ట్రాక్టర్ కింద భూమయ్య మృతదేహం
కరీంనగర్ జిల్లా : ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో ట్రాక్టర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ గొడుగుల భూమయ్య(53) అక్కడికక్కడే మృతిచెందాడు. పొలం వద్ద నీళ్లు నింపుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భూమయ్య స్వగ్రామం బండకల్. భూమయ్య మృతితో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment