ అనే దళిత యువకున్ని ప్రేమించారు. గతేడాది ఆగస్టులో ఇంటినుంచి వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకున్నారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన రమేష్ తన మైనర్ కూతురుకు మాయమాటలు చెప్పి సోంబిర్ ఇంచి నుంచి తీసుకుపోయాడని కేసు పెట్టి అరెస్టు చేయించాడు. అయినప్పటికీ మమత ఇంటికి రాలేదు. ఇదిలా ఉండగా.. సోంబిర్‌పై కేసు విచారణ సందర్భంగా బుధవారం కోర్టుకి వస్తున్న మమతను రమేష్ ఇంటికి రావాల్సిందిగా కోరాడు. కానీ, ఆమె ససేమిరా అనడంతో కోపోద్రిక్తుడయ్యాడు. తమకళ్లెదుటే ‘మరో రెండు గంటల్లో నిన్ను చంపేస్తా’నంటూ రమేష్ హెచ్చరించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన మమతపై మోటర్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారనీ, పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ నరేందర్ కూడా కాల్పుల్లో గాయపడి మరణించాడని పోలీసులు వెల్లడించారు. మమత మైనారిటీ మరో కొద్దిరోజుల్లో తీరిపోనుండడంతో రమేష్ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. -
గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష
రోహ్టక్: మానసిక వికలాంగురాలిని (28) సామూహిక అత్యాచారం చేసి, కిరాతకంగా హత్య చేసిన కేసులో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. దోషులకు ఒక్కొక్కరికీ 1.75 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించారు. సోమవారం హరియాణాలోని రోహ్టక్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో పరారైన ఎనిమిదో నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న బాలనేరస్తుడు జువెనైల్ కోర్టును ఆశ్రయించాడు. నేపాల్‌కు చెందిన బాధితురాలు రోహ్టక్లోని తన సోదరి ఇంట్లో ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆమె అదృశ్యమైంది. అదే నెల 4న బహు అక్బర్పూర్ గ్రామంలో ఆమె శవమైతేలింది. ఆమెను సామూహిక అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసినట్టు పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైంది. ఆమె శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోపల రాళ్లు ఉన్నట్టు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత అపస్మారకస్థితిలోకి వెళ్లిందని, తాము ఇటుకలతో ఆమె మర్మాంగాలపై దాడి చేసినట్టు విచారణలో నిందితులు చెప్పారు. మద్యంమత్తులో విచక్షణరహితంగా ప్రవర్తించామని, ఎందుకు అలా చేశామో తెలియదని ఓ నిందితుడు చెప్పాడు.