rollover
-
ట్యాంకర్ బోల్తా...వేల లీటర్ల పాలు వృథా
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వద్ద ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకటేశ్వర రావు(40) గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ ట్యాంకర్లో పాలు నిండుగా ఉండటంతో పాలన్నీ వృధాగా పోయాయి. సుమారు పదిహేను వేల లీటర్ల పాలు వృధాగా పోయి ఉంటాయని అంచనా. బోల్తా పడిన ట్యాంకర్ గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి ట్రేడర్స్‌కు చెందిన పాల ట్యాంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి నుంచి హైదరాబాద్‌లోని హెరిటేజ్ సంస్థకు పాలను తెస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. -
ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి
కరీంనగర్ జిల్లా : ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో ట్రాక్టర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ గొడుగుల భూమయ్య(53) అక్కడికక్కడే మృతిచెందాడు. పొలం వద్ద నీళ్లు నింపుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భూమయ్య స్వగ్రామం బండకల్. భూమయ్య మృతితో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడవి పంది అడ్డురావడంతో..
ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూర్ మండలం అందోలి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూపాను వాహనం బోల్తా పడి ముగ్గురు మృతిచెందారు. వివరాలు..కొమరం భీం జిల్లా జైనూరు మండలం జంగావ్ గ్రామానికి చెందిన కొంతమంది తూపాను వాహనంలో పెళ్లి శుభకార్యం(వలీమా)నకు మహారాష్ట్రలోని కిన్వట్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా అడవిపంది దారికి అడ్డుగా రావడంతో డ్రైవర్ దానిని తప్పించబోయాడు. ఈ గందరగోళంలో వాహనం అదుపుతప్పడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..ఎనిమిదికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా..మార్గమధ్యంలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటనతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపు తప్పి ద్విచక్రవాహనం బోల్తా
చిన్నమండెం(రాయచోటి రూరల్) : చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన గ్రామం నాగూరివాండ్లపల్లెలో ఆదివారం సాయంత్రం అదుపు తప్పిన ద్విచక్రవాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో దేవగుడిపల్లెకు చెందిన ఎన్. కాళేశ్వరబాబు(24) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పడమటికోనకు చెందిన ఏ.వెంకటేష్(22) తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. డిగ్రీ చదువుతున్న సమయంలో కాళేశ్వరబాబు, వెంకటేష్‌లు స్నేహితులు. వీరు ద్విచక్రవాహనంలో చిన్నమండెం వైపు నుంచి కలిబండ వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో నాగూరివాండ్లపల్లెలో ఉన్న మలుపు వద్ద మీ సేవ ఎదురుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాతిని ఢీ కొన్నారు. దీంతో తలకు తీవ్రగాయమైన కాళేశ్వర మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. చిన్నమండెం ఏఎస్ఐ నాగరాజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా
-
గుంటూరు హైవేపై కారు బోల్తా
-
సుమో బోల్తా..యువకుడి మృతి
రామాయంపేట: రామాయంపేట మండలం కోమటిపల్లి వద్ద ఆదివారం అదుపుతప్పి ఓ సుమో బోల్తాపడింది. ఈ ఘటనలో నస్కల్ గ్రామానికి చెందిన నరేందర్ అనే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీసీఎం వ్యాన్ బోల్తా : 8మందికి గాయాలు
పినపాక: ఖమ్మం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. పినపాక మండలం మల్లారం మూలమలుపు వద్ద డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వాళ్లంతా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పినపాక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.