Rowdy Sheets
-
ఓటర్లపైనా రౌడీషీట్లు!
దర్శి: నిన్నటి వరకూ వారిపై ఎలాంటి కేసులూ లేవు.. అయితే ఒక్కసారిగా వారిపై రౌడీఓటర్లపైనా రౌడీషీట్లు ఓపెన్ అయ్యాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఎనిమిది మందిపై. అందులో ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందిన బూత్ ఏజెంట్లు. మరో ముగ్గురు ఓట్లు వేసేందుకు వచ్చిన వారు. వారికి ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదు. పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎం ధ్వంసం చేసిన వారిపై నామమాత్రం కేసులు పెట్టి చేతులు దులుపుకున్న దర్శి పోలీసులు.. వీరిపై ఎందుకు రౌడీషీట్ పెట్టారో అర్థంకాని విషయం. వాస్తవానికి ఎవరిపైనైనా రౌడీషీట్ తెరవాలంటే మూడు క్రిమినల్ కేసులు తప్పనిసరిగా ఉండాలి. కనీసం 307 కేసైనా అయి ఉండాలి. లేదా తరచూ నేరాలు చేసేవారి పైరౌడీషీట్ వేస్తారు. కానీ ఎలాంటి కేసులు లేని సామాన్యులపై వైఎస్సార్సీపీ మద్దతుదారులు అనే నెపంతో రౌడీషీట్లు తెరిచిన దర్శి పోలీసులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి దర్శి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెళ్లారు. ఆయన వెళ్లాక పోలీసులు రౌడీషీట్లు ఓపెన్ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు పోలింగ్ రోజు ఏం జరిగిందంటే.. టీడీపీ అరాచకం సృష్టిస్తున్నా.. అడ్డుకోని పోలీసులు ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు దర్శి పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలోని 117, 118 బూత్‌లలోకి సాయంత్రం ఆరు గంటలు దాటాక టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త లలిత్ సాగర్లతో పాటు అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు, తమ్ముడు గొట్టిపాటి భరత్‌లతో పాటు మరో 50 మంది నరసరావుపేటకు చెందిన వారు బూత్‌లోకి ఎగబడి ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసు సిబ్బంది తోపాటు ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు కూడా అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 6 గంటలు దాటాక బూత్‌లోకి రావడంపై ఏజెంట్లు ప్రశ్నిస్తున్నా పోలీసులు నోరు మెదపలేదు. దీంతో అక్కడ ఓటర్లుగా ఉన్నవారు, ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా వారిని అడ్డుకున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీ అక్కడే ఉన్నా చోద్యం చూస్తూ ఊరుకున్నారే గానీ వారిని అడ్డుకున్న పాపాన పోలేదు. అంతే కాకుండా అభ్యర్థి మామ కడియాల వెంకటేశ్వరరావు.. నిబంధనలకు విరుద్ధంగా నేరుగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి నానా రభస చేసినా వారిని బయటకు పంపలేదు. ఏ పోలీసు ఆయన్ను అడ్డుకుని బయటకు పంపేందుకు సాహసం చేయకపోవడం గమనార్హం. అదే సమయంలో ఓటు వేసేందుకు లైన్లో నిలబడిన వారు సమయం దాటినా ఎందుకు లోపలకు వెళ్తున్నారని వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో గొడవ కాస్త పెద్దదైంది. చోద్యం చూస్తున్న పోలీసులను ఓటర్లు నిలదీయడంతో అప్పుడు పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ అభ్యర్థి పోలీసుల కళ్లెదుటే తన అనుచరులను(నరసరావుపేటకు చెందిన వారిని) రెచ్చగొట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు పోలీసులపై, పోలింగ్ బూత్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తమిళనాడుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్‌కు ఓ రాయి కడుపులో తగిలింది. దీంతో కిందపడిపోయిన పోలీసుపై కూడా విచక్షణ రహితంగా రాళ్లు రువ్వారు. అల్లరి మూకలు డీఎస్పీపై కూడా రాళ్లు రువ్వడంతో పోలీసులు తమ గార్డులు అడ్డుపెట్టి డీఎస్పీని బూత్ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఇంత రభస చేసినా నరసరావుపేటకు చెందిన వారిని వదిలేసి స్థానికులపై కేసులు పెట్టి మమ అనిపించారు. అలాగే పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో పోలింగ్ బూత్‌లో ఈవీఎంను టీడీపీ నాయకుడు వీసీరెడ్డి ధ్వంసం చేశాడు. పోలీసులు పట్టుకుని వచ్చి 41 నోటీసులు ఇచ్చి సరిపెట్టారేగానీ, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కళ్లు తిరుగుతున్నాయంటూ వీసీ రెడ్డి డ్రామా ఆడి ఆస్పత్రి నుంచి పోలీసుల కన్ను కప్పి పారిపోయాడు. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగుల గొట్టారన్న ఆరోపణ వీడియో బయటకు వచ్చాక హడావుడిగా పోలీసులు వీసీరెడ్డిని పిలిపించి అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. ఇంత చేసిన వీసీరెడ్డి పై మాత్రం ఎలాంటి రౌడీïÙట్ పెట్టక పోవడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. అలాగే పోలింగ్ బూత్‌లో చొరబడి గందరగోళం సృష్టించిన, పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై మొక్కుబడిగా కేసులు పెట్టిన పోలీసులు.. వైఎస్సార్సీపీకి చెందిన బూత్ ఏజెంట్లు, సామాన్యులపై రౌడీషీట్లు తెరవడం విస్మయం కలిగిస్తోంది. పోలింగ్‌కు 48 గంటల ముందే బయట ప్రాంతానికి చెందిన వారు నియోజకవర్గాల్లో ఉండకూడదన్న నిబంధన ఉంది. అయితే అంత మంది నరసరావుపేటకు చెందిన వారు పట్టణంలో ఎలా ఉన్నారో దర్శి పోలీసులే చెప్పాలి. -
రౌడీషీట్లు తెరవచ్చు
సాక్షి, అమరావతి: ఏపీ పోలీస్ మాన్యువల్, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ (పీఎస్వో) ప్రకారం రౌడీ షీట్లు తెరవడం, కొనసాగించడం, రౌడీలుగా ప్రకటించడం, వ్యక్తులపై నిఘాకు వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది. ప్రాథమికంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు చెల్లవని ధర్మాసనం ప్రకటించింది. సింగిల్ జడ్జి తీర్పునకు అనుగుణంగా ఆయా వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్లు , హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు లాంటి వాటిని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తిరిగి తెరవడానికి వీల్లేదని పోలీసులకు తేల్చి చెప్పింది. అయితే ఆ వ్యక్తులపై తాజాగా ఏవైనా ఆధారాలుంటే వాటి ప్రకారం రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవొచ్చని స్పష్టం చేసింది. అనుమానితుడిపై, నిందితుడిపై నిఘా వేయాలనుకుంటే పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారమే ఆ పని చేయాలని ఆదేశించింది. ఎవరైనా వ్యక్తి / నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు పిలవాలంటే చట్ట ప్రకారం, పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని తేల్చి చెప్పింది. వేలిముద్రల సేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగానే చేయాలని పేర్కొంది. అరెస్ట్ ఉత్తర్వులను అమలు చేసేందుకు, ఏదైనా కేసులో అనుమానితుడు, నిందితుడు అవసరమైనప్పుడు మినహా రాత్రి వేళల్లో వారి ఇళ్లకు వెళ్లరాదని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ బండారు శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీల్... పోలీసులు రౌడీషీట్లు తెరవడాన్ని, కేసులు కొట్టివేసినా వాటిని కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు 57 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ సోమయాజులు ఇటీవల తీర్పు వెలువరిస్తూ అసలు పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌కు చట్టబద్ధతే లేదని తేల్చి చెప్పారు. చట్టం అనుమతి లేకుండా పీఎస్వో ప్రకారం వ్యక్తులపై రౌడీషీట్లు తెరవడం, కొనసాగించడం, వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం లాంటి వాటిని చేయడానికి వీల్లేదన్నారు. పీఎస్ఓ ప్రకారం ఏళ్ల తరబడి చేస్తూ వస్తున్న ఫోటోల సేకరణ, స్టేషన్లలో ప్రదర్శించడం, ఇళ్లను సందర్శించడం, స్టేషన్‌కు పిలిపించడం, స్టేషన్లో గంటల పాటు వేచి ఉండేలా చేయడం తదితరాలన్నీ వ్యక్తుల గోపత్య హక్కుకు విఘాతం కలిగించేవేనన్నారు. పోలీసులు ఇప్పటి నుంచి పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఇలాంటి పనులు చేయడానికి, వ్యక్తులపై అనుచిత నిఘా పెట్టడానికి వీల్లేదని ఆదేశిస్తూ ఈ ఏడాది జూలై 15న సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ వేశారు. తాజాగా హైకోర్టు ధర్మాసనం దీనిపై తీర్పు వెలువరించింది. 60 ఏళ్లుగా రౌడీషీట్లు తెరుస్తూనే ఉన్నారు.. ‘మద్రాసు నుంచి విడిపోయిన తరువాత 1954 వరకు అప్పటి మద్రాసు ఇన్స్పెక్టర్ జనరల్ జారీ చేసిన పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌ను ఆంధ్ర రాష్ట్రం యథాతథంగా అన్వయించుకుంది. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంత) జిల్లా పోలీసు చట్టం 1859ని పూర్తి స్థాయిలో అమలు చేయడం మొదలైంది. ఇందులో పోలీసుల విధులు, బాధ్యతలు, నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, నేరస్తులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టడం లాంటి వాటి గురించి స్పష్టంగా పేర్కొన్నారు. నేరాలను నియంత్రించేందుకు గత 60 ఏళ్లుగా రౌడీషీట్లు తెరవడమన్న ఆచారం కొనసాగుతూనే ఉంది. గతంలో సుంకర సత్యనారాయణ కేసులో పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కార్యనిర్వాహక మార్గదర్శకాలేనని హైకోర్టు పేర్కొంది. అయినా ఈ కారణంతో రౌడీషీట్లు తెరవడాన్ని మాత్రం కొట్టేయ లేదు. రౌడీషీట్లు తెరవడం, మూసివేయడాన్ని క్రమబదీ్ధకరించే విషయంలో పలు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రౌడీషీట్ల విష యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాది వాదనను తోసిపుచ్చలేం.. ‘కేఎస్ పుట్టస్వామి కేసులో గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకుంటూ రౌడీషీట్లు తెరవడం, నిందితులపై నిఘా ఉంచడం లాంటివి వ్యక్తి గోప్యతా హక్కుకు విఘాతం కలిగించేవని తేల్చారు. అయితే ప్రభుత్వ న్యాయవాది (హోం) మాత్రం పుట్టస్వామి కేసుకు ఈ కేసుతో ఎంతమాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఆధార్ కార్డు జారీ సమయంలో వ్యక్తుల వివరాలను అడగడం గోప్యత హక్కుకు విఘాతమని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రభుత్వ న్యాయవాది ఈ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆ వాదన ప్రకారం ఈ కేసు నేరాన్ని నియంత్రించేందుకు అనుమానితులు, నిందితులపై తెరిచిన రౌడీషీట్లకు సంబంధించింది మాత్రమే. ప్రభుత్వ న్యాయవాది వాదనను ఈ దశలో ఏ రకంగానూ మేం తోసిపుచ్చలేం. ఒక వ్యక్తిపై రౌడీషీట్ తెరవడం అతడికి రాజ్యాంగం ప్రసాదించిన గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లా? అన్నది ఇక్కడ ప్రశ్న. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం తమ ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. -
AP High Court: పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ చెల్లవు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, అమరావతి: రౌడీ షీట్లు తెరవడం.. కొనసాగించడం... రౌడీలుగా ప్రకటించడం.. వ్యక్తులపై నిఘా తదితర విషయాల్లో హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ (పీఎస్వో) / పోలీసు మాన్యువల్ ప్రకారం రౌడీషీట్, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ లాంటివి తెరవడం చెల్లదని స్పష్టం చేసింది. పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్‌కు చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది. పీఎస్ఓ ప్రకారం ఫోటోల సేకరణ, వాటిని స్టేషన్లలో ప్రదర్శించడం, ఇళ్లను సందర్శించడం, స్టేషన్‌కు పిలిపించడం, స్టేషన్లో గంటల పాటు వేచి ఉండేలా చేయడం తదితరాలన్నీ వ్యక్తుల గోప్యత హక్కుకు విఘాతం కలిగించేవేనని పేర్కొంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అనే తెలిపింది. పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఇలాంటి పనులు చేయడం, వ్యక్తులపై అనుచిత నిఘా పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం 42 పేజీల తీర్పు వెలువరించారు. సుప్రీం తీర్పును ఉల్లంఘించడమే.. ‘చట్టపరమైన నియమ, నిబంధనలను పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ అధిగమించలేవు. పోలీసులకు సీఆర్పీసీ, ఐపీసీ ప్రసాదించిన హక్కులను పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్ కల్పించడం లేదు. ఇవి కేవలం మార్గదర్శకాలు, విధి విధానాలు మాత్రమే. వీటికి ఎలాంటి చట్టబద్ధమైన బలం లేదు. అవి కేవలం శాఖాపరమైన సూచనలు మాత్రమే. పోలీసు చట్టం లేదా ఇతర ఏ చట్టం కింద పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌ను రూపొందించలేదు. చట్టబద్ధత లేని పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌ను రౌడీషీట్లు తెరవడానికి, కొనసాగించడానికి, తెరిచిన వాటిని సమర్థించుకోవడానికి ఉపయోగించేందుకు ఎంత మాత్రం వీల్లేదు. అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును నేరుగా ఉల్లంఘించడమే అవుతుంది’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కొనసాగిస్తే ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులు కాని అధికారులు సైతం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లే అవుతుందని హెచ్చరించింది. పిటిషనర్లపై తెరిచిన రౌడీషీట్లన్నింటినీ మూసివేయాలని పోలీసులను ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం నేరాలు జరగకుండా ముందస్తుగానే నివారించేందుకు సమాచార సేకరణ, నిఘా వేయాలనుకుంటే అందుకు అనుగుణంగా వీలైనంత త్వరగా చట్ట ప్రకారం నిబంధనలు రూపొందించడం, చట్ట సవరణ చేపట్టడం చేయాలని పేర్కొంది. ఈ విషయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నేరాలను నివారించేందుకు పోలీసులకు సీఆర్పీసీ ప్రకారం చర్యలు తీసుకునేందుకు పలు ప్రత్యామ్నాయాలున్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పోలీసులు రౌడీషీట్లు తెరవడం, కేసులు కొట్టివేసినా వాటిని కొనసాగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాదాపు 57 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గోప్యత ప్రాథమిక హక్కు... ‘గోప్యత ప్రాథమిక హక్కు అని కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు మైలురాయి లాంటి తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ కోర్టు ముందుకొచ్చిన వ్యాజ్యాల్లో పిటిషనర్లు తమ ప్రాథమిక హక్కులకు పోలీసులు కలిగిస్తున్న విఘాతం గురించి ప్రస్తావించారు. తరచూ తమ ఇళ్లకు రావడం, స్టేషన్లలో ఫోటోలు ప్రదర్శించడం, స్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి వేచి ఉండేలా చేయడం, రౌడీలనే ముద్ర వేయడం లాంటివి చేస్తున్నట్లు నివేదించారు. రౌడీషీట్ పెండింగ్‌లో ఉందనే కారణంతో పాస్‌పోర్టు ఇవ్వడం లేదని, చిన్న నేరం చేసిన వారిని కూడా తరచూ నేరాలు చేసే వారిగా ముద్ర వేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటిని బట్టి పీఎస్వో అమలు సమయంలో పోలీసులు బుర్ర ఉపయోగించకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది’ అని జస్టిస్ సోమయాజులు తీర్పులో పేర్కొన్నారు. సీఆర్పీసీలో ఎన్నో వెసులుబాట్లు... ‘నేరం చేసే వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించాలి? శాంతికి విఘాతం కలిగించే వారి పట్ల ఎలా వ్యవహరించాలి? ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలనే విషయాలను సీఆర్పీసీ సెక్షన్లు 107, 109 స్పష్టంగా చెబుతున్నాయి. పదే పదే నేరం చేసే వారిపై సంబంధిత చట్టం కింద కేసులు పెట్టొచ్చు. పోలీసులు వారి వేలిముద్రలు, ఫోటోలు, చేతిముద్రలు, కాలిముద్రలు సేకరించవచ్చు. కదలికలపై పరిమితులు విధించొచ్చు. ఇలాంటి సౌలభ్యాలు, వెలుసుబాట్లు సీఆర్పీసీలో ఎన్నో ఉన్నాయి. నిఘా పెట్టడం, సమాచారం సేకరించడం లాంటి వాటిని కొనసాగించాలంటే చట్టాన్ని సవరించడమే సరైన విధానం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టులు ఆదేశించినా తీరు మారట్లేదు.. సుప్రీంకోర్టు మొదలు హైకోర్టు వరకు పలు సందర్భాల్లో విస్పష్టమైన తీర్పులిచ్చినా పోలీసులు ఇప్పటికీ రౌడీషీట్లు తెరుస్తూనే ఉన్నారు. విధి విధానాల పరమైన లోపాలున్నాయని పదేపదే చెబుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. తగిన కారణాలు, విశ్వసనీయమైన ఆధారాలు లేకుండా పలువురిపై రౌడీలుగా ముద్ర వేస్తున్నారు. లోక్ అదాలత్‌ల్లో రాజీ చేసుకున్న కేసుల్లో కూడా పోలీసులు రౌడీషీట్లు కొనసాగిస్తున్నారు. ఆయా వ్యక్తులపై కోర్టులు ఎఫ్ఐఆర్లను కొట్టివేసినా రౌడీషీట్లు కొనసాగిస్తూనే ఉన్నారు’ అని న్యాయమూర్తి తీర్పులో ఆక్షేపించారు. చట్టం నిర్దేశించిన మార్గాల్లో.. ‘నిఘా, రౌడీషీట్లు తెరవడాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థిస్తున్నారు. సమాచార సేకరణ లాంటివి నేరం జరగడానికి ముందే నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాన్ని ఈ కోర్టు విస్మరించడం లేదు. దశాబ్దాల తరబడి పోలీసులు పీఎస్వో విధానాన్ని అమలు చేస్తూనే ఉన్నారు. అయితే నేరాన్ని జరగకుండా నివారించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు చట్టం నిర్దేశించిన పరీక్షను దాటలేకపోయాయి. చట్టం నిర్దేశించిన మార్గాల్లో సాధారణ నిఘా, సమాచార సేకరణను ఏ చట్టం కూడా నిషేధించడం లేదు. నేరం జరగకుండా నివారించేందుకు ఇవి అవసరం. అయితే విచక్షణారహితంగా సమాచార సేకరణ, రాత్రిపూట ఇళ్ల సందర్శన, తరచూ పోలీస్‌స్టేషన్‌కు పిలవడం, స్టేషన్లో ఫోటోలు ప్రదర్శించడం లాంటివే ప్రధాన సమస్యలు. పుట్టుస్వామి కేసు ఆధారంగా పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌ను రద్దు చేయవద్దని ప్రభుత్వ న్యాయవాది కోరుతున్నారు. ఈ అభ్యర్థన సరైంది కాదని నా అభిప్రాయం. పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు సమాచార భద్రత, ఆధార్ కార్డు గురించి మాత్రమే చర్చించలేదు. వ్యక్తి గోప్యత గురించి సవివరంగా చర్చించి, గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ప్రస్తుతానికి చట్టం కూడా ఇదే’ అని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. -
రౌడీషీటర్లపై ‘నయా’ నిఘా
సాక్షి, సిటీబ్యూరో: ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నగర పోలీసులు రౌడీషీటర్ల కదలికలపై సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చారు. టీఎస్‌కాప్ అప్లికేషన్లో చేర్చిన ‘రౌడీ షీటర్స్ మాడ్యూల్’ బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఠాణాల వారీగా రౌడీషీటర్ల పేర్లతో కూడిన డేటాను ప్రతి పోలీసు అధికారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఫీల్డ్ ఆఫీసర్లు తమ యూజర్‌నేమ్‌తో లాగిపై రౌడీ షీటర్ల డాటాను తనిఖీ చేయవచ్చని, వారి ఫొటో లు కూడా అందుబాటులో ఉండటంతో ఏ సందర్భంలోనైనా గుర్తించే అవకాశం ఉందన్నారు. వారి నేరచరిత్ర పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటు ందని తెలిపారు. ఈ రౌడీషీటర్స్ మాడ్యూల్ వల్ల పెట్రోల్ కార్లు, బ్లూకోల్ట్స్ వారు ఉంటున్న చిరునామాలకు వెళ్లడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచి వారి జియో–టాగ్ లోకేషన్ మ్యాప్‌లో పొందుపరచవచ్చన్నారు. జోన్లు, పోలీసు స్టేషన్ల వారీగా నివేదికలు పొందుపరిచిన టీఎస్‌కాప్ డ్యాష్‌బోర్డును సీనియర్ పోలీసులు పర్యవేక్షించవచ్చని సీపీ పేర్కొన్నారు. కంప్యూటర్లు, ప్రింటర్ల పంపిణీ... నగర పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా ఈ–గవర్నెన్స్ అమలు చేస్తుండటంతో పోలీసు స్టేషన్లకు కంప్యూటర్లు, ప్రింటర్లను సీపీ అంజనీకుమార్ ఆయా అధికారులకు పంపిణీ చేశారు. ఆయా విభాగ సిబ్బంది ప్రతిపాదనల మేరకు 157 కంప్యూటర్లు, 35 ప్రింటర్లను అందజేశారు. ఈ 157 కంప్యూటర్లలో లా అండ్ అర్డర్ పోలీసు స్టేషన్లకు 65, ఏసీపీలకు 14, మెయిన్ పీసీఆర్‌కు 10 కంప్యూటర్లు అందించారు. మిగిలిన కంప్యూటర్లను ట్రాఫిక్, సిటీ సెక్యూరిటీ వింగ్, కార్ హెడ్‌క్వార్టర్స్, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్‌లకు అందించారు. కార్యక్రమంలో క్రైమ్స్ అండ్ సిట్ అడిషనల్ సీపీ శికా గోయల్, లా అండ్ అర్డర్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహన్, ఎస్బీ జాయింట్ సీపీ తరుణ్ జోషి, అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
నేరగాళ్లపై నజర్
సాక్షి,నిజాంసాగర్(జుక్కల్): ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పాత నేరస్థులు, నాటుసారా విక్రయదారులు, బెల్టుదుకాణాల విక్రయదారులు, రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపైన పోలీసులు దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రి య మొదలవడం, ఎన్నికల ప్రచారం వేడెక్కడటంతో గ్రామా లు, పట్టణాల్లో అవాంచనీయసంఘటనలు జరగకుండా పోలీసు బాసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు.. ముందస్తు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేలా పోలీస్ ఉన్నతాధికారులు ముందుస్తు జాగత్త్రలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల, సర్కిల్, డివిజన్, జిల్లా కార్యాలయాల వారిగా ఉన్న పాత నేరస్థులకు సమాచారం అందిస్తున్నారు. పాత నేరస్థులు, నాటుసారా విక్రయదారులు, బెల్టు దుకాణాదారులు, రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులను పోలీస్టేషన్లకు పిలిపిస్తున్నారు. ఆయా పోలీస్స్టేషన్లల్లోని రిజిష్టర్లు నేరస్థుల హాజరు నమోదు చేసుకుంటూ మండల కేంద్రాల్లోని తహసీల్ కార్యాలయాల్లో తహసీల్దార్ ఎదుట బైండోవర్లు చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల పోలీస్స్టేషన్లల్లో పరిధిలో ఉన్న పాత నేరస్థులకు సమాచారం అందించడంతో పాటు ప్రతీ రోజు 10 నుంచి 20 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తున్నారు. హత్యలు, హ త్యాయత్నాలు, నేతలపై దాడులు, రాజకీయ కక్షసాధింపు, ఎన్నికల ప్రచారంలో అల్లర్లు, మద్యం సేవించి గోడవలు సృష్టించే వారిని పోలీసులు బైం డోవర్ చేస్తున్నారు. దాంతో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు, తహశీల్దార్ కార్యాల యాల్లో నేరస్థుల బైం డోవర్లు జోరుగా సాగుతున్నాయి. పాత నేరస్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తూన్నారు. అంతేకాకుండా ప్రతీ వారం, వారం పోలీస్‌స్లేషన్లకు వచ్చే రిజిష్టర్లల్లో హాజరు అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 552మంది నేరస్థులను పోలీసులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అన్ని పోలీసుస్టేషన్ల వారిగా నేరస్థుల బైండోవర్ సమాచారాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. నాటుసారా, బెల్టుషాప్‌లకు చెక్... జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉన్న పాతనేరస్థులతో పాటు నాటుసారా విక్రయదారులు, బెల్టుషాపు నిర్వహకులను పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున్న గ్రామాల్లో నాటుసారా తయారు, బెల్టు సీసాల విక్రయాలు చేపట్టకుండా పోలీసులు వారిని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలను మద్యం తీసుకొచ్చే వారితో వారిని ప్రోత్సహిస్తున్న వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీల్లో ఉన్న సమస్యాత్మక వ్యక్తులు, కార్యకర్తలు, నాయకులను కూడా పోలీసులు బైండోవర్ చేస్తు న్నారు. -
ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ!
ఆత్మకూరు రూరల్: ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లను జిల్లా నుంచి బహిష్కరించే యోచన ఉందని జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. ఆదివారం ఆయన ఆత్మకూరు ఎస్డీపీవో, పోలీస్ సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పల్లెనిద్ర కార్యక్రమంతో గ్రామాల్లో శాంతి భద్రతలపై అవగాహన పెరుగుతోందన్నారు. ఎన్నికలు వస్తున్నందున హింసకు పాల్పడే వారి నేర చరిత్రను సేకరిస్తున్నామన్నారు. నేర చరిత్ర గల వారిని పోలీసులు.. బైండోవర్ చేసుకుంటారన్నారు. అవసరమైతే వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అనంతరం కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్(సీపీవో)లతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సామాజిక స్పృహ అవసరమన్నారు. సీపీవోలు చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రతిభావంతంగా పనిచేసిన వారికి నగదు రివార్డులు అందించారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్డీపీవో అడిషనల్ ఎస్పీ మాధవ రెడ్డి, సీఐ బత్తల కృష్ణయ్య, ఎస్ఐలు వెంకట సుబ్బయ్య, రమేష్ బాబు పాల్గొన్నారు. -
సత్ప్రవర్తనతో మెలగాలి
గద్వాల క్రైం: పాతకక్షలకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం గద్వాల డీఎస్పీ కార్యాలయం ఆవరణలో పాత నేరస్తులు, రౌడీషీటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గద్వాల, గట్టు, ధరూర్, అయిజ, శాంతినగర్, ఉండవెల్లి, రాజోళి, మల్దకల్ తదితర మండలాల్లో 166మందిపై రౌడీషీట్ నమోదు అయ్యిందని తెలిపారు. గతంలో ఉన్న గొడవలు, పాతకక్షలు మనస్సులో పెట్టుకొని తోటి స్నేహితులు, రక్త సంబంధీకులు ఇరుగు పొరుగు వారితో క్షణికావేశంలో ఘర్షణ పడటం తగదన్నారు. ఈ క్రమంలోనే హత్యలు చేస్తున్నారని, లేదా తీవ్రంగా గాయపడి వైకల్యంతో బాధపడుతున్నా రని అన్నారు. దీనివల్ల బాధిత కుటుంబా లు రోడ్డున పడుతున్నాయని, తల్లిదండ్రులకు, పిల్లలకు దూరమవుతున్నారని చెప్పారు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలిగితే ఎలాంటి అనర్థాలు రావని చెప్పా రు. ఇకనుంచి సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని సూచిం చారు. మీలో మార్పు వస్తే మొదట మీ కుటుంబమే బాగుపడుతుందని చెప్పారు. సత్ప్రవర్తన కలిగిన నేరస్తులపైకేసులు తొలగిస్తాం మద్యం, జూదం, మాట్కా, హత్యలు, కిడ్నాప్‌లు, దొంగతనాలు, ఇతర నేరా లకు చోటివ్వకుండా సత్ప్రవర్తనతో జీవించే వారిపై కేసులు తొలగిస్తామని ఎ స్పీ చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉందని తెలిపారు. పోలీసులు ఎప్పటికప్పుడు మీ ప్రవర్తనపై నిఘా ఉంచి, ఉన్నతాధికారులకు మీ వివరాలు అందిస్తారన్నారు. అనంతరం గద్వాల డీఎస్పీ సురేందరావు కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామ, పట్టణంలో సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు అందించి, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఐలు, వెంకటేశ్వర్లు, రజిత, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు విజయ్, మురళీధర్‌గౌడ్, మదుసూదన్‌రెడ్డి, మహేందర్, వెంకటేశ్వర్లు, నవీన్‌సింగ్, పర్వతాలు, ప్రవీణ్, జగదీశ్ ఉన్నారు. -
పాతబస్తీలో 105 మందిపై రౌడీషీట్లు
హైదరాబాద్: పాతబస్తీలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ నేరాలకు పాల్పడుతున్న 131 మందిపై దక్షిణ మండలం పోలీసులు షీట్లు ఓపెన్ చేశారు. ఇందులో 105 మందిపై రౌడీషీట్లు, 25 మందిపై సస్పెక్ట్ షీట్లు, ఒక్కరిపై సీడీసీ(సిటీ డోసర్ క్రిమినల్)లను తెరిచారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పాతబస్తీలో ఏడాది కాలంగా కార్డన్ సెర్చ్‌లు, కమ్యూనిటీ పోలీసింగ్, పీడీ యాక్ట్‌లను ప్రయోగిస్తుండడంతో వ్యవస్థీకృత నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇప్పటి వరకు 47 మందిపై పి.డి.యాక్ట్ నమోదు చేశామని, మరో 20 మందిపై నమోదు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే గతంలో ఉన్న రౌడీషీటర్లలో వయోవృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సత్ప్రవర్తన కారణంగా 200 మందిపై రౌడీషీట్లను తొలగించినట్లు తెలిపారు. కాని, ఇటీవలి కాలంలో పాతబస్తీలో కొందరు యువకులు ఎక్కువగా నేరాలకు పాల్పడుతుండటంతో వారిని కట్టడి చేసేందుకు కొత్తగా రౌడీషీట్లను తెరుస్తున్నామన్నారు. ప్రస్తుతం రౌడీషీట్లు నమోదైన వారి కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సత్యనారాయణ చెప్పారు. -
ప్రశ్నిస్తే కార్పొరేటర్‌పై రౌడీషీటా?
విజయవాడ : నగర పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కేసులు బనాయిస్తూ, రౌడీషీట్లు కూడా తెరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన కార్పొరేటర్ రవికుమార్‌పై తెరిచిన రౌడీషీట్ ఇందుకు ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు. రవికుమార్‌పై రౌడీషీట్ తెరవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల తరఫున హైవే అధికారులను ప్రశ్నిం చడం, ప్రయాణికులపై చార్జీల మోత మోగిస్తే నిరసన తెలపడం నేరమెలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో ఫిర్యాదుచేసిన మహిళతో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మాట్లాడిన 14 రోజుల తరువాత ఆమె నుంచి బెదిరించినట్లు ఫిర్యాదు తీసుకోవడం, ఈ ఆలస్యానికి కారణాన్ని పోలీసులు చెప్పకపోవడం అనుమానాలకు తావి స్తోంది. తనను ఎవ్వరూ బెదిరించలేదని ఆ మహిళ కోర్టుకు లేఖ ఇస్తే ఆమెను పిలిపించుకుని తనను బెదిరించి లేఖతీసుకున్నారని పోలీసులు కోర్టులో చెప్పించడంపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలపై మాట్లాడేందుకు కార్పొరేటర్ రవికుమార్ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు డి సెంబర్ 16న వెళ్లారు. అదే సమయంలో కాల్‌మనీ నిందితుడైన మాధవశెట్టి శివకుమార్‌పై ఫిర్యాదుచేసిన ముక్తి కుమారి అక్కడ కని పించడంతో పలకరించారు. ఆమెతో రవి మాట్లాడినప్పుడు చూసిన కొందరు టీడీపీ కార్యకర్తలు అధికార పార్టీ నేతలకు వారం రోజుల తరువాత చేరవేశారు. అటువైపు నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కుమారిని పోలీసులు పిలిపించి డిసెంబరు 29న కంప్లైంట్ తీసుకున్నారు.. 31న రవికుమార్‌ను అరెస్ట్ చేశారు. రౌడీషీట్ తెరిచేందుకు ఇవీ కారణాలు.. 2014 నవంబర్‌లో జాతీయ రహదారి పక్కన కృష్టలంకలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఆక్రమణలంటూ అధికారులు తొలగించారు. స్థానిక ప్రజాప్రతినిధిగా వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ కార్పొరేటర్ పల్లెం రవి పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించవద్దని అధికారులను కోరారు. అక్కడే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని కూడా కూల్చివేసిన జాతీయ రహదారి ఉద్యోగులు తమ విధులకు ఆటంకం కలిగించాడని కార్పొరేటర్‌పై ఫిర్యాదుచేశారు. దీంతో కేసు నమోదైంది. ఆర్టీసీ పెంచిన బస్సు చార్జీలను ఉపసంహరించాలని వైఎస్సార్‌ీ సపీ ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ నెలాఖరులో విజయవాడ బస్‌స్టేషన్ వద్ద జరిగిన ధర్నాలో కార్పొరేటర్ రవి పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఆర్టీసీ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించారని అతనిపై కేసు నమోదైంది. కాల్‌మనీ కేసులో నిందితుడైన మాజీ రౌడీషీటర్ మాధవశెట్టి శివకుమార్‌పై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని రాణీగారితోటకు చెందిన ముక్తి కుమారిని పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే బెదిరించారని డిసెంబర్ 29న రవిపై కేసు నమోదైంది. ఈ కేసులో డిసెంబర్ 31న కార్పొరేటర్ రవిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. మరోసారి కుమారిని రవి అనుచరులు బెదిరించి ఆమె వద్ద బలవంతంగా లేఖ రాయించుకున్నారని జనవరి 5న పోలీసులు రెండో కేసు నమోదు చేశారు. -
కాల్‌మనీ నిందితులపై రౌడీ షీటు
-
కాల్‘కేటు’లపై ఉక్కుపాదం!
రౌడీషీట్లు తెరిచేందుకు పోలీసుల సమాయత్తం వివరాలు సేకరిస్తున్న నిఘా విభాగం విజయవాడ సిటీ : కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. కాల్‌మనీ వ్యాపారం పేరిట దందాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు రౌడీషీట్ల మంత్రం ప్రయోగిస్తున్నారు. మాజీ రౌడీషీటర్లపై వెంటనే పాత రౌడీషీట్లను పునరుద్ధరించడంతో పాటు దందాలు చేసినట్టు సమాచారం ఉన్న వారిని కొత్తగా జాబితాలో చేర్చనున్నారు. నిఘా వర్గాల ద్వారా ఇప్పటికే పలువురి వివరాలు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గన్మెన్లను వెంటేసుకొని వడ్డీ వ్యాపారం దందా నిర్వహిస్తున్న మాజీ రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్‌పై తిరిగి రౌడీషీటు ప్రారంభించారు. గతంలో పలువురు మహిళలు శివకుమార్ ఆగడాలపై కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల్లోని పలుకుబడితో అప్పటికప్పుడు శివకుమార్ బయటపడ్డాడు. కాల్‌మనీ బాధితులకు పోలీసు కమిషనర్ సవాంగ్ భరోసా ఇవ్వడంతో ఓ మహిళ అతని ఆగడాలపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.