roshan Mahanama
-
ఛాయ్, బన్లు అందిస్తున్న లంక మాజీ క్రికెటర్
Ex Lankan Cricketer Serves Tea, Buns: శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పలు హింసాత్మక అల్లరుల తదనంతరం శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక కొత్త ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది కూడా. అదీగాక విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా కష్టంగా మారింది. అంతేకాదు ఇంధన సంక్షోభాన్ని సైతం ఎదుర్కొంటుంది. దీంతో అక్కడ ప్రభుత్వం అనవసర ప్రయాణాలను సైతం తగ్గించుకోమని ప్రజలకు సూచించింది కూడా. ఈ మేరకు శ్రీలంకలో పెట్రోల్ బంక్‌ల వద్ద జనాలు ఇంధనం కోసం క్యూలో నిలుచుని పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా పెట్రోల్ బంక్‌ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...క్యూలో ఉన్నవాళ్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. పైగా అంతసేపు నుల్చుని ఉండటంతో ఆకలిగా కూడా ఉండోచ్చు. అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన సమయం ఇది. అందుకే ఇలా చేశానని చెప్పాడు. అలాగే ప్రతిఒక్కరిని తమ కోసం కాకపోయిన మన పక్కవారి కోసమైన ఏమైన ఆహార పదార్థాలు తీసుకువెళ్లడం మంచిది. ఎవరికైన బాగోకపోతే అత్యవసర నెంబర్ 1990కి కాల్ చేయండి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉంటూ..మద్దతు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ క్రికెటర్ రోషన్ మహానామా తాను ప్రజలకు సర్వ్ చేసిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేస్తూ నెటిజన్లతో ఈ విషయాలను పంచుకున్నారు. We served tea and buns with the team from Community Meal Share this evening for the people at the petrol queues around Ward Place and Wijerama mawatha. The queues are getting longer by the day and there will be many health risks to people staying in queues. pic.twitter.com/i0sdr2xptI — Roshan Mahanama (@Rosh_Maha) June 18, 2022 (చదవండి: ‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’) -
ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో రిచర్డ్సన్
దుబాయ్ : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ రిచీ రిచర్డ్సన్ ఇక మ్యాచ్ రిఫరీగా మారనున్నారు. గతవారం శ్రీలంకకు చెందిన రోషన్ మహానామా వైదొలగడంతో ఆయన స్థానంలో ఐసీసీ మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్లో రిచర్డ్సన్ను చేర్చారు. ప్రస్తుతం విండీస్ జట్టు మేనేజర్‌గా ఉన్న ఆయన ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జనవరి 3 వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిఫరీగా బాధ్యతలు తీసుకుంటారని ఐసీసీ పేర్కొంది. ఈ ప్యానెల్లో ఉండే ఏడుగురు రిఫరీల్లో భారత్ నుంచి మాజీ పేసర్ శ్రీనాథ్ కూడా ఉన్నారు. -
రిఫరీ పదవికి గుడ్‌బై చెప్పనున్న మహనామా
శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహనామా... ఈ ఏడాది చివర్లో మ్యాచ్ రిఫరీ పదవి నుంచి తప్పుకుంటున్నాడని ఐసీసీ వెల్లడించింది. 2004లో ఎలైట్ ప్యానెల్లో చేరిన మహనామా ఇప్పటి వరకు 58 టెస్టులు, 222 వన్డేలు, 35 టి20, మూడు ప్రపంచకప్‌లతో పాటు 2009 చాంపియన్స్ ట్రోఫీలోనూ రిఫరీగా వ్యవహరించారు. ఐసీసీతో ఉన్న ఒప్పందం కంటే ఆరు నెలల ముందే ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నారు. -
అంపైరింగ్ కు మహనామా గుడ్ బై!
దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘమైన సేవలందించిన రోషన్ మహనామా తన అంపైరింగ్ జీవితానికి త్వరలో వీడ్కోలు చెప్పనున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐసీసీ రిఫరీస్ ఎలైట్ ప్యానెల్ లో కొనసాగుతున్న మహనామా అంపైరింగ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. మహనామా కాంట్రాక్టు మరో ఆరు నెలలు ఉన్నా.. కుటుంబంతో అత్యంత సమయం గడపాలనే కారణం చేత ప్యానెల్ నుంచి బయటకొస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ ఏడాది చివర్లో మహనామా అంపైరింగ్ సేవల నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. శ్రీలంక క్రికెట్ లో విశేష సేవలందించిన మహనామా.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో 2004 సభ్యత్వం స్వీకరించారు. అటు తరువాత 222 వన్డేలు, 58 టెస్టులు, 35 ట్వంటీ 20 మ్యాచ్ లకు మహనామా అంపైర్ గా, రిఫరీగా పనిచేశారు . ఇందులో మూడు వరల్డ్ కప్ లతో పాటు, 2009లో జరిగిన ఐసీసీ చాంపియ్స్ ట్రోఫీ కూడా ఉండటం విశేషం. దాదాపు 12 సంవత్సరాల పాటు మహనామా ఐసీసీ ప్యానెల్లో కొనసాగారు. అటు ఆటగాడిగా, అంపైర్ గా, రిఫరీగా సుమారు 600 మ్యాచ్ లు అనుభవం మహనామా సొంతం. శ్రీలంక క్రికెట్ జట్టు తరుపున 1986 నుంచి 1999 వరకూ సేవలందించిన మహనామా 52 టెస్టులు, 213 వన్డేలు ఆడారు. 1996 లో శ్రీలంక సాధించిన వరల్డ్ కప్ లో మహనామా సభ్యుడు కావడం మరో విశేషం.